స్వాతి @ బ్యూటీషియన్ – మహానంది అవార్డు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T121923.688.wav?_=1

 

స్వాతి @ బ్యూటీషియన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం, మండల కేంద్రమైన ఝరాసంగం గ్రామానికి చెందిన గడ్డం స్వాత్తి కి బుధవారం ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యూటిషియన్ లో మహానంది అవార్డును అందజేశారు. బ్యూటి షియన్ లో యువతి కనబర్చిన ప్రతిభన గుర్తించి ఆ సంస్థ యాజమాన్యం ఈ అవార్డును అందజేయడం జరిగింది. రెండు సంవత్సరాలు గా సంగారెడ్డి పట్ట ణంలోని ఓ బ్యూటీ పార్లర్ లో శిక్షణ తీసుకోవడం జరిగింది. ఈ అవార్డును అందుకోవడం పట్ల గ్రామస్తులు బంధువులు, హర్షం వ్యక్తం చేశారు.

మహిళా యువత కి గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T125804.058.wav?_=2

మహిళా యువత కి గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం.

అవగాహనా కార్యక్రమం నిర్వహించిన జన శిక్షణ సంస్థ.

కాశిబుగ్గ నేటిధాత్రి

 

జన శిక్షణ సంస్థాన్ వరంగల్ అధ్వరం లో కె.వి.ఐ.సి హైదరాబాద్ వారు కేంద్ర ప్రభుత్వ గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం జి డబ్ల్యు ఎం సి కమ్యూనిటీ హాల్,సోమిడి గ్రామం,ఖాజీపేట లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కి ముఖ్య అతిధి గా వరంగల్ జిల్లా ఎల్ డిఎం హవేలీ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హవేలి రాజు మాట్లాడుతూ స్వయం ఉపాధితో ఎదగాలనుకొనే మహిళలు వారు ఎంచుకున్న రంగానికి సంబందించిన నైపుణ్యాలు, మెలుకువలు నేర్చుకొని కె వి ఐ సి వారి గ్రామోద్యోగ్ పథకాన్ని వినియోగిచుకొని ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళలకు,యువతకి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో కె.వి.ఐ.సి అధికారి లతాదేవి మరియు ఇతర అధికారులు గ్రామోద్యోగ్ పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువ భారత్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ కుమార్ మరియు జె ఎస్ ఎస్ డైరెక్టర్ ఎండి ఖాజా మసియద్దిన్ యువతకు,మహిళలకు నైపుణ్య శిక్షణల యొక్క ఆవశ్యకత గురించి వివరించారు.ఈ అవగాహన కార్యక్రమం లో వివిధ ప్రాంతాలనుంచి 150 మహిళలు, యువత పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్‌లో అగ్నివీరుల ప్రతిభ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-33-2.wav?_=3

ఆపరేషన్ సిందూర్‌లో అగ్నివీరులు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని భారత సైన్యం ప్రకటించింది.

 

అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్లపాటు సైన్యంలో సేవలందించే అగ్నివీరుల పనితీరు ఆధారంగా, వారికి మరింత స్థిరమైన అవకాశాలు కల్పించే మార్గాలను సైన్యం పరిశీలిస్తోంది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, అగ్నివీరులలో గరిష్టంగా 25 శాతం మంది మాత్రమే మెరిట్ మరియు సైన్య అవసరాల ఆధారంగా శాశ్వతంగా నియమించబడతారు. 2026 చివరికి తొలి బ్యాచ్ సేవలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో, శిక్షణ, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా అగ్నివీరుల నిలుపుదలపై సవరణలు చేయాలని సైన్యం భావిస్తోంది.

విద్యార్థులలో గ్రంథాలయ పఠనంపై అసక్తిని పెంచే శిక్షణ..

