ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి…

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు..

రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)

 

నేడు రామాయంపేట పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది డాక్టర్ జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గంలో జన్మించి భారతదేశ ఉన్నతమైనటువంటి పార్లమెంట్ యొక్క స్థాయిలో అనేక పదవులను అధిరోహించి భారత దేశ ఉప ప్రధాని పదవిని కూడా ఆయన అనుభవించడం జరిగింది నాటి కాలంలో అంటరానితనం భయంకరంగా ఉన్నప్పటికీని అంతా ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు పార్లమెంటులో ఆయన గళం విప్పారు పోరాడినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన మానవ అట్టడుగు వర్గాల హక్కుల కొరకు పోరాటం చేసి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అంబేద్కర్ రైటర్ అయితే జగ్జీవన్ రామ్ ఫైటర్గా పోరాటం చేసిన మహనీయుడు ఆయన సేవలు మరువలేని కాబట్టి ఆయన చిరస్మరణీయులు ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఈ యొక్క కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా లైన్స్ క్లబ్ వారు కూడా పాల్గొనడం జరిగింది బీసీ సంఘం నాయకులు మెట్టు గంగారం బీసీ నాయకులు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ దళిత నాయకులు కరికివిద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాతూరి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లద్ద నర్సింలు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తుడుం పెంటయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల కిషన్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అక్కిరి గారు రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు జేరిపోతుల అశోక్ గడ్డం సిద్ధరాములు ఎర్ర రాములు లైన్స్ క్లబ్ నాయకులు రాజశేఖర్ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ కైలాష్ గారు ఇంకా తదితరులు పాల్గొన్నారు

వ్యవసాయ కుటుంబంలో పుట్టి సినిమా రంగంలో రాణింపు.

‘వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. సినిమా రంగంలో రాణింపు’

 

కల్వకుర్తి / నేటి ధాత్రి.

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన బోయిన్ పల్లి శేఖర్ గౌడ్ వ్యవసాయ కుటుంబం. శ్రీశైలం హైవేలో కొంతకాలం హోటల్ నిర్వాకుడిగా పనిచేశాడు. అనంతరం అంది వచ్చిన అవకాశంతో.. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ రైటర్, అసోసియేట్ డైరెక్టర్ గా మిత్రుడు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తో కలిసి పనిచేశారు. ఇటీవలే ఆహా ఓటీటీలో విడుదలయ్యింది. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, సినిమా రంగంలో రాణించడంతో బంధువులు, స్నేహితులు శేఖర్ గౌడ్ ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.

క్యాతనపల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి.

దశాబ్దాల కళ నెరవేరనున్న వేళ…. క్యాతనపల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్, మంచిర్యాల మధ్య ప్రయాణికులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైల్వే బ్రిడ్జి కళ నెరవేరనున్నది. క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో బ్రిడ్జి మీదుగా రవాణా జరిగే అవకాశం ఉన్నట్లు ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు పడుతున్న అవస్థలు గుర్తించి పన్నెండు సంవత్సరాల క్రితం అప్పటి పెద్దపల్లి ఎంపీ గా వివేక్ వెంకటస్వామి బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా బ్రిడ్జి పనులు నత్తనడకన కొనసాగాయి. పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పదవీ బాధ్యతలు చేపట్టిన నుండి బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి ఆరాతీస్తూ పనులను వేగవంతం అయ్యేలా చొరవ తీసుకున్నారు. సుమారు 35 కోట్ల నిధులతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అప్రోచ్ రోడ్డు పనులు పూర్తవుతున్నాయి. ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుండడంతో ప్రయాణికులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రామకృష్ణాపూర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది..

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి

Railway

 

రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండే వారు. ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.

ఎంపీ వంశీ ,ఎమ్మెల్యే వివేక్ కు రుణపడి ఉంటాం…

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

Railway

 

గత 12 సంవత్సరాల క్రితం వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, గత బిఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోకుండా ఉండటంతో ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ల చొరవతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని వారికి రుణపడి ఉంటామని అన్నారు.

ప్రయాణికులకు దూర భారం తగ్గనుంది…

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్

 

Railway

స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ల చొరవతో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రయాణికులకు దూర భారం తగ్గనుందని అన్నారు. ఎంపీకి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

రైల్వే గేటు కష్టాలు తప్పునున్నాయి…

 

Railway

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్

రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు రైల్వే గేట్ అడ్డం ఉండడంతో రైల్వే గేటు పడిన సమయాలలో నిత్యం వందలాది వాహనాలు నిలిచిపోయేవి. రైల్వే గేట్ సమీపంలో గేట్ పడిన సమయంలో ప్రాణాలు సైతం పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రజలకు గేట్ కష్టాలు తప్పి రవాణా సులభతరం కానుందని, ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పట్టణ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి. 

