తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ )భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు,ఉద్యోగులు పెన్షనర్స్ ఎదుర్కొంటున్న పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పి ఆర్ సి కమిటీ రిపోర్టు ను ప్రభుత్వం తెప్పించుకొని పి ఆర్ సి నీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, ఇతర పెండింగ్ బకాయిలన్నింటిని త్వరితగతిన ఉపాధ్యాయులకు చెల్లించాలని ఎమ్మెల్యే ను సంఘ నాయకులు కోరారు. ఉపాధ్యాయులకు,ఉద్యోగులకు , విశ్రాంత ఉద్యోగులకు రావలసిన బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ హామీలను నెరవేర్చాలని కోరారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటిని ప్రస్తావించి వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొనే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు ములుకల్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర బాధ్యులు మారబోయిన మహేందర్, సంగెం శ్రీనివాస్, రేగొండ డివిజన్ ఇంచార్జి కొడకండ్ల శ్రీకాంత్, చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి లకుం రంజిత్ కుమార్, మహాదేవపూర్ మండల అధ్యక్షులు నస్పూరీ సంతోష్ కుమార్,జిల్లా కార్యదర్శిలు గౌరిశెట్టి రవీంద్రనాథ్, మూడికె శ్రీనివాస్, జంగిలి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు సీనియర్ ల పేర్లను తొలగింఛారు
వనపర్తి నేటిదాత్రి
వనపర్తి లోని ఆర్యవైశ్య మహాసభ లో.ఓటు హక్కు ఉంటే వాళ్ల ఎదుగుద ల చూసి వారి పేర్లు తొలగిం చారని ఆర్యవైశ్య దహన కమిటీ మాజీ చైర్మన్ పాలాది కొత్త శ్రీనివాస్ లు ఆవేదన వ్యక్తంచేశారు ఆర్యవైశ్య సంఘము అధ్యక్షులు గా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం చెయంచామని చెప్పారు డబ్బులు ఉన్నవారికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల లో ఓటు హక్కు కల్పించారని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు తప్పుడు లిస్టు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వసుజాత కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు వనపర్తి లో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేత తన ఇష్టం ఉన్న వారికి ఓటు హక్కు కల్పించినారని పాలాది ఆందోళన వ్యక్తం చేశారు వారు వనపర్తి ఆర్యవైశ్య సంఘానికి సేవ చేసిన వారు కాదని అన్నారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఓటు హక్కును తొలగించి నందుకు కోర్టును ఆశ్రయిస్తామని పాలాది శ్రీనివాస్ లు చెప్పారు
బిసి మహిళా నామినేషన్ వేసినందుకు ఆమె భర్తని కిడ్నాప్ చేసి కొట్టి హింస
జహీరాబాద్ నేటి ధాత్రి:
మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా టిప్పర్తి మండలం లో బిసి మహిళా నామినేషన్ వేసినందుకు ఆమె భర్తని కిడ్నాప్ చేసి కొట్టి హింసించి మూత్రం తాగించిన చర్యను నిరసిస్తూ టిఆర్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో టిఆర్పి పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు నరసింహ, ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ హనుమంతు,
సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వరప్రసాద్, సచిన్, మొగుడంపల్లి మండల్ శీను, మొడంపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి లతీఫ్ మరియు రాము మరియు తదితరులు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు వారి అనుచరుల పైన ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ నాయకుల తీరుపై వారి వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు ఖండిస్తూ రావడం జరిగిందని, కాంగ్రెస్ నాయకులు నాయకుల్లాగా కాకుండా దౌర్జన్యంతో రౌడీయిజం చేస్తున్నారని, అదే వైఖరితో మహిళల పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ మండిపడ్డారు.లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మహిళల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం కృషి చేస్తుందని కాంగ్రెస్ నాయకులు గర్వంగా చెప్పుకున్నారు, మరి మినిస్టర్ ఓదా లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక బీసీ మహిళ నామినేషన్ వేస్తే వారి అనుచరులు ఆమె భర్తని హింసించడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అన్న విషయం ప్రజలు గమనించాలి.రాష్ట్రంలో బీసీల పైన ఎక్కడికక్కడ బెదిరింపులు కిడ్నాప్లు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ ప్రాక్టీస్ మానిటరింగ్ చేయకుండా ఏం చేస్తుందని. అలాగే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వైఖరితో ప్రవర్తిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని జ్యోతి పండాల్ ప్రశ్నించడం జరిగింది. ఇతర పార్టీలైన బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్లో ఉన్న బీసీలకు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన తీన్మార్ మల్లన్న గారిని ఆశ్రయిస్తున్నారు. వేరే పార్టీలో ఉన్న బీసీలకు మద్దతు మరియు న్యాయం జరగాలన్న కేవలం టిఆర్పి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మరియు టిఆర్పి పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
జహీరాబాద్ పట్టణంలో 15 ఏళ్ల బాలుడు అదృశ్యమైనట్లు బంధువు కిన్నెర గురునాథ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా తారురుకు చెందిన జమ్మికుంట ఆశోక్ (15) ఈనెల 22న జహీరాబాద్లో బంధువుల ఇంటికి వచ్చాడు. శనివారం నుంచి అబ్బాయి కనిపించలేదని గురునాథ్ పోలీసులను ఆశ్రయించారు. బాలుడి ఆచూకీ తెలిస్తే 9392324883 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఎస్వీయూ పీఎస్ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు
ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.
