ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం…

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం

మాట నిలబెట్టుకున్న సొంటి రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

క్కొండ మండల కేంద్రంలోని నవత ఆటో యూనియన్ సభ్యులందరికీ తన సొంత ఖర్చులతో ఉచితంగా ప్రమాద బీమా చేపిస్తానన్న మాట ప్రకారం. 160 మంది డ్రైవర్లకు సంవత్సరం పాటు ఉచితంగా ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల బీమా ఇన్సూరెన్స్ చేపించిన టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి. బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ సెంటర్లో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ భీమ పత్రాలను నవత ఆటో యూనియన్ డ్రైవర్లకు అందించిన సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, ఈ సందర్భంగా సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సంవత్సరమే కాకుండా ఐదు సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీ బీమా అందరికీ చెల్లిస్తానని ఇంకా ఎవరైనా డ్రైవర్లు ఉంటే వాళ్ల పేర్లు కూడా పంపించాలని ప్రతి ఒక్క డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమని యూనియన్ బాధ్యులకు తెలిపారు. డ్రైవర్ల అందరూ ప్రభుత్వానికి పరోక్షంగా సేవ చేస్తున్నారని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుటలో డ్రైవర్ల పాత్ర కీలకమని, వీరి కుటుంబాలు వీరిపై ఆధారపడి ఉన్నాయని, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరో ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా చట్టప్రకారం ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఇలాంటి ఇన్సూరెన్స్ లను వినియోగించుకోవాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కి చిరు సన్మానం చేశారు .కార్యక్రమంలో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్, శ్రీరంగం శ్రీనివాస్, ఉల్లేరావు ప్రభాకర్, పెండ్యాల రాజు, బద్రు నాయక్, మోడెం రాజు, మహమ్మద్ అమీర్, నవత ఆటో యూనియన్ డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ ధరలు..తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ ధరలు..తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే

 

 

భారతీయులకు సెప్టెంబర్ 22 నుంచి వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప మార్పు అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం ప్రధానంగా ఏ వస్తువులపై జీఎస్టీ తగ్గనుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.

భారతీయులకు రేపటి (సెప్టెంబర్ 22, 2025) నుంచి ఊరట కలిగించే శుభవార్త అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన ప్రకారం, దైనందిన అవసరాల వస్తువులపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) శ్లాబ్స్ తగ్గిపోయాయి. దీంతో రోజువారీ ఆహార పదార్థాలు, షాంపూలు, గృహోపకరణాలు వంటి అనేక అవసరమైన వస్తువులు ఇకపై తక్కువ ధరలకు లభించనున్నాయి (New GST List September 2025).

ముఖ్యంగా జీవన, ఆరోగ్య బీమా సేవలపై కూడా GST రేటును సున్నాకి తగ్గించారు. ఈ మార్పులతో దాదాపు 400కిపైగా వస్తువులపై పన్ను భారం తగ్గిపోనుంది. ఇది ప్రధానంగా మధ్య తరగతి ప్రజలకు నిజంగా ఊరటనిచ్చే నిర్ణయం. కానీ లగ్జరీ, సిన్ గూడ్స్‌పై మాత్రం 40 శాతం వరకు పన్ను కొనసాగనుంది.

కొత్త GST రేట్ల జాబితా 2025: వస్తువుల వారీగా వివరాలు

5 శాతం రేటు (మార్పు లేదు)

  • రూ.2500 కంటే తక్కువ విలువ ఉన్న దుస్తులు, దుస్తుల ఉపకరణాలు
  • రూ.2500 కంటే తక్కువ విలువ ఉన్న కాటన్ క్విల్ట్స్
  • ఇతర టెక్స్‌టైల్ వస్తువులు (రూ.2500 కంటే తక్కువ)

18 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువులు

  • సైనిక ఉపకరణాల భాగాలు (ఎగ్జెక్షన్ సీట్లు, డ్రోన్ బ్యాటరీలు, సముద్ర ఆయుధాలు మొదలైనవి)
  • డైమండ్ ఇంప్రెస్ట్ అథారిటీ కింద దిగుమతి చేసిన 25 సెంట్స్ వరకు ఉన్న కట్ అండ్ పాలిష్ డైమండ్స్
  • కళాకృతులు, పురాతన వస్తువులు

12 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువులు

  • UHT మిల్క్, చీజ్ (ప్యాక్ చేసినవి), పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, చపాతీ, రోటి
  • కొన్ని ఔషధాలు (ఉదా: ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్, అసిమినిబ్)
  • నోట్‌బుక్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, పెన్సిల్ షార్పెనర్స్, క్రయాన్స్

