మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు
మహాదేవపూర్ అక్టోబర్ 6 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబాన్ని సోమవారం రోజున రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి పరామర్శించారు. బ్రాహ్మణపెళ్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెషినేని మాధవరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనంతరం జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, బ్రాహ్మణ పెళ్లి గ్రామానికి సర్పంచిగా ఎనలేని సేవలు అందించారని ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్, మండల నాయకులు ఐలయ్యయాదవ్ రవీందర్, వెంకటేష్, కొక్కు రాకేష్, హరీష్, పలువురు నాయకులు, ప్రజల పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలో జరగబోయే స్థానిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్,మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పిలుపు మేరకు కన్నెపల్లి మండల అధ్యక్షులు మైధం ఆశన్న ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కన్నెపల్లి మండల ఎన్నికల ప్రభారి జిల్లా కార్యదర్శి,రామగౌని మహీధర్ గౌడ్ రావడం జరిగింది. కన్నెపల్లి మండలంలోని 5 ఎంపిటిసి స్థానాలలో ఆశావాహుల అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించారు.ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు,ప్రజా సమస్యల పరిష్కారం కీలక అంశాలపై చర్చించి, ఎంపీటీసీ,జెడ్పిటిసి గా పోటీ చేసే అభ్యర్థుల జాబితాలు సేకరించడం జరిగింది.పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందేలా మండలం లోని ప్రతి గ్రామంలో బూత్ స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు బేరే రామన్న యాదవ్, జిల్లా మండల నాయకులు బర్ల పోషన్న,అరికల భీమన్న,బర్ల సంతోష్,ఇందురి సత్తయ్య, పాముల మల్లేష్,ఎం. భాస్కర్,దాసరి రాజు, శ్రీనివాస్,సౌల్ల తిరుపతి, ఇందురి విజయ,గంగాధర్, పోశం,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రెస్ మీట్ లో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వెల్లడిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి కుదించి బీసీలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టి తన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పంటను పండించి రైతులను డోకా చేశారు. 317 జీవోను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత గత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే. మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది. రైతుబంధు పేరుతో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫంక్షన్ హాల్లకు,ప్రైవేట్ కాలేజీలకు ప్రజా సొమ్మును పంచిపెట్టినది బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిది. అమరవీరుల కుటుంబాలను,ఉద్యమకారులను గుర్తించకుండా వారిని మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వమే. పదేళ్ల కాలంలో సర్పంచులతో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వారి ఆత్మహత్యలకు కారణమైనది బిఆర్ఎస్ ప్రభుత్వం. మహిళలకు పావలా వడ్డీకే 10 లక్షల రుణం ఇస్తానని ఇవ్వకుండా దూకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట తప్పి మోసం చేసింది కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని డోకా చేసింది బిఆర్ఎస్ పార్టీ. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వము. ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి రాగానే ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తానని డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. పది సంవత్సరాల కాలంలో ఒక డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగులను డోకా చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం. గ్రూప్.1 ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం. పదేళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో హడావిడి చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసి ధరణిని అడ్డుపెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు భూములను అక్రమంగా కాజేసినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్ కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన కంఠమహేశ్వర స్వామి మహోత్సవాలు నర్సంపేటలో నిర్వహిస్తున్నారు.
గౌడ కుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ, రేణుక ఎల్లమ్మ వనం మైసమ్మ, దేవతల ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంఠమహేశ్వరస్వామి రేణుక ఎల్లమ్మ లకు బోనాలతో నర్సంపేట పట్టణంలోని గౌడ కులస్తులందరూ , ఘటంకుండ పెద్దమనిషి, సారకోళ్ల పెద్దమనిషి, జయలక్ష్మి సెంటర్ నుండి పట్టణంలోని భవాని ఎలక్ట్రానిక్స్, ఫిష్ మార్కెట్ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహం నుండి రామకృష్ణ దుకాణం నుండి సర్పకాస్ జెండా గద్ద నుండి ద్వారక పేట బైపాస్ రోడ్డు కల్లుమండ్వా నుండి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు,పురవీధుల వెంట భాజా భజంత్రీలు నృత్యాలతో కదిలారు.పాకాల రోడ్డు కూడలిలో జెట్టి కళాకారులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
జెట్టి కళాకారులు పట్టుపోసి వివిధ కళారూపాలను ప్రదర్శించారు ఎల్లమ్మ తల్లి వేషాధారణ పలువురిని ఆకట్టుకున్నది.ఎల్లమ్మ నృత్యధారణ డప్పు కళాకారుల నృత్యాలతో నర్సంపేట పట్టణం మారుమోగింది. శ్రీకంఠమహేశ్వర స్వామి దేవాలయం చేరుకొని శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురామాంబా, దేవతల కళ్యాణం పూజారులు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మకు గావు పట్టడం కార్యక్రమాన్ని ఎల్లమ్మ తల్లి పూజారులు నిర్వహించారు. కన్నుల పండుగ బోనాల పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి బోనాలు తరలివచ్చాయి. గౌడ కుటుంబాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బోనాలను చేసి ఎల్లమ్మతల్లికి వందలాది బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.
