రబ్బి జాతీయ స్థాయి పోటీలకు కస్తూరిబా పాఠశాల విద్యార్థి….

రబ్బి జాతీయ స్థాయి పోటీలకు కస్తూరిబా పాఠశాల విద్యార్థి.

#రాష్ట్రస్థాయి పోటీలో రెండవ స్థానం గెలుపొందడం హర్షనీయం.

#స్పెషల్ ఆఫీసర్ సునీత.

నల్లబెల్లి నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని బానోతు అన్విత మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో జరిగిన రాష్ట్రస్థాయి రబ్బి పోటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి జట్టును విజయం దిశగా తీసుకో పోవడంతో పాటు అన్విత రెండవ స్థానంలో నిలవడం అభినందనీయం. అదేవిధంగా ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొని విజయం సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కస్తూరిబా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఈ టి సుజాత, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు అభినందించారు.

జాతీయ స్థాయికి క్రీడా పోటీలకు ఎంపిక- పిడి గుండెల్లి రాజయ్య…

జాతీయ స్థాయికి క్రీడా పోటీలకు ఎంపిక– పిడి గుండెల్లి రాజయ్య
మొగులపల్లి నేటి దాత్రి

 

ఇటీవల అనగా 30 డిసెంబర్ 2025 నుండి 1 జనవరి 2026 వరకు మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి సీనియర్
షూటింగ్ బాల్ సెలక్షన్” కం” టోర్నమెంట్ క్రీడా పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరఫున జడ్పీహెచ్ఎస్ మొగుళ్ళపల్లి పాఠశాల నుండి నలుగురు క్రీడాకారులు పాల్గొనగా మునిగాల అర్జిత్ కుమార్ (10 వ) జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పిడి గుండెల్లి రాజయ్య తెలిపారు. ఈ క్రీడా పోటీలు 9 జనవరి 2026 నుండి11 జనవరి 2026 వరకు మహారాష్ట్రలోని సోలాపూర్ లో జరుగుతాయని, తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున అర్జిత్ కుమార్ ఆడతారని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జిల్లా విద్య పర్యవేక్షణ అధికారి విజయ పాల్ రెడ్డి మరియు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భాగ్యశ్రీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అర్జిత్ కుమార్ ను అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసి అభినందించారు
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయురాలు , శ్రీమతి భాగ్యశ్రీ , ఉపాధ్యాయులు
టి.వెంకన్న, వై. సురేందర్,
జి. అనిల్ కుమార్,ఏ.వి.ఎల్ కళ్యాణి, బి.కుమారస్వామి,
కె. ప్రవీణ్, ఎం. రాజు, డి.పద్మ,పి. లలిత, జి.విజయ భాస్కర్,శ్రీ కల,
ఆర్. చందర్, శ్రీనివాస్,అటెండర్ ఎండి మజార్,వేణు,పాల్గొన్నారు

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌కు ఎంపికైన ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థిని విప్లవ..

జాతీయస్థాయి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీలకు ఎంపికైన ఎంఎల్ఆర్ఐటీ విధ్యార్థిని విప్లవ కు మర్రి రాజశేఖరరెడ్డి ప్రశంసలు

మల్కాజిగిరి నేటిధాత్రి

 

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 లో భాగంగా నిర్వహించిన పోటీల్లో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో మూడవ సంవత్సరం చదువుతూ జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) లో చురుకుగా పాల్గొంటున్న కోడూరి విప్లవ జాతీయ స్థాయిలో జరగబోయే ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపికవడం తమ కళాశాలకు గర్వకారణమని కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ సెక్రెటరీ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో నాలుగు దశల్లో క్విజ్, ఎస్సే రైటింగ్, ప్రజెంటేషన్, ఇంటర్వూ లాంటి పోటీల్లో పాల్గొన్న ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 లో తమ కళాశాలకు చెందిన కోడూరి విప్లవ జాతీయస్థాయికి ఎంపికవటం పట్ల మర్రి రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాలలో వివిధ రంగాల్లో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతున్నామని, హ సస్టైనబిలిటీ మరియు గ్రీన్ వికసిత్ భారత్ అనే అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో విప్లవ తన ఆలోచనలు పంచుకోనుండడం ఒక గొప్ప అవకాశమని తెలియజేస్తూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీరు విప్లవ మరియు ప్రోత్సహించిన తమ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ లను అభినందించారు.

ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఢిల్లీలోని భారత మండపంలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీల్లో సస్టైనబులిటీ మరియు గ్రీన్ వికసిత్ భారత్ అనే అంశం మీద మాట్లాడబోతున్న విప్లవ రాణించాలని ఆకాంక్షించారు రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్రీనివాసరావు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ విప్లవను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

గణిత ప్రతిభ పాట పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక.

గణిత ప్రతిభ పాట పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక.

జిల్లా స్థాయిలో మొదటి స్థానం లో గెలుపొందిన షేక్ షిఫా తహసీన్ .
మంగపేట నేటిధాత్రి

 

గణిత ప్రతిభాపాటవా పోటీ పరీక్షల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానం గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపిక మంగపేట మండలంలోని జడ్పీహెచ్ఎస్ మంగపేట హై స్కూల్ కి చెందిన టెన్త్ క్లాస్ తెలుగు మీడియం షేక్ షిఫా తహసీన్ జిల్లా స్థాయిలో జరిగిన తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం వాళ్లు నిర్వహించిన గణిత ప్రతిభ పాట పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని గెలుపొందినందుకు స్థానిక మండల విద్యాశాఖ అధికారిని పొడెం మేనక అభినందించారు మరియు మంగపేట హైస్కూల్ ఉపాధ్యాయులు క్రాంతి నాగేందర్ మధురిమ చంద్రశేఖర్ తదితర ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు రాష్ట్ర స్థాయిలో కూడా గెలుపొంది పాఠశాలకు మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎంఈఓ తెలియజేసినారు

69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో మూడవ స్థానం సాధించిన అక్షర హై స్కూల్ విద్యార్థిని.

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-24T133353.022.wav?_=1

 

 

69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో మూడవ స్థానం సాధించిన అక్షర హై స్కూల్ విద్యార్థిని

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

ఇటీవల మధ్యప్రదేశ్ రాష్టం ఇండోర్ లో డిసెంబర్ 14 నుండి 19వ తేదీ వరకు జరిగిన 69వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ కరాటే విభాగములో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన అక్షర హై స్కూల్ విద్యార్థిని తూడి అక్షర జాతీయస్థాయిలో తెలంగాణ నుండి మూడవ స్థానం సాధించింది. ఈసందర్భంగా తూడి అక్షరను కరీంనగర్ సిపి గౌస్ ఆలం అభినందించారు. వరసగా రెండు సార్లు ఎస్జిఎఫ్ గేమ్స్ లో జాతీయస్థాయికి ఎంపిక కావడం విశేషం. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్ మినుకుల మునీందర్, కరాటే మాస్టర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

“అబాకస్ స్టేట్‌కు ఎంపికైన కృతిక శ్రీ”

అబాకస్ స్టేట్ లెవెల్ కు ఎంజీఎం హైస్కూల్ విద్యార్థిని ఎంపిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

గణపురం (ము). ప్రఖ్యాత ఎన్జీవో సంస్థ విశ్వం ఎడ్యుటెక్ అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ వారు అంకగణిత సమస్యలను క్యాలిక్యులేటర్, కంప్యూటర్ వంటి పరికరాలు లేకుండా అవలీలగా సాధించడానికి అబాకస్ అనే పూసల చట్రం ద్వారా విద్యార్థులకు నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపించడానికి ప్రతి ఏటా మండల, జోనల్, రాష్ట్రస్థాయిలో అబాకస్ పోటీలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆదివారం పరకాల సి,హెచ్,స్ గ్రౌండ్ యందు జరిగిన జోనల్ లెవెల్ అబాకస్ కాంపిటీషన్లో ఎంజీఎం హైస్కూల్ విద్యార్థిని పి.క్రుతిక శ్రీ (ఐదవ తరగతి) పాల్గొని మొదటి బహుమతి సాధించి స్టేట్ లెవెల్ కు ఎంపికయ్యారు,ఈ సందర్భంగా కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్,ప్రిన్సిపల్ మధుకర్ తో పాటు మిగతా ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు

వ్యాసరచన పోటీలో సత్తాచాటిన సరస్వతి విద్యార్థి..

వ్యాసరచన పోటీలో సత్తాచాటిన సరస్వతి విద్యార్థి

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ విద్యార్థుల్లో కృతజ్ఞత, సమానత్వ భావనలు పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రజ్ఞా వికాస్, వికాస తరంగిణి ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం రేకుర్తి కోటా జూనియర్ కాలేజీలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థి సత్తా చాటినట్లు స్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాసరచన పోటీలో పదో తరగతి విద్యార్థి నిట్టు సంజన ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా స్కూల్ కరస్పాండెంట్, కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, సాంఘిక శాస్త్రం ఉపాద్యాయులు సంపత్ విద్యార్థినిని అభినందించారు.

రాష్ట్ర స్థాయికి ఎంపికైన శ్రీ కృష్ణవేణి హై స్కూల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-29T132905.614.wav?_=2

 

రాష్ట్ర స్థాయికి ఎంపికైన శ్రీ కృష్ణవేణి హై స్కూల్

నస్పూర్,నేటి ధాత్రి:

 

జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025 -26( సైన్స్ ఫెయిర్) లో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన శ్రీ కృష్ణవేణి పాఠశాల నస్పూర్ విద్యార్థులకు డీఈవో చేతుల మీదుగా మెమొంటోతో సత్కరించారు.వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో- రైన్ వాటర్ హార్వెస్టింగ్ మోడల్స్ ప్రాజెక్టు ను ఆర్.నిత్య,గైడ్ టీచర్ జి.హిమజ ప్రదర్శించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న,పాఠశాల ఇన్చార్జి రాకేష్ గౌడ్,ఉపాధ్యాయులు అభినందిస్తూ ఇంకా ఉన్నత స్థాయి చేరాలని ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు స్నేహ ఎంపిక

రాష్ట్రస్థాయి ఖో ఖో అసోసియేషన్ పోటీలలలో పాల్గొంటున్న బాలికల పాఠశాల విద్యార్థిని స్నేహ.

మహాదేవపూర్ నవంబర్ 27 నేటి ధాత్రి *

 

మహాదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి చదువుతుంది. ఇటీవల పెద్దపెల్లి జిల్లాలో జిల్లాస్థాయి ఖో ఖో అసోసియేషన్ వారు జిల్లాస్థాయి సెలక్షన్స్ నిర్వహించారు, ఈ సెలక్షన్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది నవంబర్ 28 నుండి 30 వరకు పటాన్ చెరువు సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న రాష్ట్రస్థాయి 44వ జూనియర్ నేషనల్ కోకో ఛాంపియన్ 2025 ఖో ఖో పోటీల లో పాల్గొంటుందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో బాగా ఆడి జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు,విద్యార్థిని మరియు పాఠశాల పీడి గురుసింగాపూర్ణిమ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సరిత, మధు ,సుధారాణి ,సరితా దేవి , ఒలి పాష,శ్రీనివాస్ ,వసుదప్రియ ,
వీరేశం ,సమ్మయ్య ,లీలారాణి ,రజిత, షాహిదాబేగం, ప్రసూన ,దీపిక, ఆంజనేయులు, అజ్మత్ పాషా లు పాల్గొని విద్యార్థిని అభినందించారు.

మొదటి బహుమతి అందుకున్న ప్రచోదన…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T112944.848.wav?_=3

 

మొదటి బహుమతి అందుకున్న ప్రచోదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనాడు” దినపత్రిక పోటీల్లో విజేతలుగా చాలా మంది పోటీ చేశారు,సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కేంద్రంలో “ఈనాడు” ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభ పాటవ పోటీల్లో ప్రచోదన విద్యార్థి మొదటి బహుమతి విజయం సాధించి నిలిచింది, మరియు ఇటీవల జహీరాబాద్ లోని పరమిత డాక్టర్. ఆర్ ఎల్ ఆర్ పాఠశాల మొదటి బహుమతి అవార్డును గెలుచుకుంది, దీనిని డాక్టర్. ఆర్ ఎల్ ఆర్ పాఠశాల చైర్మన్ రామలింగా లక్ష్మారెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు కవిత పలువురు ఉపాధ్యాయులు బహుమతి అందుకున్న ప్రచోదన విద్యార్థిని శుభాకాంక్షలు తెలియజేశారు, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి పూజారి తన కూతురు ప్రచోదన మొదటి బహుమతి సాధించిందని గర్వంగా ఆనందం పడ్డారు, తన కూతురు మరిన్ని బహుమతులు అందుకోవాలని దేవునితో ప్రార్థిస్తా అన్నారు,

రాష్ట్ర వాలీబాల్ పోటీలకు ఎంపికైన సారా రుత్విక్…

మల్లాపూర్ నవంబర్ 7 నేటి దాత్రి

 

మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సారా రుత్విక్ ఇటీవల రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన సందర్భంగా వారికి గౌడ సంఘ అధ్యక్షులు ముద్దం శరత్ గౌడ్ ఉపాధ్యక్షుడు బండి స్వామి గౌడ్ ప్రోత్సాహకంగా ట్రాక్ సూటు మరియు నెట్టు స్పాన్సర్ చేశారు అలాగే మహ్మద్ రఫీ షూస్ స్పాన్సర్ చేశారు వీరిని మల్లాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ హైస్కూల్ యాజమాన్యం అభినందించారు ఈ కార్యక్రమంలో ముద్దం సత్యనారాయణ గౌడ్ పెరుమళ్ళ రాజేందర్ గౌడ్ గొట్టిపాడ్త రమేష్ గౌడ్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

సాఫ్ట్ బాల్ పోటీలకు కేజీవీపీ విద్యార్థులు ఎంపిక..

సాఫ్ట్ బాల్ పోటీలకు కేజీవీపీ విద్యార్థులు ఎంపిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఈనెల 2న హన్మకొండ జిల్లా ఎస్ డిఎల్ సి క్రీడా ప్రాంగణంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ హన్మకొండ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ సెలెక్షన్ పోటీలలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల కేజీవీపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎన్. శరణ్య అద్భుత ప్రతిభ ప్రదర్శించి, హన్మకొండ జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది.
రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు జగిత్యాల జిల్లాలో నవంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్నాయి.
ఈ విజయంపై కేజీవీపీ స్పెషల్ ఆఫీసర్ నాగపురి స్వప్న వ్యాయామ ఉపాధ్యాయురాలు అనిత ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ తల్లిదండ్రులు శరణ్యను హృదయపూర్వకంగా అభినందించారు.

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక…

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక

భూపాలపల్లి నేటిధాత్రి

ఈనెల 17న వరంగల్ జిల్లా ఓ సిటీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలలో టేకుమట్ల కేజీవిపి పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎన్. శరణ్య అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. .
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు నిర్మల్ జిల్లాలో జరగనున్నాయి. ఈ విజయంపై కేజీవిపి పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న విద్యార్థి చరణ్యను వ్యాయామ ఉపాధ్యాయురాలు అనిత ను విద్యార్థిని తల్లిదండ్రులను  అభినందించారు.

విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే…

విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

 

 

69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 చెస్ టోర్నమెంట్ గురువారం జగిత్యాల లో జరిగిన ఇట్టి టోర్నమెంట్ లో జగిత్యాల జిల్లా నుండి పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల కు చెందిన పదవ తరగతి విద్యార్థి బబ్బిలి అక్షయ్’గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికయినట్లు ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా గౌరవ కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్ విద్యార్థిని అభినందించి, శాలువతో సన్మానించారు.

రాష్ట్ర వాలీబాల్‌కు గంగాధర విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు గంగాధర విద్యార్థి ఎంపిక

గంగాధర, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి మంచి కట్ల నందకిషోర్ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బాబు శ్రీనివాస్ తెలిపారు.
ఈరాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఈనెల16 నుండి 18 వరకు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో జరుగుతాయని, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్17 బాలుర జట్టులో నందకిషోర్ అత్యంత ప్రతిభ కనబరిచి బాలుర ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికైయ్యాడని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.అనిత కుమారి, ఎంపీడీవో డి.రాము, ఎంఈఓ ఏనుగు ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు అభినందించారు.

రాష్ట్ర స్థాయికి తూప్రాన్ గురుకుల విద్యార్థి రాయికోటి వివేక్ ఎంపిక…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T123014.118.wav?_=4

 

రాష్ట్ర స్థాయికి తూప్రాన్ గురుకుల విద్యార్థి రాయికోటి వివేక్ ఎంపిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తూప్రాన్ గురుకుల పాఠశాల కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాయికోటి వివేక్ ఇటీవల కొండాపూర్ మండలం గిర్మాపూర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించబడిన 69వ SGF ఎంపిక శిబిరంలో పాల్గొని వాలీబాల్ ఆటలో చక్కని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది. విద్యార్థి ఝరాసంగం గ్రామానికి చెందిన బల్ రాజ్ కుమారుడు రాయికోటి వివేక్ ఎంపికయ్యారు తనకి వెన్నంటే ఉండి శిక్షణ ఇచ్చినవ్యాయామ ఉపాధ్యాయులు కళాశాల ప్రిన్సిపాల్ సుహాసిని ఉపాధ్యాయ బృందమంతా అభినందించిశుభాకాంక్షలు తెలిపారు.

వరంగల్ 69 ఎస్ జి ఎఫ్ కబడ్డీలో చక్కని ప్రతిభను కనబరిచిన విద్యార్థిని…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T113444.650.wav?_=5

 

వరంగల్ 69 ఎస్ జి ఎఫ్ కబడ్డీలో చక్కని ప్రతిభను కనబరిచిన విద్యార్థిని

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘం మండలం బర్దీపూర్ విద్యార్థిని వరంగల్ లో జరిగిన 69 ఎస్ జి ఎఫ్ కబడ్డీలో చక్కని ప్రతిబాను కనబర్చింది. బర్దీపూర్ గ్రామం తండ్రి నర్సిములు (ఉల్లాష్ పెంటర్) కూతురు ఉదయ కుమారి రంజోలే వసతిగృహం చదువుతుంది. ఉదయకుమారికి కబడ్డీ లో ప్రతిభను కనపరచడంతో కళాశాల ప్రిన్సిపాల్ ,సిబ్బంది,గ్రామస్తులు అభినదించారు.

విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే…

విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఎంబీబీఎస్‌‌ సీటు సాధించిన విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ గారి అల్లుడు ,ఆనంద్ గారి కుమారుడు హర్షిత్ క్వాలిఫై అయ్యి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్‌లో ఉచిత సీటు పొందడం పట్ల, కొనింటి మాణిక్‌రావు విద్యార్థి ని శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,నాయకులు తదితరులు..

విద్యార్థికి లాప్ టాప్ ఇచ్చిన దాత

విద్యార్థికి లాప్ టాప్ ఇచ్చిన దాత

వనపర్తి నేటిదాత్రి .

Vaibhavalaxmi Shopping Mall

రాజ కౌశిక్ విద్యార్థికి హబూబ్ నగర్ లో మాంటిసోరి పాఠశాల జె పి ఎన్ సి ఇంజనీరింగ్ లో అర్టిఫి కల్ ఇంటిలిజెన్స్ కోర్సులో సీట్ సాధించినoదుకు పెబ్బేరు
సంబు రాము, సంబు కృష్ణయ్య కల్వ రాలకు చెందిన ప్రభాకర్ దృష్టి కి తీ సుకపోవడముతో విద్యార్థి కి ఉచితంగా లాప్ టాప్ ను అందజేశారని సంబు క్రిష్ణ య్యా తెలిపారు ఈసందర్భంగా ప్రభాకర్ ను రాజ కౌశిక్,కుటుంబ సభ్యులు సంబు కృష్ణయ్య రాము కు కృతజ్ఞతలు తెలిపారు

కార్పొరేట్ స్థాయిలో విద్య ను అందిస్తున్న ప్రభుత్వ కళాశాల….

కార్పొరేట్ స్థాయిలో విద్య ను అందిస్తున్న ప్రభుత్వ కళాశాల.

ఫిజిక్స్ వాల, క్లాట్ వంటి ప్రోగ్రాములు.

ప్రిన్సిపాల్ శ్రీదేవి.

చిట్యాల, నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం రోజున కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి అధ్యక్షతన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే ఏలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలిపారు, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీలో ఉచితంగా ఫీజు లేకుండా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, అలాగే ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా స్పెషల్ క్లాస్లులు మన నిర్వహించడం జరుగుతోంది అని, విద్యార్థులకు ఐఐటి , జె ఈ

 

 

ఈ, ఎంసెట్ ,స్థాయిలలో కూడా విద్యాబోధన జరుగుతుందని కావున తల్లిదండ్రులు ప్రభుత్వ కాలేజీ లపై చిన్న చూపు చూడకుండా పిల్లలను ప్రతిరోజు కాలేజీకి రెగ్యులర్ గా వచ్చేటట్లు చూడాలని, ఈ సంవత్సరము నుంచి ఎంపీసీ వాళ్లకు ‘ఫిజిక్స్ వాల’ ప్రోగ్రామును, కామర్స్ వాళ్లకు క్లా ట్ వంటి ప్రోగ్రాంను విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు, దాతల సహకారంతో మధ్యాహ్న భోజన ప్రోగ్రామ్ కూడా గతంలో అందించడం జరిగిందని దాతల సహకారం ఉంటే మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తామని, కావున విద్యార్థులకు తల్లిదండ్రులుగా మీ బాధ్యత గా విద్యార్థులను ప్రతిరోజు క్రమం తప్పకుండా కాలేజీకి పంపించేలా ఏర్పాటు చేయాలని కోరినారు, జిల్లా కలెక్టర్ కూడా కళాశాలకు మరమ్మత్తురు పనుల కోసం 6 లక్షల రూపాయల ఫండ్ ను ఆట వస్తువుల కోసం నిధులు మంజూరు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు, ఈ సంవత్సరం విద్యార్థులకు యూనిఫామ్ కూడా అందించడం జరుగుతుందని, జిల్లాలోనే ఉత్తీర్ణతలో మొదటి స్థానం సాధించిందని సందర్భంగా గుర్తు చేశారు, విద్యార్థుల హాజరు శాతం కోసం ప్రభుత్వం ఎఫ్ఆర్ సి విధానాన్ని కూడా ప్రవేశపెట్టిందని మన కళాశాలలో చదివిన 13 మంది విద్యార్థులు నేడు తెలంగాణలోని మల్లారెడ్డి జేఎన్టీయూ, కేఎంఐటి, జి ఎన్ ఐ టి, కి ట్స్ లాంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరు సీట్లు సాధించారని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కళాశాల లెక్చరర్స్ యుగేందర్ బాల కృష్ణ ,కర్నాజి ,సురేష్, ఉమాదేవి ,ఉమా, సురేష్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version