రాష్ట్ర వాలీబాల్‌కు గంగాధర విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు గంగాధర విద్యార్థి ఎంపిక

గంగాధర, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి మంచి కట్ల నందకిషోర్ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బాబు శ్రీనివాస్ తెలిపారు.
ఈరాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఈనెల16 నుండి 18 వరకు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో జరుగుతాయని, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్17 బాలుర జట్టులో నందకిషోర్ అత్యంత ప్రతిభ కనబరిచి బాలుర ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికైయ్యాడని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.అనిత కుమారి, ఎంపీడీవో డి.రాము, ఎంఈఓ ఏనుగు ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు అభినందించారు.

జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జెడ్పిహెచ్ఎస్ రామాజీపేట్ విద్యార్థిని విద్యార్థులు

జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జెడ్పిహెచ్ఎస్ రామాజీపేట్ విద్యార్థిని విద్యార్థులు

 

రాయికల్ , అక్టోబర్ 6, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మండలం రామాజీపేట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీలలో ఈనెల 07 -10-2025 నుంచి 10-10-2025 వరుకు వాలీబాల్ కబడ్డీ ఖోఖో క్రీడా పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు గజ్జేల నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు లక్ష్మీకాంతం రమేష్ విజయ్ కుమార్ కిరణ్ రమ యశోద వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సీసీపీఎల్ క్రీడాకారులకు జేర్సీ లోయర్స్ పంపిణి.

సీసీపీఎల్ క్రీడాకారులకు జేర్సీ లోయర్స్ పంపిణి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చిట్యాల మండలం లోని చల్లగరిగ లో నిర్వహిస్తున్న సి సి పి ఎల్ 02 క్రీడాకారుల కు పవర్ స్టార్ టీం కి జెర్సీ మరియు లోయర్ స్పాన్సర్ చేసిన వాణివిద్యా నికేతన్ కరస్పాండెంట్ బండి సంపత్ కుమార్,ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు.

16, 17 తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు…

జహీరాబాద్: 16, 17 తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 16, 17 తేదీల్లో కబడ్డీ జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్టిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. అండర్-14, 17 విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు జరుగుతాయి. పూర్తి వివరాలకు 99891 63793, 99892 18299 నెంబర్లను సంప్రదించవచ్చు.

భూపాలపల్లిలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా…

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐ డి ఓ సి మీటింగ్ హాల్ నందు నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఎమ్మెల్యే మేజర్ ధ్యాన్చంద్ ఫోటో ఫ్రేమ్ కి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత జాతీయ క్రీడ దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో గత సంవత్సరం సీఎం కప్ 2024 లో రాష్ట్రస్థాయి పోటీలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ పి అశోక్ కుమార్ ఎల్ విజయలక్ష్మి చేతుల మీదుగా మెంటోస్ నీ బహూకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎం రాజేందర్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ డి ఆర్ డి ఓ జి ఎం ఇండస్ట్రీస్ , జిల్లా స్థాయి అధికారులు, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఎల్ జైపాల్ క్రీడాకారులు, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ లు, పాత్రికేయులు, కే లో ఇండియా కోచ్ శ్రీనివాస్ , విధ్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ, రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-80-1.wav?_=1

కబడ్డీ,రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు

నర్సంపేట,నేటిధాత్రి:

జాతీయ క్రీడా దినోత్సవం ఉత్సవాలలో భాగంగా కలెక్టర్,క్రీడాశాఖ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా యువజన క్రీడల అధికారిని టీవీఏల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియం లో సోమవారం కబడ్డీ రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్జిఎఫ్ఐ సెక్రెటరీ సోనబోయిన సారంగపాణి,రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, నర్సంపేట జోన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గండి నర్సయ్య గౌడ్,సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు నర్సంపేట మండల కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుల్లూరి స్వామి గౌడ్,డాక్టర్ సాదిక్, కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విజ్ డమ్ విద్యార్థుల ఎంపిక.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విజ్ డమ్ విద్యార్థుల ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

ఇంటర్నేషనల్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ లోని ఓసిటీ గ్రౌండ్ లో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో విజ్ డమ్ విద్యార్థులు ప్రతిభను కనబరచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. ఈనెల 20, 21న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురుకుల విద్యాపీట్ హై స్కూల్ జరిగే పోటీలలో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎ. చందన, 9వ తరగతికి చెందిన బి. రాంప్రసాద్ పాల్గొననున్నారు.రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరచి జాతీయ స్థాయిలో రాణించడం తమ లక్ష్యమని విద్యార్థులు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభను కనబరచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇంచార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ ఫహీం సుల్తాన, కోచ్ రాజేష్, మధు, ప్రశాంత్ కుమార్, రియాజ్ లతో పాటు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

ఆసియా కప్ 2025: ఓపెనర్‌గా గిల్, సందేహంలో శాంసన్ స్థానం..

