ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను కలిసిన వడాయిగూడెం సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్..

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను కలిసిన వడాయిగూడెం సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్

యాదాద్రి నేటి ధాత్రి:

భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ శ్రీమతి నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్ గారు సోమవారం హైదరాబాద్‌లో శాసనమండలి సభ్యులు (MLC) శ్రీ తీన్మార్ మల్లన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని సర్వే నంబర్ 518 భూములకు సంబంధించిన వివాదాలపై ఆయనకు వినతి పత్రం సమర్పించారు.
*సర్వే నంబర్ 518లో కేవలం 20 ఎకరాల భూదాన్ భూమి ఉంటే,మొత్తం 467 ఎకరాలను నిషిద్ధ జాబితాలో పెట్టడం వల్ల రైతులు,సామాన్యులు పడుతున్న ఇబ్బందులను మల్లన్న గారికి వివరించారు.
*జనావాసాలు ఉన్న ప్రాంతాలను కూడా బ్లాక్ చేయడం వల్ల ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని,దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

*సర్పంచ్ వివరించిన సమస్యను సావధానంగా విన్న తీన్మార్ మల్లన్న గారు స్పందిస్తూ.. భూభారతి లోపాలు మరియు రెవెన్యూ అధికారుల పొరపాట్ల వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడటం అన్యాయమని,ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

*ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుక్కల దుర్గయ్య యాదవ్, ఉమ రమేష్, కోట దీప, కోట సుధాకర్, కోట సుధావాణి, గ్రామ నాయకులు బబ్బూరి సాగర్ గౌడ్, రాసాల రాజు యాదవ్, బొజ్జ సాంబేష్, నీల మనీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ ఆర్ డి ఓ కార్యాలయం లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు..

జహీరాబాద్ ఆర్ డి ఓ కార్యాలయం లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ రెవెన్యూ కార్యాలయంలో
గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది యొక్క ప్రాముఖ్యత భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం (Constitution of India) అమలులోకి వచ్చింది. ఈ రోజున, భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అధికారికంగా ఆవిర్భవించింది.
జనవరి 26 తేదీని ఎంపిక చేయడానికి ఒక చారిత్రక కారణం ఉంది: 1930లో భారత జాతీయ కాంగ్రెస్ ఇదే రోజున “పూర్ణ స్వరాజ్” (సంపూర్ణ స్వాతంత్ర్యం) ప్రకటన చేసింది, దీనిని గౌరవించడానికి రాజ్యాంగ అమలు తేదీగా దీనిని నిర్ణయించారు.ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాణిక్ రావు, మరియు జహీరాబాద్ మండల్ తాసిల్దార్ , పి దశరథ్, జహీరాబాద్ ఆర్డిఓ, రెవిన్యూ అధికారులు, పాల్గొన్నారు

ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చిన టి ఆర్ పి నాయకులు…

ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చిన టి ఆర్ పి నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం కేంద్రంలోబుధవారం రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి చీఫ్ తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం, జిల్లా అధ్యక్షులు రవి పటేల్ పిలుపు మేరకు బీసీ సప్లాన్ తెలంగాణ రాష్టంలో అమలు చేయాలనీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో ఆర్డీవో లకి వినతి పత్రాలు అందచేశారు.
ఇందులో భాగంగా గణపురం మండల తహసీల్దార్ సత్యనారాయణ స్వామి కి కూడా బీసీ లకి అనాదిగా బడ్జెట్ లో జరుగుతున్న అన్యాయం గురించి వివరించి వెంటనే తెలంగాణ లో బీసీ సప్లాన్ అమలులోకి రావాలని వినతి పత్రం అందచేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో గణపురం మండల అధ్యక్షుడు గండు కర్ణాకర్,బస్వరాజపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు అంబటి అశోక్ మండల నాయకులు ఈరగోని తిరుపతి పాల్గొన్నారు

రోడ్డెక్కిన రేకూర్తి ప్రజలు..