విద్యార్థులలో గ్రంథాలయ పఠనంపై అసక్తిని పెంచే శిక్షణ

మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని కేసముద్రం విలేజ్ ఉన్నత పాఠశాలలో 25 జూలై మరియు 26 జూలై తేదీలలో జడ్పీహెచ్ఎస్ కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ మరియు జడ్పీహెచ్ఎస్ కేసముద్రం స్టేషన్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు పాఠశాల గ్రంధాలయాలను ఏర్పాటు చేయడం మరియు గ్రంథాలయాల నిర్వహణ, పాఠశాలలో గ్రంథాలయ పఠన కార్యక్రమాలను నిర్వహించడం, విద్యార్థులలో పఠనంపై ఆసక్తిని కలిగించడం మొదలగు అంశాలపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, మరియు ఇనుగుర్తి మండల విద్యాశాఖాధికారి జంగా రూపారాణి, జడ్పీహెచ్ఎస్ కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాంనర్సయ్య, జెడ్ పి హెచ్ ఎస్ కేసముద్రం స్టేషన్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, ఆర్పీలుగా ఎం సురేష్ నాయుడు, వి భాస్కరరావు, రాజ్ కుమార్, సి.ఆర్.పి.లు సుల్తానా, స్వాతి, సరిత, నాగవాణి పాల్గొన్నారు,

సెట్విన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న.

సెట్విన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు అందజేసిన ఎంపీ

◆:- జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్‌కుమార్ శేట్కార్ మరియు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని సెట్విన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన అభ్యర్థులకు శనివారం ధ్రువ పత్రాలు అందించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్‌కుమార్ శెట్కార్ మరియు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి. ఈ సందర్భంగా ఎంపి సురేష్ శేట్కార్, సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి గార్లు మాట్లాడుతూ సెట్విన్ లో శిక్షణ పొందిన అభ్యర్థులు స్వయం ఉపాధితో చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. సెట్విన్‌లో శిక్షణ పొందే అభ్యర్థులకు ఉజ్వల్ పౌండేషన్ ఆధ్వర్యంలో 25% ఫీజు చెల్లిస్తామని చెప్పడం చాలా అభినందనియమన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎం.డి. వేణుగోపాల్‌రావు, అర్డీవో రాంరెడ్డి, మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్ తన్విర్, సిడిసి చైర్మన్ ముబీన్, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు, ఎంపిడిఓ మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,డిసిసి జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ రెడ్డి,మాజీ కౌన్సిలర్లు.రాజశేఖర్,తాహేరా బేగం,కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ వైస్ చైర్మన్ భీమయ్య,కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మాజీ వైస్ యం.పి.పిరాములు,మల్లారెడ్డి,సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,గుండా రెడ్డి,శుక్లవర్ధన్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి,అరుణ్,రాజు,నాగి శెట్టి,ఇమామ్ పటేల్,జుబేర్ పటేల్,జావీద్,గోపాల్, నర్సింహులు,బాణోత్ రాజు నాయక్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,రాష్ట్ర కార్యదర్శిహర్షవర్ధన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ ఆయా మండలాల అధ్యక్షులు కిరణ్ గౌడ్, సునీల్,మల్లికార్జున్ మరియు సెట్విన్ శిక్షణ సిబ్బంది,అధికారులు,సెట్విన్ శిక్షణ పొందిన అభ్యర్థులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సెట్విన్ కార్పొరేషన్ భవనాన్ని మరియు శిక్షణ.

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ భవనాన్ని మరియు శిక్షణ కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీహరి

◆ : సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

హైదరాబాద్ లోని చార్మినార్ మోతి గల్లీ లోని సెట్విన్ ఇనిస్ట్యూట్ లోని శిక్షణ కేంద్రాన్ని మరియు హైదరాబాద్ లోని జెహ్రా నగర్ కాలనీ,పురాణి హవేలీ సెట్విన్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్రపశుసంవర్ధక,డైరి డెవలప్మెంట్,క్రీడలు,యువజన మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డా౹౹వాకిటి శ్రీహరి,తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి సందర్శించారు.

 

N. Giridhar Reddy

 

వారితో పాటు సెట్విన్ ఎం.డి.వేణుగోపాల్ రావు మరియు సెట్విన్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ పొందితే సాధించనిది ఏమీ లేదు.

శిక్షణ పొందితే సాధించనిది ఏమీ లేదు.

#కుటుంబానికి భారం కాకుండా తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలి.

