ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్స్ దీకొండ రమేష్..

ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్స్ దీకొండ రమేష్..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి ప్రైవేట్ స్కూల్ బస్సులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ దీకొండ రమేష్ ఈరోజు స్కూల్ బస్ లను తనిఖీ చేసి డ్రైవర్స్ కు అవగాహనా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ పిల్లలను తీసుకెళ్లే వెహికిల్స్ కు తప్పనిసరిగా కండిషన్ లో ఉంచుకోవాలని,ఫిట్ నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని తప్పనిసరిగా ఉండాలని స్కూలు బస్సులను నడిపే డ్రైవర్ తప్పకుండా యూనిఫామ్​ వేసుకోవాలి. ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్‌ లేని బస్సులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.ఎటువంటి అనుమతులు, పత్రాలు లేకుండా బస్సులను నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే బస్ లలో పరిమితికి మించి విద్యార్థులను తరలించకూడదని, మద్యం సేవించి వాహనం నడపవద్దు అని అటువంటి వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

మంగపేట లో టొబాకో ఫ్రీ స్కూల్ ఛాలెంజ్ ర్యాలీ..

మంగపేట లో టొబాకో ఫ్రీ స్కూల్ ఛాలెంజ్ ర్యాలీ

మంగపేట నేటిధాత్రి

పొగాకు రహిత సమాజాన్ని సృష్టించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని మంగపేట మండల విద్యాశాఖ అధికారి మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పొదేం మేనక అన్నారు.
పొగాకు వాడడం వల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన పెంపొందించుకొని దానిని నిర్మూలించడానికి ప్రతి
ఒక్కరూ కృషి చేయాలని,వీటిపట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించడానికి విద్యార్థులచే గ్రామంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిగరెట్లు,బీడీలు,తంబాకు, గుట్కాలు వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ,దీనికి సంబంధించి అవగాహన కోసమై విద్యార్థులచే పోస్టర్లు కూడా తయారు చేయించడం జరిగింది.అంతేకాక గ్రామంలో చౌరస్తా నందు విద్యార్థులు ఒక చక్కని వీధి నాటకం ప్రదర్శించి పొగాకు వాడటం పట్ల కలిగే హానికర పరిణామాలు గూర్చి అవగాహన పెంపొందించడం జరిగింది.తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు ,విద్యార్థులు అందరూ కలసి పొగాకు రహిత సమాజం కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు క్రాంతి,మాధురి దేవి,నాగేందర్ ,వెంకటేశ్వర్లు,
వెంకటేశ్వర్ రెడ్డి,
నాగేందర్,సతీష్,చంద్రశేఖర్,
నరసింహరావు మరియు విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

స్కూల్ బస్సు క్రింద పడి పాప శ్రీ హర్షిని మృతి..

స్కూల్ బస్సు క్రింద పడి పాప శ్రీ హర్షిని మృతి

* అన్నను బస్సు ఎక్కించడానికి వచ్చి చెల్ల మృతి

మహాదేవపూర్ జులై 30 (నేటి ధాత్రి)

 


జయశంకర్ భూపాలపెల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు పాప శ్రీహర్షిని బస్ కింద పడి మృతి చెందిన ఘటన మంగళవారం రోజున చోటుచేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు ఎస్ ఎస్ వి స్కూలు బస్సు అంబటిపల్లి గ్రామానికి వచ్చి స్కూల్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా అంబటిపల్లి గ్రామానికి చెందిన సింగనేని మల్లేష్, భాగ్య దంపతుల మూడేళ్ల కూతురు శ్రీ హర్షిని(3) తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కళ్ళముందే పాప మృతి చెందిందని బస్సు డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు కోరారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ..

చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కార్గిల్ దివాస్ విజయోత్సవ సభను ఘనంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కార్గిల్లో వీరమరణం పొందిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
భారత్ పాకిస్తాన్ మధ్య మే 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగిందనీ ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు,కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం అని,యుద్ధ ప్రారంభదశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యిందనీ, నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుందనీ,అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగిందనీ,ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ అని, ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయనీ అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది అని అన్నారు.దివాస్ ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారనీ, 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారనీ,ఈ సందర్భంగా,భారత సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను స్మరించుకుంటారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకవత్ దేవా,కంచ రాజు కుమార్ అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ నందిపాటి సంధ్య,నిడిగొండ అక్షయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వద్దు..

ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వద్దు

పులిగుండాల మాజీ సర్పంచ్ సోడి చలపతి డిమాండ్

నేటిధాత్రి చర్ల

చర్ల మండలంలోని పులిగుండాల గ్రామపంచాయతీ పరిధిలో గల కొండేవాయి గ్రామంలో ఎంపీపీ స్కూల్ కి ఆనుకొని సెల్ టవర్ నిర్మాణం వద్దు గ్రామంలోనే వేరే దగ్గర స్థలం ఇస్తాము అని గ్రామస్తులు చెప్పిన వినకుండా సెల్ ఫోన్ టవర్ నిర్మాణానికి స్థలం కేటాయించడం అన్యాయమని పులిగుండాల మాజీ సర్పంచ్ సోడి చలపతి అన్నారు ఫారెస్ట్ అధికారులు మరొకసారి పునరాలోచించాలని అన్నారు సెల్ ఫోన్ టవర్ ఇంత దగ్గరగా నిర్మాణం చేపట్టడం విద్యార్థులపై రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఇకనైనా చర్ల మండల అధికారులు ఇటువంటి ఇటువంటి నిర్మాణాలను గ్రామంలోని వేరొక ప్రాంతానికి తరలించాలని అన్నారు వలన ఐదవ షెడ్యూల్ ప్రాతంలో పెసా గ్రామ సభ తీర్మానం చేయకుండా ఫారెస్ట్ అధికారులు బిఎస్ఎన్ఎల్ టవర్ కోసం విద్యార్థులు ఆటలు ఆడుకునే స్కూల్ స్థలంలో మార్కింగ్ ఇచ్చివున్నారు మరియు ఎంపీపీ స్కూల్ స్థలం లో కాకుండా గ్రామంలోనే వేరే దగ్గర టవర్ ఏర్పాటు చేయాలనీ చర్ల మండల తాసిల్దార్ కు చర్ల మండల విద్యాశాఖ అధికారికి విన్నతి పత్రం ఇచ్చినారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు పొడియంరాజేష్ పొడియం అంద్దయ్య మడకంరవి వినోద్ యాత్ కాంగ్రెస్ నాయుకులు సోడినాగరాజు తదితరులు పాల్గొన్నారు

వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా పోచమ్మ బోనాలు..

వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా పోచమ్మ బోనాలు

చందుర్తి, నేటిధాత్రి :

చందుర్తి మండలం జోగాపూర్ గ్రామం వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలు అమ్మవారి, పోతరాజుల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ బోనాల సాంస్కృతిక పాటలతో నృత్యాలతో పిల్లలు గ్రామ ప్రధాన కూడలిల వద్ద నృత్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సద్గుణ చారి మాట్లాడుతూ ….. ఆషాడ మాసంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ పండగను దేవతకు ఒక ప్రతిరూపంగా భావిస్తారు. బోనం వండి అమ్మవారికి నైవేద్యం పెడతారు. మహిళలు కొత్త మట్టి, ఇత్తడి కుండలో పాలు బెల్లం బియ్యం కలిపి వండుతారు. దీనిని వేప ఆకులు, పసుపు మరియు సింధూరంతో అలంకరిస్తారు. మహిళలు ఈ బోనాలను తలపై మోసుకొని దేవాలయంలో అమ్మ దేవతకు గాజులు మరియు చీరతో సహా బోనం నైవేద్యం పెడతారు. బోనాలు అంటే కాలిని మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ మొదలైన వివిధ రూపాల్లో పూజించడం అని వివరించారు. పాఠశాల విద్యార్థులు వివిధ వేషధారణలో బోనాలు నెత్తిన పెట్టి పోతరాజుల విన్యాసాలతో గ్రామంలోని ప్రధాన కూడలి వెంట పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. చిన్నప్పటినుండి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించడానికి పాఠశాలలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పాఠశాల కరస్పాండెంట్ సద్గుణ చారి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బాబోయ్ ప్రయి’వేటు’ పాఠశాల..?

బాబోయ్ ప్రయి’వేటు’ పాఠశాల..?

చదువు కొనాల్సిందే…

విద్య హక్కు చట్టమా నీవెక్కడ..?

సదువు సారేడు,ఫిజులు బారేడు…

ఉన్నత అధికారుల పర్యవేక్షణ కరువు…

విద్య అంగట్లో వ్యాపారమేనా..?