రోడ్డెక్కిన రేకూర్తి ప్రజలు

మాభూముల యొక్క రిజిస్ట్రేషన్లు కొనసాగించాలి -రేకుర్తి గ్రామ ప్రజలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రేకుర్తి శివారులోని భూములకు సంబంధించిన సర్వేనెంబర్లు 1 నుండి 230 వరకు ఉన్న భూముల్లో కలేక్టర్ ఆదేశాల మేరకు దాదాపు గత ఆరు నెలల నుండి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం జరిగింది. రేకుర్తి రెవెన్యూ గ్రామానికి సంబoదించిన భూములను సెక్షన్ 22ఏలో నుండి తొలగించి రిజిస్ట్రేషన్ చేయాలని, కలెక్టర్ ను తప్పు ద్రోవ పట్టిస్తున్న క్రింది స్థాయి అధికారులను సస్పెండ్ చేయాలని, రేకుర్తి భూములు ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ మరియు మొటేషన్ అయ్యిన వాటిని ఇప్పుడు నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటని, కలెక్టర్ తహసీల్దార్ ను విచారణ చేసి నివేదికను ఇవ్వాలని అడిగిన కానీ ఇంత వరకు మోకా మీదకు వెళ్లి ఎలాంటి విచారణ చెప్పంటని తహసీల్దార్ అంటూ సంబంధిత భూబాధితులు రోడ్డుపై నిరసన చేయడం జరిగింది. ఈసందర్భంగా సంబంధిత భూయజమానులు గ్రామానికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వలన గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇట్టి భూములలో ఇప్పటికే గ్రామ ప్రజలు గ్రామ పంచాయితీ మరియు పురపాలక సంఘం అనుమతులతో ఎనభై శాతం ఇండ్లు నిర్మించుకొని నివసించుచున్నామని, ఇట్టి ఇండ్లకు ఇంటి పన్ను మరియు అన్ని రకాల పన్నులు, గృహ రుణాలు కొన్ని సంవత్సరాల నుండి చెల్లించుచున్నామని, ఇంతకు ముందు కలెక్టర్ ఆదేశాలకు పూర్వము ఇట్టి భూములు అన్ని కరీంనగర్ మరియు గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కాబడి అన్నింటిని అప్పటి ఎమ్మార్వో మరియు ఆర్డీవోలు వారి పేర్లమీద రెవెన్యూ రికార్డులలో జమాబంధి చేయడం జరిగిందని, అకస్మాత్తుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని, భూములు అమ్ముకోలేక చాలా వివాహలు ఆగిపోయాయని, ఇంకా ఇలాగే కొనసాగేతే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందని కలెక్టర్కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నామని, ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అట్టి సర్వే నంబర్లలో సంబంధిత అధికారులతో విచారణ జరిపి రిజిస్ట్రేషన్లు కొనసాగేలా చేయాలని రేకుర్తి గ్రామ ప్రజలు అధికారులను పత్రికా ముఖముగా కోరుతున్నారు.

భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

 భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. అధికారుల సర్వే.. ఉద్రిక్తత

 

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీంతో రెవెన్యూ అధికారులు అధికారికంగా భూ సర్వే చేపట్టడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లా రెడ్డి (Malla Reddy), మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) మరోసారి భూమి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్‌లో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 82, 83లో 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూములు కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇక భూ వివాదం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈరోజు (మంగళవారం) అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలు తమ తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. దీంతో సర్వే జరుగుతున్న ప్రాంతంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ప్రమాదం.. 16 మేకలు ఒక్కసారిగా మృత్యువాత…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-25T132049.228.wav?_=1

 

ప్రమాదం.. 16 మేకలు ఒక్కసారిగా మృత్యువాత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ మొల్కల్పాడు గ్రామంలో సోమవారం ఉదయం ఊహించని ఘోర ప్రమాదం సంభవించింది. రైతు మేతరి సంజీవ్ తన 16 మేకలను మేతకు తీసుకెళ్లగా, అవి పొలంలోని పత్తి పంటలో మేస్తూ ఒక్కొక్కటిగా కిందపడి మృతి చెందాయి. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.2.5 లక్షల నష్టం వాటిల్లింది. మేకలు ఆకస్మికంగా ఎందుకు చనిపోయాయో తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని రెవెన్యూ అధికారులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

అతి త్వరలో రాయలపేట రోడ్డు విస్తరణ..

