కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు, శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు, జూలపల్లి నాగరాజు లు సిఐని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.