ఆంద్రా మేతావులు..తెలంగాణ వ్యతిరేకులు!?

`ఇప్పటికీ తెలంగాణ మీద విషం కక్కుతూనే వుంటారు!

`తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తారు!

`కేసీఆర్‌ అసెంబ్లీకి హజరు కాకపోవడం కూడా వాళ్లకు ఇబ్బందే!

`అవకాశం దొరికింది కదా అని విమర్శలే!

`ఎన్టీ రామారావు అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా హజరుకాలేదు.

`నన్నపనేని రాజకుమారి ఏదో ఒక మాట అన్నదని రానని వెళ్లిపోయారు.

`మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతా! అని రాలేదు.

`ఆంధ్రా మేధావులకు అది గుర్తు చేయరు!

`ఆనాడు ఎన్టీఆర్‌ చేసింది కూడా తప్పే అనే ధైర్యం వారికి వుండదు.

`వైఎస్‌. రాజశేఖరరెడ్డి పాదయాత్ర పేరుతో అసెంబ్లీకి హజరుకాలేదు.

`తర్వాత చంద్రబాబు బస్సు యాత్ర, పాదయాత్రల పేరుతో హజరుకాలేదు.

`ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించరు!

`వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా హజరుకాలేదు.

`ఎమ్మెల్సీగా వుండి పాదయాత్ర చేసిన లోకేష్‌ మండలికి హజరుకాలేదు.

`అప్పుడు ఏ ఒక్క ఆంద్రా మేధావి నోరుతెరవలేదు!

`తెలంగాణ మీద మాత్రం నోరుతెరుస్తారు.

`సుద్దపూసల సుద్దులన్నీ చెబుతుంటారు!

`కాళేశ్వరం కడితే ప్రజాధనం వృధా అంటారు.

`పోలవరం పూర్తి కావాలని కోరుకుంటారు.

`తెలంగాణ అభివృద్ధిని చూసి ఏడిచి చస్తుంటారు?

