భూమి ఆక్రమణపై రైతుల ఆందోళన

మా అనుమతి లేకుండ భూమి ఆక్రమిస్తున్నారు
మేము అమృత్ పథకం కు భూమి ఇవ్వం
అధికారులకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసిన
స్పందన కరువు
పంట ధ్వసం చేస్తే ఉరుకొం
మేము పేద రైతులం మాకు ఉంది ఇదే కొద్దీ భూమి
అధికారులను మమ్మల్ని బెదిరిస్తున్నారు
ప్రభుత్వం మాకు న్యాయం చెయ్యాలి

రాయికల్ ఏప్రిల్ 15 . నేటి ధాత్రి:

రాయికల్.పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో అమృత్ పథకం భూ భాదితులు కుర్మా మల్లారెడ్డి ,కుర్మ నారాయణ రెడ్డి ,కుర్మా ప్రేమ్ రెడ్డి ప్రెస్]మీట్ నిర్వహించారు ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతు ఐకెపి భవనం దగ్గర ఇరువై గుంటల ప్రభుత్వ భూమిని అమృత్ పథకం కు ట్యాంక్ నిర్మాణం కోసం మా అనుమతి లేకుండ నియంతృత్వంతో అధికారులు మా పంట భూమిని లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు, మేము పూర్తీ ఇట్టి భూమిని ఆమోదించాము ఇచ్చే నష్టపరిహారం తీసుకుని రైతులు భూమిని మాకు అప్పజెప్పాలని రైతులం అయినా మాకె అల్టిమేటం ఇచ్చారని మాకు ఉన్నదే ఈ కొద్దీ భూమి ఇది ఆక్రమించుకుంటే మాబ్రతుకులు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేసారు,మాకు న్యాయం చెయ్యాలంటూ జిల్లా కలెక్టర్ ,జెసి కి ,ఎమ్మెల్యే ఎంపీ విజ్ఞప్తి చేసినప్పటికిని వారు చెప్తున్నా స్పందన లేదని పట్టణంలోని రెవెన్యూ సర్వే నెంబర్ లు [ 988/2/1/1/,] [988/2/1/2/1] [988/2/1/3/1] భూమిలో ఇప్పటి వరకే మేము గ్రామ అభివృద్ధి కోసం ఐకెపి భవనం కు ఇచ్చామని మా ద్రాతృత్వాన్ని గుర్తించి ప్రభుత్వ అధికారులు మాకు న్యాయం చేయవలసిందిగా పోయి అన్యాయంగా ఉన్న పంట భూమిని లాక్కువాలనుకోవడం సమంజసం కాదని తెలిపారు ఇకనైనా మా భూమిలో పెట్టిన ప్రతిపాదనను అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేసారు
మాజీ సర్పంచ్ తురగ రాజారెడ్డి మాట్లాడుతు బలవంతంగా నిరుపేద రైతులు భూమిని లాక్కోవాలని చూడడం సరికాదని అన్నారు గతంలో ప్రభుత్వ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు సహకారంతో రైతులమే భూములు దానమిచ్చి గ్రామ అభివృద్ధికి దోహద పడ్డామని,ఇలా బలవంతంగా భూమిని లాక్కోవడం ఎక్కడ చూడలేదని రైతుల సంబంధం లేని భూమిని సర్వే చేయడం గ్రామ సభ పెట్టి ఆమోదించడం నష్టపరిహారం తక్షణమే ఇస్తామనడం కుట్ర పూరితంగా అధికారులు వ్యవహరిస్తున్నారు,అని వేరే చోట దాత భూమిని ఇచ్చేట సిద్ధంగా ఉన్నప్పటికిని ఇదే భూమి కావాలని అధికారులు పట్టు పట్టడం సరికాదని తక్షణమే ఈ పేద రైతుల భూమిలో పెట్టిన అమృత్ ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో రాము లింగ రెడ్డి ,జలపతి లక్ష్మారెడ్డి ,లింగా రెడ్డి ,వేణు ,గంగాధర్ ,సురేంధర్ పాల్గొన్నారు

108 వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్…

108 వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్.

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి

మండల కేంద్రంలో గ్రామ గ్రామానికి సేవలందిస్తున్న 108 వాహనాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్, భద్రాచలం డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్ తో కలిసి 108 వాహనాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేసి. అనంతరం 108 వాహనంలో ఉండే పరికరాలు, మందులలభ్యత,బీపి అపరేటర్,ఆక్సిజన్, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఈఎంటి, పైలెట్లు నిత్యం 108 వాహనానికి అందుబాటులో ఉండే వచ్చిన ఎమర్జెన్సీ కాలనీ లిఫ్ట్ చేసి అతి త్వరలోనే రోగులను ప్రభుత్వ హాస్పటల్ కి చేరవేర్చే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 108 ఈఎంటి బట్టా.సుమలత, పుల్లయ్య, పైలెట్ గాడిపల్లి సాయి, సాంబశివరావు పాల్గొన్నారు.