 

12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించబడిన వస్తువులు

  • కండెన్స్‌డ్ మిల్క్, బటర్, గీ, చీజ్
  • రూ. 2500 కంటే తక్కువ విలువ ఉన్న ఫుట్‌వేర్
  • కాటన్, జ్యూట్ హ్యాండ్‌ బ్యాగ్స్
  • వుడ్, రతన్, బాంబూ ఫర్నిచర్
  • కిరోసిన్ స్టవ్, లాంతర్లు, సీవింగ్ మెషీన్స్
  • డ్రై ఫ్రూట్స్ (బాదం, హాజెల్‌నట్స్, పిస్తా మొదలైనవి)
  • టెండర్ కొబ్బరి నీరు (ప్యాక్ చేసినవి)
  • నామ్‌కీన్, డయాబెటిక్ ఫుడ్స్
  • వ్యవసాయ యంత్రాలు, సౌర శక్తి పరికరాలు

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి…

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి

◆:- బీమా పథకాలపై అవగాహన

◆:- సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

◆:- ఎస్బిఐ సీజీఎం సహదేవన్ రాధాకృష్ణన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం (చీఫ్ జనరల్ మేనేజర్ ) సహదేవన్ రాధాకృష్ణన్, డీజీఎం జితేంద్ర కుమార్ శర్మ లు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జన సురక్ష పై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్, సురక్ష, జీవన్ జ్యోతి, గ్యాస్ సబ్సిడీ, దీన్ దయాళ్, అంత్యోదయ యోజన, కిసాన్ సమ్మన్ నిధి, పీఎంకిసాన్, సుకన్య సమృద్ధి పథకం, బేటీ బచావో బేటీ పడావో తదితర పథకాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. ప్రతి ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని వారు సూచించారు. ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని మహిళా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ అరెస్టు వంటి మోసాలను నమ్మకూడదని, అలాంటి సంఘటనలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఢీ హైదరాబాద్ రాజీవ్ కుమార్, సంగారెడ్డి ఆర్‌ఎం ఆర్‌బిఓ పపాసాహెబ్ సిరాజ్ బాషా, ఝరాసంగం ఎంపీడీవో మంజుల, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, రాయికోడ్ తదితర మండలాలకు చెందిన ఐకెపి సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు కేతకి సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గొల్ల కురుమలను అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరు…

గొల్ల కురుమలను అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో
గొల్ల కురుమలు అందరు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గొల్ల కాపరులను పట్టింపు చేయకుండా ప్రభుత్వ వైఖరిని కండిస్తూ భూపాలపల్లి జిల్లా జేడీ కార్యాలయ ముట్టడికి భయలుదెరగ ముందస్తు గా తెల్ల వారు జామున అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది,ఈ సంధర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె అనిల్ యాదవ్ మాట్లాడుతూ గొర్లు మేకలకు నట్టల మందులు పంపిణీ చేయాలి గొర్ల మేకల మేత కోసం559_1016 జీవోల ప్రకారం ప్రభుత్వ భూములు సొసైటీలకు ఇవ్వాలి ఆలాగే వివిధ ప్రమాదాలో చనిపోతున్న గొర్ల కాపరులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియో మరియు గొర్లు మేకలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ప్రభుత్వం రెండో విడుత గొర్లు లేదా నగదు బదలీ ఇవ్వాలని లేదంటే గొల్ల కురుమలును అందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో గొల్ల కురుమల సంఘం మండల అధ్యక్షులు మర్రి నరేష్ యాదవ్ సంఘం అద్యక్షులు కోడారి రవి యూత్ అద్యక్షులు వేముల హరీష్ యాదవ్ సంఘం జిల్లా నాయకులు కట్టే కొల్ల రాజు కోశాధికారి యదండ్ల మహేష్ యాదవ్ పాల్గొన్నారు.