హైదరాబాద్‌, నేటిధాత్రి:
మేధావి మౌనం దేశానికి ప్రమాదకరమని మాజీ ప్రదాని పివి. నర్సింహారావు అన్నారు. కాని మేధావులు అంటే ఎవరు? అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మేధావులు వేరు. అప్పటి మేదావులు వేరు. ఇప్పటి మేధావులు వేరు. అప్పటి మేధావులు సమాజం గురించి మాత్రమే ఆలోచించేవారు. రాజకీయాల జోలికి వెళ్లేవారు కాదు. కాని నేడు మేధావులు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తమకు అనుకూలమైన రాజకీయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. పైగా మేధావి అంటే అన్ని రంగాల, రకాల విషయాల మీద అవగాహన వుండాలని ఏమీ లేదు. సమాజంలో అనేక రంగాలున్నాయి. ఆయా రంగాలలో వుండే మేదావులు వేరు. ఒక రంగంలో మేదావి మరో రంగం గురించి మాట్లాడే వారు కాదు. కాని ఇప్పుడు మేధావి అంటే చాలు అన్ని రంగాల గురించి మాట్లాడుతున్నారు. అంతా నాకే తెలుసు అన్నట్లు మాట్లాడేస్తున్నారు. గతంలో మేదావులు అనేక రకాల పుస్తకాలు అధ్యయనం చేసేవారు. ఆయా రంగాలపై ఇతరుల మీద ఆదారపడాల్సినంత అవసరం లేని మేధస్సును వారి కలిగి వుండేవారు. ఇప్పుడు అంతా గూగుల్‌ మేధావులు. వారికి అవసరమైన విషయాలను అప్పటిప్పుడు గూగుల్‌లో చూసి తెలుసుకొని గొప్పలకు పోతున్నారు. మేదావులుగా చెలామణి అవుతున్నారు. వారికి తెలిసింది గోరంత. కాని చెప్పేది కొండంత. అందులో అంతా డొల్ల. పైగా తమకు మించిన విశ్లేషకులు లేరన్నట్లు మాట్లాడుతూ వున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖంగా టెలివిజన్‌ తెరలమీద, యూట్యూబ్‌లలో మాట్లాడే మేదావులు ఎక్కువయ్యారు. అలాంటి వారిలో మాజీ ఐపిఎస్‌ అధికారి జేడి లక్ష్మినారాయణ ఒకరు. నిజానికి ఆయన ఒక మేదావిగానే చెలామణి అయితే ఆయనను ఎవరూ వ్యతిరేకించేవారు కాదు. కాని ఆయన రాజకీయ అవతారమెత్తిన మేదావి వర్గం. ఆయన తెలంగాణ, ఆంధ్రా రాజకీయాల మీద బాగానే మాట్లాడుతున్నారు. ఇంత వరకు సంతోషమే. కాని తెలంగాణ రాజకీయాలపై మాత్రం అప్పుడప్పుడూ విషం కక్కుతూనే వుంటారు. కేసిఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హజరు కాకపోవడం ఆయన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. కాని వాటిలో కూడా ఆయన దూరి మాట్లాడిప్పుడు అన్ని విషయాలను ప్రస్తావించాలి. అంతకు ముందు రోజుల్లో అసెంబ్లీకి హజరు కాని వాళ్లు ఎంత మంది వున్నారు. వాళ్ల ప్రస్తావన తీసుకురాలేదు. ఇది తప్పు. ఉమ్మడి రాష్ట్రంలో 1989లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. ఎన్టీఆర్‌ ప్రభుత్వం పోయింది. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎన్టీఆర్‌ను రాజకీయంగా అప్పటి ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ నన్నపననేని రాజకుమారి ఏదో అన్నారు. దానికి ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నది. వెంటనే మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాను అంటూ వెళ్లిపోయారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీ ముఖం చూడలేదు. మరి ఆనాడు ఆయన చేసింది మాత్రం ఏపి మేదావులకు ఒప్పుగానే కనిపించిందా? ఆ విషయాన్ని ఏపి మేధావులు ఎందుకు ప్రశ్నించరు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ప్రస్తుతం ఏపి ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. ఉమ్మడిరాష్ట్రంలో ఆయన ఒకసారి బస్సుయాత్రచేశారు. రెండోసారి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీకి హజరు కాలేదు. ఆ సమయంలో చంద్రబాబు జీతం తీసుకున్నారు. ఆ విషయం మాత్రం ఏపి మేధావులు గర్తు చేయరు. 2004కు ముందు దివంగత వైఎస్‌. రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాలేదు. నేరుగా ఎన్నికలకు వెళ్లారు. పాదయాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ మేదావులకు ఆయన కనిపించలేదు. 2014 తర్వాత ఏపిలో ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేశారు. పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రిగానే మళ్లీ ఏపి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి హజరు కావడం లేదు. గత ఎన్నికల ముందు ఎమ్మెల్సీగా వున్న ప్రస్తుత మంత్రి లోకేష్‌ కూడా యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. మండలి సమావేశాలకు హజరు కాలేదు. ఆ విషయం కూడా ప్రస్తావించేందుకు ఏపి మేధావులకు నోరు రాదు. కాని తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసిఆర్‌ మాత్రం అసెంబ్లీకి హజరు కాకపోవడాన్ని మాత్రం తప్పు పడుతుంటారు. ఇక మరో మేధావి జయ ప్రకాశ్‌ నారాయణ్‌. ఆయన ఓ మాజీ ఐఎఎస్‌ అదికారి. కూకట్‌ పల్లి మాజీ ఎమ్మెల్యే. లోక్‌సత్తా అనే పార్టీకి అదినేత. ఆయన మేధావి తనం మరీ విచిత్రం. నీతి వంతమైన రాజకీయాల గురించి మాత్రం గొప్పలు అనేకం చెబుతాడు. కాని ఆయన లేని లోక్‌సత్తాను ఇతరుల చేతుల్లో పెట్టలేదు. ఏకంగా పార్టీనే రద్దు చేశారు. అంటే అప్పటి వరకు పార్టీకి సేవలందించి వారి రాజకీయ జీవితాలు ఆగం చేశారు. లోక్‌సత్తాకు వచ్చిన విరాళాలు ఏమయ్యాయి? ఆ విరాళాలు ఏదైనా స్వచ్చంధ సంస్ధకు అందించారా? ఏం చేశారు? ఆ సొమ్ములన్నీ ఏమయ్యాయి? అని మాత్రం ఆయనను అడగకూడదు. దేశ ఆర్దిక పరిస్దితులు ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నట్లు మాట్లాడుతుంటారు. ఏపికి మేలు చేసే వ్యాఖ్యలను చేస్తుంటారు. ఏపి మీద మమకారం. తెలంగాణ మీద పైకి కనిపించని కోపం ప్రదర్శిస్తుంటారు. ఎంతో తెలివిగా ఆయన ఎమ్మెల్యేగా వున్నప్పుడు ఓ వైపు లోపల తెలంగాణ వ్యతిరేక రాజకీయం చేసేవారు. పైకి మాత్రం తెలంగాణ వస్తే మిన్ను విరిగి మీద పడుతుందా? అనేవారు. కలిసి వుంటేనే కలదు సుఖం అని నీతులు చెప్పేవారు. తెలంగాణ రావడం అలాంటి మేధావులకు సుతారం ఇష్టం లేని పని. అందుకే తెలంగాణ వచ్చిన పదేళ్ల కాలంలో జరిగిన ప్రగతిని చూసి ఆయన మెచ్చుకున్న దాఖలాలు తక్కువ. తెలంగాణ విషయంలో కాళేశ్వరం మాత్రం తెల్ల ఏనుగు అంటారు. లక్ష కోట్లు వృధా చేశారని అనేక సార్లు చెబతూ వచ్చారు. కాని ఇప్పుడు ఏపి బనకచర్ల ఎత్తిపోతల పథకం వల్ల ఏపికి ఆర్ధిక బారమని మాత్రం నోరు తెరవరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పదే పదే ప్రస్తావిస్తూ వుంటారు. కాని పోలవరం మీద మమకారం కురిపిస్తున్నారు. అది ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. అందులో జరిగిన అవినీతిని ప్రశ్నించరు. అందరూ ఐఎఎస్‌లు కావాలనుకోవడం మూర్ఖత్వం అంటారు. ఆయన మాత్రం ఐఏఎస్‌ అయ్యారు. తెలంగాణలో వుంటారు. తెలంగాణ మీద పడి ఏడుస్తుంటారు. తెలంగాణ సమాజం మీద విషం చిమ్ముతూనే వుంటారు. తెలంగాణ తెర్లు అయితే బాగుండు అనుకుంటే అభివృద్ది చెందడాన్ని వాళ్లు జీర్ణించుకోలేరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్దితి ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ఆర్దిక సి ్దతి ఏమిటి అనేది జేపికి తెలుసు. అయినా దాని గురించి చెప్పరు. తెలంగాణ ఎలా సస్యశ్యామలమైంది? ఎందుకు అయ్యింది? ఎవరి వల్ల అయ్యింది? అందుకు కేసిఆర్‌ చేసిన కృషి గురించి చెప్పడానికి నోరు రాదు. ఎందుకంటే తెలంగాణ విఫల రాష్ట్రమౌతుందని ఆశపడ్డారు. కాని తెలంగాణ దేశంలనే శీఘ్రంగా ప్రగతి దారిలో పరుగెత్తుతోంది. కాళేశ్వరమంటే కేవలం మూడు బ్యారేజీలు మాత్రమే అనే అపోహలో వున్న కొందరు ఏపి మేధావులు తెలంగాణ మీద విషం చిమ్ముతూనే వుంటారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

రాయికల్ అక్టోబర్ 6, నేటి ధాత్రి:

 

రామాజీపేట గ్రామానికిమాజీ మంత్రి జీవన్ రెడ్డి చొరువతో రామాజీపేట గ్రామానికి చెందిన ఆరెల్లి గాయత్రి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్,20,000 ,గ్రామ కాంగ్రెస్ నాయకులు అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గుజ్జులా మోహన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ హరీష్ రావు,నాయకులు రాజేశ్వర్ రావు,నారాయణ,రాములు, సుధీర్ రెడ్డి,రాజు,తిరుపతి, గౌతమ్,జల తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్న అధికారులు..

*అసాంఘిక కార్యకలాపాలకు 22 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం..

*ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్న అధికారులు..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 06:

 

చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కొలమాసనపల్లి పంచాయతీ కొలమాసనపల్లిలో రైతు భరోసా కేంద్రం 2020 సంవత్సరంలో అప్పటి వైసిపి ప్రభుత్వం ఎమ్మెల్యే వెంకటే గౌడ చేతులమీదుగా 22 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసి రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణం చేపట్టారు.భవనం మొత్తం పూర్తయినా కానీ ఇప్పటివరకు ఉపయోగంలోకి తేలేదు. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.భవనం కనిపించనంతగా పిచ్చి మొక్కలు పెరిగాయి.ఈ భవనం మందు బాబులకు పేకాటరాయుళ్ల కు నిలయంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ దీనిపై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ విషయంపై పలమనేరు వ్యవసాయ అధికారిని సంధ్యా రాణి ను వివరణ కోరగా రైతు భరోసా కేంద్రం ఇంకా మాకు ఇవ్వలేదని దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ రైతు భరోసా కేంద్రం ఉపయోగంలోకి తేవాలని కొలమాసనపల్లి పంచాయతీ ప్రజలు కోరుతున్నారు..

ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తాం

ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తాం

సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు

మున్నూరు రవీందర్ విలేకరుల సమావేశం లో వెల్లడి

వనపర్తి నేటిదాత్రి

Vaibhavalaxmi Shopping Mall

వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ దగ్గర కోర్టుల నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ప్రారంభోత్సవం చేశారని కోర్టుల నిర్మాణం శంకుస్థాపనకు తాను వ్యతిరేకం కాదని సీనియర్ న్యాయవాది మాజీ బార్
కౌన్సిల్ అధ్యక్షులు మున్నూరు రవీందర్ వనపర్తి లో తన నివాసంలో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ దగ్గర కోర్టు సముదాయాల నిర్మా ననికి స్థలం కూడా ఉన్నదని మున్నూరు రవీందర్ అన్నారు నిర్మాణం చేపడితే న్యాయవాదులకు కక్షిదారులకు ఇబ్బందులు ఉండవని అన్నారు జిల్లా నలుమూలల నుండి వివిధ కోర్టుల కేసులపై కక్షిదారులు వస్తుంటారని అన్నారు బార్ కౌన్సిల్ అధ్యక్షులు మోహన్ కుమార్ యాదవ్ వనపర్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని కోరారు కొంతమంది న్యాయవాదుల కక్షిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోర్టు సముదాయాల భవనముల నిర్మాణం చేపట్టాలని మున్నూరు డిమాండ్ చేశారు ఈ మేరకు కొంతమంది న్యాయవాదులతో కలిసి హైకోర్టు న్యాయమూర్తులకు వినతిపత్రం ఇచ్చామని మున్నూరుచెప్పారు వనపర్తి జిల్లాలోని కక్షిదారులు న్యాయవాదులకు దూరం అవుతుందని చెప్పారు

చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ పిల్లల చదువులకు ఆర్థిక సహాయం

చనిపోయిన ఫోటోగ్రాఫర్స్ పిల్లల చదువులకు ఆర్థిక సహాయం

మందమర్రి నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
చనిపోయిన ఫోటోగ్రాఫర్స్. పిల్లలకు. చదువు ఖర్చుల నిమిత్తం
తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కుటుంబ భరోసా మిగులు నిధుల నుండి ఒక్కొక్కరికి 5000/- రూపాయల చొప్పున మొత్తం
నలుగురి పిల్లల కు 20000/-రూపాయల చెక్ ను

Financial

 

బాధిత కుటుంబాలకు ఈరోజు స్థానిక ఫోటో భవన్లో అందజేయడం జరిగినది
ఈ కార్యక్రమంలో. మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్. మాజీ ఉపాధ్యక్షులు కామెర గణేష్. కార్యదర్శి. బాణావత్ కృష్ణ. ప్రచార కార్యదర్శి రామస్వామి సురేందర్. తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో…

స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో

కలెక్టర్ కార్యాలయం లో సమావేశం

వనపర్తి నేటిదాత్రి .

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ప్రింటింగ్ నిర్వహినాపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు సోమవారం వనపర్తి జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప కరపత్రాలు, పోస్టర్ల ప్రింటింగ్ ప్రెస్ యజమానులు అవగాహన కల్పించారు.ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రల్లో ప్రింటింగ్ లో కులం, మతపరమైన అంశాలను ముద్రించరాదని , వ్యక్తిగత విమర్శల కు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని కోరారు. పబ్లిషర్ నుండి ఫారం- ఎ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఎ, బి తో పాటు ముద్రించిన 4 కర పత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్ కు పంపించాలని కోరారు ముద్రించిన కరపత్రం లేదా గోడ పత్రిక పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఖచ్చితంగా ముద్రించాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న డబ్బుల వివరాలు ఫారం – బి లో చూపెట్టాలని సూచించారు.
వనపర్తి జిల్లా లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈసమావేశంలో డి ఆర్ ఓ పి సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, శ్రీ కృష్ణ వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

“ప్రభుత్వ భూమిని కాపాడాలని.. కలెక్టర్ కు ఫిర్యాదు”

“ప్రభుత్వ భూమిని కాపాడాలని.. కలెక్టర్ కు ఫిర్యాదు”

” అధికారులపై చర్యలు తీసుకోండి”

బాలానగర్ / నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామపంచాయతీ శివారు అయ్యప్ప స్వామి దేవాలయ ఆలయ సమీపంలోని సర్వేనెంబర్ 102, 105 ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ కి సంబంధించిన ఆర్చిని ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు వెంచర్ యజమానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సామాజిక సేవా కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Government Land

స్థానిక రెవిన్యూ అధికారులు వెంచర్ యాజమాన్యంతో కుమ్ముక్కై ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ఏం మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని కాపాడకుండా వెంచర్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ భూమిలో ఆర్చి నిర్మాణానికి సహకరించిన అధికారులపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి విలువ మార్కెట్ రేటు ఒక ఎకరం రూ.4 కోట్ల వరకు ఉంటుందని విలువైన భూమిని కాపాడడంలో విఫలమైన స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012వ సంవత్సరంలో హైదరాబాదులో నగరానికి 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో జాతీయ రహదారులకు రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరికి అసైన్మెంట్ చేయరాదన్న జీవోను జారీ చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్థానిక రెవిన్యూ అధికారులు విస్మరించి.. రికా వ్యాల్యూ వెంచర్ యజమానికి అనుకూలంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.

అక్రమ తవ్వకాలు ఆపేవారే లేరా…

అక్రమ తవ్వకాలు ఆపేవారే లేరా!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: నాల్కల్ మండలం గణేషాపూర్లో కొందరు అక్రమార్కులు కర్ణాటకకు చెందిన వ్యక్తితో కలిసి ఎర్రరాయి తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నారని గతంలో పలువురు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వెంటనే తవ్వకాలు ఆపించి వారిపై కేసు నమోదు చేయమని నాల్కల్ తహశీల్దార్కు.. ఆర్డీవో ఫోన్ చేసి ఆదేశించినా.. ఎమ్మార్వో చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు…

జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని బీసీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మమ్మద్ ఇమ్రాన్ అన్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నేషనల్ హైవే రోడ్లు చెరువుల్లా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. తాండూర్ వైపు వెళ్లే రోడ్డు చౌరస్తా వద్ద నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కన నాళాలు లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. స్థానికులు పలుమార్లు సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు త్వరితగతిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి వర్షపు నీటి నిల్వ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

పార్టీ మార్పు పై ఓంకార్ యాదవ్ ఫైర్…

పార్టీ మార్పు పై ఓంకార్ యాదవ్ ఫైర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్ కల్ మండలం వడ్డి గ్రామం లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ మండలం మాజీ అధ్యక్షులు ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నుండి పార్టీ మార్పు చేసిన నాయకులపై ఫైర్ అయ్యారు కితకో పార్టీ మార్పు చేస్తున్న నాయకులకు ప్రజలు యూవకులు గమనిస్తున్నారు అని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికీ చిత్తూ చిత్తూ గా ఒడిస్తాం అని వారు ఫైర్ అయ్యారు రానున్న ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు పోటి చేపిస్తాం జడ్పీటీసీ కీ కూడ గెలుపే లక్ష్యంగా అందరు పని చెయ్యాలని ఎవరు ఆ ధైర్యం పడొద్దు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మండలం ప్రధాన కార్యదర్శి రాహుల్ పలింకార్ నర్సప్ప సచిన్ లక్ష్మన్ షేర్ అలీ సంజుకుమార్ రాజు తదితరులు ఉన్నారు,

ఎంబీబీఎస్ సీటు సాధించిన ఫిర్దోస్‌కు హరీష్ రావు సన్మానం…

ఎంబీబీఎస్‌‌ సీటు సాధించిన TMRIES (బుచినెల్లి) విద్యార్థిని సన్మానించిన మాజి మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో(బుచినెల్లి) చదివిన విద్యార్థి ఝరసంఘం మండలం బొప్పన్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ గారి కుమార్తె ఫిర్దోస్ నీట్‌లో క్వాలిఫై అయ్యి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్‌లో ఉచిత సీటు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, మాజీ మంత్రివర్యులు , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ,స్థానిక జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్‌రావు విద్యార్థిని శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు నాగన్న తదితరులు..ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2021లో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం (TMREIS) ప్రారంభం సందర్భంగా..
“ఫ్యూచర్ లో ఏం అవుతావు అమ్మా?” అని అడిగిన ప్రశ్నకు “డాక్టర్ అవుతాను” అని చెప్పింది విద్యార్థిని ఫిర్దోస్.చెప్పడమే కాదు, కష్టపడి చదివి అన్న మాట నిలబెట్టుకుంది. నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది.ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, జహీరాబాద్ నియోజకవర్గం లోని అదే మైనారిటీ గురుకులం నుండి మరో 8 మంది విద్యార్థినులు, అలాగే అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు.
కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలను సాకారం చేస్తున్నాయి గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు.
ఇది కేసీఆర్ గారి దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైంది తెలంగాణ రాకముందు మొత్తం 290 గురుకులాలు మాత్రమే ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వాటిని 1020కి పెంచింది నాడు కేవలం 2 మైనారిటీ గురుకులలు ఉంటే ఆ సంఖ్యను 204కు పెంచింది .
మొత్తంగా గురుకులలో విద్యార్థుల సంఖ్యను లక్షన్నర నుండి ఆరున్నర లక్షలకు పెంచింది.
గతంలో ఇంటర్ చదువు గురుకులాల్లో అందుబాటులో ఉండేది కాదు. పది తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థులు పనులకు వెళ్లేవారు.దీన్ని మార్చడానికి కేసీఆర్ గారు అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసి, ఉన్నత విద్యను చేరువ చేశారు.
ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం ఒకప్పుడు ఎంతో కష్టం, ముఖ్యంగా మహిళలకు. దీనికి పరిష్కారంగా కేసీఆర్ గారు 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారు.దేశంలో తొలిసారిగా రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.పేద పిల్లల విద్యపై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగమని కేసీఆర్ గారు నమ్మారు.రేపటి తరంపై పెట్టే పెట్టుబడిని అద్భుత సంపదగా భావించారు.విద్యార్థుల కోసం చేసే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (Capital Expenditure) గా నిర్వచించారు.ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్ లేదా ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం గొప్ప విషయం.వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం మొత్తంలో మార్పు వస్తుంది.
కేసీఆర్ గారు దీన్ని నమ్మారు కాబట్టి, విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి చదువుకునే అద్భుత అవకాశాలు అందించారు.
మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఇవ్వాలి.మీ ఊరికి, మీ స్నేహితులకు, పేదలకు, గురుకుల సొసైటీకి ఏదో విధంగా తోడ్పాటు అందించాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నా.
ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు .
కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి అని అన్నారు

