పెబ్బేర్ లో రైస్ మిల్లును తనిఖీ చేసిన..

పెబ్బేర్ లో రైస్ మిల్లును తనిఖీ చేసిన

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

వనపర్తి నేటిదాత్రి

 

బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ వనపర్తి, పెబ్బేరు మండలాల్లో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గోదాములను తనిఖీ చేశారు. వనపర్తి మండలంలోని నాచహళ్లి ఐకేపీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించార అదనపు కలెక్టర్ రైతులతో మాట్లాడారు. వడ్లు తాలు, పొల్లు లేకుండా శుభ్రం చేసుకుని తీసుకురావాలని రైతులకు సూచించారు.
పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామానికి వెళ్ళిన అదనపు కలెక్టర్, అక్కడ ఏఈఓ జారీ చేస్తున్న టోకెన్లను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సీరియల్ పద్ధతిలో వరుస క్రమంలో టోకెన్లు జారీ చేయాలని ఏఈఓను ఆదేశించారు. పెబ్బేరు మండలంలోని సూగురు గ్రామంలోని ఎస్.డబ్ల్యూ.సి గోదామును సందర్శించి,అక్కడ డెలివరీ అవుతున్న సీఎంఆర్ బియ్యం నాణ్యతను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని బియ్యం వస్తే వెంటనే తిరస్కరించాలనివాటిని సంబంధిత మిల్లుకు వెనక్కి పంపాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చివరగా పెబ్బేరు మండలంలోని సత్యసాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.మిల్లు యజమానితో మాట్లాడి, యాసంగి 2024-25 సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలను ఎటువంటి జాప్యం లేకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని మిల్లు యజమానిని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జగన్ పెబ్బేరు తహసీల్దార్ మురళి అధికారులు ఉన్నారు

స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో…

స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో

కలెక్టర్ కార్యాలయం లో సమావేశం

వనపర్తి నేటిదాత్రి .

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ప్రింటింగ్ నిర్వహినాపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు సోమవారం వనపర్తి జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప కరపత్రాలు, పోస్టర్ల ప్రింటింగ్ ప్రెస్ యజమానులు అవగాహన కల్పించారు.ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రల్లో ప్రింటింగ్ లో కులం, మతపరమైన అంశాలను ముద్రించరాదని , వ్యక్తిగత విమర్శల కు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని కోరారు. పబ్లిషర్ నుండి ఫారం- ఎ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఎ, బి తో పాటు ముద్రించిన 4 కర పత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్ కు పంపించాలని కోరారు ముద్రించిన కరపత్రం లేదా గోడ పత్రిక పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఖచ్చితంగా ముద్రించాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న డబ్బుల వివరాలు ఫారం – బి లో చూపెట్టాలని సూచించారు.
వనపర్తి జిల్లా లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈసమావేశంలో డి ఆర్ ఓ పి సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, శ్రీ కృష్ణ వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version