సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి…

సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సొంత ఇంటి కోసం 200 గజాల స్థలం ఇవ్వాలి
కార్మికుడి సంవత్సర జీవితంలో మూడు నెలలు ఇన్కమ్ టాక్స్ కట్టడానికే సరిపోతున్నది అందువలన కనీసం అధికారులలాగా పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ను మాఫీ చేయాలని కోరుతున్నాం.
సింగరేణిలో రానున్న కొద్ది సంవత్సరాల్లో అనేక భూగర్భగనులు మూతపడే అవకాశం ఉన్నందున తక్షణం నూతన గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
సేఫ్టీ ట్రైపాడ్ సమావేశాలు గత 18 నెలల నుండి జరగకపోవడం వలన రక్షణ విషయంలో వెనుకబడినట్లుగా భావిస్తున్నాం. నూతన బదిలీ విధానం కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నందున ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం
మెరుగైన క్యాడర్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతప్రమోషన్ పాలసీని తీసుకురావాలని కోరుతున్నాము
ఏరియా ఆసుపత్రులలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రిఫరల్ సిస్టంను మార్చలని మైన్ యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్కు గురైన కార్మికుడిని ముందుగా డిస్పెన్సరీకి తీసుకువెళ్లడం తర్వాత ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం తర్వాత రిఫరల్ చేయడంతో చాలా సమయం వృధా అయి విలువైన ప్రాణాలను కోల్పోతున్నందున ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా ఆసుపత్రి నుండే డైరెక్టుగా రిఫరల్ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
40/ లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం
ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేరుల సమస్యను వెంటనే తీర్చాలని కోరుతున్నాం
పై సమస్యల పరిష్కారానికి తగు చర్యను వెంటనే తీసుకొని సింగరేణి కార్మిక లోకానికి న్యాయం చేయాలని కోరుతున్నాం వివిధ కారణాల వలన ఉద్యోగాలను కోల్పోయిన డిస్మిస్డ్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అన్ని డివిజన్లో ఉన్న వాళ్లకు వన్ టైం సెటిల్మెంట్ లో ఇవ్వాలి సింగరేణి కార్మికుల ఎన్నికలలో వాగ్దానం చేసి ఇప్పటివరకు వాటిని అమలు చేయలేకపోతున్నారు వెంటనే అమలు చేయాలి చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే…!

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే… మడమ తిప్పదు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి విడత లక్ష మంజూరు

డి సి సి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం సప్పిడి గుట్ట గ్రామపంచాయతీ కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద 6 గురు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను మంజూరు చేయగా 4 గురు లబ్ధిదారులు బానోతు నీలా, సపావట్. కౌంసల్య, బానోతు రజిత, తేజావత్ కాంతమ్మ లు బేస్మెంటు బెడ్ నిర్మాణం పూర్తి అయి వారి ఎకౌంట్లో మనిషికి లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద జమ చేయడం జరిగింది. జమ అయిన లక్ష రూపాయలకు సంబంధించిన వారి ఎకౌంట్ స్టేట్ మెంటును లబ్ధిదారులకు ఇస్తూ విషయాన్ని చెప్పిన కేసముద్రం సింగిల్ విండో వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి వి .వినయ్ కుమార్, ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డికి, మహబూబాబాద్,శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ , లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఇందిరమ్మ కమిటీ సభ్యులు బానోత్ బద్రు నాయక్,బానోత్ వాలు, రవీందర్, లచ్చిరాం, లాలు, సుమన్ పాల్గొన్నారు.

శ్రీసిటీని సందర్శించిన కేంద్ర గృహనిర్మాణ శాఖ

*శ్రీసిటీని సందర్శించిన కేంద్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం..

*కార్మికుల గృహ నిర్మాణాలు..

*సుస్థిర పట్టణాభివృద్ధికి హామీ..

తిరుపతి నేటి ధాత్రి

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ కటికితల, ఆ శాఖ సంయుక్త కార్యదర్శి (అమృత్ పథకం)ఇషా కాలియా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఎన్.మౌర్య, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్ తో కలసి బుధవారం శ్రీసిటీని సందర్శించారుశ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ ఆయనకు సాదర స్వాగతం పలికి,శ్రీసిటీ ప్రణాళిక, ప్రస్థానం, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు.

