కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం.

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, విజయగణపతి దేవాలయంలో ప్రధాన పూజారులు వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగింది. రాములోరి కళ్యాణాన్ని పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తిలకించారు. రాములోరి కళ్యాణ మహోత్సవంలో మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ దంపతులు పాల్గొని దేవతా మూర్తుల తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పునాది వేసిందే వివేక్ వెంకటస్వామి.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పునాది వేసిందే వివేక్ వెంకటస్వామి…

పనులు పూర్తి కాగానే ప్రారంభించేది వివేక్ వెంకటస్వామి నే…..

మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు నిధులు మంజూరు చేసింది, పనులు పూర్తి చేసింది కాంగ్రెస్ హయంలోనే అని, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోనే నని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు. గత పన్నెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న బ్రిడ్జి పనులు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చివరిదశకు వచ్చిన నేపథ్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశి కృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

Bridge.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినప్పటికి అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, బాల్క సుమన్ బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపనలు చేసి పనులను నత్త నడకన కొనసాగించి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, పనుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవరోధాలు లేకుండా చేసి గెలిచిన సంవత్సరన్నర కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం బ్రిడ్జి పనులు పూర్తి చేశారని ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతోనే పనులు పూర్తి అయ్యాయాయని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజరమేష్ కి సిగ్గు లేదా అని మండిపడ్డారు. త్వరలోనే బ్రిడ్జి ప్రారంభం చేసి ప్రాంత ప్రజల చిరకాల కోరికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తీర్చుతారని నాయకులుb పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, యాకూబ్ అలీ, కళ్యాణ్, శివకిరణ్, రాజేష్, సుధాకర్, బాణేష్, లాడెన్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది.

బొమ్మ పూర్ క్వారీలో లారీకి ఆరు వందలులు వసూల్.

వేబిల్ వద్ద 200, లోడింగ్ కు 300,

కాంట వెయ్యకుండానే ప్రతి లారీకి 600 చొప్పున తీసుకొని “వేబిల్ “ఇచ్చిన లారీలు.

కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు.

లారీ కాటా పై వచ్చి సెల్యూట్ కొట్టి వెళ్ళితే సరిపోతుంది, వే బిల్,రెడీ.

అడిగే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్ వ్యక్తులు దాడికి సిద్ధంగా ఉంటారు.

ఉన్నత అధికారుల ఆదేశం, ఈ క్వారీ కాంట్రాక్టర్ డోంట్ కేర్ అనేలా కనబడుతుంది.

నా లారీ లోడ్ అయిపోయింది ఇప్పటికీ 600 ఇచ్చాను ఓ డ్రైవర్.

మహాదేవపూర్, నేటిధాత్రి:

ప్రభుత్వ ఆదేశాలు ఇసుక పాలసీ ఈ రెండు క్వారీల్లో మాత్రం అమలు పరచడం అసాధ్యంగా మారింది. ఇసుక లోడింగ్ వద్ద ఉన్న.” పోక్లైన్’ డబ్బాల నిండా పైసలు జమ చేసుకోవడం, వేబిల్ తోపాటు సీరియల్ వద్ద మరో రెండు రెండు వందల రూపాయలను వసూలు చేస్తున్నారు, అంతేకాకుండా గత కొన్ని రోజులుగా కేవలం ఇసుక లారీల్లో నింపి, కాంట చేయకుండానే బేబీల్లో లారీ యొక్క సైజులు పట్టి వే బిల్ ,లో ఇన్ని టన్నుల ఇసుక అని వేయడం జరుగుతుంది. కాటా చేయకుండా లారీల రవాణా వ్యవహారం అదనపు బకెట్ ఇసుక లారీల్లో నింపడం జరుగుతుందని స్పష్టం కావడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ రెండు క్వారీల్లో టీఎస్ ఎండిసీ శాఖ చర్యలకు బదులు, క్వారీ కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారి అక్రమ వసూళ్లకు పాల్పడడం జరుగుతుంది.

తాడ్పాల్ వేసుకుంటున్న 600 తీసుకున్నారు వేబిల్ వద్ద 300 ఇచ్చాను డ్రైవర్.