ఆసియా కప్ 2025 భారత జట్టు ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి.
సంజు శాంసన్ ఇటీవల తన 12 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు చేసినప్పటికీ, ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌కు అవకాశమివ్వాలనే ఆలోచన జట్టులో చర్చనీయాంశమైంది.

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో గిల్ ప్రదర్శన టీ20 జట్టులో అతని స్థానం కోసం డిమాండ్ పెంచింది. దీంతో శాంసన్ మిడిల్ ఆర్డర్‌కు నెట్టబడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ – “గిల్ ఆడితే, ఎవరిని జట్టులోంచి తొలగిస్తారు? శాంసన్ అయితే, వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు? మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు. శాంసన్ నంబర్ 5లో ఆడతాడా?” అని ప్రశ్నించారు.

అభిషేక్ శర్మ కూడా ఓపెనర్‌గా బలమైన ప్రత్యామ్నాయమని ఆయన సూచించారు. ఇంగ్లాండ్‌పై 279 పరుగులు 219.68 స్ట్రైక్ రేట్‌తో సాధించిన అభిషేక్, ఈసారి జట్టులో చోటు దక్కించుకోవచ్చని అంచనా.

ఆసియా కప్ 2025: భారత్–పాక్ పోరుపైనే ఆసక్తి..

2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఎఇలోని దుబాయ్, అబుదాబిలలో జరగనుంది. ఇది ఆసియా కప్ 17వ ఎడిషన్. ఈసారి టోర్నమెంట్‌ T20 ఫార్మాట్‌లో జరుగుతోంది.

ఆసియా కప్‌ను తొలిసారి 1984లో ప్రారంభించారు. ఇప్పటివరకు భారత్ 8 సార్లు, శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. బంగ్లాదేశ్ మూడు సార్లు ఫైనల్ చేరినా, ఇంకా ట్రోఫీని దక్కించుకోలేదు.

ఈ సారి 8 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. సెప్టెంబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ – హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. defending champions భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యుఎఇతో ఆడనుంది.

అత్యంత ఆసక్తికరంగా, భారత్ – పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. కాబట్టి లీగ్ దశలో ఒక మ్యాచ్, సూపర్ ఫోర్‌కు చేరితే మరో మ్యాచ్, ఫైనల్‌కు చేరుకుంటే మూడోసారి ఒకరినొకరు ఎదుర్కొనే అవకాశముంది. అంటే అభిమానులకు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మూడు ఉత్కంఠభరిత పోరాటాలు దక్కవచ్చు.

వెస్టిండీస్‌ పరాజయంపై బసిత్ అలీ తీవ్ర వ్యాఖ్యలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-35-3.wav?_=2

వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ జట్టు 202 పరుగుల తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో, మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆయన, రాబోయే ఆసియా కప్‌లో భారత్‌తో ఆడకపోవడమే మంచిదని సూచించారు. “భారత్ ఆడితే అంత చెడ్డగా ఓడిస్తారు, ఊహించలేరు” అని ఆయన వ్యాఖ్యానించారు.
మూడో ODIలో జయ్డెన్ సీల్స్ దారుణ బౌలింగ్‌తో పాకిస్తాన్ టాప్ ఆర్డర్‌ను కూల్చి 6/18 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ మొత్తం 92 పరుగులకే కుప్పకూలింది. బసిత్ అలీ మాట్లాడుతూ, “ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌కూ తలపడలేని స్థితిలో ఉంది. కానీ భారత్‌తో ఓడితే దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది” అన్నారు.
ఆసియా కప్‌ ఈసారి T20 ఫార్మాట్‌లో జరగనుందని, ఆ ఫార్మాట్‌లో పాకిస్తాన్ ప్రదర్శన కొంత మెరుగుగా ఉన్నప్పటికీ, భారత్‌ను ఎదుర్కోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అర్జున్‌ రెండో విజయం..