*అతి త్వరలో రాయలపేట రోడ్డు విస్తరణ..

*నిర్వాసితులకు ఆందోళన వద్దు..

*అభిప్రాయ సేకరణ అనంతరమే రోడ్డు ఏర్పాటు.. ఎమ్మెల్యే అమర్..

పెద్దపంజాణి(నేటి ధాత్రి)

 

పెద్దపంజాణి మండలం రాయలపేటలోని రోడ్డు విస్తరణ పనులు అతి త్వరలో చేపట్టనున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇరుకైన రోడ్లతో రాకపోకలకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతొందిఇలా ఉండగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం ద్వారా రూ. 4.4 కోట్ల దాకా మంజూరు చేయించారు. అయితే కొంతమంది అభ్యంతరాల మేరకు రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఊరికి వెలుపల బైపాస్ నిర్మాణాన్ని చేపట్టదలిచారు.ఈ విషయం తెలుసుకున్న మెజారిటీ గ్రామాల ప్రజలు రాయలపేట మీదుగానే రోడ్డును ఏర్పాటు చేయాలని ఈమధ్య ఎమ్మెల్యేకు విన్నవించారు. దీంతో రోడ్డును ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించడంతో రెండు రోజులుగా అధికారులు ఆ పనులను చేపడుతున్నారు.అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ భాగం రోడ్డు విస్తరణకు వెళ్లే అవకాశం ఉందని పలువురు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం రాయల్ పేట గ్రామంలో పర్యటించి మార్కింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ఇబ్బంది తలెత్తుతుందో స్థానికులు అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఎవరికి ఎటువంటి ఆందోళన వద్దని అధికారులు మరియు గ్రామస్తుల తో సమీక్ష నిర్వహించి అందరి అభిప్రాయ సేకరణ అనంతరమే పనులు చేపడతామని వారికి ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

పురాతన శివాలయం జోలికి వస్తే ఊరుకునేది లేదు బిజెపి నాయకుల డిమాండ్…

పురాతన శివాలయం జోలికి వస్తే ఊరుకునేది లేదు బిజెపి నాయకుల డిమాండ్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. గత కొన్ని దశాబ్దాల క్రితం వెలిసిన శివాలయాన్ని. మాది అంటూ కొందరు వ్యక్తులు శివాలయానికి తాళం వేయడం మంచిది కాదని దీనిపై. బిజెపి పార్టీ నాయకుల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పరిశీలిస్తూ. మాట్లాడుతూ మండల కేంద్రంలోని పురాతనమైనటువంటి. శివాలయం గుడి కలదని అత్తి శివాలయం కు. లోని కొందరు చంద్ర రెడ్డి మరియు అతని అన్నదమ్ములు కలిసి గుడికి తాళం వేసినారని అతి విషయం తెలుసుకున్న మేము. బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తీపించి . పూజారులచేపూజలు జరిపించామని. అలాగే ఇటువంటి. పరిణామాలు మరోసారి జరిగితే ఊరుకునేది లేదని దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది. లేదని. ఈ సందర్భంగా తెలియజేస్తూ. దేవుళ్ళపై. అనుచిత వ్యాఖ్యలు. చేస్తే ఊరుకునేది లేదని . గ్రామంలోని ప్రజలు కొందరు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వారి తాతల కాలంలో ఇక్కడ రాజరాజేశ్వర.అమ్మవారు. కాలభైరవుడు సూర్య వంశకు కోనేరు గుడి ఉన్నదని పూర్వీకులు. గ్రామంలోని కొందరు వ్యక్తులు. దేవుని గుడికి తాళాలు భూ ఆక్రమణలకు దీనిపై రెవెన్యూ అధికారులు సందర్శించి సమస్య అయ్యే దిశగా చర్యలు భూమి జాగలు .వాళ్లవి ప్రజల సమక్షంలో పరిశీలించి పరిశీలించుకోవాలని ఈసందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి బిజెపి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి కౌన్సిల్ మెంబర్ కోలా ఆంజనేయులు. మండల ప్రధాన కార్యదర్శి. ఇటికల రాజు. ఉపాధ్యక్షులు సిలివేరి ప్రశాంత్. సీనియర్ నాయకులు గజ బింకర్ సంతోష్. ఆసాని లింగారెడ్డి బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి….

దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలోని పలు గ్రామాలలో మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు.గురువారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ గౌడ్ మాట్లాడుతూ..కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట,వెన్ను దశలో ఉన్న పంట నేలకొరిగి కంకులు నీటిలో నానుతున్నాయని తెలిపారు.ఫలితంగా దిగుబడి తగ్గడంతోపాటు ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్నారు.ప్రభుత్వం తుపాను గురించి సకాలంలో హెచ్చరికలు చేయడంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతోనే భారీగా పంట నష్టం జరిగిదన్నారు. పెనుగాలుల కారణంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.తక్షణమే పంట నష్టం గురించి అంచనా వేసేందుకు వ్యవసాయ,రెవెన్యూ శాఖల అధికారులతో బృందాలను వేసి,పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి జాబితాను రూపొందించాలని కోరారు.ఎకరాకు వరికి రూ.25 వేలు,మొక్కజొన్న , పత్తి వంటి పంటలకు ఎకరాకు రూ.50 వేలు పంట నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం రైతులను,కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి,జిల్లా నాయకులు బచ్చు వెంకటేశ్వర్ రావు,మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి,మండల కార్యదర్శి బూర కృష్ణ, మండల నాయకులు వల్లే పర్వాతలు,బోట్ల ప్రతాప్,నాగిరెడ్డి రాజిరెడ్డి,బూత్ అధ్యక్షులు ఊటుకూరి చిరంజీవి, నాగపూరి సాగర్,కొలిపాక దేవేందర్ పార్టీ నాయకులు కొనుకటి మధుకర్,చెంచు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

కొండపర్తిలో విషాదం – గోడ కూలి మహిళ మృతి….

కొండపర్తిలో విషాదం – గోడ కూలి మహిళ మృతి

హనుమకొండ జిల్లా, ఐనవోలు, నేటిధాత్రి.

ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామంలో బుధవారం జరిగిన దుర్ఘటన స్థానికులను విషాదంలో ముంచింది. నిన్న ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాత్రి సమయంలో ఓ ఇంటి గోడ కూలి, ఆ ఇంట్లో నిద్రిస్తున్న గద్దల సూరమ్మ (58) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్ మరియు రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఇళ్లను గుర్తించి వారిని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి పురాతన ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ సూచించారు.

అతివేగంతో గ్రామంలో ప్రజలు పిల్లలను భయ ప్రాంతులకు గురిచేస్తున్న ఇసుక ట్రాక్టర్లు…

అతివేగంతో గ్రామంలో ప్రజలు పిల్లలను భయ ప్రాంతులకు గురిచేస్తున్న ఇసుక ట్రాక్టర్లు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.

 