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి. 

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే 6 ఏరియాలోని ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం యువజన విభాగం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు
బి.సదానందం ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.నర్సింగ్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్
బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసిన ఘన నివాళులు అర్పించారు.అనంతరం జె. నర్సింగ్ మాట్లాడుతూ..
దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర పోరాట యోధుడు అణగారిన వర్గాల సంక్షేమం కోసం సంఘ సంస్కర్తగా అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ దళిత వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి సంకల్పించిన వీరుడు బాబు జగ్జీవన్ రామ్ వారు మన దేశానికి తొలి దళిత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆదర్శ పాలక అధ్యక్షులుగా పేరు గడించారని తెలియజేశారు.అలాగే అతి పిన్న వయసులో మంత్రి బాధ్యతలు చేపట్టి భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రిగా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా 40 ఏళ్ల పాటు భారత దేశ పార్లమెంట్ లో వివిధ మంత్రి పదవులను చేపట్టిన గ్రామీణ కార్మికుల కోసం అణగారిన వర్గాల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ పని చేసే వారని అలాంటి మహనీయుడైన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ యొక్క 118 వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం మంచిర్యాల నియోజకవర్గ కమిటీ మరియు యువజన విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అభినందనీయమైనది అని అన్నారు.ఈ కార్యక్రమంలో
సంక్షేమ సంఘం నస్పూర్ మున్సిపాలిటీ ప్రచార కార్యదర్శులు సిహెచ్ వాసు,టి.విజయ్ యూత్ నాయకులు,సుజిత్,ప్రజ్వాల్, జశ్వంత్,అరవింద్,బబ్లూ, నరేష్,తేజ,యశ్వంత్,బన్నీ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు. 

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ అంబేద్కర్ కాలనీ లోని అంబేద్కర్ భవనం లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కొప్పర్తి రాజం మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కోప్పర్తి రాజం, మడుగుల శంకర్,జిలకర రాజం,యువ నాయకులు మడుగుల స్వామి దాస్, మడుగుల మహేష్,కొప్పర్తి చింటూ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యలపై పోరాటం దాడు లకు బయపడo ఐక్యవేదిక.

ప్రజాసమస్యలపై పోరాటం దాడు లకు బయపడo ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి :

 

ప్రజా సమస్యలపై 45 రోజుల పాటు కమిటీలు వేస్తూ, వారోత్సవాలు, జరపాలని నిర్ణయం తీసుకున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా.అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు
సతీష్ యాదవ్ నివాసంలో విలేకరుల తో ఆయన మాట్లాడుతూ, అఖిలపక్ష ఐక్యవేదిక రిజిస్టర్ అయీ నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజా సమస్యలపై వినూత్నంగా వారోత్సవాలు జరిపాలని నిర్ణయించడం జరిగిందని, ఇంతకుముందు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పేవారని, ఇకనుండి ప్రజల వద్దకే పోయి సమస్యలను స్వీకరించి వార్డు, ఊరు, మండలం, జిల్లా కమిటీలు వేయడం జరుగుతుందని, ప్రజలు చెప్పే సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అవి పరిస్కారమయ్యే వరకు పోరాడుతామని, ఇప్పటివరకు మాపై జరిగిన దాడులు సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపై ఎవరైనా మాపై దాడులు చేయాలని చూస్తే ప్రజల సమక్షంలోని ఎదుర్కొంటామని, దాడులకు భయపడమని అన్నారు
ఈ సమావేశంలో సతీష్ యాదవ్ తో , వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, శివకుమార్, పుట్టపాక బాలు,పాషా,కుమార్, శ్రీనివాసులు, సురేష్, రాముడు, కృష్ణయ్య, నాగరాజు, అన్వర్ తదితరులు పాల్గొన్నారు

శివాలయ పునర్నిర్మాణానికి 3లక్షల విరాళం.

శివాలయ పునర్నిర్మాణానికి 3లక్షల విరాళం.