.ప్రభుత్వ భూములు పరిరక్షించండి…

.ప్రభుత్వ భూములు పరిరక్షించండి
. కబ్జాలను తొలగించండి
.అమీన్పూర్ డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఈర్ల వెంకటేష్

నేటి ధాత్రి, పాటన్ చేరు :

కృష్ణారెడ్డిపేట 164 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో కబ్జాలు జరుగుతున్నాయి అంటూ పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని పటేల్ గూడా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈర్ల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు..సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట రెవెన్యూ సర్వేనెంబర్ 164 రెవిన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి. అని ప్రధానంగా మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ కబ్జాకు పాల్పడినట్టు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అమీన్పూర్ తహసిల్దార్ ఆర్డర్ నెంబరు బి /413/2023 ప్రకారం కబ్జాలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మౌనం వహిస్తున్నారు… ఇప్పటికైనా 164 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమాలను తొలగించి విలువైన ప్రభుత్వములను కాపాడాలని కబ్జాదారులపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని పటేల్ గూడా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈర్ల వెంకటేష్ అన్నారు ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల కోసం పాఠశాలలు ఆసుపత్రులు ఏర్పాటు కోసం కాకుండా బెల్ట్ షాపుల మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం ఎంతో బాధాకరమని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు బెల్ట్ షాపులకు ఇచ్చి అద్దె వసూలు చేస్తున్న ఘనత మాజీ ఎంపీపీ ఈర్ల దేవానందుదేనని,ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న వ్యక్తి ఈ రకమైన కబ్జాలకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించి ప్రభుత్వ భూములలో నిర్మాణాలను తక్షణమే తొలగించాలని కోరారు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను కలిసిన వడాయిగూడెం సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్..

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను కలిసిన వడాయిగూడెం సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్

యాదాద్రి నేటి ధాత్రి:

భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ శ్రీమతి నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్ గారు సోమవారం హైదరాబాద్‌లో శాసనమండలి సభ్యులు (MLC) శ్రీ తీన్మార్ మల్లన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని సర్వే నంబర్ 518 భూములకు సంబంధించిన వివాదాలపై ఆయనకు వినతి పత్రం సమర్పించారు.
*సర్వే నంబర్ 518లో కేవలం 20 ఎకరాల భూదాన్ భూమి ఉంటే,మొత్తం 467 ఎకరాలను నిషిద్ధ జాబితాలో పెట్టడం వల్ల రైతులు,సామాన్యులు పడుతున్న ఇబ్బందులను మల్లన్న గారికి వివరించారు.
*జనావాసాలు ఉన్న ప్రాంతాలను కూడా బ్లాక్ చేయడం వల్ల ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని,దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

*సర్పంచ్ వివరించిన సమస్యను సావధానంగా విన్న తీన్మార్ మల్లన్న గారు స్పందిస్తూ.. భూభారతి లోపాలు మరియు రెవెన్యూ అధికారుల పొరపాట్ల వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడటం అన్యాయమని,ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

*ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుక్కల దుర్గయ్య యాదవ్, ఉమ రమేష్, కోట దీప, కోట సుధాకర్, కోట సుధావాణి, గ్రామ నాయకులు బబ్బూరి సాగర్ గౌడ్, రాసాల రాజు యాదవ్, బొజ్జ సాంబేష్, నీల మనీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లిలో భూమి కబ్జాపై న్యాయం కోరిన యజమాని

నాకు ప్రాణ రక్షణ కల్పించి న్యాయం చేయండి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఒక వ్యక్తి మాకు న్యాయం చేయాలంటూ.ప్లడ్ కార్డులతో. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ .బటాయించాడు. సందర్భంగా.వేములవాడకు చెందిన .కొండబత్తిని సత్యం. అనే ఇతను గతంలో లక్ష్యం పూర్ గ్రామంలో.సర్వేనెంబర్. 1170. నెంబర్లో. సబ్ స్టేషన్ పక్కన మూడు ఎకరాల ల్యాండ్ నా పేరు మీద ఉన్నది దానికి 2015. జనవరి 26 వ. సంవత్సరంలో బోరు వేయించడం జరిగింది. బోరును. నడవకుండా ఖరాబు.చేయడంతో పాటు. నన్ను చంపుతానని భయ ప్రాంతాలకు గురి చేస్తూ నా భూమిని కబ్జా చేసుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు వారితో నాకు ప్రాణ భయం ఉన్నది దయచేసి సంబంధిత అధికారులు దీనిపై తగు విచారణ చేసి నాకు సంబంధించిన మూడు ఎకరాల భూమి నాకు ఇప్పించవలసిందిగా అధికారులు కోరుచున్నాను ఇట్టి విషయమై ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో చుట్టూ ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ బటాయించడం జరిగిందని. ఇందులో. గుర్రం అంజయ్య. ఆయన కుమారుడైన శ్రీనివాస్ రెడ్డి. నాకు సంబంధించిన భూమిని కబ్జా చేసుకుని నన్ను చంపుతానని బెదిరిస్తూ. నాకు సంబంధించినజాగను. నాకు కాకుండా బెదిరిస్తున్నారు వీరితో మాకు ప్రాణ భయం ఉన్నందున పోలీసులు అయినా రెవెన్యూ అధికారులైన సంబంధిత భూమిపై విచారణ చేపట్టి అర్హులైన మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము

దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి…

దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి

– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

హనుమకొండ:నేటిధాత్రి

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న తమ భూమిలోకి బాట లేదని వెళ్లనివ్వకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన బొక్క తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు . తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 133 ఏ, 133 బి, 148b2, 148సి/1/1/3 సర్వే నెంబర్లలో మొత్తం మూడు ఎకరాల రెండు గుంటల భూమి ఉండగా గత 45 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నామని కానీ గత కొంతకాలంగా తమ భూమి లోకి వెళ్లకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. ఇదే విషయంపై గతంలోనే జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయగా ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్ కు రిఫర్ చేసిందని దానితో స్థానిక ఆర్డిఓ తహసిల్దార్ విచారణ చేసి గతంలో లాగానే వ్యవసాయ పనుల నిమిత్తం మోహన్ రెడ్డి భూమి నుండి తమ భూమి లోకి వెళ్లే విధంగా తీర్పు ఇచ్చారని దానికి మోహన్ రెడ్డి సైతం ఒప్పుకున్నాడని అన్నారు. ఆ తర్వాత మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తూ వ్యవసాయ పనులకు తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని అన్నారు. గతంలో తమను తీవ్రంగా కులం పేరుతో దూషించడంతో పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని దానిని ఇప్పుడు ఉపసంహరించుకోమని తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు.దీని పూర్తి వివరాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి

– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు

హనుమకొండ:నేటిధాత్రి

 

తమపై దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ గుండ్ల సింగార నికి చెందిన బౌతు అన్నపూర్ణ సోమవారం ప్రజావాణిలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అన్నపూర్ణ తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ గుండ్ల సింగారం సర్వే నెంబర్ 175 లోని ప్లాట్ నెంబర్ 22ను తమ 2017లో కటకం కవిత దగ్గర కొనుగోలు చేసి దానిలో ఇల్లు నిర్మించుకున్నామని దాని పక్కనే ఉన్న ఫ్లాట్ నెంబర్ 26 ఖాళీగా ఉండేది దానిని ధార సీత కొనుగోలు చేసి అప్పటి నుండి తన కొనుగోలు చేసిన స్థలంలోని కొంత భాగం తమ ఇంటి లోపల ఉంది అని దౌర్జన్యం చేస్తూ గొడవకు దిగుతుందని ఆరోపించారు. ఇదే విషయమై గతంలో తహసిల్దార్ కు ఫిర్యాదు చేయగా వారు వచ్చి సర్వే చేసి హద్దులు నిర్ణయించారని కానీ హద్దులు కరెక్ట్ కాదు అని మళ్లీ తమ పహారి గోడను కూలగొట్టి తమ ఇంటి లోపల పిల్లర్ వేసిందని అన్నారు. తాము భయభ్రాంతులకు గురై డయల్ 100కు కాల్ చేయగా పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వినకుండా తమపై బెదిరింపులకు దిగుతుందని అన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న మహిళపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.

సబ్ రిజిస్టర్, మున్సిపల్ కమిషనర్ పై కేసు నమోదు

 

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-24T140312.793.wav?_=1

సబ్ రిజిస్టర్, మున్సిపల్ కమిషనర్ పై కేసు నమోదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గతంలో భూ వివాదంలో నిబంధనలు పాటించకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి సబ్ రిజిస్టర్ అబ్దుల్ హఫీజ్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు లపై కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ బుధవారం తెలిపారు. 2018లో హైదరాబాద్ కు చెందిన వినోబా స్థానికులు నరసింహారెడ్డి, వేణు గోపాల్ తో కలిసి ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. తనను మోసం చేశారని భూ యజమాని ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

పోర్జరీ సంతకాలతొ నా ఇల్లును జూనియర్ అసిస్టెంట్ కబ్జా….