ధూప దీప నైవేద్యాలతో వారివారి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగలి వెంకటనారాయణ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి
లింగయ్య గౌడ్, కార్యదర్శి మాచర్ల అయిలు మల్లు, ఉడుగుల శ్రీనివాస్ గౌడ్, గౌడ్ మాజీ అధ్యక్షులు వరుసగా ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్, గొడిశాల సదానందం గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు
గణపురం నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు, శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు, జూలపల్లి నాగరాజు లు సిఐని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.
జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జెడ్పిహెచ్ఎస్ రామాజీపేట్ విద్యార్థిని విద్యార్థులు
రాయికల్ , అక్టోబర్ 6, నేటి ధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
మండలం రామాజీపేట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీలలో ఈనెల 07 -10-2025 నుంచి 10-10-2025 వరుకు వాలీబాల్ కబడ్డీ ఖోఖో క్రీడా పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు గజ్జేల నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు లక్ష్మీకాంతం రమేష్ విజయ్ కుమార్ కిరణ్ రమ యశోద వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్ కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన కంఠమహేశ్వర స్వామి మహోత్సవాలు నర్సంపేటలో నిర్వహిస్తున్నారు.గౌడ కుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ, రేణుక ఎల్లమ్మ వనం మైసమ్మ, దేవతల ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంఠమహేశ్వరస్వామి రేణుక ఎల్లమ్మ లకు బోనాలతో నర్సంపేట పట్టణంలోని గౌడ కులస్తులందరూ , ఘటంకుండ పెద్దమనిషి, సారకోళ్ల పెద్దమనిషి, జయలక్ష్మి సెంటర్ నుండి పట్టణంలోని భవాని ఎలక్ట్రానిక్స్, ఫిష్ మార్కెట్ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహం నుండి రామకృష్ణ దుకాణం నుండి సర్పకాస్ జెండా గద్ద నుండి ద్వారక పేట బైపాస్ రోడ్డు కల్లుమండ్వా నుండి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు,పురవీధుల వెంట భాజా భజంత్రీలు నృత్యాలతో కదిలారు.పాకాల రోడ్డు కూడలిలో జెట్టి కళాకారులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జెట్టి కళాకారులు పట్టుపోసి వివిధ కళారూపాలను ప్రదర్శించారు ఎల్లమ్మ తల్లి వేషాధారణ పలువురిని ఆకట్టుకున్నది.ఎల్లమ్మ నృత్యధారణ డప్పు కళాకారుల నృత్యాలతో నర్సంపేట పట్టణం మారుమోగింది. శ్రీకంఠమహేశ్వర స్వామి దేవాలయం చేరుకొని శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురామాంబా, దేవతల కళ్యాణం పూజారులు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మకు గావు పట్టడం కార్యక్రమాన్ని ఎల్లమ్మ తల్లి పూజారులు నిర్వహించారు. కన్నుల పండుగ బోనాల పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి బోనాలు తరలివచ్చాయి. గౌడ కుటుంబాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బోనాలను చేసి ఎల్లమ్మతల్లికి వందలాది బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ధూప దీప నైవేద్యాలతో వారివారి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగలి వెంకటనారాయణ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, కార్యదర్శి మాచర్ల అయిలు మల్లు, ఉడుగుల శ్రీనివాస్ గౌడ్, గౌడ్ మాజీ అధ్యక్షులు వరుసగా ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్, గొడిశాల సదానందం గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
`తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తారు!
`కేసీఆర్ అసెంబ్లీకి హజరు కాకపోవడం కూడా వాళ్లకు ఇబ్బందే!
`అవకాశం దొరికింది కదా అని విమర్శలే!
`ఎన్టీ రామారావు అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా హజరుకాలేదు.
`నన్నపనేని రాజకుమారి ఏదో ఒక మాట అన్నదని రానని వెళ్లిపోయారు.
`మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతా! అని రాలేదు.
`ఆంధ్రా మేధావులకు అది గుర్తు చేయరు!
`ఆనాడు ఎన్టీఆర్ చేసింది కూడా తప్పే అనే ధైర్యం వారికి వుండదు.
`వైఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర పేరుతో అసెంబ్లీకి హజరుకాలేదు.
`తర్వాత చంద్రబాబు బస్సు యాత్ర, పాదయాత్రల పేరుతో హజరుకాలేదు.
`ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించరు!
`వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా హజరుకాలేదు.
`ఎమ్మెల్సీగా వుండి పాదయాత్ర చేసిన లోకేష్ మండలికి హజరుకాలేదు.
`అప్పుడు ఏ ఒక్క ఆంద్రా మేధావి నోరుతెరవలేదు!
`తెలంగాణ మీద మాత్రం నోరుతెరుస్తారు.
`సుద్దపూసల సుద్దులన్నీ చెబుతుంటారు!
`కాళేశ్వరం కడితే ప్రజాధనం వృధా అంటారు.
`పోలవరం పూర్తి కావాలని కోరుకుంటారు.
`తెలంగాణ అభివృద్ధిని చూసి ఏడిచి చస్తుంటారు?
హైదరాబాద్, నేటిధాత్రి: మేధావి మౌనం దేశానికి ప్రమాదకరమని మాజీ ప్రదాని పివి. నర్సింహారావు అన్నారు. కాని మేధావులు అంటే ఎవరు? అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మేధావులు వేరు. అప్పటి మేదావులు వేరు. ఇప్పటి మేధావులు వేరు. అప్పటి మేధావులు సమాజం గురించి మాత్రమే ఆలోచించేవారు. రాజకీయాల జోలికి వెళ్లేవారు కాదు. కాని నేడు మేధావులు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తమకు అనుకూలమైన రాజకీయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. పైగా మేధావి అంటే అన్ని రంగాల, రకాల విషయాల మీద అవగాహన వుండాలని ఏమీ లేదు. సమాజంలో అనేక రంగాలున్నాయి. ఆయా రంగాలలో వుండే మేదావులు వేరు. ఒక రంగంలో మేదావి మరో రంగం గురించి మాట్లాడే వారు కాదు. కాని ఇప్పుడు మేధావి అంటే చాలు అన్ని రంగాల గురించి మాట్లాడుతున్నారు. అంతా నాకే తెలుసు అన్నట్లు మాట్లాడేస్తున్నారు. గతంలో మేదావులు అనేక రకాల పుస్తకాలు అధ్యయనం చేసేవారు. ఆయా రంగాలపై ఇతరుల మీద ఆదారపడాల్సినంత అవసరం లేని మేధస్సును వారి కలిగి వుండేవారు. ఇప్పుడు అంతా గూగుల్ మేధావులు. వారికి అవసరమైన విషయాలను అప్పటిప్పుడు గూగుల్‌లో చూసి తెలుసుకొని గొప్పలకు పోతున్నారు. మేదావులుగా చెలామణి అవుతున్నారు. వారికి తెలిసింది గోరంత. కాని చెప్పేది కొండంత. అందులో అంతా డొల్ల. పైగా తమకు మించిన విశ్లేషకులు లేరన్నట్లు మాట్లాడుతూ వున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖంగా టెలివిజన్ తెరలమీద, యూట్యూబ్‌లలో మాట్లాడే మేదావులు ఎక్కువయ్యారు. అలాంటి వారిలో మాజీ ఐపిఎస్ అధికారి జేడి లక్ష్మినారాయణ ఒకరు. నిజానికి ఆయన ఒక మేదావిగానే చెలామణి అయితే ఆయనను ఎవరూ వ్యతిరేకించేవారు కాదు. కాని ఆయన రాజకీయ అవతారమెత్తిన మేదావి వర్గం. ఆయన తెలంగాణ, ఆంధ్రా రాజకీయాల మీద బాగానే మాట్లాడుతున్నారు. ఇంత వరకు సంతోషమే. కాని తెలంగాణ రాజకీయాలపై మాత్రం అప్పుడప్పుడూ విషం కక్కుతూనే వుంటారు. కేసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు హజరు కాకపోవడం ఆయన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. కాని వాటిలో కూడా ఆయన దూరి మాట్లాడిప్పుడు అన్ని విషయాలను ప్రస్తావించాలి. అంతకు ముందు రోజుల్లో అసెంబ్లీకి హజరు కాని వాళ్లు ఎంత మంది వున్నారు. వాళ్ల ప్రస్తావన తీసుకురాలేదు. ఇది తప్పు. ఉమ్మడి రాష్ట్రంలో 1989లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. ఎన్టీఆర్ ప్రభుత్వం పోయింది. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎన్టీఆర్‌ను రాజకీయంగా అప్పటి ప్రభుత్వ చీఫ్ విఫ్ నన్నపననేని రాజకుమారి ఏదో అన్నారు. దానికి ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నది. వెంటనే మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాను అంటూ వెళ్లిపోయారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీ ముఖం చూడలేదు. మరి ఆనాడు ఆయన చేసింది మాత్రం ఏపి మేదావులకు ఒప్పుగానే కనిపించిందా? ఆ విషయాన్ని ఏపి మేధావులు ఎందుకు ప్రశ్నించరు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ప్రస్తుతం ఏపి ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. ఉమ్మడిరాష్ట్రంలో ఆయన ఒకసారి బస్సుయాత్రచేశారు. రెండోసారి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీకి హజరు కాలేదు. ఆ సమయంలో చంద్రబాబు జీతం తీసుకున్నారు. ఆ విషయం మాత్రం ఏపి మేధావులు గర్తు చేయరు. 2004కు ముందు దివంగత వైఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాలేదు. నేరుగా ఎన్నికలకు వెళ్లారు. పాదయాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ మేదావులకు ఆయన కనిపించలేదు. 2014 తర్వాత ఏపిలో ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రిగానే మళ్లీ ఏపి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి హజరు కావడం లేదు. గత ఎన్నికల ముందు ఎమ్మెల్సీగా వున్న ప్రస్తుత మంత్రి లోకేష్ కూడా యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. మండలి సమావేశాలకు హజరు కాలేదు. ఆ విషయం కూడా ప్రస్తావించేందుకు ఏపి మేధావులకు నోరు రాదు. కాని తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసిఆర్ మాత్రం అసెంబ్లీకి హజరు కాకపోవడాన్ని మాత్రం తప్పు పడుతుంటారు. ఇక మరో మేధావి జయ ప్రకాశ్ నారాయణ్. ఆయన ఓ మాజీ ఐఎఎస్ అదికారి. కూకట్ పల్లి మాజీ ఎమ్మెల్యే. లోక్‌సత్తా అనే పార్టీకి అదినేత. ఆయన మేధావి తనం మరీ విచిత్రం. నీతి వంతమైన రాజకీయాల గురించి మాత్రం గొప్పలు అనేకం చెబుతాడు. కాని ఆయన లేని లోక్‌సత్తాను ఇతరుల చేతుల్లో పెట్టలేదు. ఏకంగా పార్టీనే రద్దు చేశారు. అంటే అప్పటి వరకు పార్టీకి సేవలందించి వారి రాజకీయ జీవితాలు ఆగం చేశారు. లోక్‌సత్తాకు వచ్చిన విరాళాలు ఏమయ్యాయి? ఆ విరాళాలు ఏదైనా స్వచ్చంధ సంస్ధకు అందించారా? ఏం చేశారు? ఆ సొమ్ములన్నీ ఏమయ్యాయి? అని మాత్రం ఆయనను అడగకూడదు. దేశ ఆర్దిక పరిస్దితులు ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నట్లు మాట్లాడుతుంటారు. ఏపికి మేలు చేసే వ్యాఖ్యలను చేస్తుంటారు. ఏపి మీద మమకారం. తెలంగాణ మీద పైకి కనిపించని కోపం ప్రదర్శిస్తుంటారు. ఎంతో తెలివిగా ఆయన ఎమ్మెల్యేగా వున్నప్పుడు ఓ వైపు లోపల తెలంగాణ వ్యతిరేక రాజకీయం చేసేవారు. పైకి మాత్రం తెలంగాణ వస్తే మిన్ను విరిగి మీద పడుతుందా? అనేవారు. కలిసి వుంటేనే కలదు సుఖం అని నీతులు చెప్పేవారు. తెలంగాణ రావడం అలాంటి మేధావులకు సుతారం ఇష్టం లేని పని. అందుకే తెలంగాణ వచ్చిన పదేళ్ల కాలంలో జరిగిన ప్రగతిని చూసి ఆయన మెచ్చుకున్న దాఖలాలు తక్కువ. తెలంగాణ విషయంలో కాళేశ్వరం మాత్రం తెల్ల ఏనుగు అంటారు. లక్ష కోట్లు