తిరుపతి, నవంబర్ 6: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పీఎస్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ అధికారులపై విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కాగా.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో (SV University) ర్యాగింగ్ కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో విద్యార్థులను ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డి ర్యాగింగ్‌కు ప్రోత్సహించారంటూ బాధిత విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో ప్రొఫెసర్‌పై ఫిర్యాదు ఇవ్వడానికి యూనివర్సిటీ అధికారులను మూడు రోజులు ముందు విద్యార్థి సంఘాలు కలిశాయి. అయితే ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.
అయితే.. ఇప్పటి వరకు ర్యాగింగ్‌పై ఎలాంటి చర్యలు లేకపోగా.. తిరిగి తమపైనే కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు విద్యార్థులు, బాధిత విద్యార్థినిలు చేరుకున్నారు. యూనివర్సిటీ అధికారులపై విద్యార్థినిలు, విద్యార్థి సంఘ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.
తల్లిదండ్రులపై ఓ కూతురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జగిత్యాల: ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై కూతురు ఫిర్యాదు చేసింది. వివరాళ్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, వెల్గటూర్ మండలం రాజక్కపల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్‌ల మధ్య 6 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుస్తోంది.
అయితే.. రాకేష్ దళితుడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వీరిద్దరి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో జులై 2న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. తనను తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక ఆరోపిస్తుంది. అలాగే.. వారి నుంచి తనకు, తన భర్త రాకేష్‌కు ప్రాణహాని ఉందని తెలిపింది. ఈ మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక ఫిర్యాదు చేసింది. ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గణపురం భారతీయ జనాతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిదర్ రెడ్డి ఆదేశానుసరం జయశంకర్ జిల్లా లోని ఇసుక క్వారీ ల వద్ద ఇసుక లోడింగ్ కీ వెళ్లిన లారీలా దగ్గర అదనముగా డబ్బులు వసూలు చేస్తున్నారు టి ఎం ఎస్ డిసి వారు 14 టైర్ల లారీ కీ 32 టన్నులకు డబ్బులు తీసుకోని లోడింగ్ దగ్గర మాత్రం 30 టన్నులు మాత్రమే ఇసుక నింపుతున్నారు దీని వలన నేరుగా వినియోగ దారుని మీద సుమారుగా ఒక్క లారీ కీ పది వేళ రూపాయలు అధిక భారం పడుతుంది అలాగే గత ప్రభుత్వం జయశంకర్ జిల్లా ను స్థానిక జిల్లాగా గుర్తించి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్పెషల్ అలాట్మెంట్ చేసేది కానీ ఇప్పటి ప్రభుత్వం స్థానికతను తుంగలో తొక్కి స్థానిక వినియోగదారుల మీద స్థానిక లారీ ఓనర్ల మీద ఉక్కు పాదం మోపుతుంది కావున పై అంశాలపై టీజీఎండిసి ఎండీ తో చర్చించి వినియోగదారులపై అధిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలి అని స్థానిక జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతిపత్రం మీద సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా కోశాధికారి ఎర్రబెల్ల
“ప్రభుత్వ భూమిని కాపాడాలని.. కలెక్టర్ కు ఫిర్యాదు”
” అధికారులపై చర్యలు తీసుకోండి”
బాలానగర్ / నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామపంచాయతీ శివారు అయ్యప్ప స్వామి దేవాలయ ఆలయ సమీపంలోని సర్వేనెంబర్ 102, 105 ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ కి సంబంధించిన ఆర్చిని ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు వెంచర్ యజమానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సామాజిక సేవా కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
Government Land