తంగళ్ళపల్లి మండలం మండే పల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా. గ్రామస్తులు ప్రజలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ప్రభుత్వపరంగా ఇసుక వే బిల్లులు. మండల రెవెన్యూ అధికారుల ప్రభుత్వపరంగా ఇస్తుండగా. వాటికి అనుగుణంగా గ్రామంలో నుంచి వే బిల్లుల ద్వారా ఇసుక సరఫరా జరుగుతుండగా. దానికి సంబంధించి గ్రామంలో నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లు ఇష్టానుసారంగా నడిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ. గ్రామంలో నిర్మితమైన కమానును ఢీ కొట్టుకుంటూ. గ్రామ ఇండ్లల్లో కరెంటు స్తంభాలను ఢీకొట్టుకుంటూ వైర్లు తెగిపోతున్న గ్రామంలో ఇండ్లలో విద్యుత్తు సరఫరా నిలిచిపోతున్న ఇండ్లలో ఏమి. ఏమి నష్టం జరుగుతున్న పట్టించుకోకుండా సదరు ట్రాక్టర్ డ్రైవర్లు గాని యజమానులు గాని ఇష్టానుపురూపంగా వాహనాల నడుపుతున్నారని మొన్నటికి మొన్న ఒక ట్రాక్టర్ ది ముంగటి చక్రం ఊడిపోయి పొలాల్లో పడిపోయిందని. ఇసుక ట్రాక్టర్ నడుపుతున్న చాలామంది మైనర్ పిల్లలు ఉన్నారని వారికి లైసెన్సులు కూడా లేవని గ్రామంలో ప్రజలు వీధులపై తిరగడానికి భయపడుతున్నారని. స్కూలు విద్యార్థులు గ్రామాలలో పిల్లలు పెద్దలు ముసలి వాళ్లు బయటకి రావడానికి భయపడుతున్నారని. దయచేసి వెంటనే సంబంధిత అధికారులు వచ్చి స్థానిక ఎస్సై గారు వచ్చి. గ్రామంలో జరుగుతున్న వాటిపై చర్యలు తీసుకుంటూ. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కేటాయించిన వే బిల్లుల ప్రకారం. నడిపించుకోవాలని. మేము ప్రభుత్వ అందించిన దానికి వ్యతిరేకం కాదు అని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నష్టం వాటిల్లకుండా నడుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక ఎస్సై. సంబంధిత రెవెన్యూ అధికారులు. రావాలని రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు స్థానిక ఎస్సై గ్రామానికి వచ్చి గ్రామ ప్రజలతో చర్చించి ఇకపై ఇలాంటి సంఘటన పునవృతం కాకుండా. చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు ఇట్టి కార్యక్రమం

జోరుగా ఎర్రరాళ్ల దందా అటవీ, ప్రభుత్వ భూముల్లో అక్రమ……

జోరుగా ఎర్రరాళ్ల దందా అటవీ, ప్రభుత్వ భూముల్లో అక్రమ……!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎర్ర నేలల నుంచి రాళ్లను తవ్వి కొందరు అక్రమార్కులు మైనింగ్ బిజినెస్ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా చట్ట విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నా మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఇక్కడి ఎర్రరాయికి తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్రల్లో మంచి డిమాండ్ ఉంది.దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు ప్రభుత్వ, పట్టా, అటవీ, నీమ్డ్ భూముల్లో పర్మిషన్లు తీసుకోకుండానే తవ్వకాలు చేస్తూ అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. వివిధ నిర్మాణాలకు ఈ ఎర్రరాయి అణువుగా ఉండడం వల్ల క్వారీలను ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా పక్క రాష్ట్రాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

నిర్మాణాలకు అనువైన రాయి

జహీరాబాద్ ప్రాంతంలో లభించే ఎర్ర రాయి వివిధ నిర్మాణాలకు అనువైన రాయిగా పేరుగాంచింది. ఈ సెగ్మెంట్లో ఎక్కడ చూసినా ఎర్రరాయితో కట్టిన నిర్మాణాలే ఎక్కువగా కనిపిస్తాయి. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో వందల ఎకరాల్లో ఈ ఎర్రరాళ్ల క్వారీలు కొనసాగుతున్నాయి. ఏ ఒక్క దానికి పర్మిషన్ లేదు. అయినా రేయింబవళ్లు క్వారీలు నడుస్తూనే ఉంటాయి. దాదాపు మూడంతస్తుల బిల్డింగ్ ఎత్తులో, పెద్దపెద్ద గనులను తలపించేలా తవ్వేస్తున్నారు. వర్షాకాలంలో అవి పూర్తిగా నిండి అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మొక్కుబడిగా తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిమ్జ్‌ భూముల్లో..