వృధా చేశారని అనేక సార్లు చెబతూ వచ్చారు. కాని ఇప్పుడు ఏపి బనకచర్ల ఎత్తిపోతల పథకం వల్ల ఏపికి ఆర్ధిక బారమని మాత్రం నోరు తెరవరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పదే పదే ప్రస్తావిస్తూ వుంటారు. కాని పోలవరం మీద మమకారం కురిపిస్తున్నారు. అది ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. అందులో జరిగిన అవినీతిని ప్రశ్నించరు. అందరూ ఐఎఎస్‌లు కావాలనుకోవడం మూర్ఖత్వం అంటారు. ఆయన మాత్రం ఐఏఎస్ అయ్యారు. తెలంగాణలో వుంటారు. తెలంగాణ మీద పడి ఏడుస్తుంటారు. తెలంగాణ సమాజం మీద విషం చిమ్ముతూనే వుంటారు. తెలంగాణ తెర్లు అయితే బాగుండు అనుకుంటే అభివృద్ది చెందడాన్ని వాళ్లు జీర్ణించుకోలేరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్దితి ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ఆర్దిక సి ్దతి ఏమిటి అనేది జేపికి తెలుసు. అయినా దాని గురించి చెప్పరు. తెలంగాణ ఎలా సస్యశ్యామలమైంది? ఎందుకు అయ్యింది? ఎవరి వల్ల అయ్యింది? అందుకు కేసిఆర్ చేసిన కృషి గురించి చెప్పడానికి నోరు రాదు. ఎందుకంటే తెలంగాణ విఫల రాష్ట్రమౌతుందని ఆశపడ్డారు. కాని తెలంగాణ దేశంలనే శీఘ్రంగా ప్రగతి దారిలో పరుగెత్తుతోంది. కాళేశ్వరమంటే కేవలం మూడు బ్యారేజీలు మాత్రమే అనే అపోహలో వున్న కొందరు ఏపి మేధావులు తెలంగాణ మీద విషం చిమ్ముతూనే వుంటారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
రాయికల్ అక్టోబర్ 6, నేటి ధాత్రి:
రామాజీపేట గ్రామానికిమాజీ మంత్రి జీవన్ రెడ్డి చొరువతో రామాజీపేట గ్రామానికి చెందిన ఆరెల్లి గాయత్రి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్,20,000 ,గ్రామ కాంగ్రెస్ నాయకులు అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గుజ్జులా మోహన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ హరీష్ రావు,నాయకులు రాజేశ్వర్ రావు,నారాయణ,రాములు, సుధీర్ రెడ్డి,రాజు,తిరుపతి, గౌతమ్,జల తదితరులు పాల్గొన్నారు
*అసాంఘిక కార్యకలాపాలకు 22 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం..
*ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్న అధికారులు..
పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 06:
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కొలమాసనపల్లి పంచాయతీ కొలమాసనపల్లిలో రైతు భరోసా కేంద్రం 2020 సంవత్సరంలో అప్పటి వైసిపి ప్రభుత్వం ఎమ్మెల్యే వెంకటే గౌడ చేతులమీదుగా 22 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసి రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణం చేపట్టారు.భవనం మొత్తం పూర్తయినా కానీ ఇప్పటివరకు ఉపయోగంలోకి తేలేదు. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.భవనం కనిపించనంతగా పిచ్చి మొక్కలు పెరిగాయి.ఈ భవనం మందు బాబులకు పేకాటరాయుళ్ల కు నిలయంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ దీనిపై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ విషయంపై పలమనేరు వ్యవసాయ అధికారిని సంధ్యా రాణి ను వివరణ కోరగా రైతు భరోసా కేంద్రం ఇంకా మాకు ఇవ్వలేదని దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ రైతు భరోసా కేంద్రం ఉపయోగంలోకి తేవాలని కొలమాసనపల్లి పంచాయతీ ప్రజలు కోరుతున్నారు..
ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తాం
సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు
మున్నూరు రవీందర్ విలేకరుల సమావేశం లో వెల్లడి
వనపర్తి నేటిదాత్రి
Vaibhavalaxmi Shopping Mall
వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ దగ్గర కోర్టుల నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ప్రారంభోత్సవం చేశారని కోర్టుల నిర్మాణం శంకుస్థాపనకు తాను వ్యతిరేకం కాదని సీనియర్ న్యాయవాది మాజీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు మున్నూరు రవీందర్ వనపర్తి లో తన నివాసంలో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ దగ్గర కోర్టు సముదాయాల నిర్మా ననికి స్థలం కూడా ఉన్నదని మున్నూరు రవీందర్ అన్నారు నిర్మాణం చేపడితే న్యాయవాదులకు కక్షిదారులకు ఇబ్బందులు ఉండవని అన్నారు జిల్లా నలుమూలల నుండి వివిధ కోర్టుల కేసులపై కక్షిదారులు వస్తుంటారని అన్నారు బార్ కౌన్సిల్ అధ్యక్షులు మోహన్ కుమార్ యాదవ్ వనపర్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని కోరారు కొంతమంది న్యాయవాదుల కక్షిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోర్టు సముదాయాల భవనముల నిర్మాణం చేపట్టాలని మున్నూరు డిమాండ్ చేశారు ఈ మేరకు కొంతమంది న్యాయవాదులతో కలిసి హైకోర్టు న్యాయమూర్తులకు వినతిపత్రం ఇచ్చామని మున్నూరుచెప్పారు వనపర్తి జిల్లాలోని కక్షిదారులు న్యాయవాదులకు దూరం అవుతుందని చెప్పారు
చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ పిల్లల చదువులకు ఆర్థిక సహాయం
మందమర్రి నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చనిపోయిన ఫోటోగ్రాఫర్స్. పిల్లలకు. చదువు ఖర్చుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కుటుంబ భరోసా మిగులు నిధుల నుండి ఒక్కొక్కరికి 5000/- రూపాయల చొప్పున మొత్తం నలుగురి పిల్లల కు 20000/-రూపాయల చెక్ ను
Financial
బాధిత కుటుంబాలకు ఈరోజు స్థానిక ఫోటో భవన్లో అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో. మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్. మాజీ ఉపాధ్యక్షులు కామెర గణేష్. కార్యదర్శి. బాణావత్ కృష్ణ. ప్రచార కార్యదర్శి రామస్వామి సురేందర్. తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో
కలెక్టర్ కార్యాలయం లో సమావేశం
వనపర్తి నేటిదాత్రి .
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ప్రింటింగ్ నిర్వహినాపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు సోమవారం వనపర్తి జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప కరపత్రాలు, పోస్టర్ల ప్రింటింగ్ ప్రెస్ యజమానులు అవగాహన కల్పించారు.ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రల్లో ప్రింటింగ్ లో కులం, మతపరమైన అంశాలను ముద్రించరాదని , వ్యక్తిగత విమర్శల కు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని కోరారు. పబ్లిషర్ నుండి ఫారం- ఎ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఎ, బి తో పాటు ముద్రించిన 4 కర పత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్ కు పంపించాలని కోరారు ముద్రించిన కరపత్రం లేదా గోడ పత్రిక పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఖచ్చితంగా ముద్రించాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న డబ్బుల వివరాలు ఫారం – బి లో చూపెట్టాలని సూచించారు. వనపర్తి జిల్లా లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈసమావేశంలో డి ఆర్ ఓ పి సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, శ్రీ కృష్ణ వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
“ప్రభుత్వ భూమిని కాపాడాలని.. కలెక్టర్ కు ఫిర్యాదు”
” అధికారులపై చర్యలు తీసుకోండి”
బాలానగర్ / నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామపంచాయతీ శివారు అయ్యప్ప స్వామి దేవాలయ ఆలయ సమీపంలోని సర్వేనెంబర్ 102, 105 ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ కి సంబంధించిన ఆర్చిని ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు వెంచర్ యజమానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సామాజిక సేవా కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
Government Land
స్థానిక రెవిన్యూ అధికారులు వెంచర్ యాజమాన్యంతో కుమ్ముక్కై ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ఏం మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని కాపాడకుండా వెంచర్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ భూమిలో ఆర్చి నిర్మాణానికి సహకరించిన అధికారులపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి విలువ మార్కెట్ రేటు ఒక ఎకరం రూ.4 కోట్ల వరకు ఉంటుందని విలువైన భూమిని కాపాడడంలో విఫలమైన స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012వ సంవత్సరంలో హైదరాబాదులో నగరానికి 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో జాతీయ రహదారులకు రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరికి అసైన్మెంట్ చేయరాదన్న జీవోను జారీ చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్థానిక రెవిన్యూ అధికారులు విస్మరించి.. రికా వ్యాల్యూ వెంచర్ యజమానికి అనుకూలంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.
