దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్త…!

మోసపోకుండా జాగ్రత్త…!
అవగాహనే రక్షణ…!

జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్

మహబూబాబాద్/ నేటి దాత్రి

దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, ఓటిపి లు, యూపీఐ పిన్‌లు తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారని అన్నారు.

హెచ్చరిక: అక్టోబర్ 1 నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది మోసపోయి రూ. 8.5 లక్షల వరకు నష్టం కలిగిందని తెలిపారు.

సైబర్ మోసగాళ్ల విధానం:

నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షించడం.

వాట్సాప్, ఎస్ ఎం ఎస్, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపడం.

యాప్ డౌన్‌లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడం.

గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు చూపించడం జరుగుతుందని గుర్తు చేశారు.

జిల్లా ప్రజలకు సూచనలు:

ధృవీకరించిన వెబ్‌సైట్లు మరియు అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

టెలిగ్రామ్ లేదా ఇతర లింక్‌ల ద్వారా ఏపీకె ఫైల్స్ డౌన్‌లోడ్ చేయ వద్దని తెలిపారు.

ఎవరికీ బ్యాంక్ వివరాలు, ఓటిపి లు యూపీఐ పిన్‌లు పంచుకోవద్దని తెలిపారు.

ముందుగానే చెల్లింపులు చేయకుండా, “ క్యాష్ ఆన్ డెలివరీ” సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు..

ఎలాంటి మోసాలు జరిగిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండని సూచించారు.
మోసపోకుండా జాగ్రత్త అవగాహనే రక్షణ.”

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version