ఘనంగా కోట మైసమ్మ బోనాలు

ఘనంగా కోట మైసమ్మ బోనాలు

 

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం కోట మైసమ్మ బోనాలను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కోట మైసమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బోనాల పండుగ ప్రసిద్ధమైనదన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పోచమ్మ తల్లిని దర్శించుకున్న…

పోచమ్మ తల్లిని దర్శించుకున్న

రాష్ట్రప్లానిoగ్ బోర్డు వైస్ చైర్మన్
చిన్నారెడ్డి

వనపర్తి నేటిదాత్రి .

 

 

తెలంగాణ రాష్ట్ర సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా వనపర్తి పట్టణ ములో పోచమ్మ గుడి దగ్గరపోచమ్మ తల్లి ని రాష్ట్ర ప్లా నింగ్ బోర్డు వైస్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి దర్శించుకున్నారు. చిన్నారెడ్డి పోచమ్మ అమ్మవారి ఆశీస్సలు వనపర్తి నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కారు ఆలయ కమిటీ సభ్యులు చిన్నారెడ్డి ని శాలువా తో సన్మానించారు చిన్నారెడ్డి వెంట. కాంగ్రెస్ నేతలు రాగి వేణు శ్రీరంగాపురం రాజేంద్రప్రసాద్ నంది మల్ల యాదయ్య మైనార్టీ నాయకులు అక్తర్ చీర్ల జనార్దన్ పార్టీ నేతలు ఉన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ నాయకులు అక్తర్,వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, వనపర్తి జిల్లా ప్లీడర్ కిరణ్ కుమార్,వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అనిష్, వనపర్తి జిల్లా అధ్యక్షులు రోహిత్ , వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు, నాగార్జున యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నాయకులు రాగి అక్షయ్ ఇర్ఫాన్ సీనియర్ నాయకులు రాగి వేణు కోళ్ల వెంకటేష్, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

గణపురం మండలంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల తో ముక్కులు

గణపురం మండలంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల తో ముక్కులు

పవిత్ర శ్రావణమాసం లో

చివరి బుధవారం పోచమ్మ తల్లికి బోనాల మొక్కులు

మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారికిని రెండు గ్రామస్తులు పూజించారు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం గణపురం లక్ష్మారెడ్డిపల్లి రెండు గ్రామాలలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
పవిత్ర శ్రావణమాసం పురస్కరించుకుని చివరి బుధవారం పోచమ్మ తల్లికి బోనాలతో మొక్కులు సమర్పించుకున్నారు. నియమ నిష్ఠలతో మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారిని పూజించారు.
డప్పు వాయిద్యాల నడుమ,శివ సత్తుల పునకాలతో గ్రామ వీధులలో ఊరేగింపుగా బోనాలు నెత్తిన ఎత్తుకుని పెద్ద సంఖ్యలో రెండు గ్రామస్తులు పోచమ్మ తల్లి దగ్గరికి చేరి వైభవంగా వేడుక నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లి ని కోరుతూ కోళ్లు,పొట్టేలను అమ్మవారికి బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు.

సురభిలో బోనాల సంబరాలు..

సురభిలో బోనాల సంబరాలు

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని సురభి పాఠశాలలో బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. అమ్మవారికి బోనాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొలాటం, తెలంగాణ జానపద నృత్యాలు, పాటలతో కార్యక్రమం చాలా రంజుగా సాగింది. విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈవేడుకలు మన సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేస్తూ అందరికి ఆనందాన్ని కలిగించాయి. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం, డైరెక్టర్ చిప్ప వీర నర్సయ్య, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version