స్థానిక రెవిన్యూ అధికారులు వెంచర్ యాజమాన్యంతో కుమ్ముక్కై ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ఏం మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని కాపాడకుండా వెంచర్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ భూమిలో ఆర్చి నిర్మాణానికి సహకరించిన అధికారులపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి విలువ మార్కెట్ రేటు ఒక ఎకరం రూ.4 కోట్ల వరకు ఉంటుందని విలువైన భూమిని కాపాడడంలో విఫలమైన స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012వ సంవత్సరంలో హైదరాబాదులో నగరానికి 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో జాతీయ రహదారులకు రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరికి అసైన్మెంట్ చేయరాదన్న జీవోను జారీ చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్థానిక రెవిన్యూ అధికారులు విస్మరించి.. రికా వ్యాల్యూ వెంచర్ యజమానికి అనుకూలంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.
సంగారెడ్డి: నాల్కల్ మండలం గణేషాపూర్ గ్రామంలో కొందరు అక్రమార్కులు కర్ణాటకకు చెందిన వ్యక్తితో కలిసి ఎర్రరాయి తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వుతూ, గుంట భూమిని రూ. 10 లక్షలకు లీజుకిస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. ఈ అక్రమం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నా, వారు నోరు మెదపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సంగారెడ్డి: ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో అదృశ్యం కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ గ్రామీణ ఎస్సై కాశీనాథ్ తెలిపారు. ఆనెగుంటకు చెందిన పి.సవిత (22) ఈనెల 23న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని వివరించారు. తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
Pothole Damage? You Can Claim a Refund Under Consumer Law
The Danger of Potholes
Potholes on our roads are not just an inconvenience. They cause serious damage to vehicles and are responsible for many accidents every year. What most citizens don’t know is that they have a legal right to claim compensation—a refund for the damage suffered.
⚖️ Legal Responsibility
Under the Consumer Protection Act and the Motor Vehicle Act, the responsibility of maintaining safe roads lies with civic authorities. These include the Municipality, Roads & Buildings Department (R&B), and the National Highways Authority of India (NHAI). If these agencies fail to maintain roads properly, they can be held accountable.
What To Do If Your Vehicle Is Damaged
If your vehicle suffers damage due to a pothole, it is important to collect proper evidence:
Take photos and videos of the pothole.
Keep repair bills and receipts of the damage.
File a complaint with the concerned municipal or highway authority.
️ Next Step: Consumer Forum
If the authority does not respond or refuses to take action, you can approach the District Consumer Forum. With sufficient evidence, the forum can order the concerned department to pay compensation (refund of expenses) for your losses.
Example Cases
In several past judgments, courts have directed civic authorities to pay not just the repair costs, but in some cases also additional compensation for the mental agony caused. This sets a strong precedent that pothole-related damages are not just “bad luck” but a matter of consumer rights.
✅ Your Right as a Citizen
The next time your vehicle is damaged because of potholes, don’t remain silent. Collect evidence, file a complaint, and assert your rights. The Consumer Protection Act is there to protect you.
ఝరాసంగం మండల ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో కరెన్సీ నోట్లతో పనిలేకుండా పోయింది. గతంలో డబ్బులు లేనిదే ఎవరూ బయటకు వెళ్లేవారు కారు. కానీ, నేడు జేబులో రూపాయి లేకుండానే బజారుకు వెళ్తున్నారు. ఏం కొనాలన్నా, తినాలన్నా, తాగాలన్నా డబ్బులతో అక్కర్లేదు. ఎక్కడ చూసిన అన్ని ఆన్ లైన్ పేమెంట్స్. రోడ్డుపై టీ తాగిన, మార్కెట్లో కూరగాయలు తీసుకున్నా స్కాన్ చేసి డబ్బు చెల్లించడం. ఈ రకంగా మనీ ట్రాన్సఫర్స్ చాలా ఈజీ అయిపోయింది. చిన్న గుండు పిన్ను నుంచి కాస్లీ కారు కొనుగోలు చేసేవరకు అంతటా బ్యాంక్ ద్వారా ట్రాన్ జాక్షన్ చేయోచ్చు. “అతి వినయం ధూర్త లక్షణం” అన్నట్టుగా ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు మోపై ఎక్కడ, ఎవరూ ఈజీగా దొరుకుతారు వారిని దోచుకుందాం అని కళ్లు తెరబెట్టి కూర్చున్నారు. ఆఫర్స్, డిస్కౌంట్ పేరుతో అమాయకులను దోచుకుంటున్నారు.
