చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు
#పోరాటయోధురాలి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం
ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ, నేటిధాత్రి:
తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో నిలిచిన ధైర్యవంతురాలు చాకలి ఐలమ్మ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున హనుమకొండ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య,నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి తో కలిసి పాల్గొన్నారు.
స్థానికంగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. ఆమె సామాన్య వర్గానికి చెందినప్పటికీ, సామాజిక అసమానతలకు, భూ దోపిడీకి, జమీందారీ శాసనానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆమె ధైర్యం, పట్టుదల మనందరికీ ఆదర్శం కావాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్,మేయర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్,మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్,డివిజన్ అధ్యక్షులు సురేందర్,కుమార్ యాదవ్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు,ఐలమ్మ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.