బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదు
బీసీ సంఘం రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్
“నేటిధాత్రి”, కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్ స్థానిక సంస్థల్లో , విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవితక్క చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు కరీంనగర్ జిల్లా బిసి కులాలు సంపూర్ణ మద్దతు ప్రకటించి పోస్టర్ ఆవిష్కరించారు.
*ఈ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలే అని విమర్శించారు.
*బీసీల పట్ల ఇన్నేళ్లుగా అణచివేత వ్యవహరిస్తూ రెండు పార్టీలైన బిజెపి కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు చేసిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో, ఉన్నత విద్యలో , ఉద్యోగాల్లో ఇప్పటికీ బీసీలకు అన్యాయం జరుగుతున్న కూడ అధికారంలో ఉన్న పార్టీలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించారని వాపోయారు.
*గతంలో కాకా కాలేల్కర్ కమిషన్, అధికారికంగా మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను బహిర్గతం చేయని నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు.
మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ హయాంలో కూడా 50 శాతానికి పైగా ఉన్న బీసీ బిడ్డలకు 40 నియమాలతో కూడిన నివేదికను అణచివేసి , ఎక్కడ బిసి బిడ్డలు రాజకీయాల్లోనూ విద్య ఉద్యోగాల్లోనూ ఉన్నత స్థాయికి ఎదుగుతారని కక్షతో మండల్ కమిషన్ నివేదికను అమలు కాకుండా చేశారని గుర్తు చేశారు.
ఎందరో బీసీ మహనీయులు మండల్ కమిషన్ అమలుకు అనేక పోరాటాలు చేస్తే భారతీయ జనతా పార్టీ అడ్డుకొని మండల్ ఉద్యమానికి బదులుగా కమాండల్ ఉద్యమానికి తెరలేపి బీసీ బిడ్డలకు తీవ్ర అన్యాయాన్ని గురిచేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీదని ధ్వజమెత్తారు. ఇన్నేళ్లుగా బీసీల పట్ల పోరాటం చేస్తుప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం కుమ్మక్కై చోటే బాయ్ – బడే భాయ్ గా రేవంత్ రెడ్డి – మోదీ బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన చేయలేదని రేవంత్ రెడ్డి మూడు రోజులు కాదు డిల్లీలో మూడు నెలలైన డిల్లీలోనే ఉండి పోరాడి బీసీ బిల్లుకు ఉద్యమించాలని కోరారు.
తమిళనాడు రాష్ట్రంలో బీసీల కోసం 3 నెలలుగా జయలలిత గారు పోరాటం చేశారని నేటితో 50 సార్లు డిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి గారు మాత్రం బీసీ బిల్లుకు కృషి చేయలేదని మండిపడ్డారు.
బీసీ బిడ్డల కోసం ఎమ్మెల్సీ కవితక్క ఉక్కు గుండెతో పోరాట పటిమ నింపుకొని 72 గంటల నిరాహార దీక్షకు పునాది వేయడం హర్షణీయం చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు జరిగి ఎమ్మెల్సీ కవిత గారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిరహార దీక్షకు చేపడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.
యుపిఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమయ్యారునీ ,ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు ఆమె బీసీ బిడ్డల కోసం ప్రకటించారని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఉన్న బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరును ఆమె తప్పుబట్టారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా రావాలని ఆమె చేసే పోరాటానికి బిసి కులాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కనకయ్య, శ్రీనివాస్, కలర్ సత్తన్న, తూల భాస్కర్ రావు, పర్శరం గౌడ్, అనీల్ యాదవ్, పుదరి రాజేశ్వరి గౌడ్, శివరాణి, సంద్యరాణి, మేకల అంజనేయులు, రత్నాకర్, రాజీ తదితరాలు పాల్గొన్నారు