(సైబర్ Crime) నేరగాళ్లు రోజురోజుకు వినూత్న పద్ధతుల్లో కేవలం నిమిషాల వ్యవధిలోనే రూ.లక్షలు కాజేస్తున్నారు. వారి బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో (పోలీసులు) అనేక ఝరాసంగం మండల ఆయా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించినా జనం మోసానికి గురవుతూనే ఉన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా సైబర్ మోసాలకు గురవుతున్నారు. ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను, ఆన్లైన్ పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని చిరుద్యోగులను, రుణ యాప్లతో విద్యార్థులను, సామాజిక మాధ్యమాల వల విసురుతూ డిజిటల్ అరెస్ట్ పేరిట వృద్ధులు, వ్యాపారులను బోల్తా కొట్టిస్తుండటంతో ఏటేటా కేసులు పెరుగుతున్నాయి. 2023 సంవత్సరంతో పోల్చుకుంటే 2024లో సైబర్ నేరాల సంఖ్య రెట్టింపు స్థాయిలో నమోదు అయ్యాయి. సైబర్ క్రైమ్‌ల వల్ల తెలంగాణ వాసులు ప్రతిరోజూ రూ. 5 కోట్ల వరకు కోల్పోతున్నట్లు లెక్కలు ద్వారా తెలుస్తోంది. ఇందులో దాదాపు రూ. 4 కోట్లను క్రిమినల్ సిండికేట్‌లు విదేశాలకు పంపుతున్నట్లు తేలింది. పోలీసు సైబర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫలితం లేకుండా పోతుంది.
సైబర్ నేరం జరిగిన తర్వాత మొదటి కొన్ని గంటల ప్రాముఖ్యతను అధికారులు నొక్కిచెప్పారు. వాటిని ‘గోల్డెన్ అవర్స్‘ అని పోలీసులు చెబుతున్నారు. 2024లో తెలంగాణ బాధితులు సైబర్ క్రైమ్ వల్ల రూ.2,000 కోట్లకు పైగా నష్టపోయినట్టు తేలింది. కొన్ని సందర్భాల్లో, సైబర్ అధికారులు.. కోట్లాది రూపాయలను రికవరీ చేయగలిగారు, అయితే విజయవంతమైన అన్ని కేసులలో కీలకమైనది గోల్డెన్ అవర్స్‌లో నివేదించబడినవి. ఓ బాధితుడు రూ. 70 లక్షలు పోగొట్టుకున్నాడు, ఆ వ్యక్తి రూ. 15 లక్షలు మాత్రమే తిరిగి పొందగలిగాడు. అయితే అతను కీలకమైన మొదటి కొన్ని గంటల్లో సంఘటన గురించి నివేదించనందున తక్కువ వచ్చినట్లు అధికారి వెల్లడించారు. అతను పోలీసు ఫిర్యాదును దాఖలు చేయడానికి 10 రోజులు పట్టింది, దానిని వెబ్‌సైట్‌లో నివేదించి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సైబర్ సెక్యూరిటీ విభాగానికి వెళ్లాడు. సైబర్ బాధితులు http://www.cybercrime.gov.in లేదా టోల్-ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు ప్రజల్నీ అలెర్ట్ చేసింది. ఒక్క క్లిక్ తో మీ జీవితాన్ని మార్చేస్తుంది.. అనే పేరుతో ఖాకీలు పోస్టర్స్ రిలీజ్ చేశారు. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా అంటూ ఫోన్ కాల్స్, మెసేజ్ లు, ఈ మెయిల్స్ ద్వారా ఫేక్ లింక్ లు పెట్టి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. అత్యాశతో మీరు చేసే క్లిక్ ద్వారా మీ ఖాతాలోని డబ్బు మాయం అయ్యే ప్రమాదం ఉందని సూచించింది. మీకిష్టమైన వాటిని చూపించి తక్కువ ధరకు ఆ వస్తువులు వస్తున్నాయంటే మిమ్ముల్నీ బోల్తా కొట్టించే ప్రమాదం లేకపోలేదంటూ మన పోలీసులు జనాన్ని మేలుకొలుపుతున్నారు. అత్యాశకు పోతే అనర్థాలకు దారితీసే ప్రమాదాలు ఉన్నట్లు పోస్ట్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. ఆఫర్స్, డిసౌంట్స్ పై మీరు తెలుసుకొని, వెనుకా, ముందు ఆలోచించి ముందుకు వెళ్లాల్సి అవసరం ఉంది.. మీ అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి ఎమరుపాటుతో ఉండొద్దు అని తెలంగాణ పోలీస్ శాఖ వార్నింగ్ ఇస్తుంది. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలని, దీని గురించి మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ కు కూడా విప్పి చెప్పాల్సిందిగా సూచన చేయడం జరుగుతుంది.
