పోలియో రహిత సమాజా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవర ణంలో ఐదుసంవత్సరాల లోపు చిన్నారు లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజక వర్గం గ్రామపంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన పోలి యో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదం డ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపు నిచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత
ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు,స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.