కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం
‘నేటిధాత్రి”,హనుమకొండ.
తేదీ: 21/ 10 /2025 మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు బాలసముద్రంలో గల చక్రవర్తి హాస్పిటల్లో తోటి కళాకారిణి పట్టపురి అనిత గారి అమ్మ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతుంది, ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సినిమా మరియు టీవీ కళాకారుల సంఘం అధ్యక్షుడు “సదా.రుద్రారపు” వెంటనే స్పందించి తన తోటి కళాకారుల సహాయ సహకారంతో చక్రవర్తి హాస్పిటల్ సందర్శించి తమ వంతు సహాయంగా 5000 రూపాయలను ఇచ్చి పరామర్శించారు,ఇక నుండి కళాకారుల విషయంలో ఈ సంఘం ముందుంటుందని కళాకారులందరూ అభిప్రాయంవ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా యాక్టింగ్ మరియు టీవీ కళాకారుల అసోసియేషన్ మెంబర్స్, అనిల్ కుమార్ సుద్దాల, పాల కుమారస్వామి,ఎరుగొండ లావణ్యగౌడ్,ఎలుకపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.