పోర్జరీ సంతకాలతొ నా ఇల్లును జూనియర్ అసిస్టెంట్ కబ్జా.

రెవెన్యూ ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని భాదితుడు రాజగట్టు డిమాండ్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి కారల్ మర్క్స్ కాలనీ లో తనకు ఉన్న 350 గజాలు,అందులో ఉన్న పెంకుటిల్లును మొగుళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ వేమా లక్ష్మణ్ పోర్జరీ సంతకాలతో మున్సిపాలిటీలో నమోదు చేసుకున్నాడని మూగ.రాజాగట్టు అనే బాధితుడు విలేకరుల సమావేశంలో తెలిపాడు.ఈ విషయంగా జిల్లా కలెక్టర్,మున్సిపల్ కమిషనర్ కు ఆదరాలతో ఎన్నిసార్లు పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.అంతేకాక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.అదే అదే విధంగా తాను 2000 సంవత్సరంలో భూపాలపల్లికి చెందిన వెలిశెట్టి రాజయ్య తనకు శేఖర్ వద్ద నుండి అట్టి ఇల్లును భూమిని కొని ఇచ్చాడని పేర్కొన్నారు.ఆ క్రమంలో స్టాంపు కాగితంతో పాటు వెలిశెట్టి రాజయ్య,ముద్ధసాని రాజయ్య,చిలకని నరసింగములు సాక్షులుగా ఉన్నారు.2000- 2004 వరకు ఆ ఇంటిలో నివాసం ఉండి తన పేరు మీద గ్రామపంచాయతీ నెంబర్,నల్లాను తీసుకున్నట్లు పేర్కొన్నారు.అనంతరం తనకు బంధువుగా ఉన్న లక్ష్మణ్ వద్ద కొంత అప్పుగా తీసుకున్నానని,ఆ తర్వాత వడ్డీతో సహా చెల్లించడం జరిగిందాన్నారు.ఆదేవిధంగా 2004 నుండి తాను ఆర్టీసీ లో ఉద్యోగ రీత్యా మంధని లో సిగేసుకుంటున్నాను.ఆలాగే సదరు ఉద్యోగి భూపాలపల్లి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తన పలుకుబడితో మున్సిపల్ కార్యాలయంలో నా ఇల్లు ను విక్రయించినట్లు దొంగ కాగితాలు సృష్టించి మున్సిపల్ లో ఆన్లైన్లో ఇంటిని చేర్చుకున్నాడని వాపోయారు.ఈ విషయంగా పలుమార్లు లక్ష్మణ్ తో మాట్లాడితే నీకు ఇల్లు ఎక్కడిది అది నాదే అంటూ నా పైనే కేసులు పెట్టుదు భయాందోళనకు గురి చేశాడని అన్నారు.తప్పుడు పత్రాలతో నా ఇంటిని కబ్జా చేసిన రెవెన్యూ ఉద్యోగి లక్ష్మణ్ పై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని,నాకు తగిన న్యాయం చేయాలని బాధితుడు రాజగట్టు డిమాండ్ చేశారు.తమ సంతకాలను ఫోర్జరీ చేశాడు.భూపాలపల్లి కారల్మార్క్స్ కాలనీలో రాజగట్టు కు చెందిన ఇల్లు విక్రయంలో ఉన్న తమ సంతకాలను రెవెన్యూ ఉద్యోగి వేమ లక్ష్మణ్ ఫోర్జరీ చేశారని సాక్షులు ముద్దసాని రాజయ్య వెలిశెట్టి రాజయ్య చిలుకాని నర్సింగంలు పేర్కొన్నారు.భూపాలపల్లి లో శేఖర్ అయ్యర్ నుండి 2000 సంవత్సరంలో రాజకట్టు అతనికి తాను ఇంటిని స్థలమును కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందని సాక్షులు వెలిశెట్టి.రాజయ్య పేర్కొన్నారు.2000 సంవత్సరం నుండి తన ఇంటిలో ఉంటూ గ్రామపంచాయతీ ఇంటి నెంబర్ తో పాటు నల్లని తీసుకున్నాడు.రెవెన్యూ శాఖలో పనిచేసే వేమా లక్ష్మణ్ కావాలని తమ సంతకాలను పూజలు చేసి విక్రయించినట్లు మున్సిపల్ కార్యాలయంలో అధికారుల అండదండలతో తన పేరుపైన ఇల్లు చేసుకోవడం అన్యాయమని అన్నారు. అక్రమంగా తాము లేకున్నా సాక్షులుగా తమ పేర్లను పూజలు చేసిన రెవెన్యూ ఉద్యోగిపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సాక్షులు తెలిపారు.ఈ విషయంలో ఎలాంటి తాత్సారం చేయకుండా వెంటనే బాధితుడి రాజగట్టుకు న్యాయం చేయాలని వారిని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 భూ వివాదం.. తుపాకీతో కాల్చి పారేస్తామని బెదిరింపు…

 భూ వివాదం.. తుపాకీతో కాల్చి పారేస్తామని బెదిరింపు

 

భూ వివాదంలో తుపాకీ కలకలం సృష్టించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి.

మెదక్, నవంబర్ 6: భూ వివాదంలో తుపాకీ కలకలం సృష్టించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూ వివాదంపై మెదక్ జిల్లా కోర్టు నుంచి సిద్దమ్మ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యర్ధులు.. గ్రామ శివారులోని పొలం వద్ద సిద్దమ్మ సహా ఆమె కుటుంబీకులను తుపాకీతో బెదిరించారు. భూమి వద్దకు వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానంటూ బెదురింపులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తమను బెదిరించారని, కాల్చేస్తామంటూ బయపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉర్సు దర్గా ప్రాంతంలో పూలే విగ్రహ స్థలం కబ్జా ప్రయత్నం?

ఉర్సు దర్గా ప్రాంతంలో పూలే విగ్రహ స్థలం కబ్జా ప్రయత్నం?

పూలే విగ్రహ స్థలంలో వెలసిన డబ్బా..! కబ్జాదారుడికి వెనకున్న “హస్తం” ఎవరిది..?

బీసీ వర్గాల నాయకుడి విగ్రహ స్థలాన్ని కబ్జా చేయడం సమంజసమా?

నేటిధాత్రి, వరంగల్.

 

ఉర్సు దర్గా ప్రాంతంలో జ్యోతిబా పూలే దంపతుల కాంస్య విగ్రహాల నిర్మాణం జరగాల్సిన స్థలం వివాదాస్పదంగా మారింది.

ఈ విగ్రహ నిర్మాణం కోసం సిమెంట్ బ్రిక్స్, అవసరమైన సామాగ్రి ఇప్పటికే సిద్ధంగా ఉండగా, రాత్రికి రాత్రే ఆ స్థలంలో “ఓ వర్గానికి” చెందిన వ్యక్తి డబ్బా కొట్టు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.

గతంలో ఇక్కడ ఉన్న విగ్రహం కూలగొట్టిన దుండగుడు. అదే స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి మాజీ ఎమ్మెల్యే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే విగ్రహ నిర్మాణ ప్రణాళికకు ఈ చర్య పెద్ద ఆటంకం కలిగించే అవకాశముంది.

ఈ ఘటనపై స్థానిక బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “సామాజికవాద పితామహుడు జ్యోతిబా పూలే జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలాన్ని కబ్జా చేయడం సిగ్గుచేటు చర్య”గా పేర్కొన్నాయి.

విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి.

ఇక మున్సిపల్ అధికారులు, స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

స్థలం కబ్జా ప్రయత్నం మధ్య పూలే విగ్రహ నిర్మాణం కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

భూ కబ్జా దారుల నుండి ప్రభుత్వ భూమిని రక్షించాలి…

భూ కబ్జా దారుల నుండి ప్రభుత్వ భూమిని రక్షించాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

ములుగు జిల్లా కేంద్రంలో ఈ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని 124/1/ఎ గల ప్రభుత్వ భూమిలో కొంతమంది భూ అక్రమన దారులు 50 ఎకరాలు అక్రమంగా స్వాధీనం చేసుకుని కబ్జా చేసుకోవడం జరిగింది. ఇట్టి భూమిపై తక్షణమే విచారణ జరిపి కాస్తు కబ్జాలో ఉన్న పేదలకు రక్షణ కల్పించాలని కలెక్టర్ గారికి రైతులతో కలిసి వినతిపత్రం కూడా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ భూమిపై అనేకమంది పేద ప్రజలు 1966 నుండి కాస్తులో ఉన్నప్పటికీ వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వారిని భూమ్మీదకి రానివ్వకుండా భూకబ్జాకీ పాల్పడడం జరిగింది. ప్రభుత్వ భూమిని ఇద్దరు వ్యక్తులు 50 ఎకరాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరేగాక ప్రభుత్వ భూమిలో ఆ ప్రాంతంలో అనేకమంది ధనిక రైతులు భూకబ్జా కీ పాల్పడడం జరిగింది .కావున ఇట్టి భూములపై విచారణ జరిపించి ఇట్టి విషయంపై రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .లేనియెడల ప్రత్యక్ష పోరాటాలకు దిగి పేద ప్రజలతో భూఆక్రమణ చేస్తామని హెచ్చరించడం జరిగింది .గతంలో ఈ భూమి విషయంలో తగాదా గొడవ అయితే పోలీసు వారు ఎమ్మార్వో ఆఫీస్ లోఇరు పక్షాలను బైండోవర్ చేయగా ఇరుపక్షాలను ఆరు నెలల పాటు భూమి మీదకు వెళ్ళవద్దని వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పగా పేదలూ భూమ్మీదకి వెళ్లలేదు కానీ ధనిక రైతులు మాత్రం దర్జాగా భూమి మీదకు వెళ్లి కాస్తూ చేసుకుంటూ పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇట్టి విషయంపై ధనిక రైతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు పొదిల చిట్టిబాబు మండల కమిటీ సభ్యుడు కన్నోజు సదానందం మరియు రైతులు వెంకటస్వామి, రమేష్ ,నలిని రజిని హరీష్ సుభద్ర అన్నం రెడ్డి పాల్గొనడం జరిగింద