సైబర్ నేరాల బారిన పడితే 1930 నంబరుకు ఫోన్ చేయండి : ఝరాసంగం మండల ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్
సైబర్ నేరాల బారిన పడితే బాధితులు వెంటనే 1930 ఫోన్ నంబరుకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సూచించారు. సైబర్ నేరం జరిగితే త్వరితగతిన ఫిర్యాదు చేస్తే బాధితులు కోల్పోయిన డబ్బును తిరిగి ఇప్పించవచ్చని ఝరాసంగం మండల ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ చెప్పారు.
దరఖాస్తు ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా వీడని నిర్లక్ష్య వైఖరి
◆:- ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ సమాచార హక్కు చట్టం 2005 నిబంధనలను పాటించకుండా తన నిర్లక్ష్య వైఖరిని వ్యక్తపరుస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు తమ పనులకు జవాబుదారీగా ఉండాలని నిర్దేశించడం, పనుల పారదర్శకత కోసం ప్రజాస్వామ్య ప్రక్రియను మెరుగుపరచడం పౌరుడికి కావాల్సినటువంటి సమాచారం పొందుటకు సమాచారకు చట్టాన్ని అమలులోకి తెచ్చి సంబంధిత అధికారి ప్రజల కోరిన సమాచారాన్ని ఇవ్వాలన్న ఆదేశాలు సంబంధిత అధికారులు కలిగి ఉన్నప్పటికీ సంబంధిత సమాచారం కలిగి ఉండి సమాచారం ఇవ్వకుండా నాలుగు నెలలుగా నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల తాసిల్దార్ తిరుమలరావు మండల పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయతర భూముల వివరాల సమాచారం కోరగా ఇప్పటివరకు దాదాపు నాలుగు నెలలు గడుస్తున్న సమాచారం ఇవ్వలేదని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జూలై 11.2025 రోజున ఎంఆర్ఓ ను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోయారు.అధికారుల నిర్లక్ష్యంతో భూముల వివరాల అడిగిన బ్యాంకులో నువ్వు ఉన్నవారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అనుమానంతో రైతుల వద్ద డబ్బులు వసూలు చేసి దోచుకుంటున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని,అధికారుల అండ చూసుకోనీ భూములు రిజిస్ట్రేషన్లు చేస్తున్నా వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఇప్పటివరకు దాదాపు నాలుగు నెలలు కావస్తున్న సమాచారం ఇవ్వలేదని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లిన అందుబాటులో ఉంటూ ఏ సమాధానం ఇవ్వలేదన్నారు ఆర్డిఓ అధికారి కార్యాలయం,పౌర సమాచార అధికారి అప్పిలేటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.
బిఎస్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొగ్గం సుమన్
పరకాల నేటిధాత్రి
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రయివేట్ పాఠశాల సమాచారం కోరగా పరకాల ఎంఈఓ రమాదేవినీ కోరగా ఇప్పటివరకు దాదాపు 55 రోజులు గడుస్తున్న సమాచారం ఇవ్వలేదని బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మోగ్గం సుమన్ అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జూలై 11.2025 రోజున ఎంఈఓ ను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోయారు.అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ విద్యా సంస్థలు పేద విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని,అధికారుల అండ చూసుకోనీ ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఇప్పటివరకు దాదాపు రెండు నెలలు కావస్తున్న సమాచారం ఇవ్వలేదని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లిన అందుబాటులో ఉండటం లేదన్నారు.సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం,పౌర సమాచార అధికారి అప్పిలేటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.
మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.సురేష్ పై సస్పెన్షన్ వేటు పడింది.భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకున్న ఆయన,బాధితుడిని లంచం కోరినట్లు ఆరోపణలు వచ్చాయి.లంచం ఇవ్వలేదనే కారణంతో బాధితుడిని చితక బాధడంతో బాధితుడు అల్గం కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు దర్యాప్తు జరిపి,ఆరోపణలు నిజమని నిర్ధారించడంతో ఎస్సై సురేష్ ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.నెల రోజుల క్రితమే నీల్వాయి పోలీస్ స్టేషన్ కి బదిలీ అయిన సురేష్,వివిధ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు పలువురిని చితకబాదినట్లు బాధితులు తెలపడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని వీధి రౌడీ లా ప్రవర్తించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లో సెట్విన్ కార్యాలయంలో ప్రభుత్వపరమైన కార్యక్రమం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తమకు విలువనివ్వడం లేదని కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్న ఫ్లెక్సీ ని చింపి వేసినారు వాస్తవానికి వారికి ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వారి పరువుకు భంగం కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ప్రశాంత వాతావరణంలో ఉన్న రాష్ట్రాన్ని కావాలని రాజకీయ పార్టీ గొడవలను సృష్టించాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముసుగులో ఉన్న గుండాలు వీరు చేసిన ఆగడాల వీడియో క్లిప్పులను జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇవ్వడం జరిగినది వెంటనే వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గేల్లి రాములు యాదవ్ జహీరాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజామియా జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మొహమ్మద్ జాంగిర్ రాజశేఖర్ మోతి రామ్ రాథోడ్ పి.రాములు నేత మహమ్మద్ యూనుస్ జహీరాబాద్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ మోయుజోద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఇనాయత్ అల్లి మహమ్మద్ అక్బర్ మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మహమ్మద్ గౌస్ కాశీనాథ్ సురేష్ స్వామి నసురుల్లా ఖాన్ మొహమ్మద్ జమీల్ కురేషి మహమ్మద్ ఖదీర్ ఖురేషిఇస్మాయిల్ నైస్ టైలర్ సీనియర్ నాయకులు పద్మారావు మొహమ్మద్ ఇస్మాయిల్ పటేల్ మొహమ్మద్ మసీదున్ పేర్ల నాగేష్ గార్లు వినతి పత్రం ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినారు.
మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని పాత మంచిర్యాల శ్రీలక్ష్మీ నగర్ లో ఉన్న పట్టణ ప్రకృతి వనం ( పార్క్ ) లో నగరపాలక సంస్థ సిబ్బంది శుక్రవారం పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు.అందరికీ ఆహ్లాదం పంచాలనే ఉద్దేశంతో రూ. 90 లక్షల వ్యయంతో శ్రీలక్ష్మినగర్ లో నిర్మించిన పార్క్ నిర్వహణ సరిగా లేదని, వాకింగ్ ట్రాక్ లో గడ్డి మొలచి, చెత్త పొగయిందని,తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గత సోమవారం జరిగిన ప్రజావాణి లో పాత మంచిర్యాల కు చెందిన గోగు సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై పత్రికలో వార్తలు రావడంతో స్పందించిన నగర పాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు.పారిశుధ్య సిబ్బంది వాకింగ్ ట్రాక్ లో పెరిగిన గడ్డి తొలగించి శుభ్రం చేశారు.3 రోజుల్లో పారిశుధ్య చర్యలు పూర్తిచేస్తామని, మంచిర్యాల నగర పాలక సంస్థ పర్యావరణ అధికారి ప్రవీణ్ తెలిపారు.ఫిర్యాదు చేసినప్పుడే కాకుండా వారం రోజుల కొకసారి ఈ పార్క్ లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఈ పార్క్ లో వాకింగ్, వ్యాయామం చేసే వారు కోరుతున్నారు.3 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్క్ లో చెట్ల మధ్య ఖాళీ మైదానం లో పెరిగిన పిచ్చి గడ్డి మొక్కలు తొలగించి ఇసుక నింపి పిల్లలు ఆదుకోవడానికి వీలుగా ఆట పరికరాలతో ప్లేయింగ్ జోన్ తయారు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు.ఈ విషయం పై ప్రజా ప్రతినిధులు,అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో కోహ్లీపై కూడా ఫిర్యాదు దాఖలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఫిర్యాదు దాఖలైంది. శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్‌ఎమ్ వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పోలీసు స్టేషన్‌లో కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే రిజిస్టరైన కేసులో భాగంగా ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇక బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరో 50 మంది గాయపడ్డారు. ఆర్సీబీ ప్లేయర్లను సత్కరించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అక్కడి డ్రెయిన్‌పై ఉన్న మూత కూలడంతో జనాల్లో కంగారు బయలుదేరి తొక్కిసలాటకు దారి తీసింది. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వారు ఉన్నారు.