అర్జున్‌ రెండో విజయం

స్టార్‌ ఆటగాడు అర్జున్‌ ఇరిగేసి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. మాస్టర్స్‌ కేటగిరిలో తొలిరౌండ్‌ గెలిచి, రెండో రౌండ్‌ను డ్రాగా ముగించిన ఈ తెలుగు గ్రాండ్‌మాస్టర్‌.. శనివారం జరిగిన మూడో రౌండ్లో విజయం…

చెన్నై గ్రాండ్‌ మాస్టర్స్‌ చెస్‌

చెన్నై: స్టార్‌ ఆటగాడు అర్జున్‌ ఇరిగేసి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. మాస్టర్స్‌ కేటగిరిలో తొలిరౌండ్‌ గెలిచి, రెండో రౌండ్‌ను డ్రాగా ముగించిన ఈ తెలుగు గ్రాండ్‌మాస్టర్‌.. శనివారం జరిగిన మూడో రౌండ్లో విజయం సాధించాడు. ఈ రౌండ్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ రే రాబ్సన్‌ను ఓడించాడు. మూడు రౌండ్ల అనంతరం అర్జున్‌ 2.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్‌ కొట్టిన జర్మనీ నెంబర్‌వన్‌ విన్సెంట్‌ కేమర్‌ 3 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. మిగతా ఆటగాళ్లలో అనీష్‌ గిరి (1.5)తో గేమ్‌ను ప్రణవ్‌ (1) డ్రా చేసుకోగా, నిహాల్‌ సరీన్‌ (0.5)పై విదిత్‌ గుజరాతీ (1.5) గెలిచాడు. చాలెంజర్స్‌ కేటగిరి మూడో రౌండ్లో అధిబన్‌తో గేమ్‌ను ద్రోణవల్లి హారిక డ్రాగా ముగించగా, ల్యూక్‌ మెన్‌డోన్సా చేతిలో వైశాలి ఓటమిపాలైంది. వైశాలి (1) ఏడు, హారిక (0.5) తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.

కివీలు కుమ్మేశారు…

కివీలు కుమ్మేశారు

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు తమ టెస్టు చరిత్రలోనే అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వేతో శనివారం మూడో రోజే ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 359 పరుగుల తేడాతో కివీస్‌ ఘనవిజయం సాధించింది. దీంతో…

అరంగేట్ర పేసర్‌ జకారికి ఐదు వికెట్లు ఫ 2-0తో క్లీన్‌స్వీ్‌ప

బులవాయో: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు తమ టెస్టు చరిత్రలోనే అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వేతో శనివారం మూడో రోజే ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 359 పరుగుల తేడాతో కివీస్‌ ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీ్‌సను కివీస్‌ 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. అంతేకాకుండా ఓవరాల్‌ టెస్టు చరిత్రలోనూ ఇది మూడో భారీ విజయం కావడం విశేషం. కివీస్‌ జట్టులో 23 ఏళ్ల అరంగేట్ర పేసర్‌ జకారి ఫౌల్కెస్‌ సంచలన ప్రదర్శనతో (5/37) అబ్బురపరిచాడు. ఫలితంగా జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే కుప్పకూలింది. నిక్‌ వెల్చ్‌ (47 నాటౌట్‌), కెప్టెన్‌ ఇర్విన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హెన్రీ, డఫీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కాన్వే, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా హెన్రీ నిలిచారు.

 

తొలి సెషన్‌లోనే..: ఓవర్‌నైట్‌ స్కోరు 601/3 పరుగుల వద్దే కివీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంతో ఆ జట్టుకు 476 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇక శనివారం ఉదయమే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే తొలి సెషన్‌లోనే కుప్పకూలింది. పేసర్ల ధాటికి కేవలం 28.1 ఓవర్లే ఆడింది. ఓపెనర్‌ బెన్నెట్‌ను ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మూడో బంతికే పేసర్‌ హెన్రీ డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత డఫీ, ఫిషర్‌ల ధాటికి జింబాబ్వే 49/4 స్కోరుతో నిలిచింది. ఇక 16వ ఓవర్‌ నుంచి వరుస విరామాల్లో ఐదు వికెట్లను పడగొట్టిన పేసర్‌ జకారి మిడిలార్డర్‌తో పాటు టెయిలెండర్ల భరతం పట్టాడు.

సంక్షిప్త స్కోర్లు

జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌: 125

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 601/3 డిక్లేర్‌;

జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌: 28.1 ఓవర్లలో 117 ఆలౌట్‌ (వెల్చ్‌ 47 నాటౌట్‌, ఇర్విన్‌ 17; ఫౌల్కెస్‌ 5/37, హెన్రీ 2/16, డఫీ 2/28).