భూపాలపల్లిలో జర్నలిస్టుల పక్షంలో TSJU…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-37-5.wav?_=1

జర్నలిస్ట్ ల పక్షాన నిలిచేది టి.ఎస్ జే.యూ యూనియన్

జిల్లా అధ్యక్షులు సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవిందర్

భూపాలపల్లి నేటిధాత్రి

జర్నలిస్ట్ ల పక్షాన నిలిచేది తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ( ఎన్ యు జె ఐ) అని జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు అన్నారు.కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్ట్ ల పక్షాన టి ఎస్ జే యూ పోరడుతుందని స్పష్టం చేశారు.ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రయివేటు,కార్పొరేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పించిన ఘనత మాదే అన్నారు.జర్నలిస్ట్ ల భద్రత దృష్ట్య ఏ యూనియన్ చేయని విధంగా టి ఎస్.జే.యూ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం,ప్రధానం కార్యదర్శి తోకల అనిల్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ ల సూచనతో యూనియన్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి జర్నలిస్ట్ కు రూ.5 లక్షల ప్రమా భీమా కల్పించిన ఏకైక యూనియన్ మాదే అన్నారు.అంతే కాకుండా టి ఎస్ జెయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదార్థాల నియంత్రణపై విస్తృత కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు.వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కొన్ని యూనియన్లు మా యూనియన్ సభ్యులను మభ్యపెడుతూ తమ యూనియన్లో చేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది.ఆ యూనియన్ నేతలు ఇప్పటివరకు జర్నలిస్టులకు ఏం చేశారో చెప్పాకే జర్నలిస్ట్ లు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.మా యూనియన్ ఎప్పుడు జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని జర్నలిస్టులు మిత్రులకు గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు..జిల్లా ఉపాధ్యక్షులు గట్టు రవీందర్ గౌడ్,జిల్లా
ప్రచార కార్యదర్శి కారుకూరి సతీష్
సంయుక్త కార్యదర్శి కడపక రవి,బోళ్లపల్లి జగన్ గౌడ్, మారపేల్లి చంద్రమౌలి,దేవేందర్ తదితరులు పాల్గోన్నారు.

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్…

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా జిల్లాలో జిల్లాకు సంబంధించి జరిపిన అన్ని రకాల వాహనాల కేసుల గురించి జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మరియు మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ కార్యాలయ నిర్వాహకురాలు కల్పన జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో తెలిపిన వివరాలు జిల్లా నుంచి మొత్తం 293 కేసులు రాయడం జరిగిందన్నారు. అందుకుగాను రాష్ట్ర రవాణా శాఖ వారు నిర్ణయించిన 64 లక్షల రూపాయలు 100% గా నియమించారు. దీనికి గాను టాక్స్ మరియు పెనాల్టీ కాంపౌండింగ్ ఫీజు ద్వారా మొత్తంగా 96,96,465 టాక్స్ ఫెనాల్టీ రూపేణా 151 %గా వసూలు చేశామని మని తెలిపారు. అలాగే ఇంకా టాక్స్ కట్టని సరుకు రవాణా వాహనాలు ట్రాక్టర్ ట్రైలర్ ఇతర వాహనాలు 5088 వాహనాలు ఉన్నట్టు. ఈ వాహనాలు మీ స్వంతంగా టాక్స్ కట్టుకుంటే ఎలాంటి పెనాల్టీ లేకుండ కట్టాల్సి ఉంటుంది అదే రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే 200 % ఫైన్ తో కట్టాల్సి ఉంటుందని. సరుకు రవాణా వాహనాలు తప్పని సరిగా భీమా, కాలుష్య నియంత్రణ పత్రాలు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అలాగే పదిహేను సంవత్సరాలు పూర్తి ఐన స్వంత పనులకు వాడే ద్విచక్ర వాహనాలు, స్వంత కార్ లు విధిగా గ్రీన్ టాక్స్ వాహన భీమా వాహన కాలుష్య పత్రాలతో మీ స్వంత వాహనాలను పురుద్దరణ చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి తెలిపారు .పై విషయాన్ని రాష్ట్ర రవాణా కామిషనర్ సురేంద్ర మోహన్ కి తెలియజేశారు.

ఎస్ బి ఐ నుండి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత..

ఎస్ బి ఐ నుండి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండలంలోని వాగ్య నాయక్ తండ కు చెందిన స్వామి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా నెక్కొండ ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ ఐలేష్ మృతుడి భార్య సునీతకు రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ ఐలేష్ మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంకులో స్వామి 436 రూపాయల ఇన్సూరెన్స్ ను చేయడంతో రెండు లక్షల బీమా చెక్కును మృతుడి భార్య సునీతకు అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఎస్బిఐ ఇన్సూరెన్స్ ను తప్పక కట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ ఎస్బిఐ బ్యాంకు సిబ్బంది, నెక్కొండ మాజీ జెడ్పిటిసి సరోజ హరి కిషన్ పాల్గొన్నారు.

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌..

 

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా…

ఆరోగ్య బీమా లేదా..?

