శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాజేంద్ర రావు

శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేంద్ర రావు

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా అర్చకులు రాజేంద్ర రావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు అర్చన, ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలువురు కాంగ్రెస్ నేతలు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ అధికారులు భక్తులు పలువురు ప్రతినిధులతో కలిసి రాజేందర్ రావు ఊరేగింపుగా వెళ్లి పాత బజార్ లోని శివాలయం నుంచి పుట్ట బంగారం కోసం వెళ్లి, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుట్ట బంగారం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం జరిగిన తదితర పూజ కార్యక్రమాల్లో రాజేందర్రావు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, ఆలయ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, పలువురు నేతలు, మహిళలు, భక్తులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తుంకుంటలో నేడు నగర సంకీర్తన

*నేడు తుంకుంట గ్రామంలో నగర సంకీర్తన*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

అయోధ్య లోని శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం సాయంత్రం 7 గంటలకు జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో సంకీర్తన నగర నిర్వహించనున్నట్లు గ్రామ యువత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామంలోని శ్రీఆంజనేయ స్వామి మందిరం నుండి ఊరడమ్మ దేవాలయం వరకు సంకీర్తన చేస్తూ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా కుటుంబాలకు గ్రామంలోని హైందవ భగవద్గీత పుస్తకాలను అందజేస్తామని వివరించారు. ప్రతినిత్యం భగవద్గీత లోని తాత్పర్య సహితంగా ఒక శ్లోకం చిన్నారులకు అభ్యాసం చేయించాలని సంకల్పించినట్లు తెలిపారు. సంకీర్తన అనంతరం మహాప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. గ్రామంలో ప్రతి పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించునున్నట్లు గ్రామ హిందూ సంఘటన్ సభ్యులు జనార్ధన్ రెడ్డి, ఓనం రెడ్డి, శివరాజ్, నర్సిములు, కిష్టన్న, అంజన్న, రాములు, నారాయణ లు వెల్లడించారు.

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లికి బోనాలు..

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లికి బోనాలు

బోనాలు, డప్పుచప్పులతో మారుమోగిన నర్సంపేట.

ఎల్లమ్మ తల్లి,కంఠమహేశ్వర స్వామికి వందలాది బోనాల సమర్పణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్ కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన కంఠమహేశ్వర స్వామి మహోత్సవాలు నర్సంపేటలో నిర్వహిస్తున్నారు.

గౌడ కుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ, రేణుక ఎల్లమ్మ వనం మైసమ్మ, దేవతల ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంఠమహేశ్వరస్వామి రేణుక ఎల్లమ్మ లకు బోనాలతో నర్సంపేట పట్టణంలోని గౌడ కులస్తులందరూ , ఘటంకుండ పెద్దమనిషి, సారకోళ్ల పెద్దమనిషి, జయలక్ష్మి సెంటర్ నుండి పట్టణంలోని భవాని ఎలక్ట్రానిక్స్, ఫిష్ మార్కెట్ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహం నుండి రామకృష్ణ దుకాణం నుండి సర్పకాస్ జెండా గద్ద నుండి ద్వారక పేట బైపాస్ రోడ్డు కల్లుమండ్వా నుండి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు,పురవీధుల వెంట భాజా భజంత్రీలు నృత్యాలతో కదిలారు.పాకాల రోడ్డు కూడలిలో జెట్టి కళాకారులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

జెట్టి కళాకారులు పట్టుపోసి వివిధ కళారూపాలను ప్రదర్శించారు ఎల్లమ్మ తల్లి వేషాధారణ పలువురిని ఆకట్టుకున్నది.ఎల్లమ్మ నృత్యధారణ డప్పు కళాకారుల నృత్యాలతో నర్సంపేట పట్టణం మారుమోగింది. శ్రీకంఠమహేశ్వర స్వామి దేవాలయం చేరుకొని శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురామాంబా, దేవతల కళ్యాణం పూజారులు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మకు గావు పట్టడం కార్యక్రమాన్ని ఎల్లమ్మ తల్లి పూజారులు నిర్వహించారు. కన్నుల పండుగ బోనాల పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి బోనాలు తరలివచ్చాయి. గౌడ కుటుంబాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బోనాలను చేసి ఎల్లమ్మతల్లికి వందలాది బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.

ధూప దీప నైవేద్యాలతో వారివారి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగలి వెంకటనారాయణ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి

లింగయ్య గౌడ్, కార్యదర్శి మాచర్ల అయిలు మల్లు, ఉడుగుల శ్రీనివాస్ గౌడ్, గౌడ్ మాజీ అధ్యక్షులు వరుసగా ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్, గొడిశాల సదానందం గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version