టెస్టు క్రికెట్‌లో భారీ విజయాలు

ఇన్నింగ్స్‌ 579 రన్స్‌తో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌

ఇన్నింగ్స్‌ 360 రన్స్‌తో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా

ఇన్నింగ్స్‌ 359 రన్స్‌తో జింబాబ్వేపై న్యూజిలాండ్‌

ఇన్నింగ్స్‌ 336 రన్స్‌తో భారత్‌పై వెస్టిండీస్‌

యువత మొబైల్ వీడి క్రీడల్లో పాల్గొనాలి నర్సంపేట టౌన్ సిఐ రఘుపతిరెడ్డి

యువత మొబైల్ వీడి క్రీడల్లో పాల్గొనాలి

నర్సంపేట టౌన్ సిఐ రఘుపతిరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

సోషల్ మీడియాలో చెడుకు,ఇతర వ్యసనాలకు బానిసగా సెల్ ఫోన్ ద్వారా ప్రభావితం అవుతున్న యువత సెల్ ఫోన్లు వీడి క్రీడల్లో పాల్గొని మానసికంగా శారీరకంగా అభివృద్ధి చెందాలని నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతిరెడ్డి పిలుపునిచ్చారు.నర్సంపేట మండలంలోని రాజపల్లి గ్రామంలో ఖో ఖో,వాలీబాల్ కోర్ట్ లను టౌన్ సిఐ రఘుపతిరెడ్డి స్థానిక ఎస్సై అరుణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత ,పిల్లలు మొబైల్ వీడాలి – క్రీడలు ఆడాలి అను నినాదం గ్రామాల్లోని యువతకు మార్గనిర్దేశం అని పేర్కొన్నారు.మాజీ ప్రజా ప్రతినిధులు,అధికారులు,యువకులు పాల్గొన్నారు.

యంగ్ స్టార్ ఫుట్ బాల్ క్లబ్ జహీరాబాద్ వారు నిర్వహించిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T160041.770.wav?_=3

యంగ్ స్టార్ ఫుట్ బాల్ క్లబ్ జహీరాబాద్ వారు నిర్వహించిన ఫుట్ బాల్ ఛాలెంజ్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొన్నా

◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా||ఎ. చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ నాయక్ పవార్ మరియు యంగ్ స్టార్ క్లబ్ వారు నిర్వహించిన ఫుట్ బాల్ ఛాలెంజ్ ట్రోఫీ లో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ క్రీడాలు మానసిక ఉల్లాసన్ని పెంపొదిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రీడాలకు ప్రధాన్యత ఇవ్వాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి,ఎ.యం.సి.డైరెక్టర్ వంశీ,కాంగ్రెస్ నాయకులు హుగ్గెలి.రాములు, ఖాజా మియా, మూర్జల్,శ్రీనివాస్
నాయక్,సోహైల్,అయూబ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు..

క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*క్రీడ‌ల అభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి..

*అమరావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న‌..

*ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్ ప్రారంభోత్స‌వంలో శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T133904.551.wav?_=4

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 30:

ఆనాడైనా ఈనాడైనా క్రీడ‌ల అభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్నార‌ని, ఆయ‌న నేతృత్వంలో క్రీడ‌ల బ‌లోపేతానికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు అన్నారు. తిరుప‌తిలోని శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చిత్తూరు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ నిర్వ‌హిస్తున్న ఏపీ స్టేట్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌-2025(సీనియ‌ర్ మెన్ అండ్ ఉమెన్‌) పోటీల‌ను మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మతో
ఆయ‌న కలిసి ప్రారంభించారుతొలుత ప‌లు జిల్లాల నుంచి వ‌చ్చిన క్రీడాకారుల‌ను ప‌రిచ‌యం చేసుకుని వారితో బ్యాడ్మింట‌న్ ఆడి పోటీల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్రారంభోత్స‌వ స‌భ‌లో క్రీడాకారుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. సీఎం చంద్ర‌బాబునాయుడు మొద‌టి నుంచి క్రీడ‌ల‌కు అధిక ప్రాధాన్యత‌ క‌ల్పిస్తున్నార‌న్నారు. త్వ‌ర‌లోనే అమ‌రావ‌తిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న చేస్తార‌ని వివ‌రించారు. టీటీడీ, శాప్ నిధుల‌తో ఆనాడే శ్రీ శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్సును ఆయ‌న నిర్మించార‌న్నారు. ఏపీ నుంచి అంత‌ర్జాతీయస్థాయి క్రీడాకారుల‌ను త‌యారుచేయాల‌నే సంక‌ల్పంతో అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌కు స్థ‌లాలనిచ్చి అకాడ‌మీల స్థాప‌న‌ల‌కు కృషి చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడని కొనియాడారు. గత ముప్పై ఏళ్లుగా బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్, ఫెడ‌రేష‌న్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తూ బ్యాడ్మింట‌న్ క్రీడ‌ను ముందుకు తీసుకెళ్ల‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు సీఎం కృషి చేస్తున్నార‌న్నారు. అత్యుత్త‌మ క్రీడా విధానాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నార‌న్నారు. అనంత‌రం తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ మాజీ శాస‌న స‌భ్యురాలు సుగుణ‌మ్మ మాట్లాడుతూ ఏపీలో క్రీడాభివృద్ధికి సీఎం చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌లు అపార‌మైన కృషి చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న క్రీడాస‌దుపాయాలు, క్రీడా ప్రోత్సాహ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకుని క్రీడాకారులు భ‌విష్య‌త్తులో మ‌రింత మెరుగ్గా రాణించాల‌ని సూచించారు. సీఎం చంద్ర‌బాబు ఆశ‌యాల‌కు అనుగుణంగా క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌కు ప్ర‌తీ ఒక్క‌రూ కృషి చేయాల‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఎస్డీఓ శ‌శి, బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.