#కంపెనీలు రాకతో ములుగు జిల్లా అభివృద్ధి.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

 

యువతి, యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు పొందాలని, యువత కుటుంబాలకు భారం కాకుండా తల్లిదండ్రులకు భరోసాగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ పొందిన 100 మంది నిరుద్యోగులలో పలు కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైన 51 మంది యువతకు నియామక పత్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పలు కంపెనీల ద్వారా శిక్షణ పొంది ప్రతిభ పెంపొందించుకుంటే సాధించనది ఏమీ లేదని అన్నారు.
ఎక్కువ వేతనం రావడం లేదని నిరాశ చెందకుండా వచ్చిన ఉద్యోగ అవకాశాలను చేస్తూనే ఎక్కువ వేతనం వచ్చే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పలు కంపెనీలను కాపాడుకుంటూనే ఇతర కంపెనీలు రావడానికి ప్రయత్నించాలని, కంపెనీలు రాకతో ములుగు నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతిభ పెంపొందించుకోవడానికి టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో ఆరు నెలల క్రితం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇప్పటికీ శిక్షణ పొందిన వంద మందిలో 51 మంది యువతక
ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు. టాస్క్ సెంటర్ ఆవరణంలో శ్రీయ ఇన్ఫోసియస్ కంపెనీ ఏర్పాట్లు చేసి అందులో ముగ్గురికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. నేడు యువత నిరక్షరాస్యత నుండి అక్షరాస్యతకు ఎదిగి ఉద్యోగ అవకాశాలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 40 కంపెనీలకు చెందిన యజమానులు ములుగు జిల్లాలో పర్యటించారని, 10 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు.
ఈ రోజున 16 కంపెనీ లు పాల్గొన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి సీతక్క ఒక శక్తి లాగా పనిచేస్తూ ఇప్పటికే పలు కంపెనీలు రావడానికి కృషి చేయడంతో పాటు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారని, కంపెనీలు ఎదగడానికి ఉద్యోగులు కృషి చేస్తే వేతనాలు పెరుగుతాయని అన్నారు. ఎదుగుదలకు హద్దులేదని, చిన్న ఉద్యోగమని చులకన చేయవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సిన్హా – టాస్క్ సిఇఒ
ప్రదీప్ రెడ్డి – టాస్క్ ప్లేస్‌మెంట్ డైరెక్టర్
సేవ్న్ రెడ్డి – టాస్క్ రీజినల్ సెంటర్స్ హెడ్
సుధీర్ – టాస్క్ క్లస్టర్ మేనేజర్
రవి – సిఇఒ, శ్రీయా ఇన్ఫోటెక్
వినోడ్ – సిఎస్ఆర్ ఇన్‌ఛార్జి
బాలా – కాగ్నిజెంట్ సిఎస్ఆర్ బృందం, డొమైన్: ఐటి, ఐటిఇఎస్, ఫార్మా, బ్యాంకింగ్, మార్కెటింగ్, అమ్మకాలు, వ్యవసాయం, ఫైనాన్స్ మరియు నాన్ బ్యాంకింగ్, కంపెనీలకు చెందిన యాజమాన్యాలు టాస్క్ రీజినల్ సెంటర్ లో శిక్షణ పొందిన 100 మంది యువత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం.

అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం

జైపూర్ నేటి ధాత్రి:

 

shine junior college

జైపూర్ మండలం ఇందారం 4 అంగన్వాడీ కేంద్రం లో సామూహిక అక్షరాభ్యాసాలు చేపట్టి మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడి సెంటర్ కి పంపించాలని పిల్లల తల్లి తండ్రులకు సూచించారు.ప్రీ స్కూల్ ప్రాముఖ్యత గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.అంగన్వాడి కేంద్రం లో ప్రతీ నెల పిల్లల ఎత్తు,బరువు,పెరుగుదల పర్యవేక్షణ చేస్తూ పిల్లలకు పోషకాలు కల్పించే ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ టీచర్స్ వెంకటస్వామి,స్వప్న, వివో అధ్యక్షురాలు రాజేశ్వరి, ఏఎన్ఎం కృష్ణవేణి,అంగన్వాడి టీచర్స్ కళ్యాణి,నళిని,పిల్లలు, తల్లి తండ్రులు పాల్గొనడం జరిగింది.

మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాది మార్గాలు.

మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాది మార్గాలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

మహిళలకు నైపుణ్య శిక్షణలతో ఉపాధి మార్గాలు ఏర్పరుస్తాయని నర్సంపేట టౌన్ ఎస్సై అరుణ్ కుమార్ అన్నారు.శనివారం ఎఫ్ఎంఎం,వరంగల్ సాంఘిక సేవా సంస్థ వారి సహకారంతో నర్సంపేట ప్రతిభా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మగ్గం శిక్షణ, టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం సంస్థ సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో పేదరికం నిర్మూలించడానికి ముఖ్యంగా గృహింస, బాల్య వివాహాలు బాలల అక్రమ రవాణా నిర్మూలించడానికి వారికి ఉపాధి మార్గాలు అనేవి చాలా ముఖ్యమని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.మరో అతిథి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రమేష్ కోరే మాట్లాడుతూ సమాజంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రగతి ఎంత ముఖ్యమో వ్యక్తిగత భద్రత అంతే ముఖ్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి బ్యాంకుల ద్వారా అమలుపరుస్తున్న స్కీములను సద్వినియోగం చేసుకొని ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్, సహాయ సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బత్తుల కరుణ,ఎర్ర శ్రీకాంత్ ,ఫైనాన్స్ మేనేజర్ అజయ్ కుమార్,సంస్థ యూత్ అంబాసిడర్స్ దోమ మధుమతి, భౌగోచి దేవిక బొడ్డు అమర్నాథ్, ప్రతిభ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గిరిగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సేవా సంస్థ కార్యదర్శి బెజ్జంకి ప్రభాకర్, ట్రేైనర్లు శ్వేతా, సంధ్యతో పాటు మహిళలు పాల్గొన్నారు.

వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్యాల ఉత్పత్తుల శిక్షణ.

దేవుని తిరుమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్యాల ఉత్పత్తుల శిక్షణ

వనపర్తి నేటిధాత్రి

 

 

 

కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపురం గ్రామంలో భూనీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్య శిక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశామని ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు .

ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ గోశాల ఆవుల పరిరక్షణ నిమిత్తం పోషణకై దాతల వస్తూ రూపములో వచ్చిన వాటితో కొంతమంది ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

గవ్య ఉత్పత్తులను తయారుచేసి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో ఆవువుల ను రక్షించడానికి వాటికి అయ్యే ఖర్చు ఈ ఉత్పత్తుల ద్వారా ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఉత్పత్తులను తిరుమలాపురము ఆలయంలో తయారు చేయడం జరుగుతుందని ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ తెలిపారు.

 

Lord Venkateswara Swamy Temple, Tirumalapuram.

 

పంచగవ్య ఉత్పత్తుల ఉత్పత్తుల ద్వారా దూప్ స్టిక్స్ దోమల అగర్బత్తీలు క్లీన్ ఆయిల్ ఇంకా సోప్స్ హోలీ పండుగకు ప్రత్యేకంగా పూర్ణిమ సందర్భంగా ఎటువంటి కెమికల్స్ రసాయన ద్రవ్యాలు కలుషితం లేకుండా పూలతో చెట్ల దినుసులతో రంగులు తయారు చేస్తున్నామని ప్రజలు రంగులు వాడిన ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా చర్మవ్యాధులు లేకుండా ఉంటాయని ఆయన తెలిపారు తల వెంట్రుకలకు సంబంధించి ఆయిల్స్ కూడా తయారవుతాయని ప్రజలు ఆయిల్స్ ధూప్ స్టిక్స్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ గ్లాసులు వాడడం వల్ల క్యాన్సర్ ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఇది కాకుండా పురాతన కాలంలో మోత్కాకుతో ఇస్తరాకులో ఉండేవి అదే ఆకులతో పేపర్ ప్లేట్లు కూడా యంత్రాలతో భవిష్యత్తులో తయారు చేయించి సరఫరా చేస్తామని ఆయన తెలిపారు ఇది బాగుంది కంగ్రాట్స్ ఈ పేపర్ ప్రింట్ గాని గిలాసలు గాని తిడతాడు గ్లాసులు మొత్తం 15 వస్తువులు తయారవుతాయని ఆయన తెలిపారు

ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమం.

ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమం

ధ్యానోత్సవాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

శాయంపేట నేటిధాత్రి:

ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు మండల కేంద్రంలోని నవోదయ హై స్కూల్ లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత యోగ ధ్యాన శిక్షణలో ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని ఎస్సై జక్కుల ప రమేష్ తెలిపారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మనిషి తన శరీరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్నాన పానాధులు ఎలా అవ సరమో మనసుని హృదయా న్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ధ్యానం ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతాయని తెలి పారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమంలో యువకులు విద్యార్థులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ కోఆర్డినేటర్ ఎం శారద, జిల్లా కోఆర్డినేటర్ అ చ్చయ్య,రమేష్, రాంబాబు, సత్యనారాయణ, సుధాక ర్, సురేందర్ పాల్గొన్నారు

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం

శిక్షణ అందించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్. మే 20:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ఐదు రోజుల ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది.

