అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కోసం ఎన్నారై దాత ఒక లక్ష రూపాయల విరాళాన్ని దేవాలయం అధ్యక్షుడు సైపా సురేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం సేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం కూతురు అల్లుడు ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు దేవాలయ పున నిర్మాణంలో భాగంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 దేవాలయ కమిటీకి అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా దాత ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు,ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం లను అయ్యప్పస్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు.ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కమలాకర్ రెడ్డి,కోశాధికారి రవీందర్,దొడ్డ వేణు,బండారి చంచారావు,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా,దాత కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప దేవాలయం నూతన అధ్యక్షులు గురుస్వామి.

అయ్యప్ప దేవాలయం ఆలయం నూతన అధ్యక్షులు గురుస్వామి

ముత్తు కృష్ణను సన్మానము చేసిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డ్

వనపర్తి నెటిదాత్రి:

భాధ్యతతో పనిచేసి వచ్చినపదవులకు
న్యాయం చేయాలని మాజి నిరంజన్ రెడ్డి అన్నారు ఈసందర్భంగా మాజి మంత్రి నిరంజన్ రెడ్డి అయ్యప్పస్వామి ఆలయ నూతన కమిటీని సన్మానించారు
ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ముఖ్యంగా యువత అధ్యాతికతవైపు ఆకర్షించడం హర్షించదగ్గ విషయం అని మాజి మంత్రి అన్నారు.గతములో ఆలయ అభివృద్ధి కోసం సహకరించామని భవిష్యత్ లో వనపర్తి రాజనగరం అయ్యప్ప ఆలయనికి అభివృద్ధికి సహకరిస్తానని మాజీమంత్రి నిరంజన్ రెడ్డ్ అన్నారు.
నూతన అధ్యక్షులు గా ముత్తుకృష్ణ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి చీర్ల.కృష్ణసాగర్ ఆధ్వర్యములో కొత్త కమిటీ అయ్యప్పఆలయం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస.రమేష్ గౌడ్ మీడియా ఇంచార్జి నందిమల్ల.అశోక్ , లక్ష్మినారాయణ, బండారు కృష్ణ ఉంగ్లమ్ తిరుమల్ ,ప్రేమ్ నాథ్ రెడ్డి బీ ఆర్ ఎస్ నేతలు , చిట్యాల.రాము డాక్టర్ దానియల్ జోహేబ్బ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version