*అసాంఘిక కార్యకలాపాలకు 22 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం..
*ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్న అధికారులు..
పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 06:
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కొలమాసనపల్లి పంచాయతీ కొలమాసనపల్లిలో రైతు భరోసా కేంద్రం 2020 సంవత్సరంలో అప్పటి వైసిపి ప్రభుత్వం ఎమ్మెల్యే వెంకటే గౌడ చేతులమీదుగా 22 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసి రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణం చేపట్టారు.భవనం మొత్తం పూర్తయినా కానీ ఇప్పటివరకు ఉపయోగంలోకి తేలేదు. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.భవనం కనిపించనంతగా పిచ్చి మొక్కలు పెరిగాయి.ఈ భవనం మందు బాబులకు పేకాటరాయుళ్ల కు నిలయంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ దీనిపై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ విషయంపై పలమనేరు వ్యవసాయ అధికారిని సంధ్యా రాణి ను వివరణ కోరగా రైతు భరోసా కేంద్రం ఇంకా మాకు ఇవ్వలేదని దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ రైతు భరోసా కేంద్రం ఉపయోగంలోకి తేవాలని కొలమాసనపల్లి పంచాయతీ ప్రజలు కోరుతున్నారు..