మంచినీటి కోసం మున్సిపాలిటీ ముట్టడి..

మంచినీటి కోసం మున్సిపాలిటీ ముట్టడి

నల్లా నీళ్లు రావడం లేదంటూ బిందెలతో కాలనీవాసుల ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని 1వ వార్డు కాలనీలో తీవ్ర మంచినీటి సంక్షోభం నెలకొంది.గత కొంతకాలంగా కాలనీలో నల్లా నీళ్లు కూడా సరిగా రావడం లేదని,తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా 1 వ వార్డు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల ఆధ్వర్యంలో శనివారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ఒకటో వార్డులో గత కొన్ని నెలలుగా నీటి సమస్యలు వస్తున్నాయని పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు.ప్రశ్నిస్తూ ఫిర్యాదు చేసిన వారిపై దురుసుగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు.అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కాలనీవాసులు మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిందెలతో ధర్నా చేపట్టిన మహిళలు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి తక్షణమే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మౌలిక వసతులైన తాగునీటి సమస్యను పట్టించుకోకపోవడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుందని, బాధ్యతాయుతంగా అధికారులు వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
కూరపాటి క్రిస్టఫర్, సంకినేని హనుమంతరావు, దంచనాదుల సురేష్, దంచనాదుల సతీష్,ఎండి అఫ్జల్ పాషా, భూక్య మంజుల, మొగిలిచర్ల లక్ష్మి, భూక్య సునీత, నల్లబెల్లి మంజుల,
ఎండీ గుడియా బేగం,ఎండీ కౌసర్, ఎం.ఈ హసీనా, ఎం.ఈ జరినా, ఎం.ఈ సజియా, ఎండీ నూర్,
శ్రీపెల్లి రమ, మల్యాల నాగలక్ష్మి, జాటోత్ విజయ, లవూడియా విజయ తదితరులు పాల్గొన్నారు.

ఒకటో వార్డులో అధ్వానంగా అంతర్గత రోడ్లు…

ఒకటో వార్డులో అధ్వానంగా అంతర్గత రోడ్లు

రెండేళ్లుగా ఫిర్యాదు చేసిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు

నర్సంపేట మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో గల అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆ వార్డు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం ఆరోపించారు. వార్డు పరిధిలో ఉన్న అన్ని వీధుల్లో పారిశుద్ధ్యం లోపించి కంపు కొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బురదమయంగా మారుతున్న అంతర్గత రోడ్ల పట్ల గత రెండు సంవత్సరాలుగా మున్సిపాలిటి అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆరోపించారు.

పారిశుద్ధంపట్ల చెత్త సేకరణ కోసం రెండు రోజులకు ఒకసారి రావాల్సిన సంబంధిత వాహనము వారం రోజులైనా రాకపోవడంతో గత కొంతకాలంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి.. చెత్త పేరుకుపోయిన 1వ వార్డు గల్లీలు ఆడవిని తలపిస్తున్నది వాపోయారు. డ్రైనేజీ కాలువలు తీయక.. మురికితో నిండిపోయి..ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయి.దుర్వాసన వెదజల్లుతున్న డ్రైనేజ్ కాలువలను మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోని ఆగ్రహం వ్యక్తం చేశారు.అపరిశుభ్రతతో ఈగలు,దోమల దాడులతో వార్డు ప్రజలు అనారోగ్యాలపాలవుతున్నారని పేర్కొన్నారు.చిన్న వర్షం పడ్డ అంతర్గత మట్టి రోడ్లన్నీ బురుదమయమై నడవడానికి కూడా వీలు లేకుండా..కాలు వేస్తే కాలు తీయలేని పరిస్థితి నెలకొందని వివరించారు.

డ్రైనేజ్ కాలువ పక్కనే వేసిన మిషన్ భగీరథ పైపులైన్లు లీకేజీలు ఏర్పడి మిషన్ భగీరథ వాటర్ వదిలినప్పుడల్లా డ్రైనేజీ నీటిలో కలిసి కలుషితమవుతున్నాయని గతంలో మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చిన నేటికీ కూడా మరమ్మతులు చేపట్టకుండా నిమ్మకునీరెత్తినట్లుగా మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలని మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం కోరారు.

1వ వార్డు సమస్యలు పరిష్కరించాలి బీజేపీ

1వ వార్డు సమస్యలు పరిష్కరించాలి బీజేపీ నాయకులు

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

కల్వకుర్తి పట్టణంలో ఒకటో వార్డులో బిజెపి నాయకులు మార్నింగ్ వాక్ లో అక్కడి ప్రజలను కలువగా అక్కడి ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లారు.హైదరాబాద్ రోడ్డు నుంచి బచ్పన్ స్కూల్ వెళ్లే దారిలో గంగాధర్ ఇంటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని 15 సంవత్సరాలుగా ఇండ్ల నిర్మాణం అయినప్పటికీ మురికి కాలువల నిర్మాణం కాలేదు తక్షణమే పనులు నిర్మించాలని కోరారు.

ఒకటవ వార్డు బచ్పన్ స్కూల్ ముందు ఉన్న ఇండ్ల మధ్యలోకి వర్షపు నీరు మురికి నీరు నిలుచుచున్నవి అట్టి నీరుని బయటకు పోకుండా పక్క ల్యాండ్ వాళ్లు ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది అందువలన వర్షపు నీరు మురికి నీరు అక్కడికి చేరుకొని చెరువుల వలే తలపిస్తుంది ఇండ్లలోకి వర్షపు నీరు మురికి నీరు పాములు ఇతరతర జీవరాసులు ఇండ్లలోకి రావడం జరుగుతుంది తద్వారా ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.ఒకటో వార్డు లో గల వాసవి రైస్ మిల్ ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు కలవు అట్టి పైపు లు వృధాగా ఉన్నందున తక్షణమే అక్కడ డ్రైనేజీ పనులు ప్రారంభించవలసిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులు కల్వకుర్తి మున్సిపల్ ఏఈఈ షబ్బీర్ అహ్మద్ గారికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గన్నోజు బాబిదేవ్, సీనియర్ నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి,నరెoడ్ల శేఖర్ రెడ్డి, కృష్ణ గౌడ్, గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి నాప శివ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version