పుస్తకాలతో పాటు అన్ని పాఠశాలలో అందుబాటులో…

ఎం ఆర్ పి కంటే అధిక రేటుకు అమ్మకాలు…

విద్యాశాఖ అలసత్వం విద్యార్థులకు శాపమేనా…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

సదువు సారేడు ఫిజులు బారేడు అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాలల తీరు చూస్తే.ఉన్నత చదువులు అంగట్లో అందుబాటులో ఉన్నాయి అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాలల పనితీరు.మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలల దందా మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతుంది.ఉన్నత చదువులు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారాయి.ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తాము పెట్టిందే సిద్ధాంతం అంటూ అధిక ఫిసులు వసులు చేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులకు పెను భారంగా మారింది. స్కూల్ మొదలు అడ్మిషన్ ల పేరుతొ వేలకు వేలు వసులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్మకూడదని ఆదేశాలు ఉన్న, తమకేమి పట్టనట్లు ఎం ఆర్ పి కి మించి ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు అమ్ముతు లక్షలు గడిస్తున్నారు.స్కూల్ యూనిఫామ్ లతో పాటు టై లు, బెల్ట్ లు, షు లు అన్ని అంగట్లో అందుబాటులో ఉన్నాయంటూ పవిత్ర పాఠశాలను అంగడి సంతగా మారుస్తున్నారు. ఇదంతా తెలిసిన విద్యాశాఖ అధికారులు సైతం తమకేమి పట్టనట్లు వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ గోడును ఎవ్వరి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.

మరోవైపు ఉన్నత చదువులకై ప్రభుత్వ గురుకుల, నవోదయ ఎంట్రెన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో టిసి కోరగా దానికి సైతం వేలల్లో డబ్బులు వసులు చేస్తున్నారు.నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి నవోదయ, గురుకుల వంటి పాఠశాలల్లో సిటు అందించినప్పటికీ,ప్రయివేట్ పాఠశాలల చేతివాటం వల్ల అధికాస్త తల్లిదండ్రులకు శాపంగానే మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రయివేటు పాఠశాలలలో మొత్తం ఒక్కసారిగా కడితే 10% డిస్కౌట్ అంటూ ఆఫర్ లు సైతం పెడుతున్నప్పటికీ అధికారులు మాత్రం అటు వైపు కన్నీత్తి చూడటం లేదు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో నిర్దేశిత ఫీజులను అందుబాటులో ఉంచగా విద్యాశాఖ అలసత్వం వల్ల అధికాస్తా అందని ద్రాక్షగానే మారింది.మరోవైపు పరిమితికి మించి ఆటోలు టాటా ఏసీ లు, బస్సులల్లో విద్యార్థులను తీసుకుని వస్తు ప్రమాదలు జరిగి, విద్యార్థుల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు.ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విజ్డం హై స్కూల్ విద్యార్థులు.

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విజ్డం హై స్కూల్ విద్యార్థులు

రాయికల్: జూలై 19: నేటి ధాత్రి:

పట్టణం లోని విజ్డం హై స్కూల్ విద్యార్థులు మూడవ శనివారం నో బ్యాగ్ డే స్పెషల్ ప్రోగ్రాం లో భాగంగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. రైతులతో కలిసి వరి నాటు వేసే విధానాన్ని అడిగి తెలుసుకొని, రైతులతో పాటు నాటు వేశారు, పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి పిల్లలతో పాటు పొలంలో దిగి నాటు వేసి, చిన్ననాటి జ్ఞాపకాలను, రైతుల యొక్క కష్టాన్ని, రైతు విలువను విద్యార్థులకు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పది వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే, మనకు అయిదు వేళ్ళు నోటిలోకి వెళ్తాయని,వరి పంట చేతికి రావాలంటే 120 రోజుల శ్రమ, కష్టం ఉంటుందని, వాటిని గుర్తుంచుకుని ఆహారాన్ని వృధా చేయకుండా, తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోకుండా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు తద్వారా దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ నివేదిత రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ..

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ

నల్లబెల్లి, నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-51.wav?_=1

మండలంలోని పంతులుపల్లి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు, వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారి సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఏఏపిసి చైర్మన్ ఎరుకుల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, మాజీ ఎంపిటిసి ఏడాకుల రవిందర్, మామిండ్లవీరయ్యపల్లి మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌళి అతిధులుగా హాజరై విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని తమ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ పంపించిన వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయులు కూనమల్ల రాజన్ బాబు ,విద్యార్థులు పాల్గొన్నారు.

కళ్యాణికని సింగరేణి ఉన్నత పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు..