మరోవైపు, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సిటీ కమిషనర్ బీ దయానందతో పాటు పలువురు పోలీసు ఉన్న ఉన్నతాధికారులు సస్పెండ్ చేసింది.
అనంతరం, సీమంత్ కుమార్ సింగ్‌ను కొత్త చీఫ్‌గా నియమించింది. ఇక ఆర్సీబీ టీమ్, కేఎస్‌సీఏ, డీఎన్‌ఏ నెట్వర్క్ తోపాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేని పోలీసులు అరెస్టు చేశారు. డీఎన్ఏ నెట్‌వర్క్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన సొసాలేను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టు చట్ట వ్యతిరేకమంటూ సొసాలే కోర్టును ఆశ్రయించారు.
చిలుక ప్రవీణ్ పై యూట్యూబర్ చల్లా చేసిన దైవదూషణ వ్యాఖ్యలపై జహీరాబాద్ ముస్లింలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, ఇస్లాం చివరి ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) గౌరవార్థం దైవదూషణ మరియు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ చిలుక ప్రవీణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాది నేతృత్వంలోని జహీరాబాద్ ముస్లింల ప్రతినిధి బృందం సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాశీనాథ్ ను కలిసి ఈ విషయంలో అధికారిక ఫిర్యాదు చేసింది. చిలుక ప్రవీణ్ “యు న్యూస్” అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతోందని చెప్పబడింది. దీనిలో అతను ఉద్దేశపూర్వకంగా ఇస్లాం, ముస్లింలు మరియు ఇస్లాం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) గురించి రెచ్చగొట్టే మరియు అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. యూట్యూబ్ లో తప్పుడు ఖ్యాతిని పొందడానికి మరియు తన ఛానల్ యొక్క అభిప్రాయాలను పెంచడానికి మాత్రమే అతను ఇదంతా చేస్తున్నాడు. పర్వీన్ యొక్క ఈ చర్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా దేశ సామరస్యాన్ని కూడా బెదిరించాయని జహీరాబాద్ ముస్లింల ప్రతినిధి బృందం చెబుతోంది చిలుక ప్రవీణ్ మాటలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, భవిష్యత్తులో ఆమె ద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ఉండటానికి ఆమెను వెంటనే అరెస్టు చేయాలని ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా, సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాదీ చిలుక ప్రవీణ్ ప్రకటనలను తీవ్రంగా ఖండించారు మరియు అలాంటి ద్వేషపూరిత ప్రసంగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని మరియు భవిష్యత్తులో ఎవరూ అలాంటి ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ధైర్యం చేయకుండా దానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరియు ఏ మతానికి వ్యతిరేకంగానైనా ఇటువంటి చర్యలు చేసే వారిపై భారత ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు, తద్వారా ఎవరూ అలా చేయడానికి ధైర్యం చేయరు. ప్రతినిధి బృందంలో సయ్యద్ షా రిజ్వాన్ ఖాద్రీ, సజ్జాదా నషీన్ ముహమ్మద్ మహమూద్ సూఫీ, హఫీజ్ ముహమ్మద్ ఇర్ఫాన్, ముహమ్మద్ అజీముద్దీన్ ఖాద్రీ ముహమ్మద్ ముస్తెయిన్ నవాజ్ ముహమ్మద్ ఇంతియాజ్ సాకి, హఫీజ్ ముహమ్మద్ హమీద్ ముహమ్మద్ ఇబ్రహీం ఖలీల్ ముహమ్మద్ రఫీ, స్టేషనరీ ముహమ్మద్ ఫయాజ్ అహ్మద్, క్రైమ్ రిపోర్టర్ మరియు ఇతరులు ఉన్నారు.