 

 

 

చర్చల సందర్భంగా, శ్రీసిటీలో అభివృద్ధి చెందుతున్న సామాజిక వసతులపై ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. గృహ సముదాయాలు, విద్యా వసతులు, షాపింగ్ కేంద్రాలు, ఇతర కీలక సౌకర్యాల గురించి హైలైట్ చేశారు.
అలాగే ఇక్కడ అమలు చేస్తున్న సమర్థవంతమైన నీటి వనరుల నిర్వహణ, మురుగునీటి రీసైక్లింగ్,ఘన వ్యర్థాల నిర్వహణ, హరితహిత చర్యలు,ఇతర సుస్థిరత కార్యక్రమాలను వివరించారు. టౌన్‌షిప్ ల అభివృద్ధి ద్వారా “వాక్ టు వర్క్” ఆవశ్యకతను ప్రస్తావిస్తూ, ఇందుకోసం అవసరమైన సహకారం అందించాలని కార్యదర్శికి విన్నవించారు.

 

 

 

ప్రస్తుత పారిశ్రామిక కార్యకలాపాలు,భవిష్యత్తు విస్తరణ వ్యూహాలు, మౌళిక సదుపాయాలు,నివాస గృహాల డిమాండ్ ముఖ్యంగా డార్మిటరీలు మరియు తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైన అద్దె గృహాలపై శ్రీనివాస్ లోతైన చర్చల్లో పాల్గొన్నారు. ఇతర పారిశ్రామిక ప్రాంతాలలో విజయవంతమైన గృహ ప్రణాళికల నమూనాలను అధ్యయనం చేయాలని, కేంద్ర గృహ నిర్మాణశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వినూత్న ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన శ్రీసిటీ బృందానికి సూచించారు. అనంతరం, పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల్లో పాల్గొన్న ఆయన, ప్రధానంగా మహిళా ఉద్యోగులకు చౌకధర అద్దె గృహాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ సహకారం, ఇతర అంశాలపై చర్చించారు. సమగ్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణాల విషయంలో మంత్రిత్వ శాఖ నుండి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

 

 

 

కేంద్ర గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులు శ్రీసిటీ పర్యటనకు రావడం తాము గౌరప్రదంగా భావిస్తున్నామని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. వారి విలువైన సూచనలు శ్రీసిటీ అభివృద్ధికి మరింత దోహదపడతాయని, ముఖ్యంగా సామాజిక మౌళిక సదుపాయాలుగృహ వసతులను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల ద్వారా మౌళిక సదుపాయాలు మరియు కార్మిక నివాసాలకు సంబంధించి వారు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం దక్కిందన్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్ శ్రీసిటీ పరిసరాలతో పాటు ఆల్‌స్టోమ్‌ పరిశ్రమలో తయారు అవుతున్న మెట్రో కోచ్ ల తయారీ విధానాన్ని పరిశీలించారు. అక్కడ పరిశ్రమ పనితీరు, ఇతర పారిశ్రామిక మౌళిక వసతులను పరిశీలించారు. అద్భుత ప్రణాళిక, కార్యాచరణతో రూపుదిద్దుకున్న శ్రీసిటీ పారిశ్రామిక మరియు ఆర్థిక కేంద్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందంటూ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.ఇక్కడి ప్రజలు,ఈ ప్రాంతం,దేశ శ్రేయస్సుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. శ్రీసిటీ మరింత వృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలను తమ మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శితో పాటు ఇతర సీనియర్ అధికారులు, సూళ్లూరుపేట
ఆర్ డి ఓ,
కిరణ్మయి పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై హౌసింగ్.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా లో ఇందిరమ్మ ఇళ్ల.నిర్మాణానికి సంబంధించి రెండవ దశలో ప్రభుత్వ పథకానికి ఎంపికై మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వేగంగా గ్రౌండింగ్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టర్ తన ఛాంబర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కు సంబంధించి అదనపు కలెక్టర్ యాదయ్య తో కలిసి హౌసింగ్ అధికారులతో సమీక్షించారు.
ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు రావడం జరుగుతుందని లబ్ధిదారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఒక్కో మండలం వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణం కొరకు మన ఇసుక వాహనం ద్వారా ఉచితంగా ఇసుక పొందడానికి అవగాహన కల్పించాలన్నారు. మన ఇసుక వాహనం ద్వారా ఇసుక అందించే విషయంపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని మైనింగ్ శాఖ సూచించారు.
సమావేశంలో హౌసింగ్ అధికారులు విఠోబా, ఏఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం

-ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

-కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

-మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

-గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

-పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

-మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

మొగులపల్లి నేటి ధాత్రి

 

 

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొర్కిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు.

మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ మొగుళ్ళపల్లి మాజీ చైర్మన్ ఫోలీనేని లింగారావు, పీఏసీస్ మొగుళ్ళపల్లి వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంద సాంబయ్య, కేతిపల్లి తిరుపతిరెడ్డి, రొంటాల సంపత్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, క్యాతరాజు లింగమూర్తి, పొన్నాల విజయేందర్ రెడ్డి, ఎలేటి శివారెడ్డి, పడిదల ప్రకాష్ రావు, మల్సాని రాజేశ్వర్ రావు తదితరులున్నారు.

