సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు వరం. ‌

సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు వరం. ‌

జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్. ‌ ‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి. ‌

సీఎం సహాయ నిధి పేదలకు వరమని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ అన్నారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామంలోసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పలువురుపేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కులను అందజేశారు సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయం ఎంతో సహాయపడుతుందని అన్నారు పేదవారు అనివార్య పరిస్థితుల్లో ప్రవేట్ ఆసుపత్రిలో చేరి ఆర్థిక ఇబ్బందులకు గురైతే వారికోసం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నారని పేదవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కాంతాల సతీష్ రెడ్డి గౌరవ అధ్యక్షుడు మోత్కూరి మల్లయ్య ఉపాధ్యక్షులు పసునూటి సంపత్ మండ శ్రీకాంత్ దొమ్మటి అశోక్ వీళ్ళ తిరుపతి ఈళ్ల రమేష్ ఈర్ల అశోక్ పాల్గొనడం జరిగింది

సీఎం సహాయనిధి పేద ప్రజల జీవితాలలో వెలుగులు

సీఎం సహాయనిధి పేద ప్రజల జీవితాలలో వెలుగులు

భూపాలపల్లి నేటిధాత్రి

సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో రేగొండ, చిట్యాల కొత్తపల్లిగోరి టేకుమట్ల, మొగుళ్ళపల్లి, గణపురం, భూపాలపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలతో పాటు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లోని మొత్తం 191 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రూ.61,10,500/- విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసినారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ.అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు.మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సుంకరి రామచంద్రయ్య అప్పం కిషన్ సాంబమూర్తి తోట రంజిత్లబ్ధిదారులు పాల్గొన్నారు

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని

#పార్టీలకు అతీతంగా ఆరోగ్య పరంగా అండగా ఉంటానని భరోసా…

#63 మంది లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

 

 

 

ప్రజల ఆరోగ్యం కోసం పతాకంగా నిలిచిన సీఎం సహాయనిధి చెక్కులను పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం రోజున బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు రూ 28,48,600/- విలువైన చెక్కులు ,వరంగల్ మండలానికి చెందిన 5 మందికి రూ.5,00,580/-ల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎవరికి అయినా ఊహించకుండా వస్తాయి. అటువంటి సమయంలో ప్రభుత్వ మద్దతు అనేది ప్రజలకు వెన్నంటే నిలిచి అండగా ఉంటుంది అని అన్నారు.
ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు పార్టీలు, కులాలు, మతాలు అనే భేదాలు ఉండవు. ఒక్క మనిషిగా చూస్తూ, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటం కోసం నేనెప్పుడూ అండగా ఉంటాను అని తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం
ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స కోసం ఆర్థిక సాయాన్ని అందజేస్తూ వేలాది కుటుంబాలను ఆదుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం  పాల్గొన్నారు.

సిఎం రిలిప్ పండ్ చెక్కులపంపీణీ.!

సిఎం రిలిప్ పండ్ చెక్కులపంపీణీ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచేరాగడి గ్రామానికి చెందిన బాధితులకు
గురువారం ఉదయం ముఖ్య మంత్రి సహయనిధీ
చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల
అధ్యక్షుడు రామలింగారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version