న్యాల్కల్ మండలం నిమ్జ్‌ భూములను సైతం అక్రమార్కులు వదలడం లేదు. గ్రామాల శివారులో ఉన్న భూములను ఎంచుకొని గుట్టుచప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు. ఒక్క న్యాల్కల్ మండలంలోనే దాదాపు 20 ఎకరాల నీమ్డ్ భూములను తవ్వేసినట్టు సమాచారం. గనులను తలపించే క్వారీల్లో భారీ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఆధునిక యంత్రాలను వినియోగించి మైనింగ్ బిజినెస్ చేస్తున్నారు.
ఒక్కో గనిలో పదుల సంఖ్యలో యంత్రాలు పనిచేస్తున్నాయి. కొన్ని యంత్రాలకు కరెంట్ సరఫరా అవసరం ఉండడంతో ఇల్లీగల్ గా విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. కరెంట్ సరఫరా లేని చోట్ల జనరేటర్లను వినియోగించి పని కానిచ్చేస్తున్నారు. ఒక్కో గని ద్వారా నెలకు సుమారు రూ.20 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. స్థానిక పొలిటికల్ లీడర్ల సాయంతో మైనింగ్ మాఫియా ఈ దందా చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లల్లో జరుగుతున్న ఈ బిజినెస్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

చర్యలు తీసుకుంటాం

జహీరాబాద్ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రరాళ్ల తవ్వకాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కొనసాగించడం చట్టవిరుద్ధం. నేను ఇటీవలే ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్నా. రెవెన్యూ, మైనింగ్ అధికారుల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తా. ఒకటి రెండు రోజుల్లో రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల సమక్షంలో ఆయా స్థలాలను పరిశీలించి ఎర్రరాళ్ల అక్రమ దందాను అడ్డుకుంటాం. జహీరాబాద్, ఆర్డీవో

భూ కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు..

 

భూ కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో. భూ కబ్జాదారులు రాత్రికి రాత్రి చెట్లు నాటుతూ పనులు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండపల్లి గ్రామస్తుల కథనం ప్రకారం. మండపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు. 337. నంబర్లో 360 ఎకరాల. ప్రభుత్వ భూమి ఉన్నది. దీనిపై కన్నేసిన భూకబ్జాదారులు రాత్రిపూట దున్నటం భూమిలో రాత్రికి రాత్రి చెట్లు నాటడంతో గ్రామంలోని గ్రామస్తులు శనివారం రోజున రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా ఆర్ ఐ. దినేష్. జిపిఓ. రెవెన్యూ సిబ్బంది శనివారం రోజున. మండే పల్లి గ్రామానికి వెళ్లి భూములను పరిశీలించారు. గ్రామస్తులు అభిప్రాయం ప్రకారం భూమి రెవెన్యూకి చెందాలి లేకుంటే గ్రామ అభివృద్ధికి చెందాలి. అని అధికారులకు వివరిస్తూ భూమికి సంబంధించిన పత్రాలు ఉంటే రాత్రిపూట దున్నించడఏమిటి అని రాత్రిపూట చెట్లు పెట్టించడం ఏమిటని ఆరోపించారు ఇప్పటికే . గ్రామంలో భూమిని భూకబ్జాదారుల. ఆక్రమణకు గురవడంతో. గ్రామంలోని గ్రామపంచాయతీకి గాని పశువులు మేకలుమేయడానికి గాని. ఉపయోగించడానికి. వీలుగా ఉండేలా చర్యలు తీసుకుంటూ. గ్రామంలో పిల్లలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు లో క్రీడా ప్రాంగణానికి ఉపయోగపడేలా సంబంధిత అధికారులు రెవెన్యూ సిబ్బంది భూకబ్జాదారులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ భూములను కాపాడి ప్రతి గ్రామంలో ప్రజలకు మేలు కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామంలో రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

“ప్రభుత్వ భూమిని కాపాడాలని.. కలెక్టర్ కు ఫిర్యాదు”

“ప్రభుత్వ భూమిని కాపాడాలని.. కలెక్టర్ కు ఫిర్యాదు”

” అధికారులపై చర్యలు తీసుకోండి”

బాలానగర్ / నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామపంచాయతీ శివారు అయ్యప్ప స్వామి దేవాలయ ఆలయ సమీపంలోని సర్వేనెంబర్ 102, 105 ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ కి సంబంధించిన ఆర్చిని ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు వెంచర్ యజమానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సామాజిక సేవా కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Government Land