 నిలబెడతారా……

నిలబెడతారా……

నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు దక్కిన ఆధిక్యం 311. అటు రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత్‌ సున్నాకే రెండు వికెట్లు కోల్పోవడంతో ఆఖరి సెషన్‌ వరకైనా నిలుస్తుందా? అనిపించింది. కానీ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌…

  • రాహుల్‌, గిల్‌ అజేయ అర్ధసెంచరీలు
  • పోరాడుతున్న టీమిండియా
  • రెండో ఇన్నింగ్స్‌ 174/2
  • ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 669
  • బెన్‌ స్టోక్స్‌ సెంచరీ
  • నాలుగో టెస్టు

మాంచెస్టర్‌: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు దక్కిన ఆధిక్యం 311. అటు రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత్‌ సున్నాకే రెండు వికెట్లు కోల్పోవడంతో ఆఖరి సెషన్‌ వరకైనా నిలుస్తుందా? అనిపించింది. కానీ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (210 బంతుల్లో 8 ఫోర్లతో 87 బ్యాటింగ్‌), కెప్టెన్‌ గిల్‌ (167 బంతుల్లో 10 ఫోర్లతో 78 బ్యాటింగ్‌) మాత్రం పట్టువదలని పోరాటంతో అబ్బుర పరిచారు. రెండు సెషన్లపాటు ఓపిగ్గా క్రీజులో నిలిచి భారత్‌ డ్రాపై ఆశలను సజీవంగా నిలిపారు. దీంతో శనివారం నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ 63 ఓవర్లలో 174/2 స్కోరు చేసింది. ఇంకా జట్టు 137 రన్స్‌ వెనుకబడి ఉండగా.. చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. గెలుపు అసాధ్యమే కనుక చివరి రోజు మూడు సెషన్లపాటు ఆతిథ్య జట్టు బౌలర్లను భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు పంత్‌ బ్యాటింగ్‌పైనా స్పష్టత రావాల్సి ఉంది. అంతకుముందు బెన్‌ స్టోక్స్‌ (141) శతక సహాయంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేసింది. కార్స్‌ (47) రాణించాడు. జడేజాకు నాలుగు.. సుందర్‌, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి.

అద్భుత భాగస్వామ్యం: 544/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజును ఆరంభించిన ఇంగ్లండ్‌ దాదాపు సెషన్‌ పూర్తిగా ఆడి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. కానీ ఆలోపే కెప్టెన్‌ స్టోక్స్‌ శతకంతో పాటు కార్స్‌ ధాటికి మరో 125 పరుగులు జత చేరాయి. ఈ జోడీ మధ్య తొమ్మిదో వికెట్‌కు 95 పరుగులు జత చేరడం విశేషం. దీంతో స్కోరు 600 దాటడంతోపాటు ఆధిక్యం 311కి చేరి భారత్‌ ముందు కఠిన సవాల్‌ను ఉంచింది. పేసర్లు బుమ్రా, సిరాజ్‌ ఈసారి కాస్త మెరుగ్గానే బౌలింగ్‌ చేసినా ఇంగ్లండ్‌ జోరును కట్టడి చేయలేకపోయారు. డాసన్‌ (26) నిష్క్రమించాక కార్స్‌ అండతో స్టోక్స్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించాడు. సిరాజ్‌ ఓవర్‌లో ఫోర్‌తో అతడు రెండేళ్ల తర్వాత శతకం అందుకున్నాడు. స్పిన్నర్లు సుందర్‌, జడేజా ఓవర్లలో ఒక్కో ఫోర్‌, సిక్సర్‌తో ధాటిని కనబర్చాడు. అటు కార్స్‌ కూడా వేగంగా ఆడి తన వంతు సహకారం అందించాడు. చివరకు జడేజా తన వరుస ఓవర్లలో స్టోక్స్‌, కార్స్‌లను అవుట్‌ చేసి ఇంగ్లండ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ను ముగించాడు.

0/2 నుంచి కోలుకుని..: లంచ్‌ విరామానికి 15 నిమిషాల ముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. కానీ తొలి ఓవర్‌లోనే పేసర్‌ వోక్స్‌ వరుస బంతుల్లో ఓపెనర్‌ జైస్వాల్‌, సుదర్శన్‌లను డకౌట్‌ చేసి గట్టి షాక్‌ ఇచ్చాడు. అప్పటికి జట్టు పరుగుల ఖాతా కూడా తెరువలేదు. కానీ ఆ తర్వాత ఓపెనర్‌ రాహుల్‌, కెప్టెన్‌ గిల్‌ నిలకడైన ఆటతీరుతో అండగా నిలిచారు. దీంతో వేగంగా వికెట్లు తీద్దామనుకున్న ఇంగ్లండ్‌ బౌలర్ల ఆశలు ఆవిరయ్యాయి. స్టోక్స్‌ బౌలింగ్‌కు దూరంగా ఉండడం కూడా లాభించింది. కానీ లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఆరంభంలో పేసర్లు వోక్స్‌, ఆర్చర్‌ తమ పదునైన బంతులతో వణికించారు. ముఖ్యంగా ఆర్చర్‌ను ఎదుర్కొనేందుకు గిల్‌ ఇబ్బందిపడ్డాడు. అతడి ఇన్‌స్వింగర్‌కు అంపైర్‌ కాల్‌తో బతికిపోయాడు. కానీ ఆ తర్వాత నిలదొక్కుకుని చక్కటి డ్రైవ్‌ షాట్లతో ఆకట్టుకున్నాడు. 46 పరుగుల వద్ద స్లిప్‌లో డాసన్‌ క్యాచ్‌ వదిలేయడం గిల్‌కు కలిసివచ్చింది. దీంతో అతను హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఎండ్‌లో రాహుల్‌ అబేధ్య డిఫెన్స్‌తో సహకరించాడు. రెండో సెషన్‌లో జట్టు 85 పరుగులు చేసింది. ఇక ఆఖరి సెషన్‌లో గిల్‌ కాస్త నెమ్మదించినా, రాహుల్‌ సాధికారికంగా ఆడి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆర్చర్‌ను లక్ష్యంగా చేసుకుని తను బౌండరీలు రాబట్టాడు. చివరకు తమ వికెట్లను కాపాడుకుంటూ రోజును ముగించారు.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (సి) రాహుల్‌ (బి) జడేజా 84, డకెట్‌ (సి/సబ్‌) జురెల్‌ (బి) అన్షుల్‌ 94, పోప్‌ (సి) రాహుల్‌ (బి) సుందర్‌ 71, రూట్‌ (స్టంప్‌ సబ్‌) జురెల్‌ (బి) జడేజా 150, బ్రూక్‌ (స్టంప్‌ సబ్‌) జురెల్‌ (బి) సుందర్‌ 3, స్టోక్స్‌ (సి) సుదర్శన్‌ (బి) జడేజా 141, స్మిత్‌ (సి సబ్‌) జురెల్‌ (బి) బుమ్రా 9, డాసన్‌ (బి) బుమ్రా 26, వోక్స్‌ (బి) సిరాజ్‌ 4, కార్స్‌ (సి) సిరాజ్‌ (బి) జడేజా 47, ఆర్చర్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 38; మొత్తం: 157.1 ఓవర్లలో 669 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-166, 2-197, 3-341, 4-349, 5-499, 6-515, 7-528, 8-563, 9-658, 10-669; బౌలింగ్‌: బుమ్రా 33-5-112-2, అన్షుల్‌ 18-1-89-1, సిరాజ్‌ 30-4-140-1, శార్దూల్‌ 11-0-55-0, జడేజా 37.1-0-143-4, సుందర్‌ 28-4-107-2.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) రూట్‌ (బి) వోక్స్‌ 0, రాహుల్‌ (బ్యాటింగ్‌) 87, సుదర్శన్‌ (సి) బ్రూక్‌ (బి) వోక్స్‌ 0, గిల్‌ (బ్యాటింగ్‌) 78, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 63 ఓవర్లలో 174/2; వికెట్ల పతనం: 1-0, 2-0; బౌలింగ్‌: వోక్స్‌ 15-3-48-2, ఆర్చర్‌ 11-2-40-0, కార్స్‌ 10-2-29-0, డాసన్‌ 22-8-36-0, రూట్‌ 5-1-17-0.

  • ఇంగ్లండ్‌లో టెస్టు సిరీ్‌సలో ఎక్కువ పరుగులు (697) సాధించిన ఆసియా బ్యాటర్‌గా గిల్‌. మహ్మద్‌ యూసుఫ్‌ (2006లో 631)ను అధిగమించాడు.
  • ఓ ఇన్నింగ్స్‌లో వందకు పైగా పరుగులు సమర్పించుకోవడం బుమ్రాకిదే తొలిసారి.
  • టెస్టుల్లో ఓ జట్టు సున్నాకే రెండు వికెట్లు కోల్పోయినా మూడో వికెట్‌కు అధిక భాగస్వామ్యం (174) నమోదు చేసిన జోడీగా గిల్‌-రాహుల్‌.
  • ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో అత్యధిక స్కోరు (669) సాధించిన జట్టుగా ఇంగ్లండ్‌.

సాత్విక్‌ జోడీ పరాజయం..

సాత్విక్‌ జోడీ పరాజయం

సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి జోడీకి చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో చుక్కెదురైంది. ఈ భారత డబుల్స్‌ టాప్‌ జంట సెమీఫైనల్లో…

చాంగ్జౌ: సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి జోడీకి చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో చుక్కెదురైంది. ఈ భారత డబుల్స్‌ టాప్‌ జంట సెమీఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌ ద్వయం 13-21, 17-21తో రెండోసీడ్‌ జంట ఆరోన్‌ చియా/సో వూయి యిక్‌ (మలేసియా) చేతిలో చిత్తయింది. ఈ జోడీ ఓటమితో టోర్నీలో భారత్‌ కథ పూర్తిగా ముగిసింది.

కివీస్‌దే ముక్కోణం..

కివీస్‌దే ముక్కోణం

టీ20 ముక్కోణపు సిరీస్‌ టైటిల్‌ను న్యూజిలాండ్‌ సొంతం చేసుకొంది. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 7 పరుగులు అవసరమవగా.. దూకుడుమీదున్న బ్రెవిస్‌…

హరారే: టీ20 ముక్కోణపు సిరీస్‌ టైటిల్‌ను న్యూజిలాండ్‌ సొంతం చేసుకొంది. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 7 పరుగులు అవసరమవగా.. దూకుడుమీదున్న బ్రెవిస్‌ (31)ను అవుట్‌ చేసిన హెన్రీ (2/19) మూడు పరుగుల తేడాతో కివీస్‌ను గెలిపించాడు. ఫైనల్లో తొలుత కివీస్‌ 20 ఓవర్లలో 180/5 స్కోరు చేసింది. రచిన్‌ (47), కాన్వే (47), సీఫెర్ట్‌ (30) రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 177/6 స్కోరుకే పరిమిత మైంది. ఓపెనర్లు ప్రిటోరియస్‌ (51), హెండ్రిక్స్‌ (37) తొలి వికెట్‌కు 92 పరుగుల ధనాధన్‌ భాగస్వామ్యంతో గెలుపునకు బాటలు వేశారు. డెత్‌ ఓవర్లలో బ్రెవిస్‌ వేగంగా ఆడడంతో సౌతాఫ్రికా నెగ్గుతుందనిపించింది. కానీ, ఆఖర్లో హెన్రీ మాయాజాలంతో.. దక్షిణాఫికా గెలుపు వాకిట బోల్తా పడింది.

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ మరోసారి తన పోరాట స్ఫూర్తిని చాటింది. ఇంగ్లండ్ పేసర్ల దాడికి ఎదురులేని పరిస్థితుల్లో, యువ బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్ ధైర్యంగా నిలిచి జట్టుకు అండగా నిలిచారు. ప్రమాదంగా అనిపించిన పిచ్‌పై ఇద్దరూ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

యువ భారత క్రికెట్ జట్టును సిరీస్ ఆరంభంలో చాలామంది తక్కువగా అంచనా వేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో ఈ జట్టుపై అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, మొదటి టెస్ట్ నుంచే యువ ఆటగాళ్లు (India vs England 2025) తమ సత్తా చాటారు. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఇంగ్లండ్‌లో జరిగిన ఈ సిరీస్‌లో తమ పట్టుదలను చూపించింది.

యువ జట్టు ధైర్యం

లీడ్స్‌లో తొలి టెస్ట్‌లో ఓటమి ఎదురైనప్పటికీ, బ్యాటింగ్‌లో జట్టు తమ ధైర్యాన్ని ప్రదర్శించింది. బర్మింగ్‌హామ్‌లో అద్భుత పునరాగమనం చేసిన భారత జట్టు, లార్డ్స్‌లో చివరి సెషన్ వరకు ఇంగ్లండ్‌ను ఒత్తిడిలో ఉంచింది. కానీ, మహమ్మద్ సిరాజ్ స్టంప్‌లు ఢీకొట్టిన ఒక సాధారణ బంతి భారత్‌కు నిరాశను మిగిల్చింది.