 

లోడింగ్ పుక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం బొమ్మ పూర్ గ్రామం పేరుతో గ్రామ శివారులో ఏర్పాటు చేసిన, బొమ్మ పూర్ ఒకటవ నంబర్, అలాగే ఎలికేశ్వరం రెండవ నంబర్, పేర్లతో గత సంవత్సరం నవంబర్ నెలలో ప్రారంభమైన ఈ రెండు ఇసుక క్వారీలు అక్రమ ఇసుక రవాణాకు పెద్ద మొత్తంలో తెరలేపడం జరిగింది, ప్రభుత్వం ఉన్నత అధికారులు ఈ రెండు ఇసుక క్వారీల పై ప్రత్యేక నిఘా పెట్టి ఉన్నత అధికారులు పర్యవేక్షించడం కూడా జరిగింది. అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవ అక్రమ రవాణా పై అడ్డుకట్ట వేస్తూ కొత్త పాలసీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ రెండు ఇసుక క్వారీల యజమాన్యం మాత్రం అధికారుల ఆదేశాలు ఇసుక పాలసీ ను తుంగలో తొక్కి, టీఎస్ ఎండిసీ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని, అక్రమ వసూళ్ల నేటికీ కొనసాగిస్తుంది.

కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది.

మహాదేవపూర్ మండల పరిధిలోని పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేస్తున్న బొమ్మ పూర్, ఇలికేశ్వరం పేర్లతో నిర్వహించబడుతున్న ఈ రెండు క్వారీలు, టి ఎస్ ఎం డి సి సిబ్బంది అధికారులను తమ గుమస్తాగా మార్చుకొని, ఇసుక లోడింగ్ వద్ద ప్రతి లారీకి 300 రూపాయల వసూళ్లు చేయడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ కొరకు సీరియల్ వద్ద మరో 200 నుండి 300 వరకు, అలాగే వేబిల్ ఇచ్చే క్రమంలో మరో 200 రూపాలను లారీల నుండి తీసుకోవడం జరుగుతుందని డ్రైవర్లు నిర్భయంగా చెప్పడం జరుగుతుంది, లోడింగ్ పాయింట్ వద్ద లోడ్ చేసి అటువంటి ఫోక్లైన్ లో ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేసి, లోడింగ్ కు వచ్చే, ప్రతి లారీ వద్ద 300 రూపాయలను తీసుకోవడం జరుగుతుంది, కొందరు డ్రైవర్లు 200 ఇచ్చిన లోడింగ్ చేసే ప్రసక్తి లేదని 300 ఇస్తేనే లోడింగ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.

కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు.

ఈ రెండు ఇసుక క్వారీల యజమాన్యం కొత్త రకమైన అక్రమానికి తెరలేపింది, గత కొన్ని రోజులుగా లోడింగ్ చేసుకొని వచ్చిన లారీ కాటా పైకి వెళ్లి, “సెల్యూట్ కొట్టి” వెళ్లిపోవాల్సిందే లారీలో ఎంత ఇసుక ఉంది, ఏమైనా ఎక్కువ ఇసుక వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా అని కాంట చూసే ప్రసక్తి లేదు, లారీ సైజును బట్టి లారీలో వచ్చిన టన్నులను బేబీల్ లో వేయడం జరుగుతుంది, కాంట రిసిప్ట్ లాంటివి ఏమీ ఇవ్వడం లేదు, అడుగుతే కరెంటు లేదు, బ్యాటరీ ఇంవేటర్ చెడిపోయింది అని సమాధానం చెప్పడం, గట్టిగా ప్రశ్నించే పరిస్థితి అక్కడ లేదు, ఎందుకంటే కాంట్రాక్టర్ కు సంబంధించిన కొందరు ప్రశ్నించే వారిపై, లేదా ఫోటో వీడియో లాంటి వాటిని చిత్రీకరిస్తామని ప్రయత్నించిన ఆ డ్రైవర్లకు ఇతరులపై దాడికి సిద్ధంగా కొందరిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రశ్నించే పరిస్థితి లేదని స్పష్టంగా కనబడుతుంది.

ఉన్నత అధికారుల ఆదేశం, ఈ క్వారీ కాంట్రాక్టర్ “డోంట్ కేర్” అనేలా కనబడుతుంది.

ఉన్నత అధికారుల పర్యవేక్షణ అనంతరం కూడా బొమ్మ పూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీల అక్రమాలు, ఆగడం లేదంటే దీని వెనుక కారణం ఎవరు, టీఎస్ఎండిసి సిబ్బంది అధికారులు, ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచాల్సింది పోయి, కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారి, వారితో కలిసి వసూళ్లు చేయడం జరుగుతుంది అంటే, దీని వెనుక అధికార యంత్రాంగం హస్తము కూడా ఉందని స్పష్టమవుతుంది. తక్షణమే మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ఎండిసి, జిల్లా కలెక్టర్ భూపాలపల్లి ఈ రెండు ఇసుక క్వారీలను సందర్శించి, అక్కడ జరుగుతున్న అక్రమాల పై డ్రైవర్ల తో వివరాలు సేకరించి, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ సమ్మర్‌ హాట్‌ గురూ!!

ఏప్రిల్‌ నెలలో దేశవ్యాప్తంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

గతంతో పోలిస్తే పెరగనున్న వేడి గాడ్పుల సంఖ్య

వృద్ధులు, పిల్లలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు

రాజధాని ఢల్లీిలో కాలుష్య నివారణ చర్యలు

పంజాబ్‌, హర్యానా, యు.పి.ల్లో ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులకు ప్రోత్సాహం

సాధ్యమైనంత ఎక్కువ గడ్డిని పశుగ్రాసంగా మలచేందుకు చర్యలు

ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తేనే రైతులను ఒప్పించడానికి వీలు

వరిధాన్యాన్ని సేకరిస్తున్న ఎఫ్‌.సి.ఐ.

రైతులకు లాభం కలిగించే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఈ ఏడాది వేసవి ప్రారంభమైంది. ఏప్రిల్‌ 1 వచ్చిందటే వేసవి సీజన్‌ వచ్చేసినట్టే. ఇది జూన్‌ 30వరకు కొనసాగుతుంది. ఈసారి దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత అధికంగా వుండబోతున్నదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మండే ఎండలు మనుషుల జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఎంతోమంది రోజువారీ పనులపై ఆధారపడి జీవనాన్ని గడిపేవారిపై వేసవి ఎండలప్రభావం అధికంగా వుంటుంది. ఏప్రిల్‌ నెలలో ఉష్ణోగ్రతలు బాగా పెరగడానికి ప్రధాన కారణంమార్చి నెలలో నెలలో వాతావరణం బాగా పొడిగా మారడం. వాతావరణంలో తేమ కొరవడడంతో గాలి తేలిగ్గా వేడెక్కుతుంది. ఫలితంగా ఈసారి దేశంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణ స్థితికంటే ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ రకమైన ఉష్ణోగ్రత పెరుగుదల కనిపిస్తుంది. ఇదే సమయంలో నైరుతి మరి యు తూర్పు ప్రాంతాలు వేడి గాడ్పుల ప్రభావానికి లోనవుతాయని కూడా వాతావరణశాఖ అం చనా వేసింది. సాధారణంగా ఏప్రిల్‌`జూన్‌ మధ్యకాలంలో నాలుగు నుంచి ఆరు వరకు వేడి గాడ్పులు అనుభవంలోకి వస్తాయి. కానీ ఈఏడాది వీటి సంఖ్య ఆరు నుంచి పది వరకు పెరుగుతాయని స్పష్టం చేస్తోంది. 

వాతావరణశాఖ వేడి గాడ్పులను ఏవిధంగా నిర్ణయిస్తుందనే ప్రశ్న ఉదయించడం సహజమే. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటి 47డిగ్రీల వరకు చేరతాయో అప్పుడు వేడి గాడ్పులు వీస్తున్నాయని నిర్ణయిస్తుంది. అయితే ఈ వేడిగాడ్పుల అంచనా అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన ఉష్ణోగ్రతల ఆధారంగా నిర్ణయించరు. ఉదాహరణకు మైదాన ప్రాంతాల్లో 40డిగ్రీలకు చేరుకున్నప్పుడు, కొండ ప్రాంతాల్లో 30డిగ్రీలకు చేరినప్పుడు, తీరప్రాంతాల్లో 37డిగ్రీలు నమోదయినప్పుడు, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4.5డిగ్రీల నుంచి 6.4డిగ్రీల సెల్షియస్‌ అదనంగా నమోదయినప్పుడు వేడిగాడ్పులు వీస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరుతుంది. 

ఏప్రిల్‌ాజూన్‌ మధ్యకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎ క్కువ నమోదయ్యే అవకాశాలుండగా, పశ్చిమాద్వీపకల్ప ప్రాంతం, తూర్పుామధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక దేశంలోని అధిక ప్రాంతాల్లోమాత్రం సాధారణ గరిష్టం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అయితేదేశ వాయువ్య భాగానికి చెందిన సుదూర ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోత్రలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇక దక్షిణ ద్వీకల్ప భారత్‌లోని సూదూర ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. దేశ ఈశాన్య, వాయువ్య భాగాలకు చెందిన కొన్ని సుదూర ప్రాంతాల్లో సాధారణ గరి ష్టం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఇదిలావుండగా సుదీర్ఘ వేడి గాడ్పుల వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావారికీ ఈ పెరిగే ఉష్ణోగ్రతలు ఇబ్బందులు కలుగజేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజాఆర్యోగం దృష్ట్యా జాతీయ విపత్తు నివారణసంస్థ ఇందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పరచాల్సి వుంది. ఈ ఏప్రిల్‌ నెలకు సంబంధించి వాతావరణశాఖ అందించిన మరో శుభవార్త ఏమిటంటే సాధారణ వర్షపాతం నమోదు కావడం. దేశంలోని పలు ప్రాంతాల్లో, సాధారణ వర్షపాతంలో 88`112% వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దేశ వాయువ్య ప్రాంతాలు, ద్వీపకల్ప భారత్‌, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య, పశ్చిమ ప్రాంతాలకు చెందిన కొన్ని ప్రదేశాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇక దేశం మిగిలిన ప్రాంతాల్లో ఈ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకానుంది. ఈ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఈనెలలో ఏప్రిల్‌ నెలలో 32.6% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండగా, వాయువ్య ప్రాంతాల్లో 41.3%, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 38.6%,మ ధ్యభారత్‌లో 39.3% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇదే దక్షిణ ద్వీపకల్ప భారత్‌లో మాత్రం 33.6% అధిక వర్షపాతం నమోదు కానున్నదని అంచనా వేసింది. 

పంజాబ్‌, హర్యానాల్లో పంట మార్పిడి ప్రణాళికలు

ఢల్లీి, ఉత్తర భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కోసిన త ర్వాత పంట వ్యర్థాలను తగులబెట్టే ప్రక్రియ రాబోయే కాలంలో తగ్గిపోయే అవకాశాలు స్పష్టంగాకనిపిస్తున్నాయి. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని పాలు ప్రాంతాల్లో వరిపండిరచే రైతులు పంట కోతల తర్వాత పెద్ద ఎత్తున పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాతావరణం కాలుష్య మయమైపోయి, ఇది క్రమంగా ఢల్లీి తదితర ప్రాంతాలకు గాలితోపాటు విస్తరించడంతో వాయు కాలుష్యం పెద్దఎత్తున చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు మోటారు వాహనాలకాలుష్యం కూడా జతకావడంతో ఢల్లీి వాసుల జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం జరిగిన యత్నాల కారణంగా ఈ రాష్ట్రాల్లో రాబోయే సీజన్‌లో ఐదులక్షల ఎకరాల్లో వరిపంటకు ప్రత్యా మ్నాయంగా పత్తి, మొక్కజన్న వంటి పంటలను సాగుచేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నా రు. ఇందుకోసం ఈ మూడు రాష్ట్రాలు రూపొందించిన ప్రణాళికను కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (సీఏక్యూఎం) సుప్రీంకోర్టుకు గతవారం ఒక నివేదికను సమర్పించింది. 

పంజాబ్‌లో ఏటా మే నెలలో వరి సీజన్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సీఏక్యూఎం సభ్యులు మూడు రాష్ట్రాల అధికార్లతో చర్చలు జరిపి వరి విస్తీర్ణాన్ని తగ్గించేందుకు వారు రూపొందించిన ప్రణాళికను కోర్టు ముందుంచారు. 2024 సీజన్‌లో పంజాబ్‌ రాష్ట్రంలో మొత్తం 3.15మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు జరగ్గా 19.52 మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. అదేవిధం గా హర్యానాలో 1.5మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు చేపట్టగా 8.10 మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. ఇక ఎన్‌సీఆర్‌ పరిధిలోకి వచ్చే ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో గత ఏడాది 1,85000 హెక్టార్లలో వరి సాగు చేయగా, 0.74మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. ఇది లావుండగా ఈ మూడు రాష్ట్రాలు వరిగడ్డిని తగులబెట్టకుండా, వాటిని సమీపంలోని పరిశ్ర మలకు తరలించి పశువులకు ఆహారంగా తయారుచేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా ఈ రాష్ట్రాలు హామీ ఇచ్చినటు ఈ నివేదికలో పేర్కొన్నారు. 

ఢల్లీాిఎన్‌సీఆర్‌ (నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌) ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ పర్యావరణ కార్యకర్త, అడ్వకేట్‌ మెహతా సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు, రాజధాని నగరంలో కాలుష్యానికి ప్రధాన కారకాలను గుర్తించింది. వాహనాలు, విచ్చలవిడిగా పటాసులను పేల్చడం, వరిగడ్డి కాల్చడం వల్ల వస్తున్న ధూళి ప్రధాన కారణాలుగా కోర్టు గుర్తించింది. వీటన్నింటి కారణంగా నగ రంలో కాలుష్యం స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి వాయుకాలుష్యం అత్యధిక స్థాయిలకు చేరు తోంది. ముఖ్యంగా శీతాకాలంలో పంటకోతలు జరుగుతాయి. సరిగ్గా అప్పుడే వరిగడ్డిన తగులబెట్టడం వల్ల నగరవాసులకు నాలుగు వారాలపాటు కాలుష్య నరకం తప్పడంలేదు. 

పంజాబ్‌లో ప్రస్తుతం 18 ధాన్యాలనుంచి ఎథనాల్‌ను ఉత్పత్తి చేసే డిస్టిలరీలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 4,90,000 హెక్టార్లలో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజన్న, చెరకు, పత్తి పంటసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఏక్యూఎం తెలిపింది. హర్యానా ప్రభుత్వం కూడా 81,000 హెక్టార్లలో పంటమార్పిడికి చర్యలు తీసుకుంటోంది. ఇక ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వం 11వేల హెక్టార్లలో మొక్కజన్న సాగుకు చర్యలు తీసుకుంటోంది. 

దేశ రాజధాని నగరంలో కాలుష్య నివారణకు అవసరమైన ప్రణాళికను రూపొందించాల్సిందిగా గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సీఏక్యూఎంను ఆదేశించింది. ఇందుకోసం సంబంధిత అధికార్లతో చర్చలు జరపి ఒక నివేదికను తనుకు సమర్పించాలని కోరింది. పంటమార్పిడిని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగానే వున్నానని పంజాబ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇందుకు రైతులను ఒప్పించాలి. ఎందుకంటే మొక్కజన్న పంట సాగు చేస్తే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక తప్పదు. అప్పుడు మాత్రమే వారిని ఒప్పించే అవకాశాలుంటాయి. అదే వరిపంటకైతే ఈబాధలే దు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ వరి ధాన్య సేకరణ చేపడుతుందని, పంజాబ్‌ ప్రభు త్వం పేర్కొంది. గతవారం సీఏక్యూఎం సమర్పించిన ఈ నివేదికను, ఇంకా కోర్టు పరిశీలించాల్సి వుంది. 1985 నుంచి సుప్రీంకోర్టు ఢల్లీి కాలుష్యంపై దృష్టి సారించినప్పటికీ, 2017లో అడ్వకేట్‌ మెహతా పిల్‌ దా ఖలు చేసిన తర్వాత, పంట వ్యర్థాలను విచ్చలవిడిగా తగులబెట్టడాన్ని నిరోధించే చర్యలు చేపట్టా ల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.

కేరళ ఓటు బ్యాంకు రాజకీయాలు భిన్నం

ఆలయల్లో డ్రెస్‌కోడ్‌పై కొలిక్కిరాని వివాదం

సమర్థకులు…వ్యతిరేకులు..ఎవరి రాజకీయాలు వారివే

సీపీఎం ఓటుబ్యాంకులోకి ఎంట్రీ ఇస్తున్న భాజపా

హిందూ ఓట్ల ఐక్యతపై బీజేపీ దృష్టి

కుల, మత రాజకీయాలపై ఇతర పార్టీల ఆసక్తి

మూఢత్వం నుంచి సామాజిక ప్రగతివైపు కేరళ ప్రస్థానం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కేరళలోని హిందూ దేవాలయాల్లోకి వెళ్లినప్పుడు శరీరం పైభాగంలోని దుస్తులు విప్పి స్వామి ద ర్శనం చేసుకోవాలన్న నిబంధన ఇప్పటికీ అమలవుతోంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజం. గత డిసెంబర్‌ 31న కేరళలోని నారాయణ గురు స్థాపించిన ప్రముఖ శివగిరి మఠానికి చెందిన సచ్చిదానందస్వామి ఆలయంలో స్వామి ద ర్శనానికి వెళ్లే సమయంలో శరీర పైభాగంలో ధరించిన వస్త్రాలను తొలగించాల్సిన అవసరం లేదని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఇంకా ఆయన చెప్పిందేమంటే నిరాకార, నిర్గుణుడుడైన భగవానుడిని చేరేందుకు భక్తుల కు దేవాలయాలు ఉపకరణాలు మాత్రమే. ఇందుకోసం శరీర పైభాగంలోని వస్త్రాలను తొలగించాల్సిన అవసరమేముంది? అందువల్ల ఎటువంటి ప్రయోజ నం లేదు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తుడి మనసు దేవుడు/దేవతపై లగ్నం కావాలి. ఇది ముఖ్యం. బాహ్య వేషధారణకు దీనికి సంబంధం లేదు, అని ఆయన పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే వుంది కానీ, దేవాలయంలోకి ప్రవేశించేవారు జంధ్యం వేసుకున్నారా లేదా పరిశీలించేందుకు తద్వారా కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేందుకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని అనడం వివాదం సృష్టించింది. కొన్ని దేవాలయాల్లో బ్రాహ్మణేతర పూజారులు కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరించాన్ని కూడా ఆయన వేలెత్తి చూపారు. నిజానికి డ్రెస్‌ కోడ్‌ అవసరంలేదు అని ఆయన చెప్పడం వరకు సమంజసమే. ఎందుకంటే దైవదర్శనం మనసు కు సంబంధించింది. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఆలయ ప్రవేశం కలిగించేందుకు ఈసం ప్రదాయం పాటిస్తున్నారనడంలో మాత్రం అర్థంలేదు. ఎందుకంటే ఆలయ ప్రవేశానికి అందరూ అర్హులే. ఎవరూ ఎవరినీ అడ్డుకోవడంలేదు. కులాల ప్రసక్తి తెచ్చి రచ్చ చేయడంవల్ల ఒరిగేదేమీ లేదు. సామాజిక అశాంతి తప్ప. 92వ శివగిరి మఠం వార్షిక తీర్థయాత్ర కార్యక్రమం ప్రారంభ కార్యక్రమంలో పాల్గన్నా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా సచ్చిదానందస్వామి వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన నారాయణ గురును సనాతనధర్మం నుంచి వేరుచేయడానికి య త్నించారనే చెప్పాలి. అయితే స్పందించే సమయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. డ్రెస్‌కోడ్‌ అవసరంలేదని సచ్చిదానందస్వామి చెబుతున్న అంశం నిజమే కానీ, సర్వసమ్మతితో మాత్రమే ఇది జరగాలన్నారు.ఎందుకంటే గతంలో శబరిమలలో మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో తలకు బప్పికట్టిన సంగతి ఆయనకు బాగానే గుర్తుంది.

ముదిరిన వివాదం

ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్‌ పి.ఎస్‌. ప్రశాంత్‌ కూడా ‘సర్వసమ్మతి’ అభిప్రాయాన్ని సమర్థించారు. చరిత్రకారుడు ఎం.జి. శశిభూషణ్‌ అభిప్రాయం ప్రకారం, ప్రజలు పవిత్రమైన దేవాలయాలను టూరిస్ట్‌ స్పాట్స్‌గా పరిగణించకుండా వుండేందుకు కూడా ఈ నిబంధనలను వి ధించి వుండవచ్చునని అభిప్రాయపడ్డారు. 1970 ప్రాంతంలో అప్పటి కేరళ ప్రభుత్వం ఈ డ్రెస్‌కోడ్‌ నిబంధనలను తొలగించడానికి ప్రయత్నించిన సంగతిని కూడా ఆయన గుర్తుచేశారు. ఇది లా వుండగా నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎస్‌) సెక్రటరీ జి. సుకుమారన్‌ నాయర్‌ ముఖ్య మంత్రి పినరయి విజయన్‌, సచ్చిదానంద స్వామిని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిరచడంతోవివాదం ముదిరింది. ఆలయ సంప్రదాయాలను మార్చడానికి ఎవరికీ అధికారంలేదు, ప్రభుత్వానికి కూడా! ఆలయ సంప్రదాయాలను ప్రశ్నించే అధికారం సచ్చిదానందస్వామికి ఎవరిచ్చారని ఆయన విరుచుకుపడ్డారు. ప్రతి ఆలయానికి ఒక్కో సంప్రదాయం వుంటుంది. అందువల్ల డ్రెస్‌ కోడ్‌ పాటించడం తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. 

