ప్రజ గుండెలో ఉండే నాయకుడు బొగ్గుల జగదీశ్వర్..

ప్రజ గుండెలో ఉండే నాయకుడు బొగ్గుల జగదీశ్వర్..

◆-: ప్రజాసేవకుడు ప్రజల కష్టం పంచుకునే నిస్వార్థ సేవకుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం గ్రామ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ ఝరాసంగం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీలో బలపరచడానికి ముఖ్య నాయకులుగా ఎదిగిన జగదీశ్వర్ ఎందుకంటే గ్రామంలో 60 సంవత్సరాలు పరిపాలించిన పేరు పొందిన నాయకులకు అడ్డుగోడగా నిలిచి ఝరాసంగం గ్రామంలో మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి సర్పంచ్ గా ఎదిగిన ఏ కేక నాయకుడు బొగ్గుల జగదీశ్వర్ రెండోసారి తన అభ్యర్థి వినోద బాలరాజును నిలబెట్టి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి రెండోసారి వినోద బాలరాజును గెలిపించడం జరిగింది గ్రామంలో సత్త ఢీకొనే నాయకుడు అంటే ఒకటే అని గ్రామస్తులు అనుకుంటున్నారు గ్రామ ప్రజలందరూ జడ్పిటిసి గా పోటీ చేసి ప్రజల మధ్యలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్న ఏకైక నాయకులు బొగ్గుల జగదీశ్వర్ అని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఢీకొనే సత్తా ఒక్కడేనని అనుకుంటున్నారు, గ్రామంలో 5 సంవత్సరాలు సర్పంచిగా పనిచేసి ప్రజల గుండెలో చోటు సంపాదించుకున్న ఇలాంటి నాయకుడు మన మధ్యలో మండల స్థాయి పదవిలో ఉండి మన అందరిని కంటికి రెప్పలాగా కాపాడే నాయకుడిని గెలిపించుకుందాం అంటున్న గ్రామ ప్రజలు

పండుగలతో అనుబంధాలు బలపడతాయి: మోటే ధర్మారావు

పండుగలతో అనుబంధాలు బలపడతాయి..

సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

పండుగల ద్వారా కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమైందని ఈ సంక్రాంతి మీ జీవితాలలో కొత్త కాంతులు దింపాలని సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరాలని ఈ ఏడాది పొడుగునా ఇంటింటా సిరులు కాంతులు విరిసిల్లాలని ఆకాంక్షించారు ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మండల నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం మల్చెల్మ తండా కి చెందిన మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చందర్ చౌహాన్ గారి తల్లి గారు మరణించడం విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే గారితో పాటుగా హోతి బి గ్రామ సర్పంచ్ మచ్చేందర్, హుగ్గెల్లి తండా సర్పంచ్ భీమ్ రావ్ ,శేఖపూర్ తండా సర్పంచ్ మోహన్ చౌహాన్,మాజి సర్పంచ్ లు చిన్న రెడ్డి,జగదీష్ ,మండల బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు వాహీద్ అలీ మాజీ ఎంపీటీసీ లు మొయిన్ ,ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు ..

దత్త జయంతి సందర్భంగా ఆశ్రమాన్ని దర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి…

దత్త జయంతి సందర్భంగా ఆశ్రమాన్ని దర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామ పంచాయతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుద్ర గాయత్రి, గురువారం దత్త జయంతి సందర్భంగా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని ఆశ్రమానికి వెళ్లి శ్రీ శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ ను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రుద్ర కృష్ణ, మాజీ సర్పంచ్ గాజుల బాల కిష్టయ్య, వార్డు అభ్యర్థులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

స్వర్గీయ ఆదినారాయణ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్..

స్వర్గీయ ఆదినారాయణ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ స్వర్గీయ మొగిలిశెట్టి ఆదినారాయణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మరియు ముఖ్య నాయకులతో కలిసి హాజరై, విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ఆదినారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదినారాయణ ఇరవై ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పంబాపూర్ గ్రామ సర్పంచ్ గా ప్రజాసేవకు పునీతుడైన గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే కొనియాడారు. పంబాపూర్ గ్రామాభివృద్ధికి బాటలు వేసిన నిరంతర శ్రామికుడు ఆదినారాయణ అని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అయ్యప్ప పూజలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్…

అయ్యప్ప పూజలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలోని శ్రీ అయ్యప్ప స్వామి.. శుక్రవారం మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఝరాసంగం మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ తన దంపతులతో హాజరయ్యారు. అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని ఏర్పరుచుకోవాలన్నారు. భక్తితో ముక్తి లభిస్తుందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో. పెద్ద స్వామి సంఘటన
పప్ప స్వామి జగదీశ్వర్ స్వామి నరేష్ స్వామి రెడ్డి స్వామి తదితరులు పాల్గొన్నారు,

హన్మంత్ రెడ్డి — రజిత వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

హన్మంత్ రెడ్డి — రజిత వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall

ఝరాసంగం మండల కేంద్రంలో కక్కెరవాడ గ్రామానికి చెందిన హన్మంత్ రెడ్డి — రజిత కుమార్తెల నూతన వస్త్రధారణ కార్యక్రమంలో చిన్నారులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి సర్పంచ్ లు బస్వరాజ్, శ్రీనివాస్ రెడ్డి,సంగారెడ్డి, నాయకులు డాక్టర్ నాగన్న,సోహైల్, దత్త రెడ్డి నాయకులు ,కార్యకర్తలు తదితరులు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు

మహాదేవపూర్ అక్టోబర్ 6 (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబాన్ని సోమవారం రోజున రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి పరామర్శించారు. బ్రాహ్మణపెళ్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెషినేని మాధవరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు చల్ల నారాయణరెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనంతరం జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, బ్రాహ్మణ పెళ్లి గ్రామానికి సర్పంచిగా ఎనలేని సేవలు అందించారని ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్, మండల నాయకులు ఐలయ్యయాదవ్ రవీందర్, వెంకటేష్, కొక్కు రాకేష్, హరీష్, పలువురు నాయకులు, ప్రజల పాల్గొన్నారు.

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్ గీత భాస్కర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-64.wav?_=1

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్ గీత భాస్కర్

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గీతా భాస్కర్ గత కొద్ది నెలల క్రితం బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళగా తిరిగి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ సర్పంచ్ గీత భాస్కర్ తో పాటు పూజారి సాంబయ్య పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, మారం రాము, గాదె భద్రయ్య, గుంటుక సోమయ్య,బండి సత్యనారాయణ రెడ్డి, నరేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మోహన్ రెడ్డి, దొమ్మటి పురుషోత్తం, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్ గ్రామా మాజి సర్పంచ్ వీర్శెట్టి పాటిల్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు వారి నివాసానికి చేరుకుని నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు అండగా ఉంటామని మనోధైర్యని కలగజేశారు ఎమ్మెల్యే గారితో పాటుగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి ,మాజి సర్పంచ్ మాజి ఎంపీటీసీలు చంద్రన్న పటేల్, వెంకట్ శశి వర్ధన్ రెడ్డి,నాగన్న సయీద్ ఆనంద్ తదితరులు ఉన్నారు.

“గణపతి లడ్డు వేలంలో జట్టగొండ మారుతి విజయం…

గణనాథుని లడ్డు వేలం పాటలో 16 వేల పలికిన మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల మల్గి గ్రాములోని హనుమాన్ మందిరంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణనాథుని లడ్డు వేలం పాటలో మొదటి లడ్డును 16 వేలకు మాజీ సర్పంచ్ జట్టగొండ మారుతి కురుమ దక్కించుకోవడం జరిగింది గ్రామంలో పలు చోట్ల వెలిసిన గణనాథులు పూజల అనంతరం నిమజ్జనానికి తరలాయి. చెరువులో నిమజ్జనం చేశారు పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి గణనాథులు నిమజ్జనం చేశారు,

భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమర్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T140105.821.wav?_=2

 

భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమర్జనం.

కల్వకుర్తి / నేటి దాత్రి:

కల్వకుర్తి నియోజకవర్గం లోని గుండూర్ గ్రామంలో సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయము భక్తి శ్రద్ధలతో గణపతి హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నము అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రము గణేష్ నిమజ్జనంలో మొదటి లడ్డు వేలంలో రూ 2,50,116 ఆజాద్ యువజన సంఘం తీసుకోవడం జరిగింది. రెండవ లడ్డు రూ 30,000 భుజాల పర్వత్ రెడ్డి దక్కించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, పర్వత్ రెడ్డి, నర్మదా, గ్రామ పెద్దలు, హనుమాన్ గణేష భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-79-3.wav?_=3

 

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శ్రావణమాసం ముగింపు సందర్భంగా నవనాథ సిద్దేశ్వర ఆలయంలో అన్నదానం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T124315.562.wav?_=4

శ్రావణమాసం ముగింపు సందర్భంగా శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమం

◆:- మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి

జహీరాబాద్ నీతి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం మల్గి గ్రామం
శ్రావణమాసం ముగింపు సందర్భంగా శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి ఆలయ కమిటీ సభ్యులు వాసు జైపాల్ రెడ్డి కృష్ణ రెడ్డి తుకారాం బాబు అంబేజీ జగన్నాథ్ గౌడ్ మహేష్ నాగేష్ సాయినాథ్ గోవర్ధన్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు,

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-57-2.wav?_=5

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవరణలో చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నెంబర్ మల్లన్న పటేల్ మాజీ సర్పంచ్ పెంటయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రఘు మాజీ వార్డ్ మెంబర్ ఆన్సర్ సీనియర్ నాయకులు ల్యాఖత్ అలీ రాజేందర్ సింగ్ అశ్విరఫ్ అలీ రజాక్ రవి కృష్ణ ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు,

మా ఇల్ల పట్టాలు ఇప్పించండి – పైడిగుమ్మల్ గ్రామస్థులు ఆవేదన

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T114101.810-1.wav?_=6

 

మా ఇల్ల పట్టాలు ఇప్పించండి – పైడిగుమ్మల్ గ్రామస్థులు ఆవేదన

◆-ముపై ఏళ్ల నుండి పట్ట సర్టిఫికెట్ తన వద్దే పెట్టుకున్న మాజీ సర్పంచ్

◆-ఎవరైనా ఏదైనా చేసుకోండి అంటున్న వైనం…!

◆-తన సన్నీ హిత వర్గాలకు ఇళ్ల ఖాళీ స్థలాలు కేటాయించి…..స్థానిక సంస్థ ఎన్నీకలో ఓటు బ్యాంకు పెంచుకునే వైనం..

◆:- …సహించిదే లేదంటున్నా గ్రామస్థులు…

 

 

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పైడిగుమ్మల్ గ్రామం లో సంచలనం రేపుతున్న వ్యవహారం.ఆ గ్రామస్థులు మాట్లాడుతూ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇల్ల స్థలాలు పట్టా పేపర్ స్ మాజీ సర్పంచ్ వద్దే ఉంచుకొని తన ఇష్ట రాజ్యాంగ వ్యాహరిస్తున్నారు.గ్రామానికి సంభందించిన కాటిలో స్థలం సర్వే నెంబర్ 5,6,7 గల మొత్తం 2.11గుంటల ప్రభుత్వం భూమి అప్పటి ప్రభుత్వం (కాంగ్రెస్ )30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించింది.అయితే అప్పుడున్న సర్పంచ్ మా గ్రామ సర్పంచ్ చే కదా అని నమ్మీ తమ సర్టిఫికెట్ స్ ఖాళీ స్థలాలు మ్యాప్ అప్పగించారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజురు అవ్వడం తో తమ సర్టిఫికెట్ ఇల్ల స్థలాలు కేటాయించాలని అప్పటి గ్రామ సర్పంచ్ బి.మొల్లయ్య అడుగగా వారు వారి అనుచరులకు ఆ స్థలాలను కేటాయించి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు బ్యాంకు పెంచుకొనే ఆలోచన తో నిజమైన లబ్బిదారుల కు బెదిరింపుల కు పాల్పడుతున్నాడు గడిచిన సంవత్సరం కిందట ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులు వద్ద రూపాయలు 1000.చొప్పున ఒక్కరి వద్ద వసూలు చేసి, మీ స్థలాలను మీకు పంచుతాను అని వారికి తో చెప్పీ డబ్బులు వసూలు చేసాడు ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు మంజురు అవ్వడం తో ఇల్ల స్థలం కలిగిన మాజీ సర్పంచ్ ను అడుగగా నేను పంచను అని అంటున్నాడు.దీనిని దృష్టిలో పెట్టుకొని వెంటనే గ్రామ పెద్దలు యువకులు సంబంధిత మండల అధికారికి వినతి పత్రం అందజేసి ఎవరూ స్థలాలను వారికి కేటాయించాలని కోరరు తహసీల్దార్ స్పందించి
వెంటనే ఆ స్థలాల పై ఎన్కెవ్వరి చేయించి నిజమైన అర్హులకు కేటాయిస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్ మాజీ ఎంపీటీసీ జ్ఞనరత్నం అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు చీమల.ప్రశాంత్ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం గ్రామ కార్యదర్శి కాడి కరుణాకర్ గ్రామ యువకులు ప్రేమ సంపత్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మోహన్ చీమల ప్రేమ్ కుమార్ రమేష్ అనిల్ నాగేష్ దానమ్మ అంతమ్మ రుతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ధనసిరి గ్రామంలో అమర జవాన్ స్థూపం ప్రారంభం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T121835.235.wav?_=7

 

ధనసిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర జవాన్ స్థూపం ప్రారంభోత్సవ

◆:- ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ధనసిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర జవాన్ స్థూపం ప్రారంభోత్సవ పాల్గొని
ఈ సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశానికి చేస్తున్న సేవ అభినందనీయం అని ,నేటి యువతక జవాన్ లను ఆదర్శంగా తీసుకోవాలి అని , మన నియోజకవర్గం ధనసిరి గ్రామంలో 80 మంది వరకు సైనికులుగా ఉన్నారు ఇది మన అందరికి గర్వ కారణం అని అన్నారు .

 

ఎమ్మెల్యే గారితో పాటు గా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి సర్పంచ్ లు హస్బి రాజు ,చిన్న రెడ్డి ,మహిపాల్ ,అశోక్ రెడ్డి, ప్రవీణ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

ఆర్షద్ పటేల్‌ను పరామర్శించిన జ్యోతి పండాల్..

ఆర్షద్ పటేల్ గారిని పరామర్శించిన బీజేపీసీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం మాడ్గ్గి గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఆర్షద్ పటేల్ కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతు ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యం తో కోలుకున్న సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్ ఈ రోజు పట్టణంలోని రాంనగర్, బృందావన్ కాలనిలో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థిని తెలుసుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాయికోటి నర్సిములు ఉన్నారు.

ఘనంగా ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-12-2.wav?_=8

ఘనంగా ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ జన్మదిన వేడుకలు

◆:- వేడుకల్లో సిడిసి మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ గారి జన్మదిన వేడుకలు ఝరాసంగం మండల బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించి, శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి డి సి మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్,బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు సంగమేశ్వర్ పాటిల్ విజేందర్ రెడ్డి ఎజాజ్ బాబా నాగన్న పటేల్,సంజీవ్, నర్సిములు మాజీ సొసైటీ చైర్మన్ బస్వరాజ్,విలాస్ బల్ రాజ్ సంగమేష్, గౌసోద్దీన్,సంజ్జు, గాలప్ప సామెల్, సద్దాం రాహుప్,తదితరులు పాల్గొన్నారు.

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి మహాదేవుడికి మారేడు దళముల పూజ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-9-1.wav?_=9

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి
మహాదేవుడికి మారేడు దళముల పూజ

సేవా సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో శ్రావణమాసం శుక్ల పక్షం దశమి సోమవారం పర్వదిన సందర్బంగా శ్రీ ఉమామహేశ్వరసేవ సమితి ఆధ్వర్యంలో శువుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళములను సేకరించి ఆలయ పూజారులు లంక కిషన్ శర్మ చే బిల్వపూజ స్వామి వారికి జరిపించారు.శ్రావణమాస రెండవ సోమవారం అయినందునా భక్తులు మహా దేవుడికి చందన అభిషేకం అర్చనలు చేయడం.

వచ్చిన భక్తులకు ఆశీర్వచనం తో పాటు తీర్థ ప్రసాదాలు అందించారాని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. పూజ కార్యక్రమంలొ మాజీ సర్పంచ్ రాచకొండ లావణ్య గోపాల్ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఆరెందల శంకరయ్య మున్నూరు కాపు సంఘం నాయకులు బాపని సాంబయ్య శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఏజన్సిస్ దూడ సతీష్ కుమార్ సేవ కమిటీ సభ్యులు దూలం శంకర్ బెనికి రాజు సింగం రాజవిరు గందే ప్రకాష్ మాదారపు వెంకటేశ్వర్లు ఆకుల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version