భూమి ఆక్రమించిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-27T122302.544.wav?_=2

 

భూమి ఆక్రమించిన
వారిపై చర్యలు తీసుకోవాలి

పోలీస్ అధికారులు చర్య తీసుకోవాలి

భూపాలపల్లి నేటిధాత్రి

భూమిని ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు శెట్టి మోహన్, కొయిడ ఎల్లయ్య, వెంకటేశ్, రాజారాం, కోటీశ్వరమూర్తి, శరత్ బాబు కోరారు. కాకతీయ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్లవేడు గ్రామానికి చెందిన మందాల రవీందర్ రెడ్డి వద్ద 146/2 సర్వే నంబర్ లోని ఎకరం భూమిని కొనుగోలు చేశామని, అదే భూమిని రవీందర్ రెడ్డి తిరిగి వేరేవారికి రిజిస్ట్రేషన్ చేశారన్నారు. చాలా ఏండ్లుగా ఇబ్బందిపడిన తాము ఆ భూమిని అమ్మడానికి సిద్ధపడగా ఆ భూమిని తాము కొన్నామని కొంత మంది ఎస్సీలు చెప్పడమే కాకుండా అందులో వారు డబ్బా ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయంపై భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ డ్యాక్యుమెంట్స్ని తీసుకొని తహసీల్దార్కు పంపించారని చెప్పారు. తహసీల్దార్ విచారణ జరిపి ఎస్సీల డ్యాక్యుమెంట్స్ ఫేక్ అని సీఐకి నివేదిక ఇచ్చారని, వెంటనే సీఐ వారిని పిలిచి డబ్బా తీయమని చెప్పారన్నారు. కానీ, వారు డబ్బా తీయక పోగా తాము చాలా ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన డబ్బాను జేసీబీతో కూల్చివేశారన్నారు. ఈ విషయంపై కేసు పెట్టి నాలుగు రోజుల నుంచి తీరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వారు కోరారు.

భూమి ఇప్పించాలని ఎమ్మెల్యేకు అభ్యర్థన….

భూమి ఇప్పించాలని ఎమ్మెల్యేకు అభ్యర్థన.

బాలానగర్ / నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడ జానంపేట గ్రామ రెవెన్యూ శివారులో ఎస్.ఆర్. పి కంపెనీ తమ భూమిని ఆక్రమించారని బాధిత రైతులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87 లో 3.14 గుంటల భూమిని ఓ కంపెనీ అక్రమంగా ఆక్రమించి, తమ భూమిని ఎందుకు ఆక్రమించారని అడిగితే తమపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.

ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T121752.081.wav?_=3

 

ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం

నేటిధాత్రి, ఏనుమాముల

 

ఏనుమాముల మణికంఠ కాలనీలో భూవివాదం తీవ్రరూపం దాల్చింది. తమ స్థలానికి గోడ కట్టగా, దానిని కొంతమంది అన్యాయంగా కూల్చివేశారని భూ యజమాని చంద్రకళ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోకుండా, దౌర్జన్యం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. తోట చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్ 189/బి మణికంఠ కాలనీ రోడ్డు 4లో తాము 2008 వ సంవత్సరంలో శ్రీనివాస్ వద్ద కొనుగోలు చేశామని, ఇట్టి జాగపై వేరే వ్యక్తులతో తగాదా ఏర్పడటం వలన 2011వ సంవత్సరంలో కోర్టులో కేసు వేసినట్లు తెలిపారు.. కోర్టు తీర్పు 2018 లో తమకు అనుకూలంగా వచ్చిందని, వెంటనే చుట్టూ ప్రహరీ గోడ కట్టుకున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళు జాగా మీధకు రాగా, అప్పుడు ఉన్న సిఐ రాఘవేంద్రరావు ఇరువురి సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఆ భూమి తమదేనని నిర్ధారించినట్లు చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుతం కొందరు భూ ఆక్రమణదారులు, ఓడిపోయిన వారి వద్ద నుండి అగ్రిమెంట్ పెట్టుకొని పది రోజుల క్రితం మా గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు అని అన్నారు. ఈ నెల 7వ తేదీన గోడను కూల్చిన వారిపై కేసు నమోదు చేయాలని ఏనుమాముల పోలీసు స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన కూడా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాదితులు ఈ వివాదంపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి తాళం…

జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి తాళం

◆- ఐడీఎస్ఎంటీ బాధితుల నిరసన

◆- మాజీ వైస్ చైర్మన్, మహిళకు అస్వస్థత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్:ఐడీఎస్ఎంటీ కాలనీ ఇళ్ళ స్థలాలు, ఇళ్ల బాధితులు ఇవాళ జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు ఎండీ తంజిం, నామ రవి కిరణ్ ఆధ్వర్యంలో బాధితులు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి బైటాయించారు. మున్సిపల్ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. గేటు ముందు నుం చి పక్కకు తప్పుకుని నిరసన తెలపాలని సీఐ సూచించినప్పటికీ వారు అంగీకరించకపోవ డంతో బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా చోటు చేసుకు న్న తోపులాటలో మాజీ వైస్ చైర్మన్ తంజిం, ఓ మహిళ సహా స్పృహ తప్పి పడిపోయింది. తమ ఇళ్లు, స్థలాల ప్రైవేటు వ్యక్తులు లాగేసుకున్న వి షయాన్ని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

భూ తగాదాలో వ్యక్తిపై దాడి… తీవ్ర గాయాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T110750.919.wav?_=4

 

 

భూ తగాదాలో వ్యక్తిపై దాడి… తీవ్ర గాయాలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన చందాసంధ్య మరియు చంద ప్రశాంత్ గత నాలుగు సంవత్స రాల నుండి ఇంటి స్థలం విష యంలో గొడవలు జరుగు తున్నాయి ఈ విషయంలో పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసుకొని వారు చెప్పిన విధంగా విన్న కూడా వారు మాపై తరచూ గొడవలు పడుతూ మమ్మల్ని ఎప్పటి కైనా చంపేస్తామని బెదిరిస్తు న్నారు.ఇదే క్రమంలో నా భర్త సుధాకర్ ను మరియు నన్ను చంపాలని ఉద్దేశంతో వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చందా ప్రశాంత్ అతని తల్లి చంద విజయ అతని అక్క ఆకుతోట జ్యోతి అతని భావ ఆకుతోట పూర్ణచందర్ అతని మేనమామ చింతపట్ల రాజు కిట్టు మా ఇంటికి వచ్చి గొడ్డలి, రాడు, కర్రలు పట్టుకొని వచ్చి నా భర్త మా ఇంటి ముందు ఉండగా చంపుతా అంటూ ఒక్కసారిగా నా భర్త పై దాడి చేశారు. వెంటనే నా భర్త అరువగా బయటకు వచ్చి నేను చూసేసరికి చందా ప్రశాం త్ గొడ్డలితో నా భర్త తలపై గొడ్డలి కాటు, ఆకుతోట జ్యోతి ఇనుపరాడుతో మిగతావారు కర్రలతో కొట్టడం జరిగింది వెంటనే నేను నా భర్తను కొట్ట వద్దని అడ్డు వెళ్లాగా వారు నన్ను చేతులతో కొట్టారు.ఇట్టి గొడవను చూసిన నేను చుట్టు పక్కల వారైనా నరసయ్య, కోటయ్య, సత్యనారాయణ వచ్చి కొట్ట వద్దని ఆపబోతే వారిని అడ్డువస్తే చంపుతా మంటూ బెదిరించి వెళ్లిపో యారు వాళ్లు గాయపరచగా నా భర్తకు తలకు నాలుగు ఐదు చోట్ల రక్త గాయాలైనాయి మరియు కుడికాలు బలంగా గాయంతో అయినవి చుట్టుప క్కల వారి సహాయంతో నేను 108 లో చికిత్స కోసం వరంగ ల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్ళి నాని అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం శ్రీనివా స్ ఆసుపత్రి తీసుకుని వెళ్లాను ప్రస్తుతం నా భర్త చికిత్స పొందుతూ ప్రాణాపాయస్థితి లో ఉన్నందున చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు

“ప్రభుత్వ భూమిని కాపాడాలని.. కలెక్టర్ కు ఫిర్యాదు”

“ప్రభుత్వ భూమిని కాపాడాలని.. కలెక్టర్ కు ఫిర్యాదు”

” అధికారులపై చర్యలు తీసుకోండి”

బాలానగర్ / నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామపంచాయతీ శివారు అయ్యప్ప స్వామి దేవాలయ ఆలయ సమీపంలోని సర్వేనెంబర్ 102, 105 ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ కి సంబంధించిన ఆర్చిని ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు వెంచర్ యజమానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సామాజిక సేవా కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Government Land

