బాలాజీ ప్లవర్ అసోసియేషన్ కమిటీ

బాలాజీ ప్లవర్ అసోసియేషన్ కమిటీ నూతన కమిటీ ఎన్నిక
ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కమిటీ

నర్సంపేట టౌన్,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని పూల దుకాణాల బాలాజీ ఫ్లవర్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా నూతన కమిటీ సభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.నూతన కమిటీ అధ్యక్షుడు పర్ష శ్రీనివాస్ ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శి బానోత్ పంతుల్ నాయక్,కార్యదర్శి కోల వెంకటే శ్వర్లు,కోశాధికారి భయ్యా కర్ణాకర్,కమిటీ సభ్యులు పర్ష వెంకన్న, పుల్లయ్య,శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో..

రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సినారె జయంతి వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T152642.831.wav?_=1

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం ఆధ్వర్యంలో కవి, రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి 94వ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కవులు పుష్పాంజలి ఘటించడం జరిగినది. సిరిసిల్ల రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండ రవి మాట్లాడుతూ హనుమాజీ పేటలో జన్మించి, సాహిత్యపూల తోటలో విరబూసి ఆలిండియా కే గర్వకారణం తెచ్చిన సిరిసిల్ల ముద్దుబిడ్డ సినారే జ్ఞానపీఠం పురస్కారం తెచ్చిన మహాకవి అని తెలిపారు. అలాగే రచయితల సంఘం ఉపాధ్యక్షులు బూర దేవానందం సి.నారాయణ రెడ్డి పై కవిత గానం చేశారు. ఉపాధ్యక్షులు వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ సినారే సిరిసిల్లలో రాబోయే నూతన కవులకు ఒక దిక్సూచి అని తెలిపారు. అంతేకాకుండా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ సినారే సిరిసిల్లలో జన్మించడం మా సిరిసిల్ల కే గర్వకారణమని తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రముఖ కవులు ఎలాగొండ రవి, బుర దేవానందం, వెంగళ లక్ష్మణ్,చిటికెన కిరణ్ కుమార్ ఆడేపు లక్ష్మణ్,అంకారపు రవి, గుండెల్ని వంశీ, అల్లే రమేష్ కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు..

మొక్కలు నాటిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు

నర్సంపేట,నేటిధాత్రి:

వన మహోత్సవంలో భాగంగా నర్సంపేట మండలంలోని కమ్మపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అధ్యక్షులు అల్లే రాజు మాట్లాడుతూ వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎఫ్డీఓ నాగమణి ఆదేశాల మేరకు కుల సంఘం ఆవరణలో, పెద్దమ్మగుడి వద్ద పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఫీల్డ్ ఆఫీసర్ హరీష్,ముదిరాజ్ కుల పెద్దమనిషి అల్లే పైడి కార్యదర్శి పెండ్యాల రవి,
కమ్మపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నంబర్ మేకల రాజు,మాజీ కుల పెద్దమనిషి పెండ్యాల బిక్షపతి, మాజీ సొసైటీ అధ్యక్షులు కుల పెద్దమనిషి పెండ్యాల మల్లేశం, మేకల రవి,అటెండర్ అల్లే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన ఎస్సై కి సన్మానం.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన ఎస్సై కి సన్మానం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-93.wav?_=2

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లా కోహీర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నరేష్ కు బుధవారం నాడు పైడిగుమ్మల్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చీమల ప్రశాంత్, ఉపాధ్యక్షుడు నేరేడు మహేష్, అనిల్ కుమార్, అంబేద్కర్ యువజన యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్వో కి వినతి పత్రం అందించిన ఉపాధ్యాయుల సంఘం.