ఇందిరమ్మ ఇండ్ల ఏంపికలో నిజమైన.!

ఇందిరమ్మ ఇండ్ల ఏంపికలో నిజమైన లబ్ధిదారులకు మొండి చెయ్యి…

తుడుం దెబ్బ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

 

 

 

మండల కేంద్ర పరిధిలో గల 15గ్రామ పంచాయతీ లలో ఇందిరమ్మ ఇండ్ల ఏంపిక లో నిరుపేదలకు మొండి చేయి చూపే విధంగా ఇందిరమ్మ కమిటీ లు వ్యవహారిస్తున్నాయని కరకగూడెం మండల తుడుం దెబ్బ, అధ్యక్షులు, పోలేబోయినా ప్రేమ్ కుమార్ ఆరోపించారు.గ్రామ సభ లో మాట్లాడిన విధంగా కాకుండా ఇందిరమ్మ కమిటీలు వాళ్ళ ఇష్టనుసారంగా వాళ్లకు నచ్చినవాళ్లకు కేటాయిస్తున్నారని, నిరుపేదలు కనీసం గుడిసెలలో వారికీ కేటాయించక పోవటం చాలా బాధాకరం, అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు, కనీసం ఎంపికైనటువంటి లబ్ధిదారుల జాబితాను కూడా తెలుపకుండా పంచాయతీ సెక్రటరీలు వ్యవహరించడం తగదుఅన్నారు. అదేవిధంగా మండల ఎంపీడీవో ఆయా పంచాయతీ కార్యదర్శులు ఇంత జరుగుతున్న చూసి చూడనట్టుగా వ్యవహరించడం అనేక అనుమానాలకు దారితీస్తుందని వాపోయారు తక్షణమే దీనిపై విచారణ చేపట్టి అసలైన అర్హులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేవిధంగా చర్యలుతీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు సుతారి నాగేష్ మాట్లాడుతూ. ఐదవ షెడ్యూల్ ఏరియా లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఏజెన్సీ చట్టాలకు, హక్కులకు అనుకూలంగా నే ఎంపికలు జరగాలని పీసాగ్రామసభ తీర్మానాలు జరిపి గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల జాబితా ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి కలం సంపత్, కార్యవర్గ సభ్యులు, పోలె బొయిన కార్తీక్, రేగ కిరణ్ పోలిబోయిన శ్యాం ప్రసాద్, కొమరం వెంకట్, తోలేo హరికృష్ణ, గోగ్గల వేణు పోలే బోయిన రఘు పోలేబోయిన సురేష్ కుమార్, పోలే బోయిన సంతోష్ పూణేo రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పేదప్రజలను ఇండ్ల పేరిట దోచుకుంటున్న కాంగ్రెస్.!

పేదప్రజలను ఇండ్ల పేరిట దోచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి:

మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హతకలిగిన లబ్ధిదారులకు చెందకుండా నిరుపేదలను మోసం చేస్తున్నారని వారి పార్టీ కార్యకర్తలకు మరియు కమిటీ సభ్యులకు మాత్రమే ఇల్లు కేటాయించుకోవడం జరుగుతుందని గ్రామంలో ఇల్లు కావాలనే వారి దగ్గర 30 వేల నుండి 50 వేల వరకు డబ్బులు తీసుకుని ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి పేర్లు లేకుండా చేసి అనర్హుల పేర్లను పెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు వాళ్లు ఇష్టానుసారం చేస్తున్నారన్నారని భారతీయ జనతా పార్టీ పరకాల రూరల్ మండలం మాజీ అధ్యక్షులు ముష్కే దేవేందర్ అన్నారు.పేదప్రజలను రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతుందని హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఇబ్బందులు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం.. లబ్ధిదారుల ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు, సరఫరా సమస్యలు, నిర్మాణ వ్యయం పెరుగుదల వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పునాది రుణాలు, ఉచిత ఇసుక సరఫరా, నమూనా ఇళ్లపై స్పష్టత లేకపోవడం, ఐకేపీలపై అవగాహన లోపం సమస్యలుగా ఉన్నాయి. లబ్ధిదారులు ఈ సమస్యల పరిష్కారాన్ని కోరుతున్నారు. ఈ వారంలో రెండో విడత లబ్ధిదారుల జాబితా విడుదల కానుంది.

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన హౌసింగ్ పీడీ.

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన హౌసింగ్ పీడీ

నిజాంపేట: నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పనులను మంగళవారం హౌసింగ్ పిడి మాణిక్యం పరిశీలించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు.. గ్రామంలో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రాజిరెడ్డి, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version