చిట్యాల, నేటిధాత్రి :

 

చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి ఏలేటి రామయ్య పల్లి గ్రామానికి చెందిన కీర్తి శేషులు ఏలేటి రాంరెడ్డి జ్ఞాపకర్థం వారి కుమారులు అయినటువంటి ఏలేటి రాజు – ప్రసన్న, మరియు శ్రీనివాస్ – జమున దంపతులు శివాలయానికి విరాళంగా 300116/- రూపాయలు అక్షరాల (మూడు లక్షల నూట పదహారు రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్,బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి,కాల్వ సమ్మిరెడ్డి,బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు,చెక్క నర్సయ్య,సర్వ శరత్, తీగల నాగరాజు,అనగాని రాజయ్య,తిప్పణవేణి రవి, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

మాటలతో మభ్యపెట్టే ఎమ్మెల్యే ,కార్పొరేటర్ మాకొద్దు..!

మాటలతో మభ్యపెట్టే ఎమ్మెల్యే ,కార్పొరేటర్ మాకొద్దు – తమ కాల్ నేను అభివృద్ధి చేసే నాయకులు కావాలి :
స్థానిక కాలనీ మహిళలు

మల్కాజిగిరి నేటిధాత్రి

05 ఏప్రిల్

41 సంవత్సరాల నుండి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తున్న , కేవలం రోడ్లు, మోరీలు తప్ప తమ బస్తీకి ఏ ఒక్క నాయకుడు చేసింది ఏమీ లేదని, ఇందిరా నెహ్రూ నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలో రాజకీయ నాయకులు తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పడి 41 సంవత్సరాలు గడిచిన ఈరోజు వరకు కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ లేకపోవడం విడ్డూరం. మహిళలు సమైక్య గ్రూపులు చేసుకోవాలన్న, యువత ఏదైనా మీటింగులు పెట్టుకోవాలన్న, అన్ని రోడ్లమీదనే కొనసాగుతున్నాయని, కాలనీలో కమిటీ హాల్ కోసం ఉన్న 60 గజాలలో నిర్మాణం జరపడానికి నిధులు. 

MLA .

 

లేవని నాయకులు చెప్పడం తమ దౌర్భాగ్యం అని అన్నారు. ఓట్ల సమయంలో తమకు ఏ సమస్య లేకుండా చేస్తామని మభ్యపెట్టి తమతో ఓట్లు వేయించుకోని గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు తమ వద్దకు వచ్చి తమ సమస్యలను తీర్చిన దాఖలాలే లేవని అన్నారు. గతంలో నాయకులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుపుతామని పలుమార్లు కొబ్బరికాయలు కొట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్లారు తప్ప ఈరోజు వరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఊసే లేదు అని నాయకుల తీరుపై మండిపడ్డారు. జనరల్ ఎలక్షన్స్ సమయాన తమకు బోర్ వేయించిన ప్రస్తుత కార్పొరేటర్, 14 నెలలు గడిచిన ఈరోజు వరకు దానికి స్టార్టర్ ఏర్పాటు చేయకపోవడం హాస్యస్పదమని అన్నారు. స్థానికులు సొంత డబ్బులతో స్టార్టర్ ఏర్పాటు చేసుకుంటే, చాలా రోజుల నుండి బోరు వాడకపోవడంతో బోర్ లో నుండి నీళ్లు రావడం లేదని తెలిపారు. ఐదేళ్లకోసారి ఎలక్షన్స్ అప్పుడు వచ్చి తమను మభ్యపెట్టే నాయకులు ఇకపై తమకు వద్దని, తమ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, నాయకులకే తాము అండగా ఉంటామని గంటపదంగా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే స్పందించి, పనిచేయని బోరును వెంటనే మరమ్మతులు చేయించాలని, అదేవిధంగా 41 సంవత్సరాల నుండి తాము ఎంతగోనో ఆశగా ఎదురు చూస్తున్నా కమిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. అవి చేయకుండా ఓట్ల కోసం వారి వద్దకు వస్తే మాత్రం నాయకులకు వ్యతిరేకంగా ఓట్లు వేసి వారిని ఓడకొట్టి గుణపాఠం చెప్తామని అన్నారు.

ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి

దళిత సింహం జగ్జీవన్ రామ్-ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి

పరకాల నేటిధాత్రి

 

పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానిడాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత సింహమని బీహార్లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 198లో ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జన్మించారని ఆయన జన్మదినాన్ని భారతదేశమంతట సమతా దివసుగా జరుపుకుంటారన్నారు.అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి షెడ్యూల్ కులాలను ఆయన సంఘటితం చేశారని,బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారని తెలిపారు.సామాజిక చైతన్యం సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆల్ ఇండియా డిప్రెసెడ్ క్లాసెస్ లీగ్అఖిల భారతీయ రవిదాస్ మహాసభకు పునాది వేశారని అలాగే 1935లో అక్టోబర్19న దళితులకు ఓటు హక్కు కోసం హమండ్ కమిషన్ ముందు వాదన వినిపించారన్నారు.రాజ్యాంగ సభలో సభ్యుడుగా ఆయన పాత్ర ఎనలేనిదని దళితుల సామాజిక న్యాయ రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు 1946లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటుచేసిన తాత్కాలిక ప్రభుత్వ క్యాబినెట్ లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి తర్వాత కమ్యూనికేషన్,రైల్వే,రవాణ,ఆహార,వ్యవసాయ,రక్షణ వంటి కీలక శాఖలో బాధ్యతలు నిర్వహించారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడానికి జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్ఎఫ్ నాయకులు బొచ్చు సంపత్ మాదిగ,దైనంపెళ్లి అజయ్ మాదిగ,ఒంటేరు మహేందర్ మాదిగ,ఏకు ప్రణయ్ మాదిగ,ఒంటేరు చరణ్ మాదిగ లు పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణీ.

సన్న బియ్యం పంపిణీ. 

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు ఆధ్వర్యంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మా గౌడ్ ,రహీం, రజిని, పోచవ్వ, బాలవ్వ తదితరులు పాల్గొన్నారు

బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు…

ఎంపీడీవో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వడదెబ్బతో వృద్ధురాలి మృతి.

వడదెబ్బతో వృద్ధురాలి మృతి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఎండ వడదెబ్బతో మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాంబలక్ష్మి (80) వడదెబ్బతో తీవ్ర అస్తవతకు గురై ఉదయం మరణించింది విషయం తెలుసుకున్న. గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల రాజ్ కుమార్ పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు అనంతర o మృతురాలి కుటుంబ సభ్యులకుతన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వ్యక్తం చేశారు

జగ్జీవన్ రావు జయంతి వేడుకలు.

ఎమ్మార్వో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో అధ్యక్షతన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు ఫోటోలకు పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి.

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి.

రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)

 

దివంగత బాబు జగ్జీవన్ రామ్ సెవెన్ మరువలేనివని రామాయంపేట లైన్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. శనివారం రామాయంపేట పట్టణంలో ఆయన 117వ జయంతి వేడుకలను నిర్వహించారు. బడుగు బలహీనవర్గాల కోసం ఆయన ఎంతో సేవ చేశారని ఆయన సేవలు మరువలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ నాయకులు. ఏలేటి రాజశేఖర్ రెడ్డి, దేమే యాదగిరి, కైలాష్ తదితరులున్నారు.

జై బాపు జై భీమ్ జై సంవిధానం.!

భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు జై భీమ్ జై సంవిధానం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలంలో శనివారం రోజున గొల్లపల్లి బస్వ రాజుపల్లి రవినగర్ జంగుపల్లి, భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు,జై భీం,జై సంవిధాను లో బాగంగా మండలం గ్రామంల లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,రాజ్యాంగ పిటికలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రేపాక రాజేందర్, ఆధ్వర్యంలో కార్యక్రమ మండల ఇన్చార్జి పంతకాని సమ్మయ్య మాజీ ఎంపీటీసీ కాటారం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమారస్వామి, గణపురం మండలం వైస్ ఎంపీటీసీ విడదనేని అశోక్, మండల అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుందని అన్నారు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ,అణగారిన వర్గాల హక్కులు కాలరాస్తున బీజేపీ వైఖరి నశించాలని నినదించారు. భారత రాజ్యాంగమును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆద్వర్యంలో నెల రోజులు మండల వ్యాప్తంగా జరిగే యాత్రలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు,విద్యావంతులు పాల్గొని విజయంతం చేశారు గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఉడిగే అరుణ్ కుమార్, కోటంచ డైరెక్టర్ ఏనుగుల సంపత్, సీనియర్ నాయకులు మర్రి ఐలయ్య, పోలు బుచ్చయ్య, బైకాని రాజ్ కుమార్, లక్కం రాములు, భూతం సంపత్, పాల్గొన్నారు. బసరాజ్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కట్ల మల్లయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ రమేష్, మాజీ ఎంపీటీసీ జంగిల్ భవిత మాజీ వైస్ ఎంపీటీసీ చింతకుంట్ల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ బుగ్గ తిరుపతి, సైన్డ్ల సమ్మయ్య, సైన్డ్ల తిరుపతి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు రవినగర్-జంగుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు జంగా వెంకట నరసయ్య, మాజీ సర్పంచ్ మంజుల- భాస్కరరావు, మానుక మధు, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.!

జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం చిర్రావంచ చింతల్ తనా పద్మ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నమన్నారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ ఈరోజు 05.04.2025. రోజున తంగళ్ళపల్లి మండలంలో జై బాపు. జై భీమ్. జై సంవిధాన్.. కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టడం జరిగిందని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడాలని రాజ్యాంగ విలువలను కాపాడాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని మహాత్మా గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు వివరించాలని తెలియజేశారు భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి. 75. సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేడు పేద బలహీన వర్గాల ప్రజల వృద్ధిపై ఆకాంక్ష లేదని ప్రధాని పేద ప్రజల కంటే బడా బాబులకు ముఖ్యమన్నారు రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు అంబేద్కర్ గాంధీ పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బిజెపి పార్టీ అనగదొక్కలని చూస్తుందనీ అమిత్ షాఅంబేద్కర్ నీ పార్లమెంటు సాక్షిగా అవమానించారని గ్రామ మండల స్థాయిలో కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని కోరారు గాంధీ అంబేడ్కర్ ఆశయాల సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ గత బి.ఆర్.ఎస్ పార్టీ అందజేసిన పథకాలు కూడా కొనసాగిస్తున్నామన్నారు కానీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులుఓ ర్వలేక వ్యతిరేక అంశాలను సోషల్ మీడియా ద్వారా పలు విషయాలు పై విషం చిమ్ముతుందని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగం అని దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిపరుడుపై ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

దళితుల హక్కుల కోసం పోరాడిన DR జగ్జీవన్ రామ్.

దళితుల హక్కుల కోసం పోరాడిన సంఘసంస్కర్త డాక్టర్ జగ్జీవన్ రామ్

ఆయన జీవితం యువతకు స్ఫూర్తి దాయకం

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

సమాజంలో దళిత బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు గొప్ప సంఘ సంస్కర్త జగ్జీవన్ రామ్ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ధూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన జయంతిని పురస్క రించుకొని కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహానుభా వుడు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించడమే కాకుండా స్వాతంత్ర అనంత రం చిన్న వయసులో కేంద్ర క్యాబినెట్ లొ కార్మిక కమ్యూని కేషన్ మంత్రిగా పని చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకొనిపనిచేయా లని అన్నారు ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు మారపల్లిరవీందర్ ,చిందం రవి దుబాసి కృష్ణమూర్తి, కట్టయ్య, మార్కండేయ, మస్క కుమారస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన.!

డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

డా; బాబా జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు. 

MLA.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ‘బాబూజీ’ అని అన్నారు.ఎమ్మెల్యే గారితో పాటుగా న్యాల్కల్ మండల జెడ్పీటీసీ స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిమ్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహిద్దీన్,మాజి మొగుడంపల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సురేష్,మాజి సర్పంచ్ లు విజయ్ , జగ్దిష్,దేవదాస్,యువ నాయకులు మిథున్ రాజ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,గణేష్, చంద్రయ్య,వినోద్,ప్రభాకర్,దీపక్,శంత్ కుమార్,నగేష్,ప్రవీణ్ మెస్సీ,తదితరులు పాల్గొన్నారు.

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలు దంతులను సన్మానం.

హిందూ రాష్ట్ర సభ అధ్యక్షురాలు దంతులను సన్మానం చేసిన బీజేపీ నేతలు
వనపర్తి నేటిదాత్రి :

హిందూ రాష్ట్ర సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్ శ్రీమతి నారాయణ దాస్ జ్యోతి రమణ దంపతులను ఎంపికైనందున వనపర్తి పట్టణ 11 వ వార్డు రామ్ నగర్ కాలనీ కి చెందిన కాటమోనీ కృష్ణ గౌడ్ బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో 11వ వార్డు రాంనగర్ కాలనీ బిజెపి నాయకులు బోడా భాస్కర్ పట్టణ కార్యదర్శి అక్కల శివ గౌడ్ పట్టణ బీజేవైఎం నాయకులు అడ్డాకుల రాణా ప్రతాప్ 11వ వార్డు బూత్ అధ్యక్షులు 11వ వార్డు బిజెపి నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ చంద్రకాంత్ రాజు రవి తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version