పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్‌ ఉపయోగకరం…

పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్‌ ఉపయోగకరం

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కపాస్ కిసాన్ యాప్‌ ను ప్రారంభించిన కలెక్టర్

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

 

ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్‌ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. యాప్‌ ను పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు సులభంగా,మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.గురువారం వరంగల్ జిల్లా
దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె, ముద్దునూరు,బంధంపెల్లి,గ్రామాల పత్తి రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవి అధ్యక్షతన కిసాన్ యాప్ పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రైతులకు స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్ , భూమి రికార్డుల ద్వారా సులభంగా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలున్నాయని అన్నారు.

 

ఆధార్ నంబర్‌తో స్వీయ-నమోదుతో పాటుమార్కెట్‌లో రద్దీని తగ్గించడానికి క్యూలను నివారించడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్మకాలు జరుపుకోవడంతో పాటు పేమెంట్ ట్రాకింగ్ వంటి సదుపాయాల ద్వారా లావాదేవీలలో పారదర్శకతను అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.ముందుగా ప్లేస్టోర్ నుంచి కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యాప్‌లో ఆధార్, భూమి రికార్డులు (పట్టాదారు పాస్‌బుక్), పంట రకం, విస్తీర్ణం, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలన్నారు.పత్తి అమ్మాలనుకుంటున్న మార్కెట్‌ను ఎంచుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.నాణ్యమైన పత్తి కి మంచి మద్దతు ధర రూ.8110 వస్తుందని తెలియజేశారు.పత్తి ఏరడానికి కాటన్ బ్యాగ్స్, పాత చీరలు వాడాలని, ప్లాస్టిక్ సంచులు వాడరాదని సూచించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్స్, మరియు ప్రైమరీ స్కూల్ లను కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, ఏఈఓలు హనుమంతు,విజయ్, రాజేశ్ ఆయా గ్రామాల పత్తి రైతులు పాల్గొన్నారు.

భూభారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి – కలెక్టర్…

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి — జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య.

తహసిల్దార్ కార్యాలయం నుండి వచ్చే ప్రతి ఫైల్ నిర్ణీత ప్రొఫార్మాలో పంపాలి.

ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట, వెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ పి ప్రావీణ్య, రెవెన్యూ అధికారులను ఆదేశించారు ఆదేశించారు. గురువారం జిల్లా లోని ఆర్ డి ఓ లు, తహశీల్దార్ల తో కలెక్టరేట్ సమావేశమందిరంలోభూభారతి అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు నిర్ణీత ప్రొఫార్మాలో అవసరమైన పూర్తి వివరాలు జత చేసి తాసిల్దార్ కార్యాలయం నుండి ఆర్డిఓ కార్యాలయానికి ఆర్డిఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ కు పంపించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇప్పటివరకు భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు . నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.

సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి సంబంధిత స్థలాలను పరిశీలించి విచారణ జరపాలని అధికారులకు సూచించారు. వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ, జీఐఎస్ ఆధారిత సర్వే డిజిటైజేషన్ వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి, భూ రికార్డులను పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాదా బైనామాలు కు సంబంధించి పూర్తి వివరాలతో వచ్చిన దరఖాస్తు అన్నిటికి సంబంధించిన ఫైళ్లను అన్ని సిద్ధం చేసుకోవాలని తెలిపారు .కలెక్టరేట్ వచ్చిన ఫైళ్లను కలెక్టరేట్ కు సంబంధించి సెక్షన్ అధికారులు క్షుణ్ణంగా సెక్షన్ అధికారులు వచ్చిన ఫైల్ కు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఫైల్ నోట్లు రాసి సిద్ధం చేయాలన్నారు . ఒకవేళ ఫైల్ రిజెక్షన్ అయితే ఎందుకు రిజెక్షన్ చేశాము, అన్న వివరాలు సైతం నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు తాసిల్దార్ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయాల నుండి వచ్చిన ఫైళ్లను జిల్లా స్థాయిలో రూపొందించిన నిర్ణీత ప్రొఫార్మ ప్రకారం సంబంధిత ఫైల్స్ రానున్న 15 రోజుల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ ) మాధురి నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి / జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా అందోల్ ఆర్డీఓ పాండు సంగారెడ్డి ,జి.రాజేందర్,జిల్లా లోని తహసీల్దార్లు పాల్గొన్నారు .

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను విచారణ వేగవంతం చేయాలి…

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను విచారణ వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను ఆదేశించారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, అసైన్డ్ భూముల విచారణ, భూ భారతి, 22-ఏ తదితర కీలక అంశాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
మండలాల వారీగా దరఖాస్తుల స్థితిని తెలుసుకున్న కలెక్టర్ దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలంటే అధికారులు వచ్చిన దరఖాస్తులు ఆదారంగా క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ రికార్డుల ప్రామాణికతను నిర్ధారిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని, అవసరమైన సందర్భాల్లో సంబంధిత అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్ట నిబంధనలను పాటించని ఎంఆర్ఓ…

సమాచార హక్కు చట్ట నిబంధనలను పాటించని ఎంఆర్ఓ

దరఖాస్తు ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా వీడని నిర్లక్ష్య వైఖరి

◆:- ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ సమాచార హక్కు చట్టం 2005 నిబంధనలను పాటించకుండా తన నిర్లక్ష్య వైఖరిని వ్యక్తపరుస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు తమ పనులకు జవాబుదారీగా ఉండాలని నిర్దేశించడం, పనుల పారదర్శకత కోసం ప్రజాస్వామ్య ప్రక్రియను మెరుగుపరచడం పౌరుడికి కావాల్సినటువంటి సమాచారం పొందుటకు సమాచారకు చట్టాన్ని అమలులోకి తెచ్చి సంబంధిత అధికారి ప్రజల కోరిన సమాచారాన్ని ఇవ్వాలన్న ఆదేశాలు సంబంధిత అధికారులు కలిగి ఉన్నప్పటికీ సంబంధిత సమాచారం కలిగి ఉండి సమాచారం ఇవ్వకుండా నాలుగు నెలలుగా నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల తాసిల్దార్ తిరుమలరావు మండల పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయతర భూముల వివరాల సమాచారం కోరగా ఇప్పటివరకు దాదాపు నాలుగు నెలలు గడుస్తున్న సమాచారం ఇవ్వలేదని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జూలై 11.2025 రోజున ఎంఆర్ఓ ను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోయారు.అధికారుల నిర్లక్ష్యంతో భూముల వివరాల అడిగిన బ్యాంకులో నువ్వు ఉన్నవారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అనుమానంతో రైతుల వద్ద డబ్బులు వసూలు చేసి దోచుకుంటున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని,అధికారుల అండ చూసుకోనీ భూములు రిజిస్ట్రేషన్లు చేస్తున్నా
వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఇప్పటివరకు దాదాపు నాలుగు నెలలు కావస్తున్న సమాచారం ఇవ్వలేదని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లిన అందుబాటులో ఉంటూ ఏ సమాధానం ఇవ్వలేదన్నారు ఆర్డిఓ అధికారి కార్యాలయం,పౌర సమాచార అధికారి అప్పిలేటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version