శ్రీ నారాయణ ధర్మపరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డీపీ) ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేషన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యదర్శి సుకుమారన్‌పై విమర్శల దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. ఇటువంటి సమస్యలు హిందువులను విడదీయలేవని ఆయన అన్నారు. అయితే యోగక్షేమ సభ అధ్యక్షుడు అఖీరామన్‌ కళాదాసన్‌ భట్టత్తిరిప్పాడ్‌ మాత్రం కొంత సంయమనంగా మాట్లాడటం గమ నార్హం. అనవసరమైన పరిమితులు, నిబంధనలు ఎత్తేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అయితే బ్రాహ్మణులను గుర్తించడానికే ఈ డ్రెస్‌కోడ్‌ తీసుకొచ్చారన్న వాదనను మాత్రం ఆయన ఖండిరచారు. ‘‘ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో సంప్రదాయం వుంటుంది. ఉదాహరణకు శబరిమల దేవాలయనికి డ్రెస్‌కోడ్‌ నిబంధనలేం లేవు. కానీ 10 నుంచి 50ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీ లకు ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. మార్పులకు మేం వ్యతిరేకం కాదు. కానీ ప్రతిదానికీ బ్రాహ్మ ణులు ఆధిపత్యం అనడం ఎంతమాత్రం సమంజసం కాదు’’ అని స్పష్టం చేశారు. 

విజయన్‌ మద్దతు వెనుక రాజకీయం

అతిపెద్ద తీర్థయాత్రా కేంద్రమైన శివగిరి మఠానికి విజయన్‌ మద్దతుగా నిలవడం వెనుక ఒక రాజకీయ కారణం వుంది. ఈ మఠం హిందువుల్లోని ఎరaవా వర్గం శివగిరి మఠాన్ని అత్యంత పవిత్ర మైనదిగా భావిస్తారు. పెద్దంసంఖ్యలో ఈ వర్గానికి చెందిన ప్రజలు ఈ మఠాన్ని సందర్శి స్తుంటారు కూడా. ఓబీసీలైన వీరు సీపీఎంకు బలమైన మద్దతుదార్లు. తాజాగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకోవడానికి యత్నిస్తుండటం విజయన్‌కు ఎంతమా త్రం మింగుడుపడటంలేదు. ముఖ్యంగా భారత ధర్మ జనసేన (బీడీజేఎస్‌), శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం (ఎస్‌ఎన్‌డీపీ) అనే రెండు సంస్థలు భారతీయ జనతాపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం సీపీఎంకు ఓటుబ్యాంకుగా వున్న ఎరaవా వర్గం ప్రజల్లో బీజేపీ పలు కుబడిని పెంచడానికి ఇవి తీవ్రంగా కృషిచేస్తున్నాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఎంకు గట్టి మద్దతుగా నిలిచిన ఇక్కడి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి గణనీయంగా ఓట్లు సంపాదించడం వెనుక ఈ రెండు సంస్థల కృషి ఎంతో వుంది. లోకనీతి, సీడీఎస్‌ సర్వే ప్రకారం ఎరaవా కులాల్లో బీజేపీకి ఏకంగా 32% ఓట్లు లభించాయి. ఇది గతంతో పోలిస్తే 11% ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఎన్‌డీపీని పూర్తిగా కాషాయీకరిం చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదంటూ సీపీఎం విరుచుకుపడుతోంది. 

శివగిరి మఠానికి ఎందుకంత ప్రాధాన్యం?

కేరళకు చెందిన నారాయణ గురు గొప్ప సంఘసంస్కర్త. ఆయన మతసామరస్యంతో పాటు అందికీ సమాన విద్య, అన్ని వర్గాల మధ్య సమానత్వం అవసరమంటూ ఉద్యమాలు చేశారు. శివగిరి మఠాన్ని 1903లో ఆయన స్థాపించారు. ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు’ అనేది ఈయన ప్రవచించిన సిద్ధాంతం. ముఖ్యంగా బాగా వెనుకబడిన ఎరaవా కులం వారి అభ్యున్నతికోసం అహర్నిశలు పాటుపడ్డారు. ప్రజల్లో ఉన్నత విలువలను పెంపొందించే ప్రక్రియలో భాగంగా ఏటా ఈ ‘తీర్థయాత్ర’ కార్యక్రమాన్ని మఠం నిర్వహిస్తుంది. నిజానికి ఎరaవా వర్గం వారు కేరళ జనాభాలో 23% వరకు వున్నారు. దీనివల్ల సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వీరిని గొప్ప ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శివగిరి మఠంతో మంచి సంబంధాలను కొన సాగించడం ద్వారా ఈ వర్గం ప్రజల్లో పలుకుబడి పెంచుకోవాలని తంటాలు పడుతున్నాయి. బీజేపీ హిందువుల ఓట్లు చీలడానికి ఎంతమాత్రం ఇష్టపడదు. ఈ నేపథ్యంలో నారాయణ గురు సంప్రదాయానికి పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా ఎరaవా వర్గాల్లో పలుకుబడి పెంచుకోవ డానికి ప్రయత్నిస్తోంది. అయితే శివగిరి మఠం ఇప్పటివరకు ఏపార్టీకి మద్దతు ఇవ్వకుండా తట స్థ వైఖరి అవలంబిస్తోంది. ఫలితంగా అన్ని పార్టీలు ఈ మఠాన్ని తమకు వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. శివగిరి మఠం ముఖ్యంగా ఆలయల్లో అనుసరిస్తున్న డ్రెస్‌కోడ్‌ను వ్యతిరేకిస్తుంది. ఇందులో భాగంగా జనవరి 17న ట్రావన్‌కూర్‌ దేవస్థానం బోర్డువరకు మఠం సన్యాసులు ఒక ప్రదర్శన కూడా నిర్వహించడం గమనార్హం.