ఎమ్మార్వో కి వినతి పత్రం అందించిన ఉపాధ్యాయుల సంఘం
జమ్మికుంట (నేటిధాత్రి)
జమ్మికుంట తాసిల్దార్ వెంకటరెడ్డికి కరీంనగర్ జిల్లా డి టి ఎఫ్ అధ్యక్షుడు ఆవాల నరహరి ఉపాధ్యాయులతో కలిసి వినతి పత్రం అందించారు ఉపాధ్యాయులకు రావలసిన మెడికల్ బిల్లులు GPF బిల్లులు క్లియరెన్స్ లు పూర్తి చేయాలని కోరారు ఉపాధ్యాయ సమస్యలపై పోరాట కమిటీ ఆగస్టు 1న అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా, ఆగస్టు 23న హైదరాబాదులో మహాధర్నా కార్యక్రమంలో చేపడుతున్నట్లు తెలిపారు.

విద్యుత్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం

విద్యుత్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా వేల్పుల రాజేశం

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా వేల్పుల రాజేశం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి తెలిపారు.ఆదివారం బెల్లంపల్లి చౌరస్తా ఆవరణలో
మంచిర్యాల సర్కిల్ స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘం
(621/2014) అధ్యక్షులు కుమారస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అనంతరం మంచిర్యాల జిల్లా నూతన ఎస్సీ,ఎస్టీ విద్యుత్ శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.అధ్యక్షులుగా వేల్పుల రాజేశం (ఏడిఈ), కార్యదర్శిగా పసరగొండ శ్రీనివాస్ (ఏ ఏ ఓ),ఎన్నికైన సందర్భంగా జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ జెడ్ ఉత్తమ్,బి.రాజన్న (డి /ఓ పి) బెల్లంపల్లి,కైసర్ (డి /ఓ పి)
అభినందనలు తెలిపారు.

తెలంగాణ పిఆర్ టియు సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం.

తెలంగాణ పిఆర్ టియు సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

నేటిదాత్రి చర్ల

Telangana PRTU Association.

 

పిఆర్ టియు రాష్ట్ర జిల్లా శాఖల పిలుపు మేరకు చర్ల మండలం లోని వివిధ పాఠశాలలు తిరిగి పిఆర్ టియు టిఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగినది దీనిలో చర్ల మండల సభ్యులు అందరూ సభ్యత్వం తీసుకోవటం జరిగింది ఈ కార్యక్రమం లో పిఆర్ టియు టిఎస్ చర్ల మండల అధ్యక్షులు ఎస్ఎస్ఎస్ రవికుమార్ ప్రధాన కార్యదర్శి తుర్రం వీరభద్రం పునేం వేణు శ్రీనివాస్ దారయ్య గురుమూర్తి వీరమోహన్ పోడియం నాగేశ్వరరావు కాంతారావు తదితరులు పాల్గొన్నారు మంచి స్పందన సభ్యులలో కనిపించింది సంఘం ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అని మీకు త్వరలో మంచి పి ఆర్ సి ట్రాన్స్ఫర్ తో కూడిన ప్రమోషన్స్ పెండింగ్ బకాయిలు జనగణన చేసిన డబ్బులు ఇప్పించాలని సభ్యులు తెలుపగా సమస్యలు వెంటనే తీర్చే విధంగా చర్యలు తీసుకొనేలా రాష్ట్ర శాఖకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి తెలిపి వీలైనంతవరగా సమస్యలను పరిష్కరిస్తామని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు

యజమానుల సంఘం అధ్యక్ష  కార్యదర్శుల హామీ.

పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు  అసాములకు ఒప్పందం ప్రకారం కూలీ ఇవ్వాలి

సిఐటియు ఆధ్వర్యంలో పాలిస్టర్ అసోసియేషన్ ఆఫీస్ ముందు ధర్నా

సంఘం అధ్యక్ష కార్యదర్శులకు వినతిపత్రం అందజేత

యజమానుల సంఘం అధ్యక్ష  కార్యదర్శుల హామీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రలోని పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు , ఆసాములకు కూలీ తగ్గించి ఇస్తున్న యజమానుల వైఖరికి నిరసనగా వెంటనే కూలీ పెంచి ఇవ్వాలనే డిమాండ్ తో ఈరోజు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘ భవనం ముందు ధర్నా చేపట్టి సంఘం అధ్యక్ష , కార్యదర్శులు ఆడెపు భాస్కర్,అంకారపు రవి లెటర్ ఇవ్వడం జరిగినది.

ఈ సందర్భంగా వారు కార్మిక సంఘ నాయకులు మూషం రమేష్ , కోడం రమణ మరియు కార్మికులతో చర్చలు జరిపి రెండు రోజుల వరకు యజమానులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి కూలీ పెంచి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా CITU – పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు ఆసాములకు గత సంవత్సర కాలంగా ఒప్పందం ప్రకారం కూలి చెల్లించకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా యజమానులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా యజమానులు వెంటనే ఒప్పందం ప్రకారం కూలి చెల్లించాలని లేకుంటే కూలి తగ్గించి ఇస్తున్న యజమానులపై లేబర్ ఆఫీసులో కేసులు నమోదు చేయిస్తామని అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెళ్తామని అన్నారు.

పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.

పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం:-

హాజరైన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్:-

 

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి, (లీగల్):-

 

 

 

 

శనివారం హనుమకొండ లోని నేత హాస్టల్ లో పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో పద్మశాలి న్యాయవాదుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ల ఎన్నికలలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా వలుస సుదీర్, కోశాధికారి గా సిరిమల్ల అరుణ, కార్యవర్గ సభ్యులుగా యం.

మేఘనాథ్, పరకాల బార్ అసోసియేషన్ మహిళ కార్యదర్శిగా గజ్జెల సధారణి, జనగామ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి రామకృష్ణ గెలుపొందిన తదితర న్యాయవాదులను ఆయన ఘనంగా సన్మానించారు.

ఇట్టి సందబంగా దుస్సా జనార్ధన్ మాట్లాడుతూ ప్రతీ యువ న్యాయవాది నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు.

Advocates

 

ఈ కార్యక్రమం లో పావ అధ్యక్షులు గంజి గణేష్, సీనియర్ న్యాయవాదులు మార్గం వీరస్వామి, దాసరి ప్రేంసాగర్, కొండబత్తుల రమేష్ బాబు, పోపా రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్, బిల్లా ప్రభాకర్, మేరుగు సుభాష్, రవీందర్, పాము రమేష్, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా పద్మశాలి అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

వివిధ మండలాలు సందర్శించిన రైతు సంఘం అధ్యక్షుడు.

వివిధ మండలాలు సందర్శించిన రైతు సంఘం అధ్యక్షుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ న్యాల్కల్ మండలం వివిధ మండలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి కార్యవర్గ సభ్యుడు సునీల్ ధత్, న్యాల్కల్ ఎంపీటీసీ శ్రీశైలం, గోపాలరెడ్డి, దేవదాస్, తుల్జారాం, తదితరులు పాల్గొన్నారు.

రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ చేసిన.

రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ చేసిన సింగరేణి సంక్షేమ సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

కాకతీయ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం రీజన్ బెల్లంపల్లి రీజన్లో రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి చీఫ్ లైజన్ ఆఫీసర్, ఏరియా లైజన్ ఆఫీసర్, అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పర్సనల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వారి బృందంతో పాటు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు అధ్యక్షులు భాస్కర రావు జనరల్ సెక్రెటరీ భూక్య నాగేశ్వరరావు కార్యనిర్వాహక అధ్యక్షులు పంతుల ఏరియా అధ్యక్షులు సెక్రెటరీ పాల్గొని, ఆర్జి-1 ఏరియా, ఆర్జి-2 ఏరియా, బెల్లంపల్లి ఏరియా, మందమర్రి ఏరియా, శ్రీరాంపూర్ ఏరియా, ఎస్ టీ పీపీ ఈ 5 ఏరియాల్లో ఉన్నటువంటి రోస్టర్ రిజిస్టర్ పుస్తకాలను తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు
ఇప్పటివరకు క్యారీ ఫార్వర్డ్ అవుతున్న అన్ని పోస్టుల వివరాలను ఏరియా పర్సనల్ మేనేజర్ ద్వారా కాపీలను తీసుకోవడం జరిగింది ఏరియాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి,
ఆర్జి -1 ఏరియా, – 66 ఆర్జి-2 ఏరియా, – 31
ఆర్జి- 3 ఏరియా. -48
బెల్లంపల్లి ఏరియా – 11
మందమర్రి ఏరియా – 31
శ్రీరాంపూర్ ఏరియా. -92
ఎస్ టి పిపి- 03
భూపాలపల్లి ఏరియా – 33
ఎన్ సి డబ్ల్యూ ఏ
క్యాడర్లలో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలను పైన తెలిపిన విధంగా ఏరియాలో గిరిజనుల పోస్ట్లు భర్తీ కాకుండా ఉన్నాయని తెలియజేస్తున్నాము వాటిని భర్తీ చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ పర్సనల్ మేనేజర్ కి తెలియజేయడం జరిగింది వాటిని భర్తీ చేయడానికి మేనేజ్మెంట్ వారు అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది కావున ఏరియాలో ఉన్న జరిగిన ఉద్యోగస్తులు గమనించగలరు కోరుతున్నాము
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా అధ్యక్షులు మోహన్ సెక్రటరీ హేమ నాయక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి రాములు, జాయింట్ సెక్రెటరీ రాజు నాయక్ సిహెచ్ వెంకన్న జి అనిల్ లక్ష్మణ్ మోతిలాల్ పాల్గొన్నారు

ఎమ్మెల్యే రేవూరిని కలిసిన మండల ఫర్టిలైజర్స్ వెల్ఫేర్

ఎమ్మెల్యే రేవూరిని కలిసిన మండల ఫర్టిలైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ

 

పరకాల నేటిధాత్రి :

 

మండల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ అధ్యక్షులు వెంకన్న ను మరియు ప్రధాన కార్యదర్శి నవత బ్రదర్స్ శివాజీని,కోశాధికారి మల్లికార్జున,ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ లను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి విత్తనాలు లో,ఎరువులు,పురుగు మందులు వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు ఎరువులను రైతులకు అందించే విధంగా నాణ్యత ప్రమాణాలతో తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా నా సహాయ సహకారాలు మీకు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

సీఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన రెడ్డి వేమన సంఘం.

సీఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన రెడ్డి వేమన సంఘం.

నర్సంపేట నేటిధాత్రి:

ఇటీవల నూతనంగా నర్సంపేట పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన సీఐ రఘుపతి రెడ్డిని
నర్సంపేట డివిజన్ వేమనరెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో ఘనంగా సన్మానించారు.అధ్యక్షులు చింతల కమలాకర్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు లెక్కల విద్యాసాగర్ రెడ్డి, వీరమల్ల మాధవ రెడ్డి,బైరి తిరుపతి రెడ్డి,కే విజేందర్ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,గోలి శ్రీనివాస్ రెడ్డి,వీరమల్ల సంజీవరెడ్డి,ఉపేందర్ రెడ్డి,బిల్లా ఇంద్రా రెడ్డి,మాడుగుల మల్లారెడ్డి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,పెరుమళ్ళ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నడికూడ నేటిధాత్రి:

మండలంలోని తహసిల్దార్ గా నూతనంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గుజ్జుల రవీందర్ రెడ్డి ని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.మండల వ్యాప్తంగా ఉన్న రైతు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వివిధ విభాగాల అధికారులతో చర్చించి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం తహసిల్దార్ కు,శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు.ఈ కార్యక్రమంలో మండలంలోని అధ్యక్షులు వాంకే రాజు,ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకేటి నగేష్,యూత్ నాయకులు నారగాని రాకేష్ గౌడ్,లోనే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జమ్మికుంట వాసి పెండం సర్వేశం ఎన్నిక
హర్షం వ్యక్తం చేసిన జమ్మికుంట చేనేత సంఘాలు

జమ్మికుంట నేటిధాత్రి:

హైదరాబాద్ (ముగ్దం మోహినుద్దీన్ భవన్) లో జరిగిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన పెండెం సర్వేశం ను రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా సర్వేశం గురువారం జమ్మికుంట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉండి కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేతన్నలను చిన్నచూపుచూస్తున్నా
యని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెట్టి చేనేత పరిశ్రమను దెబ్బతీసిందని ఇప్పటికైనా జిఎస్టి తొలగించాలని, రద్దు చేసిన చేనేత పథకాలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని సహకార సంఘాల రుణాలతో సహా నేతన్నల కు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని, సహకార సంఘాలకు,టెస్కోకు ఎన్నికలు నిర్వహించలని కోరారు. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి చేనేత కార్మికులకు చేతినిండా పనులు కలిగించి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.6 లక్షలు ఇవ్వాలని, కార్మికులకు నెలకు రూ. 5000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యల పరిష్కారానికి రానున్న కాలంలో కార్మికులను చైతన్య పరిచి ఉద్యమాలు
చేస్తామని చెప్పుకొచ్చారు. తను ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనరసయ్య లతో పాటు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకులు జమ్మికుంట మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు మాటేటి సమ్మయ్య, నాయకులు బొమ్మకంటి మహేంద్ర చారి, ఈవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.

సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.

మందమర్రి నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సహారా ఇండియా బాధితుల సంఘం సమావేశమై ఈ క్రింద పేర్కొనబడిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించనైనది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్ మాట్లాడుతూ సహారా డబ్బులు విషయంపై మందమర్రి ఏజెంట్ డి. శ్రీనివాసరావు, మేనేజర్ ఎస్. టి. రావు ను నిలదీయగా గత ఐదు నెలల క్రితం లీగల్ నోటీసులు జారీ చేశారు.. అంటే అడిగితే న్యాయానికి సంకెళ్లు వేస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయం? చట్టానికి కళ్ళు ఉన్నాయని నిరూపిస్తాం. వందమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు గాని ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు భారతీయ శిక్ష స్మృతి ప్రకారం అని పేర్కొన్నారు. ఈ విషయం పై త్వరలో జిల్లా కలెక్టర్, రామగుండం సిపి పోలీస్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి పత్రం అందజేసి. అనంతరం ధర్నాలు రాస్తారోకలు గ్రామాల నుంచి మండలాల వరకు మండలం నుంచి జిల్లా వరకు జిల్లా నుంచి రాష్ట్రం వరకు పోరాడి మా డబ్బులు మాకు తెచ్చుకునే దిశగా ఎంత దూరమైనా వెళ్తామని పేర్కొన్నారు. అలాగేసింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జల్లి వెంకటయ్య మాట్లాడుతూ
సహారా ఇండియా సంస్థలో కాలపరిమితి పూర్తి అయిన ఖాతాదారులకు వెంటనే సహారా సంస్థ డబ్బులు చెల్లించాలి. అలాగే బెల్లంపల్లి మంచిర్యాల నస్పూర్ కాలనీలో ఉన్నటువంటి సహారా ఇండియా మేనేజర్లకు బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించే విధంగా కృషి చేయాలని వినతి పత్రాలు ఇవ్వడానికి తీర్మానం చేయనైనది.సంవత్సరాల తరబడి సహారా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ డిపాజిట్లు చెల్లించకపోవడం వలన వృద్ధులు వితంతువులు సీనియర్ సిటిజల్లు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఇతరులు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇట్టి విషయంపై కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కి అదేవిధంగా బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల శాసనసభ్యులకు కూడా సహారా బాధితుల పక్షాన వినతి పత్రాలు సమర్పించి బాధితులను ఆదుకునే విధంగా కృషి చేయాలని కోరుతూ తీర్మానించడమైనది.ఇట్టి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య, డి. రాజమౌళి నస్పూర్, డి. కొమురయ్య గంగారం, వెంబడి రాజేందర్ బెల్లంపల్లి, బొల్లు రాంబాబు మందమర్రి, దండు మల్లయ్య, యాదన్న, రాజమల్లు, సదానందం, నోముల వెంకన్న, సత్యనారాయణ, అజారుద్దీన్, ఓదేలు తదితరులు మహిళా సహారా బాధితులు పాల్గొనడం జరిగింది.

శ్రీ రామాంజనేయ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక.

శ్రీ రామాంజనేయ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక.

-అధ్యక్షుడిగా పుప్పాల కమలాకర్.

-ప్రధాన కార్యదర్శిగా మారం నారాయణ.

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ రామాంజనేయ ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక శుక్రవారం జరిగింది.అధ్యక్షుడిగా పుప్పాల కమలాకర్,ఉపాధ్యక్షుడిగా శేరు రాజేశం,ప్రధాన కార్యదర్శిగా మారం నారాయణ,సహాయ కార్యదర్శిగా సోమిడి ప్రభాకర్,కోశాధికారిగా తోడేటి రవి లను ఏకిగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యవర్గ సభ్యులుగా మర్రి శ్రీకాంత్,సందెల శ్రీనివాస్,పునగుర్తి గట్టయ్య,బుడిమే కుమార్ ను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ట్రాక్టర్ యూనియన్ బలోపేతం కోసం కృషి చేస్తామని యూనియన్ అభివృద్దే లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ ఓనర్లు,డ్రైవర్లు,రైతులు పాల్గొన్నారు.

ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుండెకారి రంగారావు.

ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుండెకారి రంగారావు

నర్సంపేట,నేటిధాత్రి:*

 

 

ఆరె కుల సంక్షేమ సంఘం ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన గుండెకారి రంగారావును ఎంపికయ్యారు.ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా ఆరెకుల ముఖ్య నాయకుల సలహా సూచన మేరకు కృషి చేస్తానని అన్నారు. తన మీద ఎంతో నమ్మకంతో బాధ్యతను కట్టబెట్టి, కుల సంఘ నిర్మాణంలో, కార్యక్రమాలలో నా వంతు సహాయ, సహకారాలతో పాటు,తనకు గ్రామ,మండల,జిల్లా, రాష్ట్ర కమిటీ నాయకులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.తన నియామకానికి సహకరించిన ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు,
రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ, రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్,స్టీరింగ్ కమిటీ చైర్మన్ దిగంబర రావు,రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోర్తాల చందర్ రావు,క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మారుజోడు రాంబాబు, రాష్ట్ర, జిల్లా కమిటీ ముఖ్య నాయకులకు రంగారావు కృతజ్ఞతలు తెలిపారు.

మందమర్రి రజక వృత్తిదారుల సంఘం.!

మందమర్రి రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సమావేశం….. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల్ల ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకాన్ని రజక అభివృద్ధి దారులకు కూడా అమలు చేయాలని మందమర్రి పట్టణంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ధోబిఘాట్లను పూర్తి చేయాలని అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

General Meeting

 

అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు జిల్లా అధ్యక్షులు తంగేళ్లపల్లి వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు ముస్కే చందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్ ఉపాధ్యక్షులు కొత్తకొండ నరసయ్య బండి పోశయ్య రాసర రాములు పెనుగొండ సమ్మయ్య తోటపల్లి కళావతి తడిగొప్పుల భాగ్య తదితరులు పాల్గొన్నారు

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డిని రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుకు భూ భారతి చట్టంపై అవగాహన, ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రైతు సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version