చలో ఇందిరా పార్క్ బీసీ ధర్నాను విజయవంతం చేయండి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో
ధర్మసమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 24 న ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాదులో జరగబోయే మహా ధర్నాకు సారాధ్యం వహిస్తున్న ఉమ్మడి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు, బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ నేతృత్వంలో చేయబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునివ్వడం జరిగింది. దేశ జనాభాలో 133 కులాలు 60 శాతం ఉన్న బీసీలు కేవలం 29 శాతం రిజర్వేషన్ ని మాత్రమే అనుభవిస్తున్నారు తద్వారా వీరు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అగ్రకుల పార్టీల చేతిలో 70 సంవత్సరాలు దగా పడ్డది చాలు వీరికి న్యాయబద్ధంగా రావాల్సిన 42% రిజర్వేషన్ ని రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చితేనే బీసీలకు సంపూర్ణ విముక్తి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఘనపూర్ మండల కేంద్రంలోని బీసీలు, బహుజన సంఘాల వారందరూ మహాధర్నా కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సైదులు పాష, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్, రజక సంఘం నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్, కోగిల జితేందర్, కుర్రి స్వామినాథన్, ఇంజపల్లి విక్రమ్, ఎస్.కె ఇమామ్, ఇంజపెల్లి రవి పాల్గొన్నారు..
