నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి…

నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి
-కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

https://youtu.be/ooGYBXQUVCQ?si=-goZNUdgZUHhhhjG

బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి,జక్కా ఇంద్రసేనారెడ్డిలు బుధవారం మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన పులుగుజ్జా అనూష(25),ఎర్రబోయిన లింగయ్య(90),బొంత రాజు(30)లు వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను సందర్శించి పరామర్శించారు. అనంతరం మూడు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున 75 కేజీల బియ్యం, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున రూ.9 వేల రూపాయలు నగదు అందజేశారు.
అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మహబూబ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల సహకారంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.పేద బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో పేద కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చెవిటి సదాకర్,మడిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు వెన్నెం సోమిరెడ్డి,హరిపరాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,1వ వార్డు మెంబెర్ తోట అశోక్,4,6వ వార్డు సభ్యులు రామగిరి రమ సురేష్, వల్లపు సైదులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల వెంకటరెడ్డి,చిరబోయిన కృష్ణ యాదవ్,వల్లపు రాఘవులు,లింగన్న,పనికర కొమురయ్య,దాసరి సాగర్, మహంకాల సంపత్, శనిగరం శివశంకర్,వెంకన్న, మురళి,మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గద్దల పరశురాములు,గ్రామ యూత్ అధ్యక్షులు గద్దల మధుకర్, వెంకన్న,లింగన్న,నాగన్న,ప్రశాంత్, ముకేశ్,మురేష్,సాగర్, రామకృష్ణ,యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ నుండి 25 కేజీల బియ్యం అందజేత…

బిఆర్ఎస్ పార్టీ నుండి 25 కేజీల బియ్యం అందజేత

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన అజంతా యూత్ అసోసియేషన్ తోలి అధ్యక్షుడు అయిన మిట్టపల్లి రమేష్ తల్లి మిట్టపల్లి సరోజన మరణించినారు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి పార్టీ తరుపున 25కేజీ రైస్ అందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మార్త శ్రీనివాస్, దాసరి రాములు, బి ఆర్ ఎస్ పార్టీ 2వ వార్డ్ మెంబర్ బానోత్ మధుకర్, రత్నం రాజు,భీష్మచారీ, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి చేయూత..

నిరుపేద కుటుంబానికి చేయూత

నేటిదాత్రి :హన్మకొండ

ఇటీవల కాలంలో బండారి లక్ష్మి ముదిరాజ్ అనారోగ్య రీత్యా మరణించిన నేపథ్యంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి తాళ్ళ రవీందర్, సింగారపు రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కుల పెద్దలు దండు నర్సయ్య, దండు రవి, దండు రాజు సమక్షంలో బాధిత కుటుంబానికి 10,000 పదివేల రూపాయలు క్వింటల్ బియ్యం అందజేశారు.

అనంతరం సంఘం నేతలు వార్డు మెంబరు మేక సుమలత రాజు, గంగరబోయిన నిరంజన్ లు సంయుక్తంగా మాట్లాడుతూ, కూలి పనికి వెళ్లి వచ్చి కట్టుకున్న భార్య లక్ష్మి తన కళ్ళ ముందు చనిపోతుంటే చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న కొమురయ్య పరిస్థితి, కుటుంబ దయనీయ ఆర్థిక స్థితిని అర్థం చేసుకొని

పిఆర్ ముదిరాజ్ సేవా సమితి పెద్దలు సిద్దిపేట మాజీ కౌన్సిలర్ పెసరు రాజన్న
గ్రామ వాస్తవ్యులు కె ఎస్ ఆర్ అభ్యాస్ విద్యాసంస్థ చైర్మన్ నరహరి రాజేందర్ రెడ్డి కుల ప్రముఖులు, దాతల సహకారంతో బాధిత కుటుంబానికి సాయం చేయడం చాలా గర్వకారణమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ముదిరాజ్ జాతి ఐక్యతకు దోహదపడతాయని, ముదిరాజు బిడ్డలు దానం చేసే స్థాయికి ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సేవకులు ముద్రబోయిన రమేష్
దండు రవి, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు దండు నర్సయ్య, కార్యదర్శి దండు రాజు, డైరెక్టర్ మేక అనిల్, మేక సుమలత రాజు;
గౌరవ సలహాదారులు గాలిబు సంపత్, గంగరబోయిన నిరంజన్ వాడకట్టు కుల బంధువులు కుమ్మరికుంట్ల రాంబాబు, భూమ సంపత్, పొన్నం, కోమ్మయ్య, దండు రాజేందర్ , రాములు కుమ్మరికుంట్ల చంటి యువజన నాయకులు గంగరబోయిన నవీన్, దండు ఉదయ్ కిరణ్, సందీప్, దండు రమేష్, సాంబయ్య, దండు బాలయ్య, దండు చిరంజీవి ముదిరాజ్; బండారి లక్ష్మి కుటుంబ సభ్యులు కొమురయ్య, కూతురు ఎలా స్వాతి, సంధ్యరాణి, సిరి చందన, రిక్విత మణికుమార్ పాల్గొన్నారు.

“శ్రీసిటీకి కొత్త ఎస్ఐ ప్రియాంక”

*శ్రీసిటీ హైటెక్ పి.ఎస్ నూతన ఎస్ఐ గా ప్రియాంక..

శ్రీసిటీ(నేటిధాత్రి)డిసెంబర్ :

 

శ్రీసిటీ హైటెక్ పోలీస్టేషన్ నూతన ఎస్ఐ గా ప్రియాంక సోమవారం భాద్యతలు చేపట్టారు.
తిరుపతి ఎస్.బి నుంచి ఇక్కడ కు ఉన్నతాధికారులు బదిలీ చేయడం జరిగింది.
ఎస్ఐ ప్రియాంక గతంలో నాగలాపురం, నారాయనవనం మండలాల్లో విధులును నిర్వహించిఉన్నారు‌.
అలాగే బుచ్చినాయుడు కండ్రిగ ఎస్.ఐ సుధీర్ కుమార్ రెడ్డిని, చంద్రగిరి పిఎస్ నుండి చిత్ర తరుణ్ ను ఉన్నతాధికారులు ఇక్కడకు బదిలీ చేశారు.
దీంతో శ్రీసిటీ హైటెక్ పోలీస్టేషన్ లో ముగ్గురు ఎస్ఐ లు నూతనంగా విధులును నిర్వర్తించనున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ప్రియాంక మాట్లాడుతూ..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధి నిర్వహణలో రాజీ లేకుండా కృషిచేస్తామన్నారు.
శ్రీసిటీ పారిశ్రామిక వాడ భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక మైన రీతిలో భద్రత చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు.
శ్రీసిటీ సెజ్ గ్రామీణ ప్రాంత ప్రజలుకు, మహిళా కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారుఈ ప్రాంతంలో ఏవైనా భద్రతా పరమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

రాయికల్ అక్టోబర్ 6, నేటి ధాత్రి:

 

రామాజీపేట గ్రామానికిమాజీ మంత్రి జీవన్ రెడ్డి చొరువతో రామాజీపేట గ్రామానికి చెందిన ఆరెల్లి గాయత్రి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్,20,000 ,గ్రామ కాంగ్రెస్ నాయకులు అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గుజ్జులా మోహన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ హరీష్ రావు,నాయకులు రాజేశ్వర్ రావు,నారాయణ,రాములు, సుధీర్ రెడ్డి,రాజు,తిరుపతి, గౌతమ్,జల తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version