స్కోర్లుగా మలచలేక..

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్ట్‌లో భారత జట్టు కాస్త అలసినట్లు కనిపించింది. 1–2 స్కోర్‌తో వెనుకబడిన ఈ సిరీస్‌లో, గత టెస్ట్‌లలో కనిపించిన ఉత్సాహం, స్థిరత్వం కొంత తగ్గినట్లు అనిపించింది. జట్టు ఎంపికపై చర్చలు జోరుగా సాగాయి. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ వైఫల్యం విమర్శలను తెచ్చిపెట్టింది.

టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. 2015 తర్వాత మొదటిసారిగా, విదేశీ గడ్డపై భారత్ ఒక ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు పైగా ఇచ్చింది. జస్ప్రీత్ బుమ్రా, భారత్ ప్రధాన ఫాస్ట్ బౌలర్, తన కెరీర్‌లో మొదటిసారిగా ఒక ఇన్నింగ్స్‌లో 100 పరుగులకు పైగా ఇచ్చాడు.

ఓటమి అనుకున్నారు..

ఇంగ్లండ్ 669 పరుగుల భారీ స్కోర్ సాధించి, 311 పరుగుల ఆధిక్యం తెచ్చుకుంది. భారత రెండో ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ తొలి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్‌లను ఔట్ చేసి జట్టును కష్టాల్లోకి నెట్టాడు. నాలుగో రోజు లంచ్ సమయానికి స్కోర్ 1/2తో ఉండగా, ఓటమి ఖాయమని అందరూ భావించారు. సోషల్ మీడియాలో అభిమానులు ఇన్నింగ్స్ ఓటమిని అంచనా వేశారు. బ్రాడ్‌కాస్టర్ సంజనా గణేశన్ కూడా మధ్యాహ్న సెషన్ ఈ టెస్ట్‌కు చివరిదని అన్నారు. ఆ క్రమంలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ గిల్‌పై విమర్శలు వచ్చాయి.

వీరిద్దరూ మాత్రం..

అయితే, శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్ ఈ సవాళ్లను అధిగమించారు. 62.1 ఓవర్లు, రెండు సెషన్ల పాటు అద్భుతంగా బ్యాటింగ్ చేసి, స్టంప్స్ వరకు అజేయంగా నిలిచారు. గతంలో భారత జట్టు సుదీర్ఘ సిరీస్‌లలో చివర్లో అలసిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2024–25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1–1 స్కోర్ 1–3 ఓటమిగా మారింది. కానీ, మాంచెస్టర్‌లో గిల్, రాహుల్ ఈ జట్టు భిన్నమైన ఆటతీరును చూపించారు. వారి పోరాటం సిరీస్‌పై నమ్మకాన్ని తిరిగి తెచ్చింది.

డ్రా చేస్తే..

గెలుపు కష్టమైనప్పటికీ, మాంచెస్టర్‌లో డ్రా సాధిస్తే, ఓవల్ టెస్ట్‌కు 1–2 స్కోర్‌తో వెళ్లి సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంది. ఇందుకు బ్యాటింగ్ లైనప్ మొత్తం సహకరించాలి. గిల్, రాహుల్‌ల పట్టుదల యువ జట్టుకు స్ఫూర్తినిచ్చింది. దీంతో క్రీడాభిమానులు సైతం తర్వాత ఎలా ఆడనున్నారని ఆసక్తితో ఉన్నారు.

 శ్రీజ రన్నరప్‌తో సరి..

శ్రీజ రన్నరప్‌తో సరి

తెలుగమ్మాయి ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్‌ లాగోస్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్‌లో రన్నర్‌పగా నిలిచింది. సింగిల్స్‌ ఫైనల్లో హషిమొటో…

లాగోస్‌ (నైజీరియా): తెలుగమ్మాయి ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్‌ లాగోస్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్‌లో రన్నర్‌పగా నిలిచింది. సింగిల్స్‌ ఫైనల్లో హషిమొటో (జపాన్‌) 4-1తో శ్రీజను ఓడించింది. కాగా, పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను భారత జోడీ సాతియన్‌ గుణశేఖరన్‌/ఆకాశ్‌ పాల్‌ దక్కించు కుంది. ఫైనల్లో సాతియన్‌ ద్వయం 3-1తో ఫ్రాన్స్‌ జంట లియో డి/జులెస్‌పై నెగ్గింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version