చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులుగా పొదిల సురేష్

#నెక్కొండ, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ, బంజరపల్లి, మూడు తండా, గొల్లపల్లి, వాగ్య నాయక్ తండ, లకు సంబంధించి ఆటో యూనియన్ ఏర్పరచుకొని 30 సంవత్సరాలుగా అవుతున్న తరుణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆటో యూనియన్ ఎన్నికలను నెక్కొండ నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలలో చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ని, కార్యదర్శిగా చిలువేరు కొమ్మాలను, కోశాధికారి జితేందర్ , కమిటీ మెంబర్ గా కాజా పాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడు పొదిల సురేష్ తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నెక్కొండ నవత యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట అక్టోబర్ 8 నేటిధాత్రి (మెదక్)

Vaibhavalaxmi Shopping Mall

అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ.
రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏ క గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా చిర్ర సత్యనారాయణ, కోశాధికారిగా కట్ట ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా రాగి లింగం, సహాయ కార్యదర్శులుగా రామారపు యాదగిరి, కుస్టీ నారాయణ, ముఖ్య సలహాదారులుగా పాతూరి రమేష్ గౌడ్, ఉడెం దేవరాజు, మర్కు నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులకు అన్ని విధాలుగా తన వంతు ఎల్లప్పుడు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు.

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్…

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం కాల్వపల్లీ గ్రామానికి చెందిన పంచికా మహేష్ యాదవ్ నీ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ లు తెలిపారు, పంచిక మహేష్ యాదవ్ యాదవ జాతిని పటిష్టత కోసం నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణ గల యాదవ బిడ్డగా భూపాలపల్లి జిల్లా యాదవుల కోసం వారి సమస్యల కోసం ఎనలేని పోరాటాలు చేస్తారని యాదవుల కమ్యూనిటీ కోసం బలోపేతం చేస్తారని నమ్మకంతోని ఇవ్వడం జరిగింది పంచీక మహేష్ యాదవ్ నీ ఎన్నుకునట్లు తెలిపారు.

నూతనంగా ఎన్నకైన మహేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జాతి కోసం సిద్దాంతము పునరంకితం అయి నితి నిజాయితీ క్రమశిక్షణ చిథశుద్దితో పని చేస్తానని యాదవుల సామాజిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలపై ఎనలేని పోరాటము చేస్తానని యాదవులను సంస్థాగతంగా పటిష్ఠ పరుస్తనను అదేవిధంగా నాకు సహకరించిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్నకు మరియు రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర అన్నకు అలాగే రాష్ట్ర నాయకులు అందరికి ఇతర జిల్లా మండల నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా దొంగల రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఅన్నారు,

పరకాల బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు రామస్వామి…

పరకాల బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు రామస్వామి

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పల్లె రామస్వామి పరకాల బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షునిగా నియమించారు,అనంతరం రామస్వామి మాట్లాడుతూ నా నియమకానికి సహకరించిన రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ మిద్దెల జితేందర్ కి, హనుమకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి,ఐదు జిల్లాల కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జ్ సుంకరి శ్రీనివాస్ రెడ్డి కి, హనుమకొండ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్ కి,ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నేను కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిగా పనిచేస్తానని అన్నారు

బహుజనుల రాజకీయాల ఐక్యతే…

బహుజనుల రాజకీయాల ఐక్యతే
అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యానికి విరుగుడు…
పొన్నం బిక్షపతి గౌడ్ BSP జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు
మొగులపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గారు హాజరై మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతూ అందకారానికి దగ్గర చేస్తున్నాయని విద్య- వైద్యం- గూడు కనీస అవసరాలను తీర్చలేని ప్రభుత్వాలను రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో వారి దొంగ నాటకాలను అరికట్టాలని 42% BC రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న బహుజన్ సమాజ్ పార్టీనీ ఆదరించాలని పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా మొగుళ్లపల్లి మండల అధ్యక్షులుగా కళాశ చిరంజీవి మొగుళ్లపల్లి మండల ఉపాధ్యక్షులుగా మురారి మనోజ్ గార్లను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బొచ్చు తిరుపతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా EC మెంబర్ భూపాలపల్లి నియోజకవర్గ కార్యదర్శి పుల్యాల భగత్ మరియు తదితరులు పాల్గొన్నారు

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్…

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయంలో ఈనెల 27న గణపతి నవరాత్రి ఉత్సవములను నిర్వహించేందుకు నిర్వాహక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ సాంబమూర్తి దేవాలయ ప్రధాన అర్చకులు భైరవభట్ల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో. గ్రామస్తుల సమక్షంలో గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షనిగా క్యాతరాజు రమేష్, ఎన్నికయ్యారు. అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మాట్లాడుతూ. గణపతి నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని అందుకు కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తుల సహకారంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని క్యాతరాజు రమేష్ అన్నారు. ఉపాధ్యక్షులుగాదేవునూరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్దండి ప్రకాష్, కోశాధికారిగా బత్తిని రాజు, సహాయ కార్యదర్శిగాఎర్రబాటి మహేందర్, అన్నారపు కుమార్, కార్యవర్గ సభ్యులుగా వీణవంక నవీన్,క్యాతారాజు రజనీకాంత్, సూర్నేని మణికర్, గుడిమల్ల రమేష్, తంగళ్ళపల్లి వీరబ్రహ్మం, వీణవంక ప్రసాద్, కటుకూరి శ్రీధర్, దేవునూరి అశోక్, చాట్ల రాజు, పుట్ట అజయ్, హరీష్ లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఎన్నిక.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-70.wav?_=1

గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఎన్నిక.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోని గణేష్ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల నూతన కమిటీని స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు తాటి పెళ్లి శ్రీనివాస్ తెలిపారు. ఉత్సవాల కమిటీ అధ్యక్షుడిగా వల్లాల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా క్యాతరాజు మల్లేష్, మేడిపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మైదం శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా ఉయ్యాల రమేష్, కోశాధికారిగా చిలగాని నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా ఓదెల శ్రీహరి, ఈగ కోటేశ్వర్, మహమ్మద్ అక్బర్, మామిడి శెట్టి తిరుపతి, చింతకింది దశరథం, భీమారం ప్రమీల, పట్టేం రాజు, మహమ్మద్ వలి, పోతుగంటి సంతోష్ లను ఎన్నుకున్నట్లు ఆయన వివరించారు.

నూతన జిల్లా అధ్యక్షుడికి మందమర్రి ఫోటోగ్రాఫర్స్ సన్మానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-7.wav?_=2

నూతన జిల్లా అధ్యక్షుడికి మందమర్రి ఫోటోగ్రాఫర్స్ సన్మానం

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు . మందమర్రి పాత బస్టాండ్ వ్యాపార సంఘం అధ్యక్షులు శ్రీ వడ్లకొండ కనకయ్య గౌడ్ అధ్యక్షతన ఈరోజు మందమర్రి అంగడి బజార్ ఏరియా శివకేశావఆలయం లో. నూతనంగా ఎన్నుకోబడిన. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అప్పసు రామన్న కి. ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి కి. కోశాధికారి ముక్కెర శ్రీనివాస్ కి
ప్రత్యేక పూజలు నిర్వహించి
ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా శాలువా తో సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో
శివ కేశవ సంజీవ దేవాలయం.మందమర్రి అంగడి బజార్. అధ్యక్షులు. రంగ భూమయ్య * *గౌరవ అధ్యక్షులు రాచర్ల రవికుమార్ ప్రధాన కార్యదర్శి రాచర్ల.గణేష్ కోశాధికారి గడ్డం రామన్న కమిటీ సభ్యులు. బట్టు నారాయణరెడ్డి రంగ గురువయ్య * *కేశెట్టి సత్తయ్య గుడి పూజారి దిలీప్ శుక్ల *మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి. ప్రధాన కార్యదర్శి ఆడేపు అశోక్ కుమార్. *కోశాధికారి బద్రి సతీష్. సిహెచ్ రవి. కుటుంబ భరోసా ఇంచార్జ్ నూనె సురేష్ తదితరులు పాల్గొన్నారు**

ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలుగా పిన్నం వసంత నియామకం..

వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలుగా పిన్నం వసంత నియామకం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T130535.515-1.wav?_=3

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణ ఆర్య సంఘం మహిళా అధ్యక్షురాలుగా పిన్నo వసంత నియామకం అయ్యారు ఈ మేరకు నియామక పత్రాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం నాడు ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు నాగ బంది యాదగిరి పట్టణ అధ్యక్షులు బచ్చురాం ఆర్యవైశ్య నేతలతో కలిసి నియామక పత్రం అందజేశారు గతంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలిగా జిల్లా మహిళా సంఘం నాయకురాలిగా వసంత సేవలు అందించార ని యాదగిరి బచ్చురాం ఒక ప్రకటన లో తెలిపారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌ రవ అధ్యక్షులు నాగ బంది యాదగిరి పట్టణ అధ్యక్షుడు బచ్చురాం మాట్లాడుతూ నూతనంగా నియామకం అయిన శ్రీమతి వసంత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి పూజల పై దృష్టి పెట్టాలని ఆర్యవైశ్య మహిళలను గౌరవించి తేడా లేకుండా అందరినీ కలుపుకపోవాలని సూచించారు ఈ మేరకు నరేందర్ దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్యవైశ్య నేతలు న్యాయవాది అయిత కృష్ణ మోహన్ పూరి బాల్ రాజు శెట్టి మారం బాలీషి దొంత అశోక్ కందికొండ సాయిరాం వేణుగోపాల్ సి పం డ రయ్య మారం బాలీశ్వరయ్యా ఉల్లిగడ్డ రమేష్ ఆర్యవైశ్య మహిళలు భక్త్తులు పాల్గొన్నారు

సకల కళల పరిరక్షణ జేఏసీ జిల్లా

సకల కళల పరిరక్షణ జేఏసీ జిల్లా కమిటీ ఎన్నిక

కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అక్బర్ పాషా

పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున పట్టణంలోని ఎఫ్జె గార్డెన్లో హనుమకొండ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కళాకారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం ఆయా మండలాల నుంచి హాజరైన వారితో హన్మకొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సకల కళల పరిరక్షణ జేఏసీ హన్మకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అక్బర్ పాషా, ప్రధాన కార్యదర్శిగా దండు సారంగపాణిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మహమ్మద్ అక్బర్ తెలిపారు.సకల కళల పరిరక్షణ జేఏసీ ఉపాధ్యక్షులుగా మల్లయ్య , బాబురావు,బుచ్చయ్య,సహాయ కార్యదర్శులుగా, రమేష్,సమ్మయ్య రాజయ్యాలను ఎన్నుకున్నారు.కోశాధికారిగా కొండ సమ్మయ్య,ప్రచార కార్యదర్శిగా బొందయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోగా 9 మందిని కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అక్బర్ పాషా,దండు సారంగపాణిలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు తెలంగాణ ముఖ్యమంత్రిని కోరారు.

బిఆర్ఎస్ నిజాంపేట్ మండల యూత్ అధ్యక్షులు..

బిఆర్ఎస్ నిజాంపేట్ మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు జన్మదిన వేడుక

నిజాంపేట, నేటి ధాత్రి

మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మావురం రాజు జన్మదిన వేడుకను మెదక్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని భగవంతుని కోరుకుంటున్నాను అన్నారు. మావు రం రాజు మాట్లాడుతూ నాపై ప్రేమాభిమానాలు చూపి నాకు దీవెనలు అందించిన తిరుపతి రెడ్డి అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట పిఎసిఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి, బిఆర్ఎస్వి రాష్ట ఉపాధ్యక్షుడు పడాల సతీష్,ఏడుపాయల మాజీ చైర్మన్ బాలగౌడ్.కూర్తివాడ మాజీ సర్పంచ్ శ్రీను.బిఆర్ఎస్వి మెదక్ జిల్లా నాయకులు గంజి నవీన్.గోపీని సాయి. పంపరి నగేష్, సంగు స్వామి, మల్లేశం , వంశీ ,శివ, మహేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా కురుమిళ్ళ శ్రీనివాస్..

నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడిగా కురుమిళ్ళ శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

నాయి బ్రాహ్మణ సేవా సంఘం భూపాలపల్లి జిల్లా కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా భూపాలపల్లికి చెందిన కురుమిళ్ళ శ్రీనివాస్,మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శిగా నడిగోటి రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నడిగోటి రాము మాట్లాడుతూ జిల్లాలోని నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం దిశగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్, రాము, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు భూపాలపల్లి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి నూతన కమిటీ ఎన్నుకున్నట్లు వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అధ్యక్ష కార్యదర్శులు శాలువాలతో సన్మానించి స్వీట్ తినిపించి అభినందించారు. అలాగే మండలాల అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.

చిత్రపురి కాలనీపై ఆరోపణలు.. అధ్యక్షుడు అనిల్‌ క్లారిటీ..

చిత్రపురి కాలనీపై ఆరోపణలు.. అధ్యక్షుడు అనిల్‌ క్లారిటీ

హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీపై వస్తున్న ఆరోపణలపై అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీపై (Chitrapuri colony issue) వస్తున్న ఆరోపణలపై అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ (Anil Kumar) క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్‌ సూట్‌, రో హౌసెస్‌, డూప్లెక్స్‌ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్‌ కి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ‘చిత్రపురి కాలనీలో ఆరు నెలలకు ఓసారి సమావేశం జరుగుతుంది. అందరం కలిసి సమస్యల గురించి చర్చించుకుంటాం. ఈ మధ్యన కొందరు సమావేశంలో మాట్లాడకుండా చలో ఫిలిం ఛాంబర్‌, ఛలో గాంఽధీభవన్‌ అంటూ బయటికి వస్తున్నారు. అందులో చాలామంది చిత్రపురి కాలనీకి సంబంధం లేనివారు ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది. కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఈ కారణంగా కాలనీలో ఉండే ఎంతోమంది కొన్ని భయాందోళనకు గురవుతున్నారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలి అని ఒక కుటుంబం లాగా అందరం కలిసి ముందుకు వెళ్తున్నాము. అవినీతి జరిగిందంటూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడేవారు. అవేంటో చెబితే బహిరంగంగా మాటాడటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరూ ముందుకు రారు. చిత్రపురి కాలనీలో 4713 కుటుంబాలు ఇప్పటికే నివాసం ఉంటున్నారు. 700 నుండి 850 కోట్ల మధ్య ఉన్న చిత్రపురి కాలనీ పై సుమారు 3000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు. ఆరోపించేవారు ముందుకొస్తే సమాధానం చెప్పడానికి కమిటీ సిద్ధంగా ఉంది. కోర్టులో ఉన్న కొన్ని విషయాలపై నేను మాట్లాడలేను కానీ మిగతా వాటిపై నేను మాట్లాడతాను’  అన్నారు. 

* చిత్రపురి కాలనీలో జాయిన్ కావాలంటే కచ్చితంగా సినీ కార్మికులయ్యే ఉండాలి. ప్రస్తుతానికి సుమారు 60 శాతం మాత్రమే అలా ఉన్నారు. కొంతమంది అమ్ముకుని బయటకు వెళ్లిపోయారు.

* 2009లోనే పర్మిషన్లు తీసుకుని రో హౌసులు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2017లో కూడా మరికొన్ని పర్మిషన్లతో G+2గా మరి కొన్ని రో హౌసులు నిర్మించడం జరిగింది. అవి అన్ని పెర్మిషన్ తోనే జరిగాయి కాని కొంతమంది కేసులు పెట్టిన కారణంగా ఆ కట్టడాలు ఆపడం జరిగింది.

* ఇప్పటికీ ఉన్న రేట్లు అన్ని సమావేశంలో చర్చించుకుని ఫిక్స్ చేసినవే. అలాగే కాలనీ పై ఉన్న అప్పును దృష్టిలో పెట్టుకొని ఆ రేట్లు నిర్ణయించడం జరిగింది. సఫైర్ సూట్ నిర్మించేందుకు అన్ని పర్మిషన్లతోనే ముందుకు వెళ్తున్నాము.

* శ్రావణమాసంలో కొత్త నిర్మాణాలు మొదలుపెట్టనున్నాము. చుట్టుపక్కల ఉన్న ఎన్నో గేటెడ్ కమ్యూనిటీలకు తగ్గట్లు అన్ని రకాల ఎమినిటీస్ తో సఫైర్ సూట్ నిర్మించబోతున్నాము. ఈ కొత్త ప్రాజెక్టు పూర్తి కాకపోతే కాలనీ మనుగడకే సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా పర్మిషన్లు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. దానిని పూర్తి చేసి ఉన్న సమస్యలు అన్నిటిని సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. మొత్తం 51 అంతస్థుల భవనంలో సఫైర్ సూట్ ప్లాన్ చేస్తున్నాము.

* చిత్రపురి కాలనీలో నీటి సమస్య అనేదే లేదు. నిరంతరం మంజీరా నీటి సరఫరా ఉంటుంది.

* కాలనీలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ సరైన మెంబర్షిప్ లు ఉంటే కచ్చితంగా వారికి ఫ్లాట్ వచ్చేందుకు మా కమిటీ పూర్తి సహకారం అందించి వారికి ఫ్లాట్ వచ్చేలా పనిచేస్తుంది. వారికి ఫ్లాట్లు ఇచ్చేందుకు కూడా రెడీ గానే ఉన్నాయి.

* వచ్చే సెప్టెంబర్ నెలలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఆరోపణలు చేసేవారు వివరణ ఇవ్వాలి. ఆ వివరణ ఆధారంగా చర్యలు ఉండబోతాయి.

* ఇప్పటికీ చిత్రపురి కాలనీ పై ఉన్న సుమారు 170 కోట్ల రూపాయల అప్పును తీర్చాలంటే సఫైర్ సూట్ కేవలం 48 నెలలలో పూర్తి చేస్తే ఆ అప్పును తీర్చే అవకాశం ఉంది. అంతేకానీ చత్రపతి కాలనీలో సభ్యులపై ఆ అప్పు పడదు.

* 2023 తర్వాత ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు. ఒకవేళ అలా చేసిన 336లో సినీ కార్మికులు కాని వారు ఎవరైనా ఉంటే వారిని తీసేయడానికి అనిల్ కుమార్ కమిటీ సపోర్ట్ చేస్తుంది.

* సినీ జర్నలిస్టులకు కూడా చిత్రపురిలో ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా సినీ జర్నలిస్టులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అలాగే 24 క్రాఫ్ట్స్ లో తమ అసోసియేషన్ ద్వారా వస్తే ఫ్లాట్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము.

* గతంలో లోన్స్ కట్టలేని పరిస్థితులలో ఆక్షన్ వేసే పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో చదలవాడ శ్రీనివాస్ గారు చిత్రపురి కాలనీకి అండగా నిలబడ్డారు.

* ప్రభుత్వం వారు ఇప్పటికే వేసిన కమిటీ వారు ఎవరైనా సినీ కార్మికులకు న్యాయంగా ఫ్లాట్ వెళుతుంది అని చెప్తే కచ్చితంగా వారికి ఫ్లాట్ ఇస్తాము.

* సభ్యులను తీయాలంటే రెండు ప్రక్రియలు మాత్రమే ఉంటాయి. ఒకటి సరైన సమయంలో డబ్బులు కట్టకపోవడం వల్ల తీసేస్తాము. లేదా సినీ కార్మికులు కాని వారిని తీసేస్తాము. ఈ రెండు కారణాలు కాకుండా సభ్యులను తీసేసే అవకాశం ఎవరికీ లేదు. 

బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావుకు ఘన స్వాగతం

బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావుకు ఘన స్వాగతం

బాలానగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఎంపీ డీకే అరుణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గోపాల్ నాయక్ గజమాలతో రామచంద్రరావును సన్మానించారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ డీకే అరుణ, బీజేపీ నేత శాంత కుమార్ వర్గీయులు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు

కేసముద్రం/ నేటి దాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పధకంలో భాగంగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆదేశాలమేరకు లబ్ధిదారునితో మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మురళి,బండారు దయాకర్,అల్లం వెంకన్న,కన్నె యాకయ్య,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పోలేపాక నాగరాజు,తరాల సుధాకర్,బాధ్య నాయక్, బాలు నాయక్,జల్లంపల్లి శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్స్ ఎండీ ఆయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి,దామరకొండ ప్రవీణ్, భూమటి పురుషోత్తం రావు,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్ యాదవ్,అల్లం నిరంజన్ యాదవ్,మాజీ ఉప్పసర్పంచ్ రఫీ,ఎండీ నవాజ్ అహ్మద్,తోట సుధాకర్,యూత్ కాంగ్రెస్ కార్యదర్శి తోట అఖిల్,పరకాల కుమార్, ఎండీ రఫీ, ఎండీ సమీర్,యశ్వంత్,ప్రభు, బల్మోహన్,విజేందర్ రెడ్డి,తోట మధు,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

27 న భూపాలపల్లి బి..

27 న భూపాలపల్లి బి
ఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం

గణపురం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి నేతృత్వంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు తారకరామరావు హాజరవుతారని ఈ సమావేశానికి మండల పరిధిలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు , పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గణపురం మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి తెలిపారు

మట్టిపాట పోస్టర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

మట్టిపాట పోస్టర్ ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ దసరాకు నరేష్ రచించిన మట్టిపాట పోస్టర్ ను చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూట్ల తిరుపతి విచ్చేసి మాట్లాడుతూ అమ్మ తనం ఎంత విలువైనదొ మట్టి పరిమళం కూడా అంతే విలువైనదని చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మ నవమాసాలు కడుపులో మోస్తే మనిషిని జీవితాంతం కాపాడేది మట్టి తల్లి అని పేర్కొన్నారు నేటి సమాజంలో నేల తల్లికి లేని స్వార్థం మనుషులలో నేడు పేరిగిపోయిందని చుట్టూ ఉన్న సహజ వనరులను కాపాడుకోవాలని ప్రకృతి మన దైవమని పేర్కొన్నారు అదే విధంగా ఈ పాటను రచించిన దాసారపు నరేష్ ను పాట లో నటించిన జన్నే యుగేందర్, పాట పాడిన జూపాక శివను, సంగీతం కిట్టు కిస్ ను పాటలో పాల్గొన్న బృందాన్ని అభినందించారు
కార్యక్రమంలో దొడ్డి కిష్టయ్య, గడ్డం కొమురయ్య, పుల్ల మల్లయ్య, అల్లకొండ కుమార్, గుమ్మడి సత్యం, పుల్ల సతీష్, శనిగరపు మొగిలి కటుకూరి మొగిలి, గోల్కొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు

కార్మిక సంఘం అధ్యక్షుడికి సన్మానం.

కార్మిక సంఘం అధ్యక్షుడికి సన్మానం.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-25T115303.147.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల అధ్యక్షలుగా సుకుమార్ ఎన్నికయ్యారు. వారిని జహీరాబాద్ బీజేపీ మహిళా నాయకురాలు జ్యోతి పండాల్, తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు రాజేష్ ముదిరాజ్ కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు..

సిరిసిల్ల ఎమ్మెల్యే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) 49వ జన్మదినం సందర్భంగా సిరిసిల్ల గాంధీ చౌక్ లో
బిఆర్ఎస్ పార్టీ నేతలు వైభవంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్లకే ఒక ఒక వరం మన అన్న కేటీఆర్ అని, అలాంటి వారి జన్మదినం ఈరోజు జిల్లాలో జరుపుకోవడం ఎంతో సంతోషకరమని అంతేకాకుండా ఈ సిరిసిల్లని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం గత ప్రభుత్వం పాలనాలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరగడం అని కొనియాడారు. అంతే కాకుండా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల తోట ఆగయ్య కూడా మాట్లాడుతూ


ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, మరియు తల్లి శిశువులకు సంబంధించిన కెసిఆర్ కిట్లు హాస్పటల్లో పంచడం జరిగినది తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ మాజీ చైర్పర్సన్ జిందo కళా చక్రపాణి, బోల్లి రామ్మోహన్, ధర్నాo లక్ష్మీనారాయణ, అడ్డగట్ల మురళి, తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన సందర్భంగా.

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

, వనపర్తి నేటిడాత్రి:

అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే. జన్మదినం సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారని మీడియా సెల్ కోఆర్డినేటర్ డి వెంకటేష్ ప్రకటనలో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version