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా అందుబాటు ప్రీమియంలలో ఆరోగ్య బీమా పొందలేక పోతున్నారు. ఈ కారణంగా ఆస్పత్రి, వైద్య పరీక్షలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌ వ్యయాలన్నీ తాము పొదుపు చేసుకున్న సొమ్ము నుంచే చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను చట్టం 80డి సెక్షన్‌.. 60 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య సంబంధిత వ్యయాలపై కొన్ని రాయితీలు అందిస్తోంది. పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం. దీని కింద ఆరోగ్య బీమా పాలసీ లేకపోయినా సీనియర్‌ సిటిజన్లు ఆరోగ్య సంబంధిత వ్యయాలపై పన్ను మినహాయింపులు కోరవచ్చు.
80డి సెక్షన్‌ ఏమిటి?

పన్ను చెల్లింపుదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సెక్షన్‌ ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య సంబంధిత వ్యయాలపై రాయితీలు, మినహాయింపులు అందిస్తుంది. తద్వారా పన్ను చెల్లింపు మొత్తం ఆదా చేస్తుంది.

  • ఈ సెక్షన్‌ కింద పన్ను చెల్లింపుదారు తనతో పాటుగా కుటుంబ సభ్యుల (భార్య లేదా భర్త, తనపై ఆధారపడిన సంతానం) ఆరోగ్య సంరక్షణకు చేసిన వ్యయాలపై లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • దీనికి తోడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల కోసం చేసిన ఆరోగ్య సంబంధిత వ్యయాలు, ఆరోగ్య బీమా ప్రీమియంపై మరో రూ.25,000 పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేయవచ్చు.
  • అలాగే ప్రీమియం చెల్లిస్తున్న వ్యక్తి (స్వయంగా లేదా కుటుంబ సభ్యుల కోసం) సీనియర్‌ సిటిజన్‌ అయినట్టయితే ఈ మినహాయింపు పరిమితి గరిష్ఠంగా రూ.50,000 వరకు ఉంటుంది. అంటే మీరు సీనియర్‌ సిటిజన్‌ అయి ఉండి మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం కూడా ప్రీమియం చెల్లిస్తున్నట్టయితే రూ.1 లక్ష వరకు ఆదాయపు పన్ను మినహాయింపునకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.
  • ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ చెల్లింపుల (గరిష్ఠంగా రూ.5,000) కోసం చేసే వ్యయాలైతే నగదు రూపంలో చెల్లించవచ్చు. మిగతా వ్యయాలేవైనా నగదేతర రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

బీమా కవరేజీ లేని వారి మాటేమిటి?

ఆరోగ్య బీమా కవరేజీ లేని సీనియర్‌ సిటిజన్లకు కూడా ఈ సెక్షన్‌ రాయితీలు కల్పిస్తోంది. అలాంటి వారు వైద్య వ్యయాలపై ఏడాదికి గరిష్ఠంగా రూ.50,000 వరకు మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ వ్యయాలను మీ పిల్లలు భరించినట్టయితే వారు కూడా పన్ను మినహాయింపులు పొందేందుకు అర్హులవుతారు. కేవలం 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అంతే కాదు…నూతన, సరళీకృత ఆదాయపు పన్ను విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.

ఎస్ హెచ్ జీ సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసా.

ఎస్ హెచ్ జీ సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసా

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

37 మందికి రూ.38 లక్షల లోన్ బీమా చెక్కులు,
ఇద్దరికి ప్రమాద బీమా రూ. 20 లక్షలు పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జీ) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు బీమా, సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి సోమవారం పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలంలో 14 మందికి రూ. 14,96,457, తంగళ్ళపల్లి మండలంలో ఒకరికి రూ. 30 వేలు, గంభీరావుపేట మండలంలో 8 మందికి రూ.7,66,925, వీర్నపల్లి మండలంలో ఇద్దరికి రూ.2,67,434, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి రూ.13,04,133 మొత్తం రూ. 38, 64,949 విలువైన చెక్కులు ఆయా స్వయం సహాయక సంఘాల బాద్యులకు అందజేశారు.
ఇద్దరికి ప్రమాద బీమా పంపిణీ అలాగే ముస్తాబాద్ మండలంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు ప్రమాదవశాత్తూ మరణించగా, వారికి నామిని లకు రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల విలువైన చెక్కులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు.కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా

ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా…

 

వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా…

వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోకూడదు. అలా చేస్తే కష్ట సమయాల్లో అక్కరకు రాకపోగా మన జేబుకే చిల్లు పడే ప్రమాదం ఉంది.

దీంతో చాలా మంది స్విగ్గీ, జొమాటాలో బిర్యానీ లేదా ఇతర తినుబండారాలు ఆర్డర్‌ చేసినంత ఈజీగా ఆరోగ్య బీమా పాలసీలు కొనేస్తున్నారు. ఆ పాలసీ షరతులు ఏంటి? కవరేజీ పరిమితులు, మినహాయింపుల గురించి ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. దీంతో ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రిలో చేరేటప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిమితులు, మినహాయింపులను అడ్డుపెట్టుకుని బీమా కంపెనీలూ క్లెయిమ్స్‌కు సారీ చెబుతున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అవేమిటంటే..

అవగాహన

ఆరోగ్య బీమా అనేది ఒక భరోసా. అయితే వ్యాపారం పెంచుకునేందుకు కంపెనీల ఏజెంట్లు ఇప్పుడు దీన్ని కూడా వస్తువులను అమ్మినట్టు అమ్మేస్తున్నారు. పాలసీ తీసుకునే వ్యక్తికి పెద్దగా అవగాహన లేకపోతే లేని ప్రయోజనాలను ఉన్నట్టు చెప్పి మరీ అంటగడుతున్నారు. కాబట్టి కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునే వ్యక్తి లేదా వ్యక్తులు పాలసీ గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే పాలసీ తీసుకోవడం మంచిది. ఇందుకోసం పాలసీ షరతులు, కవరేజీ పరిమితులు, మినహాయింపులను ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థంగాకపోతే ఎవరైనా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

ఇప్పటికే ఉన్న వ్యాధులు

దాదాపు అన్ని బీమా కంపెనీలు ఇప్పటికే ఉన్న వ్యాధులకు వెంటనే కవరేజీ అనుమతించవు. కనీసం రెండు మూడేళ్ల తర్వాతే ఇందుకు అనుమతిస్తాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు కూడా వెంటనే కవరేజీ కావాలంటే ప్రీమియం కొద్దిగా ఎక్కువ చెల్లించాలి.

మెటర్నిటీ ట్రీట్‌మెంట్లు

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే మెటర్నిటీ ట్రీట్‌మెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లేకపోతే బీమా కంపెనీలు ఇందుకు అనుమతించవు. ఒకవేళ అనుమతించినా అందుకు సవాలక్ష పరిమితులు, ఆంక్షలు పెడుతుంటాయి.

ఆధునిక ట్రీట్‌మెంట్లు

ఆరోగ్య సమస్యలతో పాటు ట్రీట్‌మెంట్లు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. టెక్నాలజీ అభివృద్ధితో ఇప్పుడు అధునాతన రోబోటిక్‌ సర్జరీలు, జన్యు (జెనెటిక్‌) పరీక్షలూ అందుబాటులోకి వచ్చాయి. పాలసీ తీసుకునేటప్పుడే ఇవి కూడా కవరయ్యేలా జాగ్రత్త పడాలి.

మానసిక రుగ్మతలు

మానసిక రుగ్మతలకు కూడా ఆరోగ్య బీమా వర్తింప చేయాలని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ ఆప్షన్‌ ఒకటి ఉందనే విషయాన్ని బీమా కంపెనీలు పెద్దగా పాలసీదారులకు చెప్పడం లేదు. మానసిక ఒత్లిళ్లు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆరోగ్య బీమా పాలసీ కింద ఈ రుగ్మతలకు కూడా కవరేజీ ఉండేలా చూసుకోవాలి.

గదుల అద్దె

కొన్ని ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్‌గా చేరక తప్పదు. అయితే ఇందుకు అయ్యే రూమ్‌ రెంట్‌పై బీమా కంపెనీలు అనేక పరిమితులు పెడుతుంటాయి. ఆ పరిమితికి మించి రూమ్‌ రెంట్‌ ఉంటే ఆ అదనపు మొత్తాన్ని పాలసీదారులే భరించాలి. కొన్ని బీమా కంపెనీలు రూమ్‌ రెంట్‌ ఎంత ఉన్నా, అది పాలసీ కవరేజీకి లోబడి ఉంటే చాలని చెబుతున్నాయి. పాలసీ తీసుకునేటప్పుడే పాలసీదారులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. లేకపోతే జేబుకు చిల్లు పడుతుంది.

ఓపీడీ, వ్యాధి నిర్ధారణ

ఇవాళ ఔట్‌ పేషెంట్‌ సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా పెద్దభారంగా మారాయి. పెద్దపెద్ద ఆస్పత్రుల్లో డాక్టర్‌ కన్సల్టేషన్‌, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే ఈ ఖర్చులకూ కవరేజీ ఉండేలా జాగ్రత్త పడాలి. అయితే బీమా కంపెనీలు ఒక పరిమితి వరకే ఈ ఖర్చులను అనుమతిస్తాయి.

ఇతర జాగ్రత్తలు

  • పాలసీ తీసుకునే ముందే పాలసీ బ్రోచర్‌ను కాకుండా పాలసీ పూర్తి డాక్యుమెంట్‌ తీసుకుని చదివి పూర్తిగా అర్థం చేసుకోవాలి.
  • పాలసీ ద్వారా ఏయే సమస్యలకు కవరేజీ లభించదో ముందుగానే పూర్తిగా తెలుసుకోవాలి.
  • బీమా కంపెనీల పరిభాష అందరికీ అర్థం కాదు. పాలసీలో పేర్కొనే సబ్‌ లిమిట్స్‌, కో-పే, వెయిటింగ్‌ పీరియడ్‌ అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
  • వివాహం, పిల్లలు పుట్టినప్పుడు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ మీ అవసరాలకు సరిపోతుందా? లేదా? అనే విషయాన్ని సమీక్షించుకోవాలి.
  • మీ ఆరోగ్య బీమా పాలసీ కంపెనీ, పాలసీ వివరాలపై కుటుంబసభ్యులకు ముందుగానే పూర్తిగా తెలియజేయాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అన్ని విషయాలు చక్కబెట్టాల్సిందే వారే.

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటే, అవసరమైనప్పుడు జేబులో పైసా ఖర్చు చేయకుండా ఆరోగ్య సమస్యల నుంచి తేలిగ్గా గట్టెక్కవచ్చు. లేకపోతే ఆరోగ్య పరంగానే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతినే ప్రమాదం ఉంది

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం.

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం

మెట్ పల్లి జూన్ 16 నేటి ధాత్రి

 

 

shine junior college

ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ లు అందజేత
బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు
మెట్ పల్లి: జర్నలిస్టుల భద్రత కొరకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు అన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించగా ఆ పాలసీ బాండ్లను సోమవారం రోజు డాక్టర్ రఘు చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. డాక్టర్ రఘు మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం ఎంతో అభినందనీయం అని, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉన్న విలేకరులకు ప్రభుత్వం ద్వారా కూడా అందవలసిన సహాయ సహకారాల కోసం నేనెప్పుడూ పాటు పడుతా అని డాక్టర్ రఘు అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, అఫ్రోజ్,విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఆగ సురేష్,ఏసవేని గణేష్ ,ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం.

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం అందుకున్న పరమేశ్వర్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .జీవిత భీమా సంస్ధ నుండి అరుదైన గౌరవ పురస్కారం అందుకున్నారు ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ .జీవిత భీమా ద్వారా ప్రతి కుటుంబానికి పొదుపు చేయడం నేర్పడం.మరియు ప్రమాద బీమా ని అందించడం .ఆరోగ్యబీమాను అందించడం తనకు ఎంతగనో సంతృప్తి ఇస్తుంది అని అన్నారు .అనుకోకుండా జరిగే ప్రమాద ల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయ్యాయి అందుకే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు జీవిత భీమా ను తీసుకొని కుటుంబ భద్రతను కాపాడుకోవాలి అని అన్నారు.

కోటి రూపాయల ఎస్బిఐ ప్రమాద భీమా అందజేత.

కోటి రూపాయల ఎస్బిఐ ప్రమాద భీమా అందజేత

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కొమిశెట్టి కిరణ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా, మృతుడు కాశీపేట 2 గని లో విధులు నిర్వర్తించేవాడు.సింగరేణి సంస్థకు ఎస్బిఐ బ్యాంక్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎస్బిఐ సాలరీ అకౌంట్ ఎస్బిఐ లొ మెయింటైన్ చేసినందుకు గాను కోటి రూపాయల భీమా ఎస్బిఐ బ్యాంక్ మంజూరు చేసింది. ఇట్టి కోటి రూపాయల చెక్కును నామిని అయిన మృతుని భార్య కొమిశెట్టి కోమల కు శనివారం రామకృష్ణపూర్ ఎస్బిఐ బ్యాంక్ ఆవరణలో మంచిర్యాల ఎస్బిఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్త, ఆర్బీవో సివిఈ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ మూర్తి లు మృతుని కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమం లో బ్రాంచ్ మేనేజర్ గుగులోత్ గోపాల్, బ్యాంక్ స్టాఫ్ ప్రశాంత్,రామ కార్తిక్, వెంకటేశ్. రాజేంద్ర ప్రసాద్ , చందు, రమాదేవి లు పాల్గొన్నారు.

ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి.

గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి

జమ్మికుంట :నేటిధాత్రి

జమ్మికుంట మండలంలోని ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు బిజిగిరి షరీఫ్ గ్రామ సుడైనటువంటి ముడతనపల్లి రాజు తండ్రి మల్లయ్య ప్రమాదవశాత్తు మరణించగా ఇతనికి గాయత్రి బ్యాంకులో నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ఉంది ప్రమాదంలో చనిపోవడం వల్ల అతని తల్లి అయిన ముడతనపల్లి సుశీలకు లక్ష రూపాయల చెక్కును జమ్మికుంట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయిన శ్రీమతి పుల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా బ్యాంకు మేనేజర్ వోద్దుల మహేందర్ పొల్లు ప్రవీణ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేయడం జరిగింది.

జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం.!

జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయం

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా అవసరం అని, టీ.ఎస్.జె.యూ జర్నలిస్టులకు ప్రమాద బీమా అందించడం అభినందనీయమని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జె.యు) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా పత్రాలను అందజేశారు.
రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్,ఎన్ యుజె(ఐ)జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ ఆధ్వర్యంలో టీఎస్ జెయు జిల్లా కమిటీ సభ్యులు కలసి జర్నలిస్టుల దాడులకు సంబంధించిన కమిటీని పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టులకు టీ.ఎస్.జె.యు ఆధ్వర్యంలో రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా ఇవ్వడం సంతోషకరమని అన్నారు.
విధి నిర్వహణలో రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా వార్తా సేకరణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.అలాంటి సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
టీఎస్ జె యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వ కల్పించే సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో పని చేసే విధంగా చొరవ తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్,జిల్లా ఉపాధ్యక్షులు,గట్టు రవీందర్,సంయుక్త కార్యదర్శులు పల్నాటి రాజు,కడపాక రవి,కోశాధికారి గా సంగెమ్ శేఖర్,ఆర్గనైజ్ సెక్రెటరీ మారేపల్లి చంద్రమౌళి,బొల్లపెల్లి.జగన్,ఈసి సభ్యుడు కె.దేవేందర్ మీడియా ఇంచార్జి కార్కూరి సతీష్.. తదితరులు పాల్గొన్నారు

జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించడం సంతోషకరం.

జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించడం సంతోషకరం

కలెక్టర్ సత్య ప్రసాద్

టీ ఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల అటాక్స్ కమిటీ పునరుద్ధరించడానికి వినతి పత్రం అందజేత

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి:

జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని పునరుద్ధరించాలి అని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సత్య ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో యూనియన్ అంద చేస్తున్న ఉచిత ప్రమాద బీమా పత్రాలను సభ్యులకు ఈరోజు కలెక్టర్ అందచేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ..జర్నలిస్టులకు టి.ఎస్.జే.యు ఇస్తున్నటువంటి 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా ఇవ్వడం ఆ సంతోషకరం అని అన్నారు.విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతుంటారు ఆ సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.టీ.ఎస్.జే.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ… జర్నలిస్టులకు గల సమస్యలను మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నీ కోరారు.ఈ కార్యక్రమంలో టీఎస్ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్,రాష్ట్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ అవునూరి సంపత్, కోరుట్ల నియోజకవర్గ కమిటీ గౌరవ అధ్యక్షులు దీకొండ మురళి, అధ్యక్షులు జోరిగే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, కోశాధికారి ఓంకారి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోయాల్కర్ నరేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడ దివాకర్, మీడియా ఇంచార్జి నన్నాపురజ్ రవిరాజ్, ఈసీ మెంబర్లు పండిత్ రాజేందర్, సయ్యద్ ఫిరోజ్,గట్ల శ్రీనివాస్,దూది గణేష్, సభ్యులు మద్దెనపల్లి నాగేష్, బెజ్జరాపు శ్రీకాంత్, దగ్గుల అశోక్, బెజ్జరాపు శ్రీనివాస్, చొక్కాల రవీందర్, సుద్దాల హరీష్, వెంకటరమణ, గుండవేణి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిద్దాం

– టియుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ ఆర్. లెనిన్
– వరంగల్ జిల్లా టియూడబ్ల్యూజే కార్యవర్గ సమావేశం

