కోరపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో సైకిళ్ల పంపిణీ
జమ్మికుంట (నేటిధాత్రి)
ఈరోజు జమ్మికుంట మండలంలోని కోరపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని లకు కేంద్రమంత్రి బండి సంజయ్ సంకల్పంగా తీసుకున్నటువంటి నిజోయకవర్గ పదో తరగతి విద్యార్థినిలకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి కరీంనగర్ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఎర్రవెల్లి సంపత్ రావు సంపెల్లి సంపత్ రావు, పుల్లూరు ఈశ్వర్, పుల్లూరి రవి, ఈ కార్యక్రమంలో పాల్గొని సైకిల్లు పంపిణీ చేయడం జరిగింది.
Tag: ZPHS
జెడ్పిహెచ్ఎస్ లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా .!
జెడ్పిహెచ్ఎస్ లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం.
మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి.
చిట్యాల, నేటిధాత్రి :
జడ్.పి.హెచ్.ఎస్ చిట్యాల పాఠశాల ఆవరణలో 6-9 తరగతుల విద్యార్థులను ఉద్దేశించి వేసవి శిక్షణా శిబిరాన్ని ఎంఈఓ కొడపాక రఘుపతి , సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఇందులో గ్రామంలో గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థుల శారీరక, మానసిక,వికాసం కొరకు ఆటలు, పాటలు, బొమ్మలు గీయడం, యోగ, కథల పుస్తకాలు చదవడం మొదలగు వినోద కార్యక్రమాలు నేర్చుకోవడానికి ఈ శిక్షణా శిబిరం ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు,పోషక విలువలు కలిగిన స్నాక్స్ మరియు మంచినీటి సదుపాయం అందుబాటులో ఉంచామని వీటిని విద్యార్థిని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిరోజు విద్యార్థులందరూ ఉదయం8గం నుండి 11వరకు హాజరయ్యేలా చూడాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి, బొమ్మ రాజమౌళి , బుర్రసదయ్య గోపగాని భాస్కర్,సిఆర్పి రాజు, కనకం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ZPHS కారుకొండ
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ZPHS కారుకొండ.
హన్వాడ:- నేటి దాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కారుకొండ గ్రామంలోని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2014-2015 బ్యాచ్.ఏప్రిల్ 20-2025 న.తమ 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ తీపి జ్ఞాపకాలను పంచు కున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ ఉపాధ్యాయులని గుర్తుచేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు.