మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు
మహాదేవపూర్ అక్టోబర్ 6 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబాన్ని సోమవారం రోజున రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి పరామర్శించారు. బ్రాహ్మణపెళ్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెషినేని మాధవరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనంతరం జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, బ్రాహ్మణ పెళ్లి గ్రామానికి సర్పంచిగా ఎనలేని సేవలు అందించారని ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్, మండల నాయకులు ఐలయ్యయాదవ్ రవీందర్, వెంకటేష్, కొక్కు రాకేష్, హరీష్, పలువురు నాయకులు, ప్రజల పాల్గొన్నారు.