మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం..

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం
గాంధీనగర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన స్వర్గస్తులైన కీర్తిశేషులు కీర్తి శ్రీకాంత్ దిన కర్మ కు హాజరైన భూపాలపల్లి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంపటి భువన సుందర్ మాజీ తాజా సర్పంచ్ మాధం మమత – సుధాకర్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోతరాజు సురేష్, కాంగ్రెస్ నాయకులు గుడ్డేటి సురేష్, కడారి సుమన్, వేంపటి సురేందర్, పల్లెవెని రాజయ్య,బోల్ల భిక్షపతి, తుముల కుమార్, బొళ్ళశంకర్,కీర్తి శంకర్,కీర్తి భద్రయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు ప్రమోద్,అందరు కలిసి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీ ల బియ్యాన్ని మరియు ఆర్థిక సాయం 2500 రూపాయలు అందించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఆదుకొని అండగా ఉంటానని ధైర్యం చెప్పారు

ఆనారోగ్య మహిళకు ఆర్థిక సహాయం.

ఆనారోగ్య మహిళకు ఆర్థిక సహాయం–ఉదయం ఫౌండేషన్

రాయికల్ , జూలై 23, నేటి ధాత్రి:

మండలం అయోధ్య గ్రామానికి చెందిన తునికి జల (42) గత కొన్ని నెలలుగా షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ టాబ్లెట్స్ తీసుకుంటుంది.భర్త రాజేశం 6 సంవత్సరాల క్రితం మరణించాడు. వీరిది నిరుపేద కుటుంబం. రేకుల షెడ్ లో ఉంటూ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. అనారోగ్యం కారణంగా గత కొన్ని నెలల నుండి బీడీలు మానేసి మంచం పట్టి , హాస్పిటల్ కి వెళ్ళదామంటే డబ్బులు లేక ఉదయం ఫౌండేషన్ సంప్రదించాగా ఈ రోజు 5000 వేల రూపాయల ఆర్థిక సహాయన్నీ అందించారు.ఈ కార్యక్రమంలో పంచతి నరేష్, బాలరాజు, రాజేందర్, రాజశేఖర్, మహమ్మద్ అస్లాం, తోట రాజేష్ లు పాల్గొన్నారు.

బాధిత మెకానిక్ కుటుంబాలకు రూ.30 వేలు ఆర్థిక సాయం.

బాధిత మెకానిక్ కుటుంబాలకు రూ.30 వేలు ఆర్థిక సాయం

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 21:

ముగ్గురు బాధిత టు వీలర్స్ మెకానిక్స్ కు తిరుపతి టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి తెలియజేశారుతిరుపతికి చెందిన గోపాల్ (హార్ట్), చంద్రగిరి కి చెందిన చిన్న తంబి ( కిడ్నీ), తలకోనకు చెందిన సుబ్రహ్మణ్యం ( కాలు విరిగి) సమస్యలతో బాధపడుతున్న ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఆవుల ముని రెడ్డి తన తోటి అసోసియేషన్ నేతలు సభ్యులతో కలిసి అందజేశారు. అలాగే 70 మంది మెకానిక్ లకు స్పెషల్ టూల్ కిట్స్ అందజేశారు. అంతేకాకుండా బోస్ డి ఎస్ 7 కంపెనీ ఏరియా మేనేజర్ సతీష్ చంద్ర తో త్వరలో ఆ కంపెనీ బైక్ ను గురించి టూవీలర్స్ మెకానిక్లకు అవగాహన కల్పించినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణరావు సెక్రెటరీ గురు ఆచారి జాయింట్ సెక్రెటరీ తేజారెడ్డి ట్రెజరర్ బాబు కమిటీ మెంబర్లు నాగరాజు పాపయ్య మురుగ, బాధిత మెకానిక్స్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన జన్నే అంజి కుటుంబానికి ఆర్థిక చేయూత,

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన జన్నే అంజి కుటుంబానికి ఆర్థిక చేయూత,
– 5000 రూపాయలను అందించిన జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలు మారుతి.
నేటి ధాత్రి- మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నె అంజి అనే విద్యుత్తు తాత్కాలిక ఉద్యోగి ఈనెల మూడవ తేదీన ప్రమాదవశాత్తు విద్యుత్తు పోలు నుండి విద్యుత్ షాక్ తగలడం వలన కిందపడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు ప్రస్తుతం హైదరాబాదు యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం పొందుతున్నాడు,

గాయపడిన జన్నె అంజి నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వాడు కావడంతో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది జన్నె అంజి తండ్రి సైతం మంచాన అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉండటంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది మొట్లపల్లి సబ్స్టేషన్లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న జన్నె అంజి కి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేకపోవడంతో.. అంజికి మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా తయారయింది. అంజి దయనీయ పరిస్థితి గురించి వివిధ పత్రికలలో కథనాలు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అధినేత ఐలు మారుతి స్పందించి బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించాడు అంతేకాకుండా భవిష్యత్తులో తన వంతు సహాయంగా చేతనందిస్తానని భరోసా ముట్లపల్లి తాజా మాజీ సర్పంచ్ నరహరి పద్మా వెంకటరెడ్డి 5000 రూపాయలను అందించగా బజ్జూరి వేణుగోపాల్ వెయ్యి రూపాయలు బజ్జూరి వీరన్న పెడిసిల్ల 1000 రూపాయలు గూడూరి రఘుపతి రెడ్డి 1000 రూపాయలు శ్రీ పల్లి రాజేష్ 2000 రూపాయలు దర్శనాల సురేష్ 2000 రూపాయలు టేకుమట్ల లైన్మెన్ రఘు వెయ్యి ఇలా చాలామంది దాతలు స్పందించి బాధిత కుటుంబానికి అందించి తమ ఔదార్యాన్ని చాటారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిలు మారుతి. ఆలయ కమిటీ చైర్మన్ గూడూరు రఘుపతి రెడ్డి బజ్జూరి వేణుగోపాల్ బజ్జూరి వీరన్న సీనియర్ జర్నలిస్టు రాళ్ల బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు,

పొలంలో జారి పడి వ్యవసాయ కూలీ దుర్మరణం

పొలంలో జారి పడి వ్యవసాయ కూలీ దుర్మరణం
పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన సామాజిక కార్యకర్త నల్లమారి రమేష్
రైతు కూలీలకు సైతం భీమా సౌకర్యం కల్పించాలి
మృతుని కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి.
నేటి ధాత్రి అయినవోలు

అయినవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన సింగారపు రాములు (50) అనే రైతు కూలి అదే గ్రామానికి చెందిన ఓ రైతు దగ్గర వ్యవసాయపనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒడ్డు పైనుంచి కాలుజారి బురదలో పడి మరణించినాడు. మృతునికి భార్య నలుగురు ఆడపిల్లలు. నిరుపేద కుటుంబానికి చెందిన రాములు తను ఇన్నాళ్లు కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించాడు. అయితే ప్రమాదంలో రాములుమృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు నిరాశ్రయులుగా మిగిలిపోయినారు. అయితే ఆ కుటుంబం యొక్క దీనస్థితిని తెలుసుకున్న సామాజిక కార్యకర్త నల్లమారి రమేష్ సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సాయంగా 5000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని విధాల ఈ కుటుంబాన్ని ఆదుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి భర్త మరణంతో వితంతువుగా మారిన దేవేంద్రకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థాన డైరెక్టర్ సింగారపు రాజు గ్రామ పెద్దలు బంధువులు ఉన్నారు.

ఆటో డ్రైవర్ కి ఆర్థిక సహాయం.

ఆటో డ్రైవర్ కి ఆర్థిక సహాయం

మందమర్రి నేటి ధాత్రి

 

 

ఈ రోజు మందమర్రి పట్టణంలో ని 24 వ వార్డు విలేజ్ మందమర్రి లోని ఆటో డ్రైవర్ బైర్నేని పొషం గారి తల్లి గారు చనిపోయి ఈ రోజు దశ దిన కర్మ లకు హాజరై 50 కిలోల బియ్యం 2016/- రెండు వేల పదహారు రూపాయలను ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మొయ్య రాంబాబు ,ఆటో డ్రైవర్ల సమక్షంలో వారి కుటుంబనికి అందజేసిన ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బండి సదానందం యాదవ్ గారు

మెకానిక్ మిత్రునికి ఆర్థిక సహాయం.

మెకానిక్ మిత్రునికి ఆర్థిక సహాయం

నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో జియా గ్యారేజ్ నడిపిస్తున్న మెకానిక్ యూనిస్ ప్రమాదవశాత్తు బైక్ చైన్ లో పడి ఎడమచేతి రెండు వెళ్ళు పూర్తిగా కట్ కావడం జరిగింది.ప్రమాదానికి గురైన వ్యక్తి నెల రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో అతని యొక్క జీవనాధారం కొరకు మెకానిక్ యూనియన్ ని సంప్రదించినట్లు తెలిపారు.ఈ విషయం పై వెంటనే స్పందించిన నస్పూర్ కాలనీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అతనికి ఆర్థిక సహాయంగా11,000 వేల రూపాయలను మంగళవారం అందించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్ మాట్లాడుతూ టూవీలర్ మెకానిక్ యూనియన్ ఉండడం వల్ల మెకానికులకు ఎలాంటి ఆపద వచ్చిన యూనియన్ అండగా ఉంటుందని యూనియన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అదేవిధంగా యూనియన్ లో లేనివారు కూడా సభ్యత్వం తీసుకుని యూనియన్ నుంచి ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మెకానిక్ సోదరులు ఉపయోగించుకోవాలని కోరారు.అలాగే ప్రతి కమిటీ సభ్యుడు మరియు మెకానిక్ సోదరులు యూనియన్ లో లేని వారిని కూడా యూనియన్ సభ్యత్వం తీసుకునే విధంగా ప్రతి ఒక్క మెకానిక్ తో మాట్లాడి యూనియన్ వల్ల ఏమిటి లాభాలు ప్రతి ఒక్క మెకానిక్ మరియు యూనియన్ కమిటీ సభ్యులు తెలియజేయాల్సిందిగా కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రంగు భాను ప్రకాష్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల నరేష్ గౌడ్,ఉపాధ్యక్షులు పెండెం భాస్కర్,చంద్రమౌళి,ప్రసాద్, అల్లావుద్దీన్,బానేష్ పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

 

శనివారం కల్వకుర్తి మండలం లోని తర్నికల్ గ్రామానికి చెందిన వర్కాల కృష్ణయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తర్నికల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ రుక్ముద్దీన్, మాజీ వార్డు సభ్యులు దేవయ్య, మాణిక్యరావు, వెంకటరత్నం, కృష్ణయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన.

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బాల్యమిత్రులు ..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:-

 

 

 

చిన్ననాటి కాలంలో వారితో పాటు చదువుకున్న మిత్రుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తోటి విద్యార్థులు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. పొత్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో వారితోపాటు విద్యను అభ్యసించిన ఎనగందుల రాజు ఇటీవల మల్లయ్య పల్లె గ్రామంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అప్పట్లో రాజు తో చదువుకున్న మిత్రులందరూ రాజు కుమార్తె పేరు మీద ఉన్నత చదువులు కొరకు రూ. ఇరవై ఐదు వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిదుల రవీ గుండ్లపల్లి శ్రీనివాస్ వంగ కుమార్ గడ్డం ఉపేందర్ ఐలయ్య రవి పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి ధాత్రి

 

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం మాదాయ పల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప్పలా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. రూ. 3 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ హైమావతి రామస్వామి, యాదయ్య, సుధాకర్, దశరథం, లక్ష్మీనారాయణ, పరంజ్యోతి, యాదయ్య, శేఖర్, యాదయ్య, పెంటయ్య, రామస్వామి, మైసయ్య, జంగయ్య, మైసయ్య, లక్ష్మయ్య, మల్లేష్, పరుశరాములు, పర్వతాలు, సత్యం, రాజు, రవి, కుమార్, భగవంతు, రమేష్, శ్రీశైలం, అశోక్, వినోద్, సతీష్, ప్రశాంత్, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేర్ కి ఆర్థిక సహాయం..

ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేర్ కి ఆర్థిక సహాయం చేసిన కిరాణం వ్యాపారి
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో చిట్యాల రోడ్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఆర్యవైశ్య వైకుంఠ రథం రిపేరు చేయించడానికి వనపర్తి పట్టణానికి చెందిన వాసవి సప్లయర్స్ ఎదురుగా చిరు కిరాణం వ్యాపారి ద్వారకా కిరాణం కాలూరు శ్రీనివాసులు శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజు కు అందజేశారు పూరి ని శాలువాతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు బచ్చురాం కాంగ్రెస్ నాయకులు రాజకుమార్ శెట్టి ఆవోప పట్టణ అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు లగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టిని సన్మానం చేశారు ఆర్యవైశ్య వైకుంఠంరథాని కి ఆర్థిక సహాయం చేసిన చిరు వ్యాపారి కాలూరు శ్రీనివాసులశెట్టిని ఆర్యవైశ్య నేతలు అభినందించారు

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత..

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత

రాష్ట్ర ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ చైతన్య నగర్ కాలనీలో ఇటీవల అకాల మరణం చెందిన పందుల యాకయ్య కుటుంబాన్ని పరామర్శించి ఒక క్వింటా బియ్యం ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల రవి బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్ ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ సొస కండ్ల సుభాష్ రెడ్డి పెండ్యాల లక్ష్మణ్ బోళ్ల కట్టయ్య ఉల్లి వెంకటేశ్వర్లు కీర్తి సారయ్య ఎస్.కె. యాకూబ్ బి వెన్ను ఎల్లయ్య తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version