స్థానిక రెవిన్యూ అధికారులు వెంచర్ యాజమాన్యంతో కుమ్ముక్కై ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ఏం మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని కాపాడకుండా వెంచర్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ భూమిలో ఆర్చి నిర్మాణానికి సహకరించిన అధికారులపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి విలువ మార్కెట్ రేటు ఒక ఎకరం రూ.4 కోట్ల వరకు ఉంటుందని విలువైన భూమిని కాపాడడంలో విఫలమైన స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012వ సంవత్సరంలో హైదరాబాదులో నగరానికి 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో జాతీయ రహదారులకు రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరికి అసైన్మెంట్ చేయరాదన్న జీవోను జారీ చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్థానిక రెవిన్యూ అధికారులు విస్మరించి.. రికా వ్యాల్యూ వెంచర్ యజమానికి అనుకూలంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.

మండల కేంద్రంలో ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు….

మండల కేంద్రంలో ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

అధికారుల సహాయంతో అక్రమ ఇసుక రవాణా

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో కొందరు రెవెన్యూ అధికారులు, దళారులు కుమ్మక్కు కావడంతో ఇసుక పక్కదారి పడుతుందని, ఈ అక్రమ దందాను అరికట్టాలని శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఈ సందర్భంగా కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరలలో ఇసుక అందించాలని స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ఆదేశించినా దళారుల రంగ ప్రవేశంతో అనుమతులకు మించి ఇసుక తోడేస్తూ ఈ ప్రాంత వనరులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఒక టేకుమట్లే కాకుండా ఇసుక సౌకర్యం ఉన్న రేగొండ, శాయంపేట, మొగుళ్ళపల్లి, టేకుమట్ల, చిట్యాల మండలంలో క్వారీల ను ఓపెన్ చేసి, అన్ని మండలంలో నుండి తీసుకపోయేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క టేకుమట్ల మండలంలో రోజు 25 ట్రాక్టర్ల ఇసుకకు అనుమతి ఉంటే రోజు 200 నుండి 250 ఇసుక ట్రిప్పులు నడుస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇసుకను అక్రమంగా డంప్ చేస్తున్న అక్రమార్కుల పైన కేసులు నమోదు చేయట్లేదని మామూలుగా ట్రాక్టర్లతో ఇసుక కొడుతున్న వారి పైన కేసులు అవుతున్నాయన్నారు. అక్రమ ఇసుక తరలించిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకార్యక్రమం అనంతరం రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

జహీరాబాద్ లో శాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం…

జహీరాబాద్ లో శాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం

◆:- మీ సేవలకు శతకోటి దండాలు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది గత 11 రోజులుగా నిత్యం పూజలు అందుకున్న వినాయకుని శనివారం రాత్రి ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు భక్తులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.రాత్రి నిమజ్జనోత్సవంలో అంబరాన్ని అంటిన సంబరాలు మిగిల్చిన గుర్తులు. పట్టణ వీధుల గుండా గణపయ్యలను ఊరేగిస్తూ భక్తులు చల్లిన పూలు. నిమజ్జనం అనంతరం ఇళ్లకు వెళ్లిన యువత కునుకుతీసింది. సుఖమెరుగని ఈ కష్టజీవులు రాత్రనకా.. పగలనకా.. చెమటోడ్చి చెత్తను అంతా ఎత్తిపోశారు. పారిశుద్ధ్య కార్మికులూ మీ సేవలకు శతకోటి దండాలు!

జహీరాబాద్ లో శాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-08T124815.290-1.wav?_=2

 

జహీరాబాద్ లో శాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం

◆:- మీ సేవలకు శతకోటి దండాలు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది గత 11 రోజులుగా నిత్యం పూజలు అందుకున్న వినాయకుని శనివారం రాత్రి ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు భక్తులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.రాత్రి నిమజ్జనోత్సవంలో అంబరాన్ని అంటిన సంబరాలు మిగిల్చిన గుర్తులు. పట్టణ వీధుల గుండా గణపయ్యలను ఊరేగిస్తూ భక్తులు చల్లిన పూలు. నిమజ్జనం అనంతరం ఇళ్లకు వెళ్లిన యువత కునుకుతీసింది. సుఖమెరుగని ఈ కష్టజీవులు రాత్రనకా.. పగలనకా.. చెమటోడ్చి చెత్తను అంతా ఎత్తిపోశారు. పారిశుద్ధ్య కార్మికులూ మీ సేవలకు శతకోటి దండాలు!