స్థానిక రెవిన్యూ అధికారులు వెంచర్ యాజమాన్యంతో కుమ్ముక్కై ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ఏం మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని కాపాడకుండా వెంచర్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ భూమిలో ఆర్చి నిర్మాణానికి సహకరించిన అధికారులపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి విలువ మార్కెట్ రేటు ఒక ఎకరం రూ.4 కోట్ల వరకు ఉంటుందని విలువైన భూమిని కాపాడడంలో విఫలమైన స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012వ సంవత్సరంలో హైదరాబాదులో నగరానికి 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో జాతీయ రహదారులకు రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరికి అసైన్మెంట్ చేయరాదన్న జీవోను జారీ చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్థానిక రెవిన్యూ అధికారులు విస్మరించి.. రికా వ్యాల్యూ వెంచర్ యజమానికి అనుకూలంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.

మామిడిగూడెం ఆదివాసులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-71-3.wav?_=5

 

మామిడిగూడెం ఆదివాసులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

ఐటీడీఏ పీవో కు వినతి పత్రం అందజేత

న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్

 

నేటిదాత్రి చర్ల

చర్ల మండలం మామీడిగూడెం చెందిన 50 కుటుంబాలు 1995 నుంచి సర్వేనెంబర్ 62 మరియు 65 లో సాగులో ఉన్నారు ఈ మధ్యకాలంలో దుమ్ముగూడెం కు చెందిన ఫారెస్ట్ అధికారులు అక్రమంగా భూమిలోకి వచ్చి ఆదివాసులను బెదిరించి పంటలు పీకినట్టుగా మొక్కలు తీసేసినట్టుగా కేసులు నమోదు చేశారు తక్షణమే వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆ భూములను ఆదివాసి ప్రజలకు పంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు చర్ల వచ్చిన భద్రాచలం ఐటిడిఏ పిఓ కు వినతిపత్రం అందించారు
అనంతరం న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ చర్ల మండలంలో ఆదివాసి ప్రజలకు హక్కులు ఉన్న భూమిలోకి పోయే పరిస్థితిని ఫారెస్ట్ వారు కల్పించడం లేదని సాగులో ఉన్న భూములను గుంజుకొని అమాయకులైన ఆదివాసులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం అని అన్నారు గతంలో కూడా ఫారెస్ట్ అధికారులకు గుర్తు చేశాం అయినా మామిడిగూడెం గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహిళలని అరెస్టు చేసి ఏడుగురుపై కేసు నమోదు చేసి ఒకరిని వదిలిపెట్టి ఇంకొక మహిళ ఎటుపోయారో తెలవని పరిస్థితిలో ఉన్నదని ఆచూకీ దొరకడం లేదని పిఓ కి గుర్తు చేశారు తక్షణమే ఆ మహిళ ఆచూకీ తెలపాలని సర్వేనెంబర్ 62 65 భూములు ఆదివాసి ప్రజలకు పంచాలని 1/70 యాక్టు ఏజెన్సీ చట్ట ప్రకారం ఇక్కడ ఆదివాసులని అధికారులు గానీ నియమించాలని ఇక్కడ ఫారెస్ట్ వారు సామాజిక వర్గాల తోటి అధికారం చలా ఇస్తున్నారని ఇది మానుకోవాలని వారన్నారు ఏ సామాజిక వర్గమైన పేద ప్రజలకు న్యాయం చేసేటట్టుగా చట్టాలకు అనుకూలంగా లోబడి పని చేయాలని వారు గుర్తు చేశారు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఇంకో మహిళ ఆచూకీ వెల్లడించాలని లేనిపక్షంలో దశల వారి ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా తెలియజేస్తున్నాం అని అన్నారు అనంతరం భద్రాచలం ఐ టి డి ఏ పి ఓ మాట్లాడుతూ ఈ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెల్లం రామకృష్ణ తెల్లం పెంటమ్మ కొమరం సమ్మయ్య చల్లం శ్రీను శ్యామల అరుణ తెల్లం వెంకటరమణ కొమరం రామక్క తదితరులు పాల్గొన్నారు

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-68-1.wav?_=6

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి ;

 

చిట్యాల మండల కేంద్రంలోని రామ్ నగeర్ కాలనికి చెందిన పర్లపెల్లి భద్రమ్మ అనారోగ్యంతో గత వారం రోజుల క్రితం మరణించగా భారతీయ జనతా పార్టీ చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి 50 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ మంచిగా మహేష్ పెరుంమండ్ల రాజు గజనాల రవీందర్ చింతల రాజేందర్ కేంసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version