విద్యార్థికి లాప్ టాప్ ఇచ్చిన దాత

విద్యార్థికి లాప్ టాప్ ఇచ్చిన దాత

వనపర్తి నేటిదాత్రి .

Vaibhavalaxmi Shopping Mall

రాజ కౌశిక్ విద్యార్థికి హబూబ్ నగర్ లో మాంటిసోరి పాఠశాల జె పి ఎన్ సి ఇంజనీరింగ్ లో అర్టిఫి కల్ ఇంటిలిజెన్స్ కోర్సులో సీట్ సాధించినoదుకు పెబ్బేరు
సంబు రాము, సంబు కృష్ణయ్య కల్వ రాలకు చెందిన ప్రభాకర్ దృష్టి కి తీ సుకపోవడముతో విద్యార్థి కి ఉచితంగా లాప్ టాప్ ను అందజేశారని సంబు క్రిష్ణ య్యా తెలిపారు ఈసందర్భంగా ప్రభాకర్ ను రాజ కౌశిక్,కుటుంబ సభ్యులు సంబు కృష్ణయ్య రాము కు కృతజ్ఞతలు తెలిపారు

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే..

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే..

#మమ్మల్ని గెలిపించి,అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రజలకు ఎప్పడు రుణపడి ఉంటాం..

#మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చెందింది మీరే కదా..

#మీ రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఎన్నికల ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు…

#బి ఆర్ ఎస్ కా డోఖా కార్డ్ విడుదల చేసిన డీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎంపీ

హన్మకొండ, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్ధిక భారాన్ని మోపిన బి ఆర్ ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు.సోమవారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు,వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి కడియం కావ్య తో కలిసి పాల్గొన్నారు.

పదేళ్ల గత బి అర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలపై బిఆర్ఎస్ కా డోఖా కార్డ్ పేరుతో కార్డులను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లలను పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని,రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు మర్చిపోలేదు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది.

కాంగ్రెస్ మాట మీద నమ్మకం ఉన్న పార్టీ మేము ఇచ్చిన హామీలను దశల వారీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం.
బిఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమే.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని పెద్దగా ప్రచారం చేసింది.
వేలాది కుటుంబాలు నేడు షీట్ ఇళ్ళ్లో, అద్దె ఇళ్ళ్లో ఉంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఫండ్‌లు విడుదల చేసింది.
టీఆర్‌ఎస్ “రైతు బంధు, రైతు బీమా” అని గొప్పగా చెప్పుకున్నా, వాస్తవానికి రైతులకు రుణాలు మాఫీ కాలేదు.
పంట కొనుగోలు కేంద్రాల్లో బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు.

ఎరువుల కొరత, విత్తనాల కొరత రైతు దైనందిన కష్టాలు బిఆర్‌ఎస్ పాలనలో పెరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్‌లోనే రైతులకు పంటల బీమా పునరుద్ధరణ, సమయానుసారం ఎరువుల సరఫరా చర్యలు తీసుకుంది.

మార్కెట్‌లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పి) హామీగా ఇచ్చి అమలు చేయడం మొదలుపెట్టింది.
టీఆర్‌ఎస్ 2018లో ఇచ్చిన హామీ: “ప్రతి నిరుద్యోగ యువకుడికి ₹3,016 భృతి.”
పదేళ్లపాటు అధికారంలో ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
పరీక్షల వాయిదాలు, పేపర్ లీక్‌లు, అవినీతి యువత భవిష్యత్తుతో చెలగాటమాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను వేగవంతం చేసింది.
టీఆర్‌ఎస్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి, హాస్టళ్లు మూసివేశారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి.
డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ఎక్కడా ప్రారంభం కాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మళ్లీ జీవం పోస్తోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయడం మొదలుపెట్టింది.
ప్రభుత్వ కళాశాలలకు ఫ్యాకల్టీ నియామకాలు జరుగుతున్నాయి.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌కు స్మార్ట్ సిటీ హామీ ఇచ్చినా, దాని అమలు వద్ద ఆగిపోయింది.
మీరు చేస్తున్న బాకీ ప్రచారంలో మేము ప్రజలకు బాకీ ఉన్నమాట నిజమే అని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు బాకీ ఉండటంలో తప్పు లేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “బిఆర్ఎస్ కా దోఖా “ను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ వెంకట్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు బంక సరళ మరియు ప్రజా ప్రతినిధులు,బ్లాక్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బాకీకార్డులతో కొత్త నాటకానికి తెరలేపిన బీఆర్ఎస్…

బాకీకార్డులతో కొత్త నాటకానికి తెరలేపిన బీఆర్ఎస్

పాలన పేరుతో అవినీతి చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం

గాడిన పెడ్తున్న ప్రభుత్వం పై విమర్శలు సిగ్గుచేటు

కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త నాటకా నికి తెరలేపారని కాంగ్రెస్ మం డల పార్టీ అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి విమర్శిం చారు. శాయంపేట మండల కేంద్రంలో ఆదివారం భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బాకీ కార్డులు పంపిణీ చేసిన నేప థ్యంలో సోమవారం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి పిఎసిఎస్ భవన నిర్మాణం కోసం గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి భూ మి పూజ చేసిన శిలాఫలకం వరకు పాదయాత్ర చేసి అట్టి శిలాఫలకం వద్ద పిండ ప్రధానం కార్యక్రమం నిర్వహించారు .

తదనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయాలని ఉద్దేశంతోటే ఇస్తారన్నారు మిగులు రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశా రని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్న క్రమంలో పాలనలో కనీసం రెండేళ్లు పూర్తికాకుండానే తమ ఉనికి కోసం బురద జల్లే ప్రయ త్నం చేస్తున్నారని అన్నారు. 22 నెలల కాలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు రుణ మాఫీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ కనెక్షన్, సుమారు 60 వేల ఉద్యోగ కల్పన, రేషన్ కార్డుల పంపిణీ హామీలు అమలు అవుతున్నాయని, మేనిఫెస్టోలో లేని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకం సైతం అమలు జరుతుందని, ఈ పథకాలు బీఆర్ఎస్ నాయకులకు కూడా అమలయ్యాయని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ బాకీలు:

పదేళ్లు అధికారంలో ఉండి ఇంటికొక ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ లు, కేజీ టు పీజీ విద్య, పోడు భూముల పట్టాలు, అమరుల కుటుంబాలకు ఉద్యోగం, ముస్లిం లకు రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చారు. అవన్నీ అమలు చేశారో చెప్పాలని నిలదీశారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరమణరెడ్డి బాకి

శాయంపేట మండలానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎంతో బాకి పడ్డారు. కాంగ్రెస్ కార్య కర్తల కష్టంతో గెలిచి,వారి సతీమణికి పదవితెచ్చుకు న్నారే తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. పిఎసిఎస్ భవనానికి శిలాఫలకం వేసి నిధులున్నా కట్టించలేని అసమర్థులు. పిఎసిఎస్ లో మాజీ పాలకవర్గ సభ్యులు అయిన గండ్ర వెంకట రమణా రెడ్డి అనుచరులు 15 లక్షల రూపాయల అవినీతికి పాల్పడి సొసైటీకి బాకీ పడితే అవి రికవరీ చేయించలేని అసమర్ధ నాయకులు గండ్ర వెంకట రమణారెడ్డి . అట్టి రూపాయ లను వెంటనే రికవరీ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లా డాలని మేము డిమాండ్ చేస్తున్నాం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన వారికి 15 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రొసీ డింగ్స్ తెచ్చి కట్టిస్తా అన్నారు. కట్టించారా!డ్రైనేజీలు లేని రోడ్డు వేసి స్థానికులను ఇబ్బం దులు పెట్టడం వాస్తవం కాదా!సుమారు 200 డబుల్ బెడ్రూ మ్ లకు శిలాఫలకాలు వేశారు కట్టించారా!జిపి భవనాలకు శిలాఫలకాలు వేశారు కట్టించారా.మండల ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే అంబులెన్స్ కావాలని అడిగితే డీజిల్ ఎవరు పొయ్యాలి. ఎవరు నడపాలి.అని అవహేళనగా మాట్లాడింది మీరు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీటికి సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిని, మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ దశాబ్ద కాలం పైగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను సామాజికంగా మరియు రాజకీయంగా చైతన్య పరుస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేయబోతుందని చిట్యాల మండల కేంద్రంలో భూపాలపల్లి జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్ అన్నారు.
రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.

చిట్యాల, నేటిధాత్రి :

రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

ఆ గ్రామ రైతు వేదిక .. మందు బాబులకు అడ్డా.

ఆ గ్రామ రైతు వేదిక .. మందు బాబులకు అడ్డా.

బాలానగర్ /నేటి ధాత్రి.

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్…

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం కాల్వపల్లీ గ్రామానికి చెందిన పంచికా మహేష్ యాదవ్ నీ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ లు తెలిపారు, పంచిక మహేష్ యాదవ్ యాదవ జాతిని పటిష్టత కోసం నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణ గల యాదవ బిడ్డగా భూపాలపల్లి జిల్లా యాదవుల కోసం వారి సమస్యల కోసం ఎనలేని పోరాటాలు చేస్తారని యాదవుల కమ్యూనిటీ కోసం బలోపేతం చేస్తారని నమ్మకంతోని ఇవ్వడం జరిగింది పంచీక మహేష్ యాదవ్ నీ ఎన్నుకునట్లు తెలిపారు.

నూతనంగా ఎన్నకైన మహేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జాతి కోసం సిద్దాంతము పునరంకితం అయి నితి నిజాయితీ క్రమశిక్షణ చిథశుద్దితో పని చేస్తానని యాదవుల సామాజిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలపై ఎనలేని పోరాటము చేస్తానని యాదవులను సంస్థాగతంగా పటిష్ఠ పరుస్తనను అదేవిధంగా నాకు సహకరించిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్నకు మరియు రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర అన్నకు అలాగే రాష్ట్ర నాయకులు అందరికి ఇతర జిల్లా మండల నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా దొంగల రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఅన్నారు,

డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ మృతి…

డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ 75 సంవత్సరాల వయసులో మరణించారు. మౌలానా హఫీజ్ సాకిబ్ సాహిబ్ నాయకత్వంలో జుహర్ ప్రార్థన తర్వాత బాగ్దాదీ మసీదులో అంత్యక్రియల ప్రార్థన జరిగింది, దీనిలో పెద్ద సంఖ్యలో బంధువులు మరియు స్నేహితులు పాల్గొన్నారు. మృతుడు పదిహేను సంవత్సరాలుగా పరిహారం లేకుండా హజ్ యాత్రికుల కోసం దరఖాస్తులు రాసి రెండుసార్లు పెన్షన్ పొందాడు.

అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ ను వారిలో అతని భార్య, 3 కుమారులు మరియు 4 కుమార్తెలు ఉన్నారు.

ఆనందోత్సాహాలతో మధ్య కౌండిన్యుల అభిషేకాలు…

 

ఆనందోత్సాహాలతో మధ్య కౌండిన్యుల అభిషేకాలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలో గల పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు రెండో రోజు ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. కౌండిన్యుల గోత్రం కలిగిన ప్రతి ఒక్కరూ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి డప్పుచప్పుల్ల మధ్య ఇంటింటి నుంచి తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ ,జలాలతో అభిషేకాలు చేశారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని ఆ దేవున్ని ప్రార్థించారు. అంతకు ముందు పట్టణంలోని పలు వీధులలో పూజారులచే పలు విన్యాసాలు నిర్వహించారు.కొత్త వస్త్రాలను ధరించిన గౌడులు పట్టణంలోని వారి ప్రతి ఇంటి నుంచి బిందెలతో జలాలు మంగళహారతులతో తరలివచ్చి పూజలను నిర్వహించారు.పట్టణంలోని గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పూజ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు.ఆలయ కమిటీ భక్తుల సౌకర్యం కోసం పలు ఏర్పాట్లను చేసింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్, చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్ ,మాజీ అధ్యక్షులు ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్ గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళ పెళ్ళి చంద్రమౌళి గౌడ్, కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, ఊడుగుల శ్రీనివాస్ గౌడ్, పంజాల రాజు గౌడ్, గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్, పుల్లూరి స్వామి గౌడ్ వల్లాల శ్రీహరి గౌడ్, వీరయ్య గౌడ్, వేముల రవి గౌడ్, సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version