వరంగల్, నేటిధాత్రి

జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిద్దామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నారు. గురువారం వరంగల్ లోని వరంగల్ తూర్పు జర్నలిస్టు పరపతి సంఘం భవనంలో టియూడబ్ల్యూజే, టెంజు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీ యూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మిట్ట నవనీత్ గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది. కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు
సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం, యూనియన్ ఐడి కార్డుల పంపిణీ, డెస్క్ జర్నలిస్టుల అక్రిడేషన్ కొనసాగింపు, ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ లో ఇప్పించేందుకు కృషి, వరంగల్లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహకారం, గుర్తింపు ఉన్న సంస్థల్లో పనిచేసే వారికే యూనియన్ సభ్యత్వాలు.అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించట
సమావేశంలో పై తీర్మానాలను ఆమోదించిన
అనంతరం బి ఆర్. లెనిన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో డెస్క్ జర్నలిస్టులను గుర్తించి అల్లం నారాయణ అక్రిడిటేషన్లు ఇప్పిస్తే… ప్రస్తుత ప్రభుత్వం కోత పెట్టేందుకు సిద్ధమైందని, ఒక వేళ అదే జరిగితే పోరాటాలకు సిద్ధమని తెలిపారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులను అల్లం నారాయణ నేతృత్వంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కడుపులో పెట్టుకుని కాపాడుకుందని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించి జర్నలిస్టులకు మనోధైర్యాన్ని నింపిన ఘనత మన యూనియన్ కు దక్కుతుందని అన్నారు. యూనియన్ బలోపేతం అయితే ప్రెస్ క్లబ్ లను సునాయసంగా గెలుచుకోవచ్చన్నారు. అందుకుగాను వరంగల్ జిల్లా కమిటీ యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు. ఇకమీదట యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ నిర్మాణాత్మకంగా పనిచేస్తూ సభ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెరుమాడ్ల వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరిపై పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిటిషన్ ను ప్రెస్ క్లబ్ కమిటీ వెనిక్కి తీసుకుని, వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. టి యు డబ్ల్యూ జే 143 లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి యూనియన్ నుండి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి వారికి అండగా ఉండేందుకు కృషి చేస్తామన్నారు. నూతన సభ్యత్వాల నమోదును పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గుర్తింపు ఉన్న సంస్థల్లో పనిచేసే వారికే యూనియన్ సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు యూనియన్లు, అసోసియేషన్లు, ఫెడరేషన్ల పాత్ర కీలకంగా ఉంటుందని గుర్తు చేశారు. జర్నలిస్టులందరికీ ఎమ్మెల్యేల పరిధిలో ఇళ్ల స్థలాలు లేదా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా ఇప్పటివరకు మీడియా అకాడమీ కనీసం జర్నలిస్టులందరికీ నూతన అక్రిడేషన్లు ఇప్పించలేకపోయారని తెలిపారు. ఇంటి స్థలాలపై జర్నలిస్టులకు భరోసా ఇవ్వలేని పరిస్థితిలో పోటీ యూనియన్ ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాంకిడి శ్రీనివాస్, కోశాధికారి రాపల్లి ఉపేందర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మిట్ట నవనీత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నీలం శివ, కోశాధికారి శ్రీనివాస్,
ఉపాధ్యక్షుడు తౌటి కామేష్ , కంది భరత్, కమటం వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ బండి రవి టెంజు ఉపాధ్యక్షుడు పిండం విజయ్, అమీర్, విద్యాసాగర్, వేణు, జాయింట్ సెక్రెటరీ కిరణ్, ప్రభాకర్, అనిల్ ,రమేష్, సనత్, ప్రదీప్, ఈసీలు, చందు, సంతోష్, కృష్ణ, యుగేందర్, నరేందర్, రాజు, రాజేష్,

జర్నలిస్టులకు వ్యక్తిగత ప్రమాద బీమా అవసరం:- జిల్లా కలెక్టర్ సత్య శారద.

 

తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు భీమా సౌకర్యం కల్పించడం అభినందనీయం.

వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద చేతుల మీదుగా జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా పత్రాల అందజేత

యూనియన్ జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా పత్రాలు అందజేత. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం

*_ టీ.ఎస్.జే.యు రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం గౌడ్.

వరంగల్, నేటిధాత్రి.

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో, యూనియన్ లో ఉన్న జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం గౌడ్ నారగోని అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చేతుల మీదుగా జర్నలిస్టులకు బీమా పత్రాలు అందజేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టులు వ్యక్తిగత జీవిత భీమా ఉండాలని, తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, నరేష్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు కందికొండ గంగరాజు, లింగబత్తిని కృష్ణ, బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, భాగ్యరాజ్, ఈద శ్రీనాథ్, అడుప అశోక్, నాగపురి నాగరాజు, అశోక్, అవినాష్, మోహన్, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version