కళ్యాణికని సింగరేణి ఉన్నత పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు

మందమర్రి నేటి ధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-27.wav?_=2

ఈరోజు మందమర్రి ఏరియా హాస్పిటల్, సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ఉన్నత పాఠశాల, కళ్యాణికని యందు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Medical examinations

ఈ పరీక్షలలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వారికి రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయి, శారీరక బలహీనత తదితర విషయాలపై పరీక్షలు చేపట్టారు. పరీక్షల అనంతరం, బ్లడ్ తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికీ అవసరమైన ఔషధాలు, విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు.

Medical examinations

ఈ కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేలా, ముందస్తు వైద్య జాగ్రత్తలతో కూడినదిగా ఏర్పాటుచేయబడింది. పిల్లల ఆరోగ్యం పట్ల సింగరేణి సంస్థ చూపుతున్న చొరవకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యాపక వర్గం, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ.

కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-26.wav?_=3

న్యాల్కల్ కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు చూసి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.

మహోదయ పాఠశాలలో బోనాల పండుగ సంబరాలు.

మహోదయ పాఠశాలలో బోనాల పండుగ సంబరాలు

చందుర్తి, నేటిధాత్రి:

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో గొప్పదైన ఆషాడ మాస బోనాల సందర్భంగా మండలంలోని లింగంపేట గ్రామంలో గల మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గురువారం పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థినీ విద్యార్థులకు చిన్ననాటి నుండే మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు బోనం నెత్తిన పెట్టుకొని, పోతరాజుల వేషధారణలో గ్రామ విధుల వెంట ఆటలాడుతూ పాటలు పాడుతూ పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగుల రేణుక, మింగలి కవిత, ఇందూరి సౌమ్య, కముటం స్వప్న, పహిమ, మున్నిర విద్యార్థులు పాల్గొన్నారు.

మరిగడ్డ ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్న భోజనం.

మరిగడ్డ ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్న భోజనం చేయడానికి పిల్లలకు 140 ప్లేట్ల వితరణ.

చందుర్తి, నేటిధాత్రి:

మర్రిగడ్డ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సిద్దిపేటకు చెందిన అయిత పురుషోత్తము , కొమురవెల్లి విద్యాసాగర్లు విద్యార్థులు మధ్యాహ్న భోజనము చేయుటకు 140 ప్లేట్లు వితరణ చేశారు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, తమ వంతు చేయుతగా ప్లేట్లు అందించామని , విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వ పాఠశాల విద్యను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దాతలు విద్యర్థులను కోరారు.
విద్యార్థుల సౌకర్యార్ధం ప్లేట్లను అందించిన పురుషోత్తం, విద్యాసాగర్లను మండల విద్యాధికారి వినయ్ కుమార్ సన్మానించి,అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, కనకయ్య, జ్యోతిరాణి, సావిత్రి, సరోజ, పద్మ , విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు..

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరం SSC, ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగించింది. జూలై 31 వరకు సాధారణ ఫీజుతో, ఆగస్ట్ 28 వరకు లేట్ ఫీజుతో అప్లికేషన్లు అధికారిక వెబ్సైట్లో www.telanganaopenschool.org లేదా MeeSevaలో అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ తర్వాత అభ్యర్థులు మూడు రోజుల్లో ధృవపత్రాలను సంబంధిత స్కూల్లు/కళాశాలలకు ఇవ్వాలి.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ యం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాలు చాలా అవసరమని, నైపుణ్యాలతోటే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే చదువుతో పాటుగా వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి రాజీవ్ యువ వికాసం లాంటి అనేక సంక్షేమ పథకాలను అందించేందుకుఅనేక కార్యక్రమాలను, నైపుణ్య శిబిరాలను నిర్వహిస్తున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను, ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం- 2025 యొక్క ఉద్దేశం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భవాని చంద్,రమేష్,నరసింహారెడ్డి, కృష్ణవేణి,అనిత,హేమలత, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి.

‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మ్యాతారి మహేందర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్రతి 30 మందికి ఒక బస్సు ఏర్పాటు చేసి స్కూలుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ యం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగంగా కవర్లకు బదులు కాగితపు సంచులను వినియోగించుకోవాలని ,ప్రకృతి పరిరక్షణలో భాగంగా తమ వంతు బాధ్యతను నెరవేర్చాలన్నారు.మనం వాడే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి చాలా హానికరం. అంతేగాక నీరు,భూమి,వాయు కాలుష్యానికి దోహదకారిగా పనిచేస్తాయని తెలిపారు.ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఈ రోజునుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం ఆపి పేపర్ బ్యాగులను వాడి పర్యావరణాన్ని కాపాడుతామని ఎన్.సి.సి క్యాడెట్లచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎన్.సి.సి క్యాడెట్లు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలను తెలుపుతూ ఆకట్టుకునేలా చార్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ ,నాగరాజు, రాజేష్ ,రవీందర్ రెడ్డి భాగ్యలక్ష్మి , రాజేందర్ ,పూర్ణిమ విజయ్, గౌతమ్ క్రాంతి కుమార్, రామ్మూర్తి, వ్యాయామ ఉపాధ్యాయుడు భవాని చంద్ పాల్గొన్నారు.

పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి.

పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం వద్ద ప్రైవేటు పాఠశాలల్లో విద్య హక్కు చట్టం ప్రకారం బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు 25% ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో పొందుపరిచిన ఆర్టికల్ 12 (1) సి విద్య హక్కు చట్టం ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని రాశారు కేంద్ర ప్రభుత్వం 2009 నుండి అమలులోకి తేవడం జరిగింది ఈ విద్య హక్కు చట్టాన్ని ప్రతి ప్రైవేటు పాఠశాల బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు కట్ల శంకరయ్య దూడపాక దుర్గయ్య అంబేద్కర్ వాదులు ఇమ్మడి వెంకటేశ్వర్లు దూడపాక శ్రీనివాస్ మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి సైదుల్ గడ్డం సదయ్య చిలువేరు దయాకర్ ఊరడి మురళి రత్నం రామకృష్ణ శనిగరపు ఆనందం ఎండి లాలు పాల్గొన్నారు

రేగుంట హైస్కూలు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల..

మల్లాపూర్ జులై 4 నేటి రాత్రి
రేగుంట హైస్కూలు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నీటి కొరతను తీర్చిన రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ గ్రామస్తులు
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విద్యార్థుల కాల కృత్యాలు తీర్చుకోవడానికి కనీస నీటి వసతి లేక హైస్కూల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్న విషయాన్ని పాఠశాల ఉపాధ్యా యులు విద్యార్థులు రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ కు తెలియచేయగా తక్షణమే స్పందించి తనతో పాటు కొద్దిమంది గ్రామస్తులు సహకారంతో కొత్త రిగ్గు మోటర్ అందించి విద్యార్థుల నీటి కొరతను తీర్చి అండగా నిలిచిన మల్లేష్ యాదవ్ సహకరించిన రేగుంట గ్రామస్తులకు కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు
ఈ కార్యక్రమంలో..
కర్నె పవన్ కళ్యాణ్, కుందేళ్ల రాజేష్ ఎండీ భసీర్,కుక్కుదుగు అశోక్, పడిగెల నరేష్,ప్రకాష్ హబీబ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజు, నర్సింగ్ రావ్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా

భూపాలపల్లి నేటిధాత్రి:

2025 -26 సంవత్సరమునకు గాను బెస్ట్ అవైలబల్ స్కూల్స్ స్కీం పథకం క్రింద 1వ తరగతి 5వ తరగతి లో ప్రవేశము కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి మీటింగ్ హాల్ లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా స్కీం నిర్వహించడం 1వ తరగతికి (41) సీట్లు గాను (1) అధర్శ హై స్కూల్ కు – 08, (2) వివేకానంద హై స్కూల్ కు – 08, (3) సెయింట్ పీటర్స్ హై స్కూల్ కు- 09, (4) సువిద్యా హై స్కూల్ కు – 08, (5) సి ఎస్ ఐ మెమోరీస్ కు – 08, 5వ తరగతికి (43) సీట్లు గాను (1) అధర్శ హై స్కూల్ కు – 14, (2) వివేకానంద హై స్కూల్ కు 14, (3) సువిద్యా హై స్కూల్ కు -15, సీట్లు లక్కీ డ్రా పద్దతి లో కేటాయించడం జరిగినది. లక్కీ డ్రా స్క్రీన్ కార్యక్రమంలో నందు విజయ లక్ష్మీ జిల్లా అడిషనల్ కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి రాజేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి టి డబ్ల్యూ ఆర్ ఎస్ జిల్లా కొ-ఆర్డినేటర్ స్కూల్ ప్రిన్సిపల్స్, విద్యార్ధిని, విద్యార్ధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version