రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన విద్యార్థికి స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఘనసన్మానం.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన విద్యార్థికి స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఘనసన్మానం.
మల్లాపూర్ అక్టోబర్ 14 నేటి ధాత్రి

 

మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సార రుత్విక్ జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనందున మల్లాపూర్ స్వర్ణకార చేతివృత్తుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జారపు గంగాధర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రిత్విక్ అనేక విజయాలు సాధించాలని, అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అలాగే నేటి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు ఎగ్యారపు శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శులు తిప్పర్తి కిషన్, సింహరాజు నరేష్, అలాగే సంఘ సభ్యులు తుమ్మనపల్లి శ్రీనివాస్, బెజ్జారపు తిరుపతి, బెజ్జారపు శ్రీనివాస్, కట్ట వీరేంద్ర చారి, గన్నరపు రమేష్, ఎగ్యారపు వెంకటరమణ, ద్రుశెట్టి రాజేష్, దురిశెట్టి శ్రీనివాస్, ఆకోజి వెంకటరమణ అలాగే విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జెడ్పిహెచ్ఎస్ రామాజీపేట్ విద్యార్థిని విద్యార్థులు

జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జెడ్పిహెచ్ఎస్ రామాజీపేట్ విద్యార్థిని విద్యార్థులు

 

రాయికల్ , అక్టోబర్ 6, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మండలం రామాజీపేట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీలలో ఈనెల 07 -10-2025 నుంచి 10-10-2025 వరుకు వాలీబాల్ కబడ్డీ ఖోఖో క్రీడా పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు గజ్జేల నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు లక్ష్మీకాంతం రమేష్ విజయ్ కుమార్ కిరణ్ రమ యశోద వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం..

వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం

పరకాలలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంధు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-78-1.wav?_=1

పరకాల నేటిధాత్రి
రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం పరిష్కారించాలని విద్యార్ధి సంఘాలు చేప్పట్టిన బందు పరకాల పట్టణంలో ప్రశాంతంగా కొనసాగిందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు.ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్,మండల అధ్యక్షుడు మడికొండ మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ పట్టణంలో ప్రైవేట్ స్కూలు మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైతం బందుకు మద్దతు తెలిపారని అన్నారు.ఖాళీగా ఉన్న టీచర్,ఎంఈఓ,డిఈఓ పోస్టులు భర్తీ చేయాలని,ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి,పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిదులు,అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌళిక సదుపాయాలు కల్పించాలని,పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని,అద్దె భవననాలలో నడుస్తున్న వసతి గృహలకు స్వంత భవనాలు నిర్మించాలని,గురుకులాలలో అశాస్త్రీయంగా తీసుకు వచ్చిన సమయపాలనను మార్చాలని బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని,ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధులు ఇవ్వాలని,విద్యార్థులకు ఆర్టీసిలో ఉచిత బస్పాసులు ఇవ్వాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్,లెక్చరర్ పోస్తులు భర్తీ చేయాలని ఎన్ఈపి-2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని బందుకు పిలుపునిచ్చామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ,మహేష్,రంజిత్,కృష్ణ,సురేష్,శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సబ్జెక్ట్ తప్పడంతో విద్యార్థి ఆత్మహత్య.

సబ్జెక్ట్ తప్పడంతో విద్యార్థి ఆత్మహత్య

మంచిర్యాల, నేటి ధాత్రి:

మంచిర్యాల పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్న అక్షయ్ (20) హనుమకొండలోని రెవెన్యూ కాలనీలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటఫణి శనివారం తెలిపారు.అక్షయ్ రెండు నెలల కిందట పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు.ఇటీవల పరీక్షల ఫలితాలు విడుదల కాగా అందులో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు.కొద్ది రోజుల నుంచి మానసిక ఆందోళనకు గురైన అక్షయ్ ఓ గదిలో ఫ్యానుకు ఉరేవేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

న్యాల్కల్ KGBV హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత.

న్యాల్కల్ KGBV హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-22.wav?_=2

న్యాల్ కల్ లో కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ లో ఐదుగురికి విద్యార్థులు అస్వస్థతకు గురి . విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. జహిరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు . విద్యార్థుల ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన విద్యార్థులకి మళ్లీ అస్వస్థత గురి కావడం చర్చనీ అంశం . వర్షాకాలం పరిశుభ్రత లోపించిందా ఆహారం లోపమా తెలియాల్సిందే. జిల్లా అధికారులు పర్యవేక్షణ లోపించింది .

Nyalkal KGBV hostel.

వెంటనే తహసిల్దార్ ప్రభులు మండల గిర్ధవర్ శ్యామ్ రావు హాస్టల్ లో పరిస్థితులను పరిశీలించారు.

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని.

సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని

పతకం సాధించిన విద్యార్థిని, మాస్టర్ ను అభినందించిన ప్రిన్సిపాల్, పీడి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని టీజిటి డబ్ల్యూ ఆర్ జే సి కి చెందిన విద్యార్థిని బానోత్ చార్మి ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలలో కిక్ బాక్సింగ్ విభాగంలో జిల్లా తరుపున పాల్గొని రజిత పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భముగా గురువారం పతకం సాధించిన విద్యార్థిని చార్మితో పాటు మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ ( కరాటే ) లను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, పీడి బి గౌతమి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరిన్ని పతకాలు సాధించాలని ఈ సందర్భముగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

నిరుపేద విద్యార్థికి సహాయం అందించిన ఎన్నారై.

నిరుపేద విద్యార్థికి సహాయం అందించిన ఎన్నారై

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణనికి చెందిన చేనేత కార్మికుడు కొండి సత్యం కుమార్తె కొండి వర్షిత తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల కళాశాలలోఎం.పీ.సీ గ్రూపులో వేయికి గాను సుమారు 976 మార్కులతో కళాశాల తృతీయ స్థానంలో మార్కులు సాధించడం జరిగినది. నిరుపేద విద్యార్థి అయిన వర్షితకు పై చదువుల కోసం ప్రముఖ ఎన్నారై సిరిసిల్ల అశోక నగర్ చెందిన గడ్డం భానుచంధర్(NRI)s/o సత్తయ్య మరియు వివేక వర్ధిని స్కూల్ 10వ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థి కొండి వర్షిత 40 వేల రూపాయలు పై చదువుల కోసం సహాయం అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు గుగ్గిల్లా అభినయ్ గౌడ్,బద్దెనపల్లి మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల అంజయ్య,మాజీ ఎంపీటీసీ సిలువెరీ ప్రసూన-నర్సయ్య, కొండ రాజేశం, కొండ రమేష్ లు పాల్గొన్నారు..

బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం.

సంవత్సరాల నుండి బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం తంగళ్ళపల్లి

నేటిధాత్రి:

 

 

 

లోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లిలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూల్ బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్స్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సూచిందని దీనితో దిక్కుతోచని స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. ఎలాగైనా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు కలెక్టర్ గాని చొరవ తీసుకొని వారికి బిల్లులు వచ్చే విధంగా చొరవ తీసుకొని వాళ్ల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారిని వేడుకున్నారు కలెక్టర్కు ఇచ్చిన ప్రజావాణి . సంబంధిత అధికారులకు పత్రంలో పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

మెడికల్ విద్యార్థికి ఆర్థిక సహాయం.

మెడికల్ విద్యార్థికి ఆర్థిక సహాయం…

కల్వకుర్తి నేటి ధాత్రి:

shine junior college

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మండలం నుచ్చుగుట్ట తండాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వర్త్యావత్ యశస్వినికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో చదివి సోమవారం వెలువడిన మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 445 ర్యాంకు సాధించింది. ఉత్తమ ఫలితాలు కనబరిచిన గిరిజన పుత్రిక యశస్విని సన్మానించిన ఉప్పల వెంకటేష్ యశస్విని మెడిసిన్ పూర్తి చేయడం కోసం పూర్తిగా ఉప్పల చారిటబుల్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. గిరిజన తండాల్లో పుట్టి, కన్నా తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగి నేడు ఉస్మానియా, గాంధీ వంటి మెడికల్ కళాశాలలో సీటును సాధించిన యశస్విని ఎంతోమంది గిరిజన బిడ్డలకు ఆదర్శమని ఉప్పల వెంకటేష్ కొనియాడారు.

జహీరాబాద్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.

జహీరాబాద్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

జహీరాబాద్ పట్టణంలో నివాసం ఉండే వెంకటరమణ (19) అనే ఆర్ ఎల్ ఆర్ కళాశాల విద్యార్థి, ఇంటర్మీడియట్ లో ఒక సబ్జెక్ట్ లో ఫేయిల్ అయినందుకు మనస్థాపం చెంది తమ నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఉరివేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న జహీరాబాద్ పట్టణ ఎస్ఐ కె. వినయ్ కుమార్ సోమవారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

◆ సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అవడంతో అఘాయిత్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

 

జహీరాబాద్: ఇంటర్మీడియట్లో ఫెయిల్అయి
నందుకు మనస్థాపానికి గురై వెంకట రమణ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ పట్టనంలో నివాసం ఉంటున్న రాయిపల్లి కృష్ణ కుమారుడు వెంకటరమణ (19) డాక్టర్ ఆర్ఎల్ఆర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మృతుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాశాడు. సోమవారం మధ్యానం 12 గంటలకు ఇంటర్ సప్లి రిజల్ట్స్ రావడంతో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వెంకట రమణ తల్లి వెంకటరమ ణకు ఫోన్ చేస్తే లిఫ్ట్చేయడంలేదని స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి చూడమని చెప్పింది.దీంతో తన స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా ఉరేసు కుని ఉన్నారు. స్నేహితులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీ క్షించిన వైద్యులు వెంకట రమణ మృతిచెందినట్లు ధృవీకరించారు. వెంకట్ రమణ మృతిపై తండ్రి కృష్ణ జహీరాబాద్ టౌన్ పీఎస్ లో ఎలాంటి అను మానాలు లేవని పేర్కొన్నట్లు ఎస్ఐ. కె. వినయ్ కుమార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

పెంచిన స్టూడెంట్స్ బస్ పాస్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి.

పెంచిన స్టూడెంట్స్ బస్ పాస్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి

జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తూ అడ్మిషన్స్ చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్

సిరిసిల్ల టౌన్( నేటి ధాత్రి ):

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలను 20% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తూ అడ్మిషన్స్ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేయడం జరిగినది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ
ఇప్పటికే గతంలో పెంచిన బస్ ఛార్జీలు, స్టూడెంట్స్ పాస్ ఛార్జీలు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ 20% ఛార్జీలు పెంచి అమలు చేస్తే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రధానంగా ఉన్నత విద్య కోసం బస్ నమ్ముకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోని చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే చాలా రూట్లలో విద్యార్థులు కోసం బస్సులు నడపడం లేదు. ఒక ప్రక్క బస్సులు సంఖ్య పెంచి, ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఛార్జీలు, బస్ పాసులు పెంచే ఆలోచన చేయడం దుర్మార్గపు చర్య. తక్షణమే పాసుల ఛార్జీలు పెంపు ఆలోచనలు విరమించుకోవాలి. లేకుంటే అన్ని డిపోల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని అన్నారు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని పాఠశాలలు ఉన్నాయని వాటిని పర్యవేక్షణ చేయడంలో జిల్లా విద్యాధికారుల లోపం స్పష్టంగా కనబడుతుందని వెంటనే పర్మిషన్ లేని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలని అన్నారు అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లకు ,పక్కా భవనాలు నిర్మించాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రినీ నియమించాలని డిమాండ్ చేశారు, లేని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు సాయి భరత్, శివ ,నాయకులు జస్వంత్, అఖిల్, అక్షయ్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థికి స్టేట్ ర్యాంక్.

పేద విద్యార్థికి స్టేట్ ర్యాంక్

బాలానగర్ నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో పదో తరగతి విద్యార్థి అమూల్య నిన్న వెలువడిన టీజీఆర్ జేసీ ఫలితాలలో.. ఏంఈసీ విభాగంలో స్టేట్ 1 ర్యాంకు సాధించింది. కొత్తకోట చెందిన సువర్ణ మల్లేష్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన కూతురు అమూల్యను బాలానగర్ గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. స్టేట్ బ్యాంకు సాధించడంతో పాఠశాల ప్రిన్సిపల్ అంజన్ రెడ్డి, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

విద్యార్థినికి 692 వ ర్యాంకు.

విద్యార్థినికి 692 వ ర్యాంకు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన హానిక EAPCET లో 692వ ర్యాంకు సాధించింది. కనిక తల్లిదండ్రులు నవీన, శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, తల్లిదండ్రుల కృషితో తనకు మంచి ర్యాంకు వచ్చిందని హానిక తెలిపారు.

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ప్రోత్సాహం.!

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ప్రోత్సాహం

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బూరుగుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శతాక్షి లండన్ వెళ్లడానికి అవసరమైన రూ.70 వేల విలువైన విమాన టికెట్ అందజేసిన ఎమ్మెల్యే

ఖండాంతరాలు దాటి చదువుకొని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాగా భారతదేశానికి ఖ్యాతి తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే

గంగాధర నేటిధాత్రి :

 

 

 

ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి అండగా నిలవడంలో ముందుంటారని మరోసారి నిరూపించుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థినిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శతాక్షి కి లండన్ లోని గ్రీన్ విచ్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదవడానికి అవకాశం వచ్చింది.ఉన్నత చదువుల కోసం శతాక్షి దేశాలకు వెళుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి వచ్చింది.ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడంలో ముందుండే ఎమ్మెల్యే మేడిపల్లి శతాక్షికి ఆర్థిక సహకారం అందజేయాలని నిర్ణయించుకున్నారు.మంగళవారం కరీంనగర్ లోని తన నివాసంలో శతాక్షిని అభినందించి, స్వంత ఖర్చులతో కొనుగోలు చేసిన రూ. 70 విలువైన విమాన టికెట్ ను అందజేశారు. ఖండాంతరాలు దాటి చదివి, అంబేద్కర్ వలె భారతదేశానికి ఖ్యాతిని తీసుకురావాలని విద్యార్థినికి ఎమ్మెల్యే సూచించారు.విమాన టికెట్ను అందజేసిన ఎమ్మెల్యేకు శతాక్షీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా విద్యార్థినిని ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను మండల ప్రజలు అభినందించారు.

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం రంజోల్కు చెందిన మహమ్మద్ కరీం కూతురు నూరిన్ ఫాతిమా లా విద్యాలో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించింది. HYDలో లా పూర్తి చేసిన ఫాతిమా మూడు రోజులపాటు HYDలోని సుల్తాన్ ఉల్ ఉలమ్ కాలేజ్ ఆఫ్ లాలో హార్మనీ ఇన్ డిస్ప్యూట్స్ అనే అంశంపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నాగేశ్వరరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. దీంతో కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు.

ఎస్ఎస్సి ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థి.!

ఎస్ఎస్సి ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థినిలకు సన్మానం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థినిలు టాపర్లుగా నిలవడంతో అధికారులు వారికి గురువారం ఘనంగా సన్మానం చేశారు.2024 – 2025 పదో తరగతి విద్యా సంవత్సరం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో జెడ్పి హైస్కూల్ లో చదువుతున్న ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థిని సముద్రాల నక్షత్ర 600 మార్కులకు 523 మార్కులు సాధించి మొదటి టాపర్ గా నిలవడంతో 600 మార్కులకు 495 మార్కులు సాధించిన దేవిక రెండవ టాపర్ గా నిలిచినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని,అలాగే ప్రభుత్వ పాఠశాలలో అత్యంత విద్య లభిస్తుందని హాస్టల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులకు పోషకమైన ఆహారంతో పాటు నాణ్యమైన విద్య లభిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాపూరావు,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సునీత,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుధా లక్ష్మి,విద్యార్థినిల తల్లిదండ్రులు,స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.

జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు.

జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు ముందస్తు అరెస్ట్

మంచిర్యాల నేటి దాత్రి

 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది మంచిర్యాల పోలీసులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నస్పూర్ అఖిల్. శ్రావణ్ . రాజ్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్బంగా నస్పూర్ అఖిల్ మాట్లాడుతూ బి సి ,ఎస్ సి, ఎస్ టి విద్యార్థుల ఫిజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంత వరకీ ఒక స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు అన్నారు విద్యార్థుల బంగారు భవిష్యత్తును గుర్తుంచుకొని ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేయాని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది

విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపాల్.

విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపాల్

నేటి ధాత్రి కథలాపూర్

 

 

 

మన కథలాపూర్ పద్మశాలి ముద్దుబిడ్డ జోగ మహాలక్ష్మి ద్వితీయ సంవత్సరం CEC విభాగం లో 984/1000 మార్కులు వచ్చినందుకు మాస్ట్రో కాలేజీ ప్రిన్సిపల్ ఆకుల రాజేష్  అభినందించారు.

ఇంటర్మీడియట్ ఫలితాలలో.!

ఇంటర్మీడియట్ ఫలితాలలో మెరిసిన కక్కిరాలపెల్లి విద్యార్థిని లయశ్రీ
ఇంటర్మీడియట్ ఎం. ఎల్ టి గ్రూపులో స్టేట్ మొదటి ర్యాంక్
ఆరూరి లయశ్రీ రాయపర్తి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని
ఆరూరి లయశ్రీకి గ్రామస్తులు బి. ఆర్. ఎస్ నాయకుల అభినందన

నేటిధాత్రి ఐనవోలు :-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో అయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన ఆరూరి లయశ్రీ ఇంటర్మీడియట్ ఎంఎల్టి గ్రూప్ లో స్టేట్ లో మొదటి ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన ఆరూరి సుమలత ప్రభాకర్ దంపతులకు కుమార్తె లయశ్రీ రాయపర్తి లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతూ ఈ ఘనత సాధించడం విశేషం.ఈ సందర్భంగా కక్కిరాలపెళ్లి గ్రామ బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు లయశ్రీ ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కంజర్ల రమేష్ మాట్లాడుతూ కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని రాష్ట్రంలోని అత్యుత్తమ ర్యాంకు సాధించడం మన గ్రామానికి గర్వకారణం అన్నారు. చదువులోనే కాకుండా లయశ్రీ సాఫ్ట్ బాల్ కాంపిటీషన్లో నేషనల్ లో సిల్వర్ మెడల్ సాధించడం కూడా విశేషం. ఇలాంటి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లయశ్రీ గ్రామంలోని యువత కే కాకుండా మండలంలోని యువత కూడా ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ బొల్లం ప్రకాష్ మాజీ వార్డు సభ్యులు మంద రజిత కాటబోయిన కుమార్ స్వామి టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నాయకులు యాదగిరి ఏలియా నిమ్మాని వెంకటేశ్వరరావు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version