అక్రమ కలప వ్యాపారాన్ని అరికట్టాలి…

అక్రమ కలప వ్యాపారాన్ని అరికట్టాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అడవులు రక్షణకు ప్రభుత్వాలు పనిచేస్తుంటే, అక్రమార్కులు మాత్రం ధనార్జిని ధ్యేయంగా అక్రమ కల్ప వ్యాపారం నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం లోని కోహిర్ ఝరాసంగం మొగుడం పల్లి మాడలాల శివారులో అక్రమంగా రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రాముల ప్రజలు అర్పిస్తున్నారు.

 

 

 

ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు హరితహారం లో భాగంగా చెట్లు నాటుతుంటే కాసులకు అలవాటుపడ్డ అక్రమార్కులు చెట్లను నరికి అక్రమ కల్ప వ్యాపారం నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేక కలప వ్యాపారులకు సహకరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కల్ప వ్యాపారాన్ని అరికట్టి చెట్లు నరకకుండా చర్యలు తీసుకోవాలని ఆయ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పలమనేరులో పెద్ద చెరువు రక్షణకు ఆదేశాలు…

*పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని

*అధికారులను
అదేశించిన ఎమ్మేల్యే అమర్..

పలమనేరు(నేటిధాత్రి)అగస్టు19:

పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారుల కోసం అధికారులు చెరువుకు గండి కొట్టి చెరువులోని నీటిని రైతుల పంట పొలాల్లోకి వదిలేసారని పత్రికలలో రావడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దీంతో మున్సిపల్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా చెరువుకు గండి కొట్టడానికి గల కారణాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.చెరువు ఆయకట్టు ప్రాంతంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో నీటిని మళ్లించినట్లు తెలిపారు. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిని మల్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కట్టను తవ్వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు మరియు ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కట్ట మరమ్మతు పనులు పునరుద్ధరించి సప్లై ఛానల్ ద్వారా నీటిని తరలించే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అందుకోసం అవసరమైన నిధులను వెంటనే తెప్పించేందుకు కృషి చేస్తానని ఆ దిశగా రెవిన్యూ అధికారుల సహకారంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక చెరువు ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులను గుర్తించి పరిరక్షించాలన్నారు.ఈ సమావేశంలో తహసిల్దార్, ఇన్బనాధన్, మున్సిపల్ కమిషనర్ ఎన్వీ. రమణారెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్కల నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ లతో పాటు మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

అర్ధరాత్రి కుండపోత వర్షం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23-3.wav?_=3

అర్ధరాత్రి కుండపోత వర్షం.

#లో లెవెల్ బ్రిడ్జిలపై పొంగిపొర్లుతున్న వరద నీరు.

#కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు.

#మత్తడి దూకుతున్న పలు చెరువులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో లో లెవెల్ బ్రిడ్జిలపై ప్రమాదకరంగా ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో లెంకలపల్లి, నందిగామ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఈ మేరకు తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై వి గోవర్ధన్ అప్రమతమై తమ సిబ్బందిని వెంట తీసుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద భారీ కేడ్లతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు ప్రజలకు సూచన చేశారు. అలాగే పలు గ్రామాలలో చెరువులు నిండుకుండల మారి మత్తడి దూకుతున్నాయి. మండల కేంద్ర సమీపాన ఉన్న వెంకటపాలెం చెరువు భారీ ఎత్తున మత్తడి పోయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించేందుకు వెళ్ళగా మరికొందరు వలలతో చేపల వేట చేశారు.

Flood water overflowing

అదేవిధంగా మండలంలోని అతిపెద్ద చెరువు అయినా రంగయ్య చెరువు పూర్తిగా నిండి మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. శిధిలవస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాలకు ఎలాంటి ఎరువులు రైతులు వేయరాదని తాసిల్దార్ ముప్పు కృష్ణ మండల ప్రజలను కోరారు. వీరివెంట ఎంపీడీవో పసర గొండ రవి, పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version