ఆకాశ రామన్న ఉత్తరంపై పోలీసులకు ఫిర్యాదు విలేఖరి పై అనుమానాలు జమ్మికుంట :నేటిధాత్రి
జమ్మికుంట అయ్యప్ప దేవాలయం అధ్యక్షుడు సిరిమల్లె జయేందర్, కార్యదర్శి ఎలిమెల్ల రాజేంద్రప్రసాద్ లపై ఆలయానికి వచ్చినటువంటి విరాళాలు సొంతానికి వాడుకొని లెక్కలు చూపించకుండా అక్రమాలు చేసినట్టు ఆలయ సభ్యులకు అయ్యప్ప మాలధారులకు కరపత్రాలు పోస్ట్ ద్వారా సీతారామయ్య చీటీ లాగా అడ్రస్ లేకుండా పంపించిన వారు ఎవరనేది తెలియకుండా పంపించడం జరిగింది ఇది జమ్మికుంట పట్టణం ఒక సంచలన వార్తగా మిగిలిపోయింది ఈ కరపత్రాల సమస్య విషయమై ప్రజల యొక్క నానుడి ఎలా ఉందంటే ఆలయ నిర్మాణ టైంలో యాంసాని కృష్ణమూర్తి అధ్యక్షులుగా ఉన్నప్పుడు అయ్యప్ప మాల వేసుకునే భక్తుడే కృష్ణమూర్తి అనుచరుడిగా శ్రేయోభిలాషిగా మెదులుతూ అతనిని తప్పుదోవ పట్టించి తప్పు చేయించి లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నటువంటి ఈ భక్తుడే కృష్ణమూర్తి ఉండే టైంలో గుడి పైసలు లక్షల రూపాయలు వాడుకొని కృష్ణమూర్తి తో ని కట్టించిన ఘనత ఈయనదే అని అనుకుంటున్నారు ఇతని లీలలు శ్రీకృష్ణ లీలలు త్వరలోనే బయటికి వస్తాయి అనుకుంటున్నారు ఇకపోతే ఆలయానికి చాలా ఖర్చులు ఉంటాయి ఒక కుటుంబం పోషించడానికి ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు అలాంటిది వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి ఆలయానికి సౌకర్యాలు కలిగించడం ఉత్సవాలు జరిపించడం ప్రతి పండుగ రోజు పండుగ వాతావరణం కలిగించడానికి ఎంతో ఖర్చవుతుంది అలాంటిది రాయలేదు వచ్చిన రూపాయలు అక్రమం జరిగిందని రాస్తున్నారు అందులో ఎంతవరకు నిజం ఉన్నదో ఈ ఆకాశరామన్న ఉత్తరంలో ఏది నిజమో ఏది అబద్దమో కాలమే తెలియజేస్తుంది అలాగే ఆలయ మొత్తము విలువ 20 కోట్లు ఉంటుందేమో కానీ 15 కోట్ల రూపాయలు అక్రమం జరిగింది 15 కోట్ల రూపాయలు సంతానికి వాడుకున్నారు అనేదాంట్లో ఎంతవరకు నిజమో అనేది ప్రజలు గమనిస్తున్నారు ఏది ఏమైనా భగవంతుని యొక్క సన్నిధిలో ఉంటూ భగవంతుని యొక్క పైసల విషయంలో ప్రజల్లోకి ఇలాంటి వార్తలు రావడం రానున్న రోజుల్లో విరాళాలు కూడా రాకుండా ఆలయ అభివృద్ధికి వెనకడుగు వేసే విధంగా చేసినారు తప్ప ఇది ఏదో అభివృద్ధి కో లేకుంటే ఏదో ఆలయానికి పనికివచ్చే విషయం అనేది ఎవరూ పరిగణించట్లేదు వాళ్ల దాంట్లో వాళ్లకు పడక ఆదిపత్య పూర్ లో భాగంగానే ఇది వచ్చిందని నిపుణులు భక్తులు ప్రజలు అనుకుంటున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.