రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్థులను ఆదుకోవాలి..

రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్థులను ఆదుకోవాలి

* తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వామిగౌడ్
* జిల్లా గౌడ సంక్షేమం కోసం కృషి చేస్తా
• గౌడ సంఘం రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా జి. వెంకటేష్ గౌడ్ ఎన్నిక

నేటిధాత్రి, చేవెళ్ల :

గౌడ కులస్థులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ స్పీకర్ స్వామిగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం గౌడ సంఘం మొయినాబాద్ మండల అధ్యక్షులు అంజయ్య గౌడ్ అధ్యక్షతన కనకమామిడి శివారులో సాయి గార్డెన్లో జరిగిన గౌడ సంక్షేమ సంఘం సమావేశానికి ముఖ్యతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వామిగౌడ్, తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టి. ఎస్. ఇ. డబ్లు. ఐ. డి. సి ) మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ హాజరయ్యారు. గౌడ కులస్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అందువల్ల వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్థులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేకంగా 5వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గీత వృత్తికి గొడ్డలి పెట్టుగా ఉన్న జీవో ఎంఎస్‌ నంబరు 164ని వెంటనే తొలగించాలన్నారు.

* జిల్లా గౌడ సంఘం అధ్యక్షులుగా జి. వెంకటేష్ గౌడ్.

ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులుగా జి. వెంకటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా జిల్లా నూతన అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్థుల సంక్షేమ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, గౌడ సంఘం బలోపేతానికి శాయయశక్తుల పనిచేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కుల వృత్తి రక్షణకు గౌడలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. గౌడ కులస్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా కల్లు గీత వృత్తి రక్షణ, రాజ్యాధికారం సాధనకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు అంజయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రెనట్ల మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు గట్టు రాంచంద్రయ్య గౌడ్, మాజీ చైర్మన్ పల్లె రవి, డాక్టర్ విజయ్ భాస్కర్ గౌడ్, మాజీ ఎంపిపి పాండు గౌడ్, మాజీ జెడ్పిటిసి చంద్రలింగం గౌడ్, మాజీ ఎంపిటిసి మోహన్ గౌడ్, మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ హరి శంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ రామకృష్ణ గౌడ్, బకారం జాగీర్ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, చందానగర్ సర్పంచ్ మురళి క్రిష్ణ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నర్సిములు గౌడ్, కౌన్సిలర్ అరుణ, సర్పంచ్ పద్మ, సర్పంచ్ పుష్పమ్మ , మాజీ సర్పంచ్ స్వప్న, మాజీ సర్పంచ్ వినీత, గౌడ సంఘం జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గౌడ సంఘం సోసైటీ అధ్యక్షుడిగా గంధసిరి యాకన్నా ఏకగ్రీవ ఎన్నిక…

గౌడ సంఘం సోసైటీ అధ్యక్షుడిగా గంధసిరి యాకన్నా ఏకగ్రీవ ఎన్నిక

కేసముద్రం/ నేటి ధాత్రి

అర్పణపల్లి గౌడ సంఘం సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నిక గ్రామంలోని గౌడ సంఘం కమ్యూనిటీ హాల్‌లో జరిగింది. ఈ ఎన్నికలో సొసైటీ అధ్యక్షునిగా గంధసిరి యాకన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.` ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు గంధసిరి యాకన్నా మాట్లాడుతూ, “నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న గౌడ సంఘం సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సొసైటీ అభివృద్ధికి, కులస్తుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తాను. విద్య, ఉపాధి, ఆరోగ్యంతో పాటు సంఘం సభ్యులకు, గీత కార్మికులకు పింఛన్లు అందేలా కృషి చేస్తాను. అన్ని రంగాల్లో సంఘం సభ్యులకు అండగా నిలుస్తాను” అని హామీ ఇచ్చారు.` నూతన కార్యవర్గానికి కుల సంఘం పెద్దలు, సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ఐకమత్యంగా ఉండటం వల్లే ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమైందని సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గౌడ కుల పెద్ద మనిషి బుచ్చిరాములు, సారుకొల్లా గంధం సంతోష్, మాజీ అధ్యక్షులు గంధం వెంకన్న, ఉపాధ్యక్షులు గంధం శ్రీను, ప్రధాన కార్యదర్శి గంధం వేంకటాద్రి మెంబర్లు రంగయ్య, ఎల్లయ్య, ఐలయ్య, గంగాపురపు యాదగిరి, బుర్ర సుధాకర్, బబ్బురు సతీష్, కందల శ్రీకాంత్, నలమాషా రాములుతో పాటు గౌడ సంఘం పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.`

మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్…

మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టాణానికి చెందిన జూలూరి మనీష్ గౌడ్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అనుబంధ సంఘం యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు నీయామక పత్రం సోమవారం అందజేసినట్లు రమేష్ గౌడ్ తెలిపారు. గౌడ కులస్తుల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం మనీష్ గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. ఈ పదవిలో మనీష్ గౌడ్ రెండేళ్లు కొనసాగుతాడన్నారు.తనను యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన అనంతుల రమేష్ గౌడ్, తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రాగుల కిరణ్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్, ఎరుకొండ కర్ణాకర్ గౌడ్ లకు మనీష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

కంట మహేశ్వర ఆలయం ఆధ్యాత్మికతకు కేంద్రబిందువవుతుంది..

కంట మహేశ్వర ఆలయం ఆధ్యాత్మికతకు కేంద్రబిందువవుతుంది

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంలో గౌడ కులస్తులు నిర్మించనున్న కంట మహేశ్వర స్వామి దేవాలయ భూమి పూజా కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, సమాజ అభ్యున్నతి కోసం దేవాలయాలు కేవలం ఆరాధనా స్థలాలు మాత్రమే కాదు, ఐక్యతను పెంపొందించే ఆధ్యాత్మిక కేంద్రాలని అన్నారు.
“గౌడ కులస్తుల శ్రద్ధ, శక్తి, సంకల్పంతో రూపుదిద్దుకునే ఈ ఆలయం నెక్కొండకు మరో ఆధ్యాత్మిక చిరునామా కానుందని. ఈ దేవాలయం ద్వారా యువతలో ఆచార సంస్కృతులు మరింత పటిష్టం అవుతాయని, ప్రభుత్వంగా మత సంస్థల అభివృద్ధికి కావలసిన సహాయాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం” అని ఎమ్మెల్యే మాధవరెడ్డి పేర్కొన్నారు.
కంట మహేశ్వర స్వామి ఆలయం నిర్మాణం గౌడ సమాజ ఏకగ్రీవ ఆశయమని, వారి దీక్ష, భక్తి ఈ నిర్మాణానికి బలమని ఆయన అభినందించారు.
కార్యక్రమంలో సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు, డిసిసి ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి సాయికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, మాదటి శ్రీనివాస్, రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గౌడ సంఘ నాయకులు, కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లికి బోనాలు..

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లికి బోనాలు

బోనాలు, డప్పుచప్పులతో మారుమోగిన నర్సంపేట.

ఎల్లమ్మ తల్లి,కంఠమహేశ్వర స్వామికి వందలాది బోనాల సమర్పణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్ కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన కంఠమహేశ్వర స్వామి మహోత్సవాలు నర్సంపేటలో నిర్వహిస్తున్నారు.

గౌడ కుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ, రేణుక ఎల్లమ్మ వనం మైసమ్మ, దేవతల ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంఠమహేశ్వరస్వామి రేణుక ఎల్లమ్మ లకు బోనాలతో నర్సంపేట పట్టణంలోని గౌడ కులస్తులందరూ , ఘటంకుండ పెద్దమనిషి, సారకోళ్ల పెద్దమనిషి, జయలక్ష్మి సెంటర్ నుండి పట్టణంలోని భవాని ఎలక్ట్రానిక్స్, ఫిష్ మార్కెట్ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహం నుండి రామకృష్ణ దుకాణం నుండి సర్పకాస్ జెండా గద్ద నుండి ద్వారక పేట బైపాస్ రోడ్డు కల్లుమండ్వా నుండి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు,పురవీధుల వెంట భాజా భజంత్రీలు నృత్యాలతో కదిలారు.పాకాల రోడ్డు కూడలిలో జెట్టి కళాకారులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

జెట్టి కళాకారులు పట్టుపోసి వివిధ కళారూపాలను ప్రదర్శించారు ఎల్లమ్మ తల్లి వేషాధారణ పలువురిని ఆకట్టుకున్నది.ఎల్లమ్మ నృత్యధారణ డప్పు కళాకారుల నృత్యాలతో నర్సంపేట పట్టణం మారుమోగింది. శ్రీకంఠమహేశ్వర స్వామి దేవాలయం చేరుకొని శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురామాంబా, దేవతల కళ్యాణం పూజారులు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మకు గావు పట్టడం కార్యక్రమాన్ని ఎల్లమ్మ తల్లి పూజారులు నిర్వహించారు. కన్నుల పండుగ బోనాల పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి బోనాలు తరలివచ్చాయి. గౌడ కుటుంబాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బోనాలను చేసి ఎల్లమ్మతల్లికి వందలాది బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.

ధూప దీప నైవేద్యాలతో వారివారి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగలి వెంకటనారాయణ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి

లింగయ్య గౌడ్, కార్యదర్శి మాచర్ల అయిలు మల్లు, ఉడుగుల శ్రీనివాస్ గౌడ్, గౌడ్ మాజీ అధ్యక్షులు వరుసగా ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్, గొడిశాల సదానందం గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లికి బోనాలు…

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లికి బోనాలు

బోనాలు, డప్పుచప్పులతో మారుమోగిన నర్సంపేట.

ఎల్లమ్మ తల్లి,కంఠమహేశ్వర స్వామికి వందలాది బోనాల సమర్పణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్ కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన కంఠమహేశ్వర స్వామి మహోత్సవాలు నర్సంపేటలో నిర్వహిస్తున్నారు.గౌడ కుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ, రేణుక ఎల్లమ్మ వనం మైసమ్మ, దేవతల ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంఠమహేశ్వరస్వామి రేణుక ఎల్లమ్మ లకు బోనాలతో నర్సంపేట పట్టణంలోని గౌడ కులస్తులందరూ , ఘటంకుండ పెద్దమనిషి, సారకోళ్ల పెద్దమనిషి, జయలక్ష్మి సెంటర్ నుండి పట్టణంలోని భవాని ఎలక్ట్రానిక్స్, ఫిష్ మార్కెట్ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహం నుండి రామకృష్ణ దుకాణం నుండి సర్పకాస్ జెండా గద్ద నుండి ద్వారక పేట బైపాస్ రోడ్డు కల్లుమండ్వా నుండి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు,పురవీధుల వెంట భాజా భజంత్రీలు నృత్యాలతో కదిలారు.పాకాల రోడ్డు కూడలిలో జెట్టి కళాకారులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జెట్టి కళాకారులు పట్టుపోసి వివిధ కళారూపాలను ప్రదర్శించారు ఎల్లమ్మ తల్లి వేషాధారణ పలువురిని ఆకట్టుకున్నది.ఎల్లమ్మ నృత్యధారణ డప్పు కళాకారుల నృత్యాలతో నర్సంపేట పట్టణం మారుమోగింది. శ్రీకంఠమహేశ్వర స్వామి దేవాలయం చేరుకొని శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురామాంబా, దేవతల కళ్యాణం పూజారులు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మకు గావు పట్టడం కార్యక్రమాన్ని ఎల్లమ్మ తల్లి పూజారులు నిర్వహించారు. కన్నుల పండుగ బోనాల పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి బోనాలు తరలివచ్చాయి. గౌడ కుటుంబాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బోనాలను చేసి ఎల్లమ్మతల్లికి వందలాది బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.
ధూప దీప నైవేద్యాలతో వారివారి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగలి వెంకటనారాయణ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, కార్యదర్శి మాచర్ల అయిలు మల్లు, ఉడుగుల శ్రీనివాస్ గౌడ్, గౌడ్ మాజీ అధ్యక్షులు వరుసగా ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్, గొడిశాల సదానందం గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆనందోత్సాహాలతో మధ్య కౌండిన్యుల అభిషేకాలు…

 

ఆనందోత్సాహాలతో మధ్య కౌండిన్యుల అభిషేకాలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలో గల పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు రెండో రోజు ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. కౌండిన్యుల గోత్రం కలిగిన ప్రతి ఒక్కరూ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి డప్పుచప్పుల్ల మధ్య ఇంటింటి నుంచి తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ ,జలాలతో అభిషేకాలు చేశారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని ఆ దేవున్ని ప్రార్థించారు. అంతకు ముందు పట్టణంలోని పలు వీధులలో పూజారులచే పలు విన్యాసాలు నిర్వహించారు.కొత్త వస్త్రాలను ధరించిన గౌడులు పట్టణంలోని వారి ప్రతి ఇంటి నుంచి బిందెలతో జలాలు మంగళహారతులతో తరలివచ్చి పూజలను నిర్వహించారు.పట్టణంలోని గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పూజ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు.ఆలయ కమిటీ భక్తుల సౌకర్యం కోసం పలు ఏర్పాట్లను చేసింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్, చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్ ,మాజీ అధ్యక్షులు ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్ గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళ పెళ్ళి చంద్రమౌళి గౌడ్, కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, ఊడుగుల శ్రీనివాస్ గౌడ్, పంజాల రాజు గౌడ్, గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్, పుల్లూరి స్వామి గౌడ్ వల్లాల శ్రీహరి గౌడ్, వీరయ్య గౌడ్, వేముల రవి గౌడ్, సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ

నేటిధాత్రి, వరంగల్

హన్మకొండ హంటర్ రోడ్డులోని గౌడ హాస్టల్ ముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ భరత మాత ముద్దుబిడ్డ తొలి తెలుగు చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ప్రపంచ ప్రసిద్ధిగాంచిందన్నారు. తెలాంగాణకె తిరుగుబాటు నేర్పిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. గౌడ జాతి గర్వకారకుడైన తెలంగాణా బహుజన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ కులస్తులందరు రాజకీయలకు అతీతంగా ఐక్యంగా ఉండి ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపా పౌండర్ అధ్యక్షులు పెరుమాండ్ల మధుసూదన్ గౌడ్, డా. బైరి లక్ష్మి నారాయణ గౌడ్, పులి శ్రీనివాస్ గౌడ్, చిర్ర రాజు గౌడ్, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు జనగాం శ్రీనివాస్ గౌడ్, జూలూరి రంజిత్ గౌడ్, బండారి జనార్ధన్ గౌడ్, అనంతుల రమేష్ గౌడ్, మార్క రవి గౌడ్, మాచర్ల శరత్ గౌడ్, కునురీ రంజిత్ గౌడ్,గట్టు నరేష్ గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి గౌడ్, ఏసీపి. కె. నాగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

గౌడ వృత్తి దిన దిన గండం ఆగని చావులు…

గౌడ వృత్తి దిన దిన గండం ఆగని చావులు
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

 

 

గౌడ కులస్తుల జీవనం రోజు రోజుకు మరి అధ్వనంగా మారుతుంది.ప్రభుత్వం గీతా కార్మికులకు ఇస్తామన్న కాటమయ్య కిట్లు అందక పోవడం వల్ల తరచూ గీత కార్మికులు ప్రమాదల బారిన పడుతున్నమన్నారు.శనివారం ఉదయం బెల్లంపల్లి మండలం లోని మాలా గురుజాల లో పోతుగంటి శంకర్ గౌడ్ అనే గీతా కార్మికుడు ఉదయం చెట్టు ఎక్కి కళ్ళు కిందకి దింపే క్రమంలో కాలుజారి బురదలో పడి మృతి చెందినట్లు తోటి గీతా కార్మికులు తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన గీత కార్మికులకు వెంటనే కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలని,చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి 10లక్షల రూపాయల ఎక్స్ క్రేషియా ఇవ్వాలని మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసరపు మొండిగౌడ్ డిమాండ్ చేస్తున్నారు.ఈకార్యక్రమంలోమోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారపు మొండి గౌడ్,రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి పెరు మండ్ల భాస్కర్ గౌడ్,జిల్లా కార్యదర్శి గాజుల రమేష్ గౌడ్,యువ నాయకులు తాళ్లపల్లి సృజన్ గౌడ్ పాల్గొన్నారు.

గౌడ పట్టణ కమిటీని సన్మానించిన గౌడ జర్నలిస్టులు…

గౌడ పట్టణ కమిటీని సన్మానించిన గౌడ జర్నలిస్టులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ గౌడ సంఘం నూతన కమిటీని నర్సంపేట గౌడ జర్నలిస్టులు సన్మానించారు.గౌడ పట్టణ కమిటీని ఇటీవల ఎన్నుకోగా పట్టణ గౌడ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్ ,ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ తో పాటు కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు,సంఘం అభివృద్ధి కోసం ప్రతీ ఒక్క గౌడబిడ్డ పాటుపడాలని కోరారు.నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుండి 7 వరకు కంఠమహేశ్వర స్వామి సూరమాంబదేవి,రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని బోనాల మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ఉత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు.

గౌడ జర్నలిస్టులకు సన్మానం..

నర్సంపేట పట్టణ జర్నలిస్టులను నూతనంగా ఎన్నికైన నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు గాదగోని సాంబయ్య గౌడ్,ఆర్థిక కార్యదర్శులు నాతి సదానందం గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్,డైరెక్టర్లు తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్,మొగలగాని సురేష్ గౌడ్,వేముల కృష్ణ గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగెళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్,సంఘ సభ్యులు తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, తాబేటి లక్ష్మణ్ గౌడ్,కోల చరణ్ గౌడ్,జర్నలిస్టులు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,రడం శ్రీనివాస్ గౌడ్,బుర్ర వేణు గౌడ్, కందుల శ్రీనివాస్ గౌడ్,జూలూరి హరిప్రసాద్ గౌడ్,తడుక రమేష్ గౌడ్,వద్లకొండ పవిత్రన్ గౌడ్,వడ్లకొండ రాజ్ కుమార్ గౌడ్, కొయ్యడి సనత్ గౌడ్,గోపగాని శోభన్ గౌడ్,బండారి సుమంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం టెండర్లలో గౌడులకు 25% వాటా కావాలి..

మద్యంటెండర్లో గౌడులకు 25 శాతం వాటా ఇవ్వాలి

మోకుదెబ్బ రమేష్ గౌడ్ డిమాండ్..

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మద్యం టెండర్లలో గౌడ కులస్తులకు 25 శాతం వాటా ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ డిమాండ్ చేశారు.పట్టణంలో బుదవారం మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం గౌడ కులస్తులకు మద్యం దుఖాణాలలో 15 శాతం మాత్రమే కెటాయించడం జరిగిందన్నారు. కామారెడ్డిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోలో గౌడ కులస్తులకు మద్యం దుఃఖణాల కేటాయింపులో 25 శాతం ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ లో గౌడ్స్ కు ఇచ్చిన హామీని ప్రకారంగా 25 శాతం వాటా డిక్లరేషన్ విస్మరించడం సరికాదన్నారు.మధ్యం టెండర్లలో 3 లక్షలు కాకుండా 2 లక్షలకు కుదించాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్లుగా తాటిచెట్ల పైనుంచి పడి చనిపోయిన, గాయపడిన 7 వందల మంది గీత కార్మికులకు పెండింగ్ లో 7 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని తెలిపారు. జనగామ జిల్లా కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని, 50 యేండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ఫెక్షన్ మంజూరు చేయాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

మోకుదెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి గా శ్యామ్ సుందర్ గౌడ్

దుగ్గొండి మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్యామ్ సుందర్ గౌడ్ ను మోకుదెబ్బ హన్మకొండ జిల్లా ప్రచార కార్యదర్శిగా నియమించినట్లు మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. గత రెండేళ్లుగా శ్యామ్ కుమార్ గౌడ్ గౌడ కులస్తులకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ పదవిలో నియమించినట్లు రమేష్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్, గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి బోడిగే మల్లేశంగౌడ్,మేరుగు మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్

బహుజనుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్

తాండూరు,( మంచిర్యాల) నేటి ధాత్రి :

 

తాండూరు మండల కేంద్రంలోని మోకు దెబ్బ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను మంగళవారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు.అనంతరం పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మోకు దెబ్బ నాయకులు మాట్లాడుతూ పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని దారబోసిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు.మొఘల్‌ సామ్రాజ్యవాదాన్ని,సైన్యాన్ని సైతం ఎదిరించి నిలబడిన వీరుడు పాపన్న అని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై కిరణ్ కుమార్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలోమోకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి బుసారపు మొండిగౌడ్,రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి పెరుమాండ్ల భాస్కర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బురగడ్డ పుణ్ణం గౌడ్,చీకటి వెంకటేశం గౌడ్,చీకటి మొండి గౌడ్,చీకటి రవి గౌడ్,మడ్డి అరుణేశ్వర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి. ఈసా,జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి,బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పులుగం తిరుపతి,మాజీ ఎంపీపీ సిరంగి శంకర్,బీఆరెస్ నాయకులు మాసాడి శ్రీరాములు,కాంగ్రెస్ నాయకులు చొప్పదండి నరేష్, మాజీ ఉప సర్పంచ్ చిర్ల రాజేశం,నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరులో పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-27-6.wav?_=1

తొర్రూరులో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

తొర్రూరుడివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బహుజన యుద్ధ వీరుడు, విప్లవకారుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మోకు దెబ్బ జిల్లా కార్యదర్శి మేరుగు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, “బహుజనులంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికార సాధన కోసం కలిసికట్టుగా కృషి చేయాలి. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం కావాలి” అని పిలుపునిచ్చారు.

Sardar Sarvai Papannagoud’s

వేడుకల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ట కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నిర్వహించిన భూమిపూజ సందర్భంగా వారి చిత్రపటాలకు గౌడ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌడ సంఘాల నాయకులు మాట్లాడుతూ, “సర్దార్ పాపన్న విగ్రహ ప్రతిష్ట కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు” తెలిపారు.
కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్, తొర్రూరు గోపా డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ జీఎస్పీఎస్ అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్ గౌడ్ కె ఎస్ పి ఎస్ గౌరవ అధ్యక్షులు చామకూరి ఐలయ్య గౌడ్ అధ్యక్షులు నాగపురి అశోక్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కుంభం మహేష్ కుమార్ గౌడ్ ఎస్ఎస్పిజి అధ్యక్షులు చీకటి అశోక్ గౌడ్ కంట మహేశ్వర సంఘంలో గౌరవాధ్యక్షులు చీకటి రమేష్ గౌడ్ అధ్యక్షులు నిమ్మల శేఖర్ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్ గౌడ యువజన సంఘం అధ్యక్షులు బొమ్మెర వినోద్ గౌడ్ కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, టౌన్ యువజన అధ్యక్షుడు బొమ్మ గాని మనోజ్ గౌడ్, చీకటి వీరన్న గౌడ్ తొర్రూరు పట్టణంలోని నాలుగు సంఘాల గౌరవ సభ్యులు ప్రజా
ప్రతినిధులు, స్థానిక నాయకులు, యువత, మహిళలు, మరియు పెద్ద సంఖ్యలో బహుజన ప్రజలు పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేశారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-26-6.wav?_=2

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.

#ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి
దనసరి అనసూయ సీతక్క పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి,
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా జరపడం జరుగుతుందని, చాలా సంతోషకరమని అన్నారు.
ప్రతి ఒక్కరూ మహనీయుల జీవిత చరిత్రను వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని మర్చిపోతే మాత్రం మానవ మనుగడకు భవిష్యత్తు కష్టతరం అవుతుందని , ” నాకోసం పనిచేస్తే నాలోనే ఉండిపోతావు – జనం కోసం పనిచేస్తే జనంలో ఉండిపోతావ్ అని అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలోని ఖిలషాపూర్ అనే గ్రామంలో జన్మించారని పశువుల కాపరిగా ఉంటూ రాజుల సైన్యాలను వారి ఆగడాలను ఎదిరించి, అరికట్టి ఉమ్మడి హక్కుల కోసం పోరాడారని , అన్యాయాలను ఎదిరించిన ఆయన జీవిత చరిత్ర మనకు ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో గౌడ్ అన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కరించడం కొరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్లు చూస్తానని పేర్కొన్నారు.
మహనీయుల విగ్రహాలను త్వరలో ఏర్పాటు చేయుటకు, బీసీ భవన్ ఏర్పాటు చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వం బి.సి. రిజర్వేషన్ 42 శాతం అమలు కు కట్టుబడి ఉందని ,
బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనీ ఈ సందర్భంగా మంత్రి కోరారు.
ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులకు కాటమయ్య 100 రక్షక కవచాలను మంత్రి అందచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇంచార్జీ సర్దార్ సింగ్, బి.సి. కులస్థులు,
బి.సి. సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అన్న కర్మ రోజే తమ్ముడి మృతి.. ముగ్గురికి తలకొరివి పెట్టిన తండ్రి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T150444.800.wav?_=3

 

అన్న కర్మ రోజే తమ్ముడి మృతి.. ముగ్గురికి తలకొరివి పెట్టిన తండ్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం : ఆగడ దరా శివా నీకు అమ్మతోడు… ఓ శివయ్యా, పార్వతిదేవి నీకు తోడుగా ఉంది. మా కుటుంబాన్ని రక్షించు అంటూ ఊరంతా కేతకి సంగమేశ్వర స్వామిని వేడుకున్నప్పటికీ, విధి ఆడిన వింత నాటకంలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కొడుకులు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తల్లి తర్వాత పెద్ద కొడుకు, అన్న దినకర్మ రోజున తమ్ముడు ఇలా పక్షం రోజులు గడవకముందే ముగ్గురు చనిపోవడం, ముగ్గురికి ఇంటి పెద్ద దిక్కైన తండ్రి తలకొరివి పెట్టడం గ్రామ ప్రజలు, బంధువులు, స్నేహితుల కళ్లను చెదిరిపోయేలా దుఃఖాన్ని మిగిల్చింది.
ఈనెల 6న సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఏడాకులపల్లిలో గ్యాస్ లీకైన ఘటనలో తల్లితోపాటు ఇద్దరి కొడుకులకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. తల్లి శంకరమ్మ (65) మృత్యువుతో పోరాడుతూ.. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 8న మృతి చెందింది. తల్లి మరణం మరవకముందే ఆమె రెండవ కుమారుడు ప్రభు (38) పది రోజులుగా చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి 15న మృతి చెందారు. అన్న దినకర్మ రోజు మరో వ్యక్తి విట్టల్ (30) మృత్యువుతో పోరాడుతూ.. పటాన్ చెరలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సోమవారం ఉదయం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.అయ్యో దేవుడా నా కొడుకులకు నేను తల కొరివి పెడుతున్నాను అంటూ తండ్రి బక్కన్న పుత్రశోకంతో కుమిలిపోతుంటే చూసినవారికి కన్నీటి దారలు ఆగలేదు. కొడుకులతోపాటు భార్య శంకరమ్మకు భర్త బక్కన్న తలకోరివి పెట్టాడు. ఇలా పక్షం రోజులు గడపక ముందే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గతంలోని కేసు నమోదయింది. ఇంత జరిగినా ఒక్కరంటే ఒక్కరు నాయకుడు గానీ, అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

500 కోట్లతో గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T150032.031.wav?_=4

 

500 కోట్లతో గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

జిల్లా గోపా అసోసియేట్ అధ్యక్షులు రామగోని సుధాకర్ గౌడ్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు డిమాండ్ల వినతిపత్రం

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

గౌడ కులస్తుల అభివృద్ధి కొరకు 500 కోట్లతో గౌడ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా గౌడ అఫీషియల్స్ ,ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గోపా అసోసియేట్ అధ్యక్షులు రామగోని సుధాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుజన బావుటా ఎగురవేసిన తొలి విప్లవయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టగా సోమవారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో అధికారులతో పాటు గోపా నాయకులు, మోకుదెబ్బ నాయకులు హాజరయ్యారు.గౌడ గీత కార్మికుల సమస్యల పట్ల గోపా జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రామగోని సుధాకర్ గౌడ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1650 ఆగస్టు 18న వరంగల్ జిల్లాలోని ఖిలాషాపురంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పురాణంలోని కుల మూల పురుషుడు కాటమయ్య నాయకత్వ మానవీయ కోణాలను పుణికి పుచ్చుకున్న వీరుడని పేర్కొన్నారు.

 

 

 

తెలంగాణ గడ్డమీద బహుజన బావుటా ఎగురవేసిన తొలి విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.పశువుల కాపరి నుంచి అన్ని కుల సంఘాలు,సబ్బండ వర్గాలను కూడగట్టుకొని అన్యాయంపై సనాతన సాంప్రదాయాలకు విరుద్ధంగా దళిత, బహుజన,మైనార్టీ వర్గాలను ఏకం చేసి అప్పటి భూస్వామ్య దొరలగడీలు నుండి మొఘల్ సామ్రాజ్య కోట గోడలను బద్దలు కొట్టిన మొనగాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసి జనగాం జిల్లాకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలన్నారు.గౌడ కులస్తుల అభివృద్ధి కొరకు 500 కోట్లతో గౌడ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి,పెన్షన్ 2 వేల నుండి 5 వేల రూపాయలకు పెంచాలని పేర్కొన్నారు.ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, వైన్ షాప్స్ వేలం పాటల్లో 50 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలని అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతకు గీత కార్మిక సభ్యత్వం ఇవ్వాలని సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మి నారాయణగౌడ్,గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వేంకటేశ్వర్లుగౌడ్,రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దెల సాంబయ్య గౌడ్,పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T142912.081-1.wav?_=5

 

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలో ఆవిష్కరించిన విగ్రహానికి పూలమాల వేసి జయంతోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న పోరాటాలు, త్యాగాలు వెనకబడిన వర్గాల గౌరవాన్ని కాపాడటమే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శకమయ్యాయని పలువురు కొనియాడారు. జహీరాబాద్ పట్టణ గౌడ్ సంఘాల అధ్యక్షులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T122002.725-1.wav?_=6

 

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు.

చిట్యాల,నేటిధాత్రి :

 

 

జయశంకర్ జిల్లా భూపాలపల్లి చిట్యాల మండలం
గోపాలపురం గ్రామంలో గౌడ సంఘం అధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని నారాయణ గౌడ్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని నారాయణ మాట్లాడుతూ
సామాన్య గౌడ గీత కార్మికుని కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించిన బహుజన వీరుడు
నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన అలుపెరగని పోరాట యోధుడు
భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా అసమాన పోరు చేసిన ధీరుడు
మొఘలాయిల పెత్తనంపై సమర శంఖారావాన్నిపూరించి
గోల్కొండ కోటాపై జెండాను ఎగరేసిన తొలి తెలుగు చక్రవర్తి
వందల ఏండ్ల క్రితమే అణగారిన ప్రజల ఆత్మ గౌరవాన్నివెలుగెత్తి చాటుతూ, సామాజిక న్యాయాన్నిఅమలు చేసిన సమరసేనాని, తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం కుటుంబ సభ్యులు పోశాల రాజు, పోశాల పైడయ్య, బత్తిని సదయ్య, పులి కిరణ్, పులి యుగేంధర్ , కోరుకోప్పుల అశోక్, కోల వేంకటేష్, మూల పైడయ్య, కోల మొగిళి, గ్రామస్తులు పాల్గొన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2-6.wav?_=7

గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

నిజాంపేట్, నేటి ధాత్రి

నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం స్థానిక రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ చత్రపతి అని పిలువబడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులంలో పుట్టడం గర్వ కారణం అని మొగులు సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ని ప్రభుత్వం పట్టించుకునే పాపను పోలేదన్నారు. ఆ మహనీయుని చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్చాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటుకు కృషి చేస్తున్నారని వచ్చే జయంతి వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సభ్యులు బజార్ సిద్దా గౌడ్, వెల్దుర్తి బాల్ రాజా గౌడ్, బజార్ వెంకట గౌడ్,చంద్ర గౌడ్, బజారు చిన్న తిరుమల గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్,బజారు రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్,అంజా గౌడ్, పర్షరాములు గౌడ్, వినయ్ గౌడ్, బొప్పాపూర్ రాజు గౌడ్, సత్య గౌడ్, చంద్రకాంత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాలలో సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-27-5.wav?_=8

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి

మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారం మొండి గౌడ్

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18న జరిగే ఉత్సవానికి గౌడ బాంధవులు అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారం మొండిగౌడ్ అన్నారు.ఈ కార్యక్రమం అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో గీత కార్మికులకు లైసెన్స్ లేనందున,గీత కార్మికుల సమస్యలపై అలాగే మంచిర్యాల జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు కొరకై జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version