సర్పంచ్ బరిలో సుల్తాన్ సలావుద్దీన్

సర్పంచ్ ఎన్నికలు బరిలో మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామ ప్రజల ఆదరాభిమానాలు పొందిన మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడ్డా తిరుగుండదు అని ప్రజలు చెబుతున్నారు.

వస్తున్న మీ కోసం………

ప్రజలకు సేవ చేయడానికి…. వచ్చి రాజకీయాన్ని కార్పొరేట్ చేసిన ఈ తరుణంలో దానికి కొత్త నిర్వచనం చెప్పడానికై వస్తున్నా…..మీ కోసం సడెన్ గా ఎన్నికల్లో ప్రత్యక్షమై మాయమైపోయే నాయకుల్లా కాను ఎన్నో ఏళ్ళుగా వివిధ రకాల సామజిక కార్యక్రమాలు చేస్తూ మీ మధ్యలో ఉంటున్నా మీకోసం పదవి ఉన్న లేకున్నా నేను మీకోసం ఏదో ఒక రూపంలో సేవ చేస్తుంటా
నా లాంటి సేవకుడికీ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి స్వలాభం లేకుండా నిస్వార్ధగా తెలిపారు. మీకు సేవ చేస్తాను అని

సత్యసాయి కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు: చంద్రబాబు..

సత్యసాయి కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు: చంద్రబాబు

 

భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయి చెప్పారని.. సకలజనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారని చెప్పుకొచ్చారు. సత్యసాయి పుట్టపర్తి శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ(ఆదివారం) సత్యసాయి సమాధిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు.‘భగవాన్ సత్యసాయి 1926 నవంబర్ 23వ తేదీన ఈ పుణ్యభూమిలో ఒక లక్ష్యం కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రయాణాన్ని సాగించి సాయి సిద్ధాంతాన్నిప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు. సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. 1940 మే 23వ తేదీన సత్యసాయి వయసు 14 ఏళ్లు… అప్పుడే ఆయన సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వాసన నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. మావన రూపంలో మనం చూసిన దైవమే సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

బదిలీపై వెళ్లిన హోంగార్డ్ సత్యనారాయణ…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T125252.744.wav?_=1

 

బదిలీపై వెళ్లిన హోంగార్డ్ సత్యనారాయణ,

◆:- మండల ప్రజలకు 14 సంవత్సరాలు సేవలందించిన హోంగార్డ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా 14 సంవత్సరాలుగా పనిచేసి సంగారెడ్డి బదిలీపై వెళ్తున్న సత్యనారాయణ, పోలీస్టేషన్ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ధర్మకర్తలు పూజారులు శాలువా పూలమాలతో సత్కరించి సంగమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించరు. అనంతరం ఝరాసంగం ఎస్సై క్రాంతికుమార్ పటేల్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకంటే చాలా కీలకమైనదన్నారు. ఇంతకాలం ఇక్కడ చాలా క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మన స్టేషన్కి గర్వకారణమని ఇప్పుడు వెళ్లే చోట కూడా ఇంతకన్నా రెట్టింపు పెరు తెచ్చుకోవాలని సూచించారు.

చిట్యాల అనాధ ఆశ్రమములో చిన్నారులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T182306.859.wav?_=2

 

చిట్యాల అనాధ ఆశ్రమములో చిన్నారులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ

వనపర్తి నేటిదాత్రి .

 

దివంగత గంధం చిన్న బాలయ్య సతీమణి గంధం బొజ్జమ్మ 12వ సంస్మరణ దినం సందర్భంగా గంధం బొజ్జమ్మ మెమోరియల్ హెల్త్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో చిట్యాల అనాధ ఆశ్రమం లోని చిన్నారులకు పండ్లు ,బ్రెడ్లు పంపిణీ చేయడం జేరిగిందని తెలుగుదేశం పార్టీ నేత డి బాల్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమములో ప్రముఖ కవి రచయిత జనజ్వాల మాట్లాడుతూ వాళ్ళ పిల్లలకే తల్లి కాదు మాకు కూడా తల్లి. ఆమె మాకు మాతోపాటు అడిగిన వారికి ఆర్థికంగా సహాయం చేసేదని అన్నారు ద్యారపోగు బాలరాజు , గంధం చందు, భాను , గంధం సిద్దు విద్యార్థులు తదితరులము పాల్గొన్నారు

ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T181749.145.wav?_=3

 

ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకం

నేటిధాత్రి చర్ల

 

గుంటూరుకు చెందిన నల్లూరి ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకమని వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత అన్నారు ఉదయలక్ష్మి భర్త నల్లూరి సుబ్బారావు వర్దంతి సందర్భంగా వారి కుమారులు బాబ్జి నాగార్జున లు వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయంకు 50 కేజీల బియ్యం విద్యార్దులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేసారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆశాలత మాట్లాడారు ఉదయలక్ష్మి కుటుంబం మొదటి నుండి సేవాభావం కలిగి ఉండటం హర్షనీయమని పేర్కొన్నారు 1977 లో దివిసీమ ఉప్పెన సందర్భంగా ప్రాణ ఆస్దినష్టం సంభవించి సర్వం కోల్పోయిన బాదిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్ ఎస్ ఎస్ ద్వారా చర్లలో నల్లూరి సుబ్బారావు ఉదయలక్ష్మి దంపతులు నిది సేకరించారని వెల్లడించారు ఆ నిది సేకరణలో వచ్చిన నగదుతో దివిసీమలోని దీనదయాలపురం గ్రామంలో ఒక ఇంటిని నిర్మించారని తెలిపారు ఆ ఇంటిపై చర్ల స్వయం సేవకుల సహకారంతో నిర్మాణం చేపట్టినట్లు పేరు రాసి ఉందని వెల్లడించారు నాటి విదేశాంగ శాఖ మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ నిర్మాణం ప్రారంబోత్సం చేసారన్నారు ఉదయలక్ష్మి ఇదే స్పూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అబినందనీయమని అన్నారు ప్రతి ఏటా కొమరం భీం విద్యార్ది నిలయంకు వితరణ అందిస్తూ మానవత్వం చాటుకుంటుంన్నారని అన్నారు ‌నిలయ కమిటీ సభ్యురాలు పోలిన రమాదేవి తమ పిన్ని ఉదయలక్ష్మి ద్వారా వితరణలను అందించడం అబినందనీయని ప్రశంసించారు విద్యార్దులు ఇటువంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రతి విద్యార్ది క్రమశిక్షణతో మెలగి తమనుతాము తీర్చిదిద్దుకోవాలని అన్నారు పట్టుదలతో చదివి జీవితంలో స్థిరపడటం ద్వారా తల్లిదండ్రులతో పాటు గురువుల కలలను సాకారం చేయాలని హితవుపలికారు ఈ కార్యక్రమంలో వనవాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ కొమరం భీం నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు మహిళా ప్రముఖ్ బందా స్వరూప రాణి కమిటీ సభ్యురాలు పోలిన రమాదేవి లవన్ కుమార్ రెడ్డి నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు

జమియత్ ఉలేమా-ఎ-హింద్ అర్షద్ మదానీ క్షేత్ర స్థాయి బలోపేతం చెయ్యండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T112506.057.wav?_=4

 

జమియత్ ఉలేమా-ఎ-హింద్ అర్షద్ మదానీ క్షేత్ర స్థాయి బలోపేతం చెయ్యండి

◆:- జామియా ఇస్లామియా ఖైరుల్-ఉలూమ్ రంజోల్‌లో శిక్షణా సెషన్,

◆:- మౌలానా అస్జాద్ మదానీ ప్రసంగం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జమియత్ ఉలేమా-ఎ-హింద్ యొక్క లక్ష్యాలు మరియు లక్ష్యాలు మరియు దాని ప్రాముఖ్యత” అనే శీర్షికతో జామియా ఇస్లామియా ఖైరుల్-ఉలూమ్ రంఝోల్‌లో జమియత్ ప్రిన్సిపాల్ మరియు జమియత్ ఉలేమా సంగారెడ్డి అధ్యక్షుడు మౌలానా ముహమ్మద్ ఫరూఖ్ ఖాస్మీ మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణ మంత్రి ముఫ్తీ మహమూద్ జుబైర్ ఖాస్మీ అధ్యక్షతన శిక్షణా సెషన్ జరిగింది, దీనికి జమియత్ ఉలేమా-ఎ-హింద్ ఉపాధ్యక్షుడు మౌలానా సయ్యద్ అస్జాద్ మదానీ, జమియత్ ఉలేమా-ఎ-జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ షాబుద్దీన్ ఖాస్మీ మరియు జమియత్ ఉలేమా-ఎ-కర్నాయక్ ప్రధాన కార్యదర్శి మౌలానా ముహిబుల్లా ఖాస్మీ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ప్రసంగం సందర్భంగా, ముఫ్తీ మహమూద్ జుబైర్ జమియత్ ఉలేమా-ఎ-హింద్ చరిత్రను క్లుప్తంగా వివరించి, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, జమియత్ ఉలేమా-ఎ-హింద్ అనేది ఇతర సంస్థల మాదిరిగా ఒక సంస్థ పేరు కాదని, క్లిష్ట పరిస్థితుల్లో ఎల్లప్పుడూ ప్రజలతో నిలబడే ఆలోచన మరియు భావజాలం అని అన్నారు. మౌలానా సయ్యద్ అస్జాద్ మదానీతన ముఖ్యమైన ప్రసంగంలో, జమియత్ ఉలేమా-ఎ-హింద్ యొక్క లక్ష్యాలు మరియు లక్ష్యాలను వివరించారు మరియు మన గొప్ప నాయకులు జమియత్ ఉలేమా-ఎ-హింద్‌ను అందించారని, ఇది ప్రజల సేవ కోసం మాత్రమే సృష్టించబడిందని, కాబట్టి జమియత్ యొక్క పని ఎక్కడ మరియు ఎప్పుడు అవసరమైతే అక్కడ సేవ చేయడమేనని, అందుకే జమియత్ 150 సంవత్సరాలుగా ఈ పనిని గర్వంగా చేస్తోంది, అది హిందువు అయినా లేదా ముస్లిం అయినా, అతను క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, అతనికి సేవ చేయడానికి నిలబడాలి. జమియత్ యొక్క గ్రౌండ్ బాడీని బలోపేతం చేయడంపై కూడా ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా జామియా ఇస్లామియా ఖైరుల్‌ ఉలూమ్‌ నిర్వాహకుడు హఫీజ్‌ ముఖ్తార్‌ అహ్మద్‌, మౌలానా ముహమ్మద్‌ ఖాసిం అతర్‌ ఖాస్మీ, జమీత్‌ ఉలేమా జహీరాబాద్‌ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్‌ ఇస్మాయిల్‌, హఫీజ్‌ ఫరూక్‌ బిలాల్‌పూర్‌, అజీమ్‌ పటేల్‌, యూనస్‌ భాయ్‌ అతనూరు, జహీర్‌ మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ మృతి…

డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ 75 సంవత్సరాల వయసులో మరణించారు. మౌలానా హఫీజ్ సాకిబ్ సాహిబ్ నాయకత్వంలో జుహర్ ప్రార్థన తర్వాత బాగ్దాదీ మసీదులో అంత్యక్రియల ప్రార్థన జరిగింది, దీనిలో పెద్ద సంఖ్యలో బంధువులు మరియు స్నేహితులు పాల్గొన్నారు. మృతుడు పదిహేను సంవత్సరాలుగా పరిహారం లేకుండా హజ్ యాత్రికుల కోసం దరఖాస్తులు రాసి రెండుసార్లు పెన్షన్ పొందాడు.

అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ ను వారిలో అతని భార్య, 3 కుమారులు మరియు 4 కుమార్తెలు ఉన్నారు.

తహెరా బేగం కు తన్వీర్ నివాళి…

మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోల్పోవడం బాధాకరం టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తహరాబేగం మృతి చెందగా విషయం తెలుసుకున్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితో పాటు పలువురు నాయకులు స్థానికంగా ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన అంతక్రియలో పాల్గొని పార్థివధ్యాన్ని నివాళులు అర్పించారు తన్వీర్ మాట్లాడుతూ తాహెరా బేగం చేసిన సేవలు మరువ లేనివి వారి మరణం బాధాకరం.

పోత్కపల్లిలో గణపతి నవరాత్రి మహా అన్నదానం…

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో గోపికృష్ణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ గణపతి మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.సంఘం అధ్యక్షుడు డబ్బేట మల్లేశం మాట్లాడుతూ, గణపతి నవరాత్రులు గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీక. ఇలాంటి సమయాల్లో అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తి, సేవ, సౌహార్దం పెంపొందుతుంది. గ్రామంలో సామాజిక స్ఫూర్తిని పెంచడం గోపికృష్ణ పద్మశాలి సంఘం ప్రధాన ధ్యేయం అని పేర్కొన్నారు. మహా అన్నదానంలో గ్రామస్తులు, చిన్నలు పెద్దలు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.

చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది..

చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది..

 

డుతుంది?’… ‘మా అబ్బాయితో బాస్కెట్‌బాల్‌ ఆడే రోబో దొరకుతుందా? రేటు ఎంత?’… ఆ మాల్‌లోకి అడుగుపెడితే ఇలాంటి సంభాషణలు మామూలే.

‘ఐన్‌స్టీన్‌ రోబోతో ఏమిటి ఉపయోగం?’… ‘చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది?’… ‘మా అబ్బాయితో బాస్కెట్‌బాల్‌ ఆడే రోబో దొరకుతుందా? రేటు ఎంత?’… ఆ మాల్‌లోకి అడుగుపెడితే ఇలాంటి సంభాషణలు మామూలే. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో మాల్‌ను చైనా రాజధాని బీజింగ్‌లో ఇటీవలే ప్రారంభించారు. నాలుగు అంతస్తుల ఈ మాల్‌లో అబ్‌టెక్‌ రోబోటిక్స్‌, యునిట్రీ రోబోటిక్స్‌ లాంటి 200 బ్రాండ్లకు సంబంధించిన… వంద రకాల రోబోలు విక్రయానికి ఉన్నాయి.

 

గ్యాడ్జెట్‌ రోబోలతో పాటు అతి ఖరీదైన హ్యూమనాయిడ్‌ రోబోలూ కొలువుదీరాయి. 300 అమెరికన్‌ డాలర్ల నుంచి లక్ష డాలర్లదాకా ధర పలికే రోబోలున్నాయి. ఈ మాల్‌ను ‘4ఎస్‌’ అంటున్నారు. అంటే రోబోలకు సంబంధించి సేల్స్‌, సర్వీస్‌, స్పేర్‌ పార్ట్స్‌, సర్వే అన్నమాట. ‘ఇలాంటి రోబో మాల్‌లు త్వరలో ప్రపంచమంతా వ్యాపిస్తాయ’ంటున్నారు టెక్‌ నిపుణులు.

ఘనంగా డబ్బాలో పాపన్న జయంతి వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-24-6.wav?_=5

ఘనంగా డబ్బాలో పాపన్న జయంతి వేడుకలు

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో బడుగుల ఆరాధ్య దైవమైన సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి వేడుకలను ఘనంగా
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న సంక్షేమ సంఘం ఇబ్రహీంపట్నం మండల శాఖ అధ్యక్షుడు నేరెళ్ల సుభాష్ గౌడ్
మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న వీరోచిత పోరాటాలను ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పుప్పాల నర్సయ్య, లింగంపల్లి గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ కోటి దేవారెడ్డి, గౌడ సంఘ అధ్యక్షులు ఎలుక అశోక్ గౌడ్, నేరెళ్ల సత్యం గౌడ్, రాజం గౌడ్, సంఘ సభ్యులు అబ్బురి ప్రకాష్, నేరెళ్ల రాజ్ కుమార్, అబ్బూరి ఆనంద్ రాజ్, ఆనంద్, శ్రీనివాస్, దశ గౌడ్, ఈమెల్ గౌడ్, రంజిత్, నేరెళ్ల అంజా గౌడ్, అబ్బూరు వేణు, వెంకటేష్ ఆకు రమేష్, సత్య నంద, తదితరులు పాల్గొన్నారు

ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ సర్వీస్ బిల్లింగ్ కొత్త హంగులతో ప్రారంభం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T170513.852.wav?_=6

ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ సర్వీస్ బిల్లింగ్ కొత్త హంగులతో ప్రారంభం

చీఫ్ ఇంజనీరింగ్ చిట్టప్రగడ ప్రకాష్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సర్వీస్ బిల్డింగ్ 3వ అంతస్తులో కొత్త హంగులతో ఏర్పాటు చేసిన సమావేశ మందిరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన

చీఫ్ ఇంజనీర్ ఓం & ఎం చిట్టాప్రగడ ప్రకాష్ కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఇంజనీర్ అధికారులు ఓ & ఏం మరియు అర్టీజన్ కార్మికులు పాల్గొన్నారు

ఆటో కార్మిక సేవా సమితి…

ఆటో కార్మిక సేవా సమితి
సేవే మార్గం సేవే లక్ష్యం

మందమర్రి నేటి ధాత్రి

ఆటో కార్మిక సేవా సమితి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆటో కార్మిక సేవా సమితి గౌరవ చైర్మన్ శ్రీ యుత గౌరవనీయులు గాజుల ముఖేష్ గౌడ్ ఆదేశాల మేరకు….

మందమర్రిలోని సింగరేణి హై స్కూల్లో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది..

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమర్రి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీయుత గౌరవనీయులు రాజశేఖర్ గారి చేతుల మీదుగా నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందని ఆటో కార్మిక సేవా సమితి డొనేటర్స్ ను సన్మానించడం జరిగింది…

ఆటో కార్మిక సేవా సమితి చైర్మన్ నేరెళ్ల వెంకటేష్ గారు తెలిపారు..

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సూరం శ్రీనివాస్ రెడ్డి, సతీష్, కొప్పుల సంజీవ్, ముఖాల సంతోష్, గంగిపల్లి అంజి, ఎస్కే గౌస్, ట్రెజరర్ గోశిక, ప్రభాకర్, బొల్లు రవి అడ్వైజర్లు చొప్పరి లక్ష్మణ్, పంబాల శ్రీనివాస్, డైరెక్టర్స్ సముద్రాల శ్రీనివాస్, బత్తిని రాజేష్, ఆకుల శ్రీనివాస్, ఎండి ఇన్నోస్, నందిపాటి రవి, సిరిపురం రవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పిట్టల రవి, ఇంద్ర మల్లేష్, గీసా రవి, చిట్యాల రమేష్, భూపెల్లి చంద్రయ్య, ఎండి పాషా, తడి గొప్పల నందు, ముప్పు తిరుపతి, ప్రసాద్, టేట్లి మహేందర్, కొంగ మల్లేష్, ఆటో కార్మిక సేవా సమితి సంస్థ డొనేటర్స్ సకినాల శంకర్, పోతుగంటి తిరుపతి, బేర వేణుగోపాల్, స్వరూప, బుక్యా సుశీల, వడ్లకొండ సతీష్ మరియు వడ్లకొండ పరమేష్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతీ దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డియార్వో విజయలక్ష్మి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి,నర్సంపేట ఉమారాణి గార్లు పాల్గొని ప్రజలనుండి స్వీకరించారు.స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 130 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ 54, హౌసింగ్ 20 దరఖాస్తులు వచ్చాయని మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 56 వచ్చాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం లభించకపోవడంతో ప్రజావాణికి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని,మీ పరిధిలో పరీక్షించవలసిన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సంబంధిత జిల్లా అధికారులకు సూచించారు.ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి ఆదేశించారు.ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, పరిష్కరించుటకు వీలుకాని సమస్యలను ఎందుకు పరిష్కరించబడవో దరఖాస్తుదారునికి వివరించే ప్రయత్నంచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టిఐ ,గ్రీవెన్స్ పెండేల్సి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,e ఫైలింగ్ లో ఫైల్స్ సర్క్యులేట్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు.వ్యవసాయ,ఆరోగ్య, విద్యాశాఖ తదితర శాఖలు శాఖపరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా పనులు చేయించాలని పనులపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణచేసి లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమం జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, హార్టికల్చర్ అధికారి అనసూయ, డిబిసిడివో పుష్పలత,జిల్లా విధ్యా శాఖ అధికారి జ్ఞానేశ్వర్,నర్సంపేట ఆర్డీఓ ఇమారాణి,సంబంధిత అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్ రేవూరి.

కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్, రేవూరి

భూపాలపల్లి నేటిధాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కింటుకూరు మారేడుమిల్లి అడవీ ప్రాంతంలో ఈనెల 18వ తేదీ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, వారి సంస్మరణ సభ శనివారం గాజర్ల స్వగ్రామం వెలిశాలలో జరుగుతుంది. ఈ సంస్మరణ సభలో భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి లు పాల్గొన్నారు. గాజర్ల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలిద్దరూ పరామర్శ తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన గాజర్ల రవి యువకుడిగా ఉన్న రోజుల్లోనే బడుగు, బలహీన వర్గాల పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి, అడవి బాట పట్టి సుమారు 33 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి ఎన్కౌంటర్లో మృతి చెందారు. కాగా, వారి స్వగ్రామం వెలిశాలలో జరుగుతున్న సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో గాజర్ల అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో , పాల్గొన్నారు

సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి.

సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

జైపూర్ నేటి ధాత్రి:

 

వరంగల్ హైవే కు టేకుమట్ల గ్రామానికి సౌకర్యవంతంగా సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని శుక్రవారం మాజీ సర్పంచ్ గొనె సుమలత నర్సయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కార్మిక,గనుల శాఖ మంత్రి డాక్టర్.వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేశారు.టేకుమట్ల నుండి వరంగల్ వైపు వెళ్తున్న ప్రధాన హైవే విషయమై ప్రతినిధి బృందం కలిసి వివరణ ఇవ్వడం జరిగింది.హైవేకు ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం చేపడితే,స్థానిక రైతులు,ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని వారు తెలిపారు.
అలాగే స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతంగా జరుగడంతోపాటు,రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సర్వే చేపట్టిన బృందం వివరించింది.ఈ విషయాన్ని గమనించిన మంత్రివర్యులు,సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం.

న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం

హాజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి

హన్మకొండ వరంగల్ నేటిధాత్రి (లీగల్):

శనివారం నాడు వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా పొగాకు నిరోధక అవగాహన కార్యక్రమాన్ని న్యాయ సేవా సదన్ బిల్డింగ్ లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ హనుమకొండ జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి పాల్గొన్నారు.

ఇట్టి కార్యక్రమంలో వరంగల్ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా అనేక విధాలుగా చెడుగా ప్రభావితం చేస్తుంది అని తెలిపారు. పొగాకు వినియోగ దారులలో అవగాహన కల్పించడం మరియు దానిని మానేయడానికి తగిన కారణాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. పొగాకు కోరికను అధిగమించడానికి తన దృష్టి మరల్చుకొని పొగ రహిత ప్రాంతానికి వెళ్లడం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు సంగీతం వంటి ప్రత్యామ్నాయ సడలింపు పద్ధతులను ప్రయత్నించాలని సూచించారు.

legal services

హనుమకొండ ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు వినియోగం వలన కలిగే చెడు ప్రభావాలను వివరించారు. పొగాకు వాడకం గుండె మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధులకు దారితీస్తుంది, ధూమపానం గుండెపోటు లకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుంది కనుక పొగాకు కు దూరంగా ఉండటం మంచిదని సూచించారు.ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరితో న్యాయమూర్తులు పొగాకు రహిత ప్రతిజ్ఞ ను చేయించారు.

ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ కోర్ట్ న్యాయమూర్తి నారాయణ బాబు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, ఇతర న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్, హనుమకొండ జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా.ఏ.అప్పయ్య, మెడికల్ ఆఫీసర్ డా.మోహన్ సింగ్, డా. శ్రీనివాస్, పల్మనాలజిస్ట్ డా.పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు

నూతన ఆర్టీసీ బస్ సర్వీస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన.!

నూతన ఆర్టీసీ బస్ సర్వీస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే పాయం కు ఘన స్వాగతం పలికిన కొమరారం గ్రామ ప్రజలు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చిన ఎమ్మెల్యే పాయం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరారం నుండి గుండాల మండల కేంద్రానికి వయా శెట్టిపల్లి, శెంబునిగూడెం గ్రామ పంచాయతీ మీదుగా నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ని సోమవారం రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం ప్రయాణికులతో కొమరారం నుండి గుండాల వరకు బస్సులో ప్రయాణించి లింగాపురం పోతురాజు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు ప్రయాణికులతో ఆప్యాయతగా మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కొమరారం నుండి శెట్టిపల్లి వరకు బస్ సర్వీసును తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ఈ ప్రాంతానికి బస్ సర్వీసును ఏర్పాటు చేశామని గుండాల మండల ప్రజల సమక్షంలో బస్ సర్వీస్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని తెలియజేశారు. బస్సు ప్రయాణించే రోడ్డు మార్గంలో గ్రామస్తులు ఎమ్మెల్యే ని స్వాగతిస్తూ పూలమాలలతో వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చిన పినపాక నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తున్న ప్రజా నాయకుడు ఎమ్మెల్యే పాయం ని గుండాల మండల ప్రజలు అభినందించారు.
ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి ,గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముత్యమాచారి,మాజీ ఎంపీపీ చాట్ల పద్మ ,పిఎస్ఆర్, పీవీఆర్ మండల కోఆర్డినేటర్ ఖదీర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దార అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RTC

 

35 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే

ఎమ్మెల్యే పాయం కు ఘన స్వాగతం పలికిన గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గుండాల మండల పర్యటనలో భాగంగా గుండాల మండలంలో ని నల్లచేలక, శoభూనిగూడెం,గుండాల ఎస్టీ కలనీ,మటన్ లంక,జామరిగూడెం
పరిధిలో 35 లక్షల అంచన ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు నిధులు సమకూర్చి నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తున్నామని తెలియజేశారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
తదితరులు పాల్గొన్నారు.

భారత్ ఆర్మీ సైన్యానికి కృతజ్ఞతలు .

భారత్ ఆర్మీ సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవ సభ్యులు

వనపర్తి నేటిధాత్రి ;

 

 

పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై
భారత్ ఆర్మీ సైన్యం మెరుపు దాడులు నిర్వహించి .ఉగ్రవాదులను హతం చేసినందుకు భారత్ ఆర్మీ చీఫ్ ఆర్మీ జవాన్లకు వనపర్తి సామాజిక సేవకులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు .ఈ మేరకు వారు హర్షం వ్యక్తం చేశారు . గోనూరు వెంకటయ్య బి రాజశేఖర్ కె వేణుగోపాల్ శ్రీనివాసులు నరసింహ కె రమణ కె వెంకటేశ్వర్లు కె కె మూర్తి హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు

శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు.

శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు తరలి వెళ్లిన సింగరేణి కార్మికులు.కరీంనగర్ లోని గోవిందపతి శ్రీవారి సేవ ఫౌండర్ గోవిందపతి శీనన్న ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దొమ్మటి విజయ్ కుమార్,రాజేందర్, స్పందన,సత్య ప్రసాద్,నరేష్, శ్రీనివాస్,మోహన్ లు ప్రతి సంవత్సరం తేదీ 28/04 నుండి 05/05/25 వరకు భక్తిశ్రద్ధలతో శ్రీవారి సేవలో మునిగిపోతున్నారు.దేశం, రాష్ట్రం శష్యశ్యామలంగా, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని వారు ప్రతి సంవత్సరం శ్రీవారి సేవలో వేడుకుంటున్నట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version