సంగారెడ్డి: నాల్కల్ మండలం గణేషాపూర్లో కొందరు అక్రమార్కులు కర్ణాటకకు చెందిన వ్యక్తితో కలిసి ఎర్రరాయి తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నారని గతంలో పలువురు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వెంటనే తవ్వకాలు ఆపించి వారిపై కేసు నమోదు చేయమని నాల్కల్ తహశీల్దార్కు.. ఆర్డీవో ఫోన్ చేసి ఆదేశించినా.. ఎమ్మార్వో చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని బీసీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మమ్మద్ ఇమ్రాన్ అన్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నేషనల్ హైవే రోడ్లు చెరువుల్లా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. తాండూర్ వైపు వెళ్లే రోడ్డు చౌరస్తా వద్ద నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కన నాళాలు లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. స్థానికులు పలుమార్లు సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు త్వరితగతిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి వర్షపు నీటి నిల్వ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
న్యాల్ కల్ మండలం వడ్డి గ్రామం లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ మండలం మాజీ అధ్యక్షులు ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నుండి పార్టీ మార్పు చేసిన నాయకులపై ఫైర్ అయ్యారు కితకో పార్టీ మార్పు చేస్తున్న నాయకులకు ప్రజలు యూవకులు గమనిస్తున్నారు అని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికీ చిత్తూ చిత్తూ గా ఒడిస్తాం అని వారు ఫైర్ అయ్యారు రానున్న ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు పోటి చేపిస్తాం జడ్పీటీసీ కీ కూడ గెలుపే లక్ష్యంగా అందరు పని చెయ్యాలని ఎవరు ఆ ధైర్యం పడొద్దు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మండలం ప్రధాన కార్యదర్శి రాహుల్ పలింకార్ నర్సప్ప సచిన్ లక్ష్మన్ షేర్ అలీ సంజుకుమార్ రాజు తదితరులు ఉన్నారు,
ఎంబీబీఎస్ సీటు సాధించిన TMRIES (బుచినెల్లి) విద్యార్థిని సన్మానించిన మాజి మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో(బుచినెల్లి) చదివిన విద్యార్థి ఝరసంఘం మండలం బొప్పన్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ గారి కుమార్తె ఫిర్దోస్ నీట్‌లో క్వాలిఫై అయ్యి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్‌లో ఉచిత సీటు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, మాజీ మంత్రివర్యులు , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ,స్థానిక జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్‌రావు విద్యార్థిని శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు నాగన్న తదితరులు..ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2021లో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం (TMREIS) ప్రారంభం సందర్భంగా.. “ఫ్యూచర్ లో ఏం అవుతావు అమ్మా?” అని అడిగిన ప్రశ్నకు “డాక్టర్ అవుతాను” అని చెప్పింది విద్యార్థిని ఫిర్దోస్.చెప్పడమే కాదు, కష్టపడి చదివి అన్న మాట నిలబెట్టుకుంది. నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది.ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, జహీరాబాద్ నియోజకవర్గం లోని అదే మైనారిటీ గురుకులం నుండి మరో 8 మంది విద్యార్థినులు, అలాగే అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలను సాకారం చేస్తున్నాయి గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు. ఇది కేసీఆర్ గారి దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైంది తెలంగాణ రాకముందు మొత్తం 290 గురుకులాలు మాత్రమే ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వాటిని 1020కి పెంచింది నాడు కేవలం 2 మైనారిటీ గురుకులలు ఉంటే ఆ సంఖ్యను 204కు పెంచింది . మొత్తంగా గురుకులలో విద్యార్థుల సంఖ్యను లక్షన్నర నుండి ఆరున్నర లక్షలకు పెంచింది. గతంలో ఇంటర్ చదువు గురుకులాల్లో అందుబాటులో ఉండేది కాదు. పది తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థులు పనులకు వెళ్లేవారు.దీన్ని మార్చడానికి కేసీఆర్ గారు అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసి, ఉన్నత విద్యను చేరువ చేశారు. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం ఒకప్పుడు ఎంతో కష్టం, ముఖ్యంగా మహిళలకు. దీనికి పరిష్కారంగా కేసీఆర్ గారు 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారు.దేశంలో తొలిసారిగా రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.పేద పిల్లల విద్యపై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగమని కేసీఆర్ గారు నమ్మారు.రేపటి తరంపై పెట్టే పెట్టుబడిని అద్భుత సంపదగా భావించారు.విద్యార్థుల కోసం చేసే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (Capital Expenditure) గా నిర్వచించారు.ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్ లేదా ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం గొప్ప విషయం.వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం మొత్తంలో మార్పు వస్తుంది. కేసీఆర్ గారు దీన్ని నమ్మారు కాబట్టి, విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి చదువుకునే అద్భుత అవకాశాలు అందించారు. మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఇవ్వాలి.మీ ఊరికి, మీ స్నేహితులకు, పేదలకు, గురుకుల సొసైటీకి ఏదో విధంగా తోడ్పాటు అందించాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నా. ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు . కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి అని అన్నారు
రాజ కౌశిక్ విద్యార్థికి హబూబ్ నగర్ లో మాంటిసోరి పాఠశాల జె పి ఎన్ సి ఇంజనీరింగ్ లో అర్టిఫి కల్ ఇంటిలిజెన్స్ కోర్సులో సీట్ సాధించినoదుకు పెబ్బేరు సంబు రాము, సంబు కృష్ణయ్య కల్వ రాలకు చెందిన ప్రభాకర్ దృష్టి కి తీ సుకపోవడముతో విద్యార్థి కి ఉచితంగా లాప్ టాప్ ను అందజేశారని సంబు క్రిష్ణ య్యా తెలిపారు ఈసందర్భంగా ప్రభాకర్ ను రాజ కౌశిక్,కుటుంబ సభ్యులు సంబు కృష్ణయ్య రాము కు కృతజ్ఞతలు తెలిపారు
#మమ్మల్ని గెలిపించి,అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రజలకు ఎప్పడు రుణపడి ఉంటాం..
#మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చెందింది మీరే కదా..
#మీ రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఎన్నికల ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు…
#బి ఆర్ ఎస్ కా డోఖా కార్డ్ విడుదల చేసిన డీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎంపీ
హన్మకొండ, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్ధిక భారాన్ని మోపిన బి ఆర్ ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు.సోమవారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు,వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి కడియం కావ్య తో కలిసి పాల్గొన్నారు.
పదేళ్ల గత బి అర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలపై బిఆర్ఎస్ కా డోఖా కార్డ్ పేరుతో కార్డులను విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లలను పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని,రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు మర్చిపోలేదు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది.
కాంగ్రెస్ మాట మీద నమ్మకం ఉన్న పార్టీ మేము ఇచ్చిన హామీలను దశల వారీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం. బిఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమే. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని పెద్దగా ప్రచారం చేసింది. వేలాది కుటుంబాలు నేడు షీట్ ఇళ్ళ్లో, అద్దె ఇళ్ళ్లో ఉంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఫండ్‌లు విడుదల చేసింది. టీఆర్‌ఎస్ “రైతు బంధు, రైతు బీమా” అని గొప్పగా చెప్పుకున్నా, వాస్తవానికి రైతులకు రుణాలు మాఫీ కాలేదు. పంట కొనుగోలు కేంద్రాల్లో బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు.
ఎరువుల కొరత, విత్తనాల కొరత రైతు దైనందిన కష్టాలు బిఆర్‌ఎస్ పాలనలో పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్‌లోనే రైతులకు పంటల బీమా పునరుద్ధరణ, సమయానుసారం ఎరువుల సరఫరా చర్యలు తీసుకుంది.
మార్కెట్‌లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పి) హామీగా ఇచ్చి అమలు చేయడం మొదలుపెట్టింది. టీఆర్‌ఎస్ 2018లో ఇచ్చిన హామీ: “ప్రతి నిరుద్యోగ యువకుడికి ₹3,016 భృతి.” పదేళ్లపాటు అధికారంలో ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పరీక్షల వాయిదాలు, పేపర్ లీక్‌లు, అవినీతి యువత భవిష్యత్తుతో చెలగాటమాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను వేగవంతం చేసింది. టీఆర్‌ఎస్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి, హాస్టళ్లు మూసివేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ఎక్కడా ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మళ్లీ జీవం పోస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వ కళాశాలలకు ఫ్యాకల్టీ నియామకాలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌కు స్మార్ట్ సిటీ హామీ ఇచ్చినా, దాని అమలు వద్ద ఆగిపోయింది. మీరు చేస్తున్న బాకీ ప్రచారంలో మేము ప్రజలకు బాకీ ఉన్నమాట నిజమే అని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు బాకీ ఉండటంలో తప్పు లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “బిఆర్ఎస్ కా దోఖా “ను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ వెంకట్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు బంక సరళ మరియు ప్రజా ప్రతినిధులు,బ్లాక్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.