Collector Sandeep Kumar

 

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు గీత నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని, విద్యార్థులను గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు

మండల విద్యాశాఖ అధికారి యస్. వెంకటేశ్వర్లు..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దుగ్గొండి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గొండి మండలం లోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు వేసవి సెలవులలో ఈ నెల 20 నుండి 2025 వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలు దుగ్గొండి మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించబడునని వివరించారు. శిక్షణా కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు.తెలుగు ,ఆంగ్లం, గణితం,పరిసరాల విజ్ఞానం విషయాలలో విద్యా సామర్థ్యంతో పాటు ఎఫ్ఎల్ఎన్ లపై రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి తెలుగు, ఆంగ్లంలలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు సాధించడం, పరిసరాల విజ్ఞానంలో భావనలు నేర్చుకునేలా రాబోయే విద్యా సంవత్సరంలో ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో విద్యార్థులకు నేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే
బాలబాలికలు ఫౌండేషన్ లిటరసీలో భాగంగా విద్యాసామర్ధ్యాలను సాధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని ఎంఈఓ
యస్. వెంకటేశ్వర్లు తెలియజేశారు.

ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్.

వనపర్తి లో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

 

జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ సురభి మరియు విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ వనపర్తి లో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శిం చారు. జిల్లా కలెక్టర్ మ్యాథమెటిక్స్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో గణిత శాస్త్రం యొక్క లోటుపాట్లను చర్చిం చారు. వనపర్తి జిల్లాలో 450 పదవ తరగతి విద్యార్థులు గణిత శాస్త్రములో ఫెయిల్ అయినారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోనే వెనుకబడిన విద్యార్థులకు ప్రాథమిక గణిత శాస్త్రం యొక్క పద్ధతులను తార్కిక ఆలోచన పద్ధతులను కాన్సెప్ట్ వారిగా విద్యార్థులకు బోధించాలని సూచించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో తమ ప్రతిభను మెరుగుపరచుకుంటే మిగతా అన్ని సబ్జెక్టులలో గణితశాస్త్ర ప్రభావంతో అన్ని అంశాలలో చురుకుగా విద్యార్థులు ఉంటారని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గణిత శాస్త్ర అభివృద్ధి కొరకు విద్యార్థులలో తగు మెలకువలు నేర్పించుట కొరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణులు అగుటకు తన వంతు సహాయం చేస్తానని దానికి కొరకు ఉపాధ్యాయులు తగిన సమయం కేటాయించి విద్యార్థులకు గణితశాస్త్రం మెలకువలను నేర్పాలని సూచించినారు.
కలెక్టర్ వెంట రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి మేడం జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ గారు పరీక్షల నిర్వహణ విభాగం అధికారి గణేష్ జిల్లా సమన్వయకర్తలు శేఖర్ మహానంది యుగంధర్ సెంటర్ ఇన్చార్జిలు ఆనంద్ గురురాజు గారు జిల్లా రిసోర్స్ పర్సన్స్ లు పాల్గొన్నారు

విజయవంతంగా ముగిసిన వేసవి శిక్షణా శిబిరం.

విజయవంతంగా ముగిసిన వేసవి శిక్షణా శిబిరం

రామాయంపేట మే 16 నేటి ధాత్రి (మెదక్):

రామాయంపేట పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని వినియోగించుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు దైనందిన జీవితంలో పాటించాల్సిన నియమాల గురించి తెలియజేశారు.

summer CAMP

విద్యార్థులు చదువుతోపాటు వివిధ రకాల విషయాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. యోగ, చిత్రలేఖనం మరియు క్రీడల వల్ల భవిష్యత్తులో కలిగే ఉపయోగాలను విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పిటిఐ లు మల్లేశం, కవిత, యోగ శిక్షకులు భరత్, డ్రాయింగ్ టీచర్ యాదమ్మలను అభినందించారు. శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, నోట్ బుక్స్ మరియు స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎంఐఎస్ సంతోష్, ఉపాధ్యాయులు రాధిక, జయ పాల్గొన్నారు.

జెడ్పిహెచ్ఎస్ లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా .!

జెడ్పిహెచ్ఎస్ లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం.

మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జడ్.పి.హెచ్.ఎస్ చిట్యాల పాఠశాల ఆవరణలో 6-9 తరగతుల విద్యార్థులను ఉద్దేశించి వేసవి శిక్షణా శిబిరాన్ని ఎంఈఓ కొడపాక రఘుపతి , సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఇందులో గ్రామంలో గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థుల శారీరక, మానసిక,వికాసం కొరకు ఆటలు, పాటలు, బొమ్మలు గీయడం, యోగ, కథల పుస్తకాలు చదవడం మొదలగు వినోద కార్యక్రమాలు నేర్చుకోవడానికి ఈ శిక్షణా శిబిరం ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు,పోషక విలువలు కలిగిన స్నాక్స్ మరియు మంచినీటి సదుపాయం అందుబాటులో ఉంచామని వీటిని విద్యార్థిని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిరోజు విద్యార్థులందరూ ఉదయం8గం నుండి 11వరకు హాజరయ్యేలా చూడాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి, బొమ్మ రాజమౌళి , బుర్రసదయ్య గోపగాని భాస్కర్,సిఆర్పి రాజు, కనకం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ ట్రైనర్ ని సన్మానించిన మహిళలు.

శిక్షణ ట్రైనర్ ని సన్మానించిన మహిళలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జి అండ్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు పూర్తయిన మహిళలు, శిక్షణ ఇచ్చిన ట్రైనర్ కవితకి, ఇన్స్టిట్యూట్ చైర్మన్ కొత్త కాపు శిరీష. రెడ్డికి ఆదివారం శిక్షణ పొందిన మహిళలు ఘనంగా సన్మానించి, బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్లోల రాజేశ్వరి, సోని, శ్రావణి మంజుల, కవిత, వాణి, లక్ష్మి, అనసూయ, స్వప్న, గాయత్రి, పున్నమ్మ, శిక్షణ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

వేసవి శిక్షణా తరగతులు.

విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి

 

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు తొర్రూరు మండలంలోని తొర్రూరు హై స్కూల్, చెర్లపాలెం హై స్కూల్, మాటేడు హై స్కూల్, అమ్మాపురం హై స్కూల్ మరియు హరిపిరాల హై స్కూల్ లలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్)తేదీ 6-05-2025 నుండి 20-05-2025 వరకు (15 రోజులు), ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు నిర్వహించడం జరుగుతుంది.
సమ్మర్ క్యాంపులో ఈ క్రింద తెలుపబడిన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము.
1 ఇండోర్ గేమ్స్
2 ఆటలు మరియు పాటలు
3 స్పోకెన్ ఇంగ్లీష్
4 బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్
5 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్
6 డ్రాయింగ్ స్కిల్స్
7 క్రాఫ్ట్ (కుట్లు మరియు అల్లికలు)
8 కమ్యూనికేషన్ స్కిల్స్
9 డాన్స్
10 వాలీబాల్ ,షటిల్ గేమ్స్
పైన సూచించిన కార్యక్రమాలతో పాటు ఇతర కొత్త కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
కావున తమరు అందరూ ఐదవ తరగతి నుండి పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరనైనది.
ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యాయుల సమావేశంలో MEO మహంకాళి బుచ్చయ్య కోరారు.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ప్రధానోపాధ్యాయురాలు ఏ.భద్రమ్మ తెలిపారు.

 

Students

ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 19 వరకు నిర్వహించబడుతుందని చెప్పారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డ్రాయింగ్, డాన్స్ క్రాఫ్ట్ కరాటే, గేమ్స్ మరియు స్పోర్ట్స్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పలు శిక్షణలు ఉంటుందన్నారు.ఈకార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులుజ్ మాజీ సర్పంచ్, గ్రామ కార్యదర్శి దేవేందర్,ఉపాధ్యాయులు కృపాల్,దేవేందర్,తాజుద్దీన్,కిషన్, పద్మశ్రీ,వాలంటీర్స్ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ .!

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ శిక్షణ కేంద్రాల ఇంచార్జీల సమీక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ప్రధాన కార్యాలయంలో సంస్థకు చెందిన శిక్షణ కేంద్రాల ఇంచార్జీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జహీరాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాలరావు పాల్గొన్నారు.ఈసమావేశంలో సెట్విన్ సంస్థ ఇంచార్జీలు,అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version