మూఢత్వం నుంచి ప్రగతి పథం వైపునకు….

నిజానికి కేరళలో కులవివక్షకు వ్యతిరేకంగా తొలి ఉద్యమం 1813లో చోటుచేసుకుంది. నాటి ట్రావన్‌కూర్‌ సంస్థానంలోని వెనుకబడిన వర్గాలైన నాడార్లు ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. అప్పటివరకు ఈ కులాలకు చెందిన మహిళల వక్షాలను వస్త్రంతో కప్పుకోవడానికి అనుమతి వుండేది కాదు. మారు మరక్కల్‌ సమారం పేరుతో జరిగిన ఈ ఉద్యమం 50 సంవత్సరాల పాటు సాగింది. నాటి ట్రావన్‌కూర్‌ ప్రభుత్వం, అత్యంత శక్తివంతమైన నాయర్‌లు ఈ ఉద్యమాన్ని అణచివేశారు. అయితే చివరకు ప్రభుత్వం నాడార్‌ మహిళలకు తమ పైభాగాలను వస్త్రంతో కప్పుకునే హక్కును సమర్థించిడంతో వివాదం సమసింది. తర్వాత 1859లో అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ గవర్నర్‌ ఛార్లెస్‌ ట్రెవెలియన్‌ ఒత్తిడితో నాడార్లలో అత్యధికులు క్రైస్తవంలోకి మారిపోయారు. అప్పట్లో కేరళలోని ఉన్నత కులాలకు చెందిన మహిళలు కూడా ఆలయంలోకి వెళ్లాలంటే తమ పైభాగంలోని ఆచ్ఛాదనను తప్పనిసరిగా తొలగించాల్సిందే. ఇదిలావుండగా 1936కు ముందు కేరళ దేవాలయాల్లోకి వెనుకబడిన వర్గాలవారు ప్రవేశించడానికి అనుమతి వుండేది కాదు. అయితే 1936లో మహాత్మాగాంధీ, నారాయణగురులు వైకోమ్‌లో సత్యాగ్రహం చేశారు. కేరళలో అత్యధిక శాతం హిందువులు ఇతర మతాల్లోకి మారిపోవడానికి ప్రధాన కారణం ఈ మూర్ఖపు ఆచార వ్యవహారలేనని చెప్పాలి.దీంతో అప్పటి ట్రావన్‌కూర్‌ సంస్థానాధిపతి ఈ నిషేధాన్ని ఎత్తేశారు. స్వాతంత్య్రం వచ్చిన 50 సంవత్సరాలు దాటిన తర్వాత దేవాలయాల్లో బ్రాహ్మణేతర పూజార్ల నియామకం కూడా జరుగుతోంది. 2018లో ప్రస్తుత విజయన్‌ ప్రభుత్వం ట్రావన్‌కూర్‌ దేవస్థాన బోర్డులో దళితులకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించింది. ఈ దేవస్థానం కింద 1200 దేవాల యాలున్నాయి.

కెసిఆర్ సమక్షంలో సన్నాహక సమావేశం.

సమావేశానికి హాజరైన ఎంపీ “వద్దిరాజు”

“నేటిధాత్రి” ఎర్రవెల్లి.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)రజతోత్సవం ఈనెల 27వతేదీన జరుగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఖమ్మం, నల్లగొండ,మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో శనివారం సన్నాహాక సమావేశం జరిగింది.
కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,
మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్,గుంతకండ్ల జగదీష్ రెడ్డి,వీ.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్,రావుల చంద్రశేఖరరెