ఏసీబీకి పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి..

ఏసీబీకి పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి

అవినీతిపరులను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటే ఏసీబీ శాఖను అవమానపరిచినట్లే

ఎన్ హెచ్ ఆర్ సి. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బూర్ల వంశీ

పెద్దపల్లి టౌన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కు పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం తొలగించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బూర్ల వంశీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏసీబీ నిర్వహించే దాడులలో లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారు ఎలా సుద్ధపూసలు అవుతారని, అసలు వారు నిర్దోషులు ఎలా అవుతారని ఆయన అన్నారు. కోర్టులలో నిర్దోషులమని క్లీన్ చీట్ తెచ్చుకొని మళ్లీ వారు ఉద్యోగంలోకి వస్తే ఇంకా వారి ఆగడాలకు హద్దు, అదుపు ఉండదని ఆయన అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ను అవమానపరిచినట్లేనని ఆయన అన్నారు. ఏసీబీకి చిక్కిన కూడా కోర్టుల ద్వారా మళ్లీ ఉద్యోగంలోకి రావచ్చుననే అభిప్రాయం ఇప్పటికే ఉందని కాబట్టి పూర్తి ఆధారాలతో పట్టుబడ్డ వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. లేనట్లయితే ఏసీబీ పట్ల ఎవరికి భయం, భక్తి ఉండవని ఆ శాఖను ఎవరూ పట్టించుకోరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి అక్రమార్కులపై చర్యలు తీసుకునే విషయంలో ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని వారు తీసుకునే నిర్ణయాన్ని న్యాయస్థానాలు, ప్రభుత్వాలు గౌరవించాలని ఆయన కోరారు. ఏసీబీకి చిక్కిన అవినీతి అక్రమార్కుల విషయంలో చట్టాలను కఠినతరం చేయాలని, దోషులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించి, వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా గౌరవ కోర్టులు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రతి రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో ఎసిబి కోర్టులను ఏర్పాటు చేయాలని, ప్రజాధనం కాపాడడానికి ఏసీబీకి సమాచారం అందించిన వారిని దేశభక్తులుగా పరిగణించాలని, వారికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త కమలాకర్, నాయకులు రాజ్యలక్ష్మి, నంబయ్య, సదయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి.

ఏసీబీకి పట్టుబడిన అధికారులను, ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి.

ఏసీబీకి సమాచారం ఇచ్చి ప్రజాధనాన్ని కాపాడిన వ్యక్తులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలి. వారిని దేశభక్తులుగా ప్రకటించాలి.

నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏసీబీ కోర్టులను ఏర్పాటు చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

నేటిధాత్రి”,

 

 

 

 

దిల్ సుఖ్ నగర్ (గ్రేటర్ హైదరాబాద్): అ

వినీతి అక్రమాలతో ఏసీబీకి పట్టుబడిన అధికారులను, ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని, వారి స్థానంలో ఏసీబీకి పట్టించి ప్రజాధనాన్ని కాపాడిన వ్యక్తులను దేశభక్తులుగా ప్రకటించి, వారి అర్హతను బట్టి వారికి ఉద్యోగం, ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య అన్నారు.

దేశంలో అవినీతి, అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అక్రమ సంపాదన లక్ష్యంగా పనిచేస్తున్న అవినీతి, అధికారుల అండతోనే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏసీబీ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.

ఈ విషయంలో త్వరలో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో కార్యచరణను చేబట్టబోతున్నామని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏసీబీ చురుకుగా పనిచేస్తుందని ఆయన ప్రశంసించారు.

ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా తప్పు చేసి పట్టుబడ్డవారికి క్లీన్ చిట్ ఇవ్వడం తగదని ఆయన అన్నారు.

అలాంటి వారిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని న్యాయస్థానాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఖజానాను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి చేతిలో ఉందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లెం భరత్ రాజ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులు రాగం శ్రీశైలం యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ లావణ్య, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి కోమాండ్ల శ్రీనివాస్, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు బాతరాజు సిద్దు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాల పేరుతో మోసం.

ఉద్యోగాల పేరుతో మోసం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ కిలాడీ లేడీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇపిస్తామని ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ ఆసుపత్రిలో ఉద్యోగం ఆశ చూపించి సుమారు రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసింది. అధికారులు స్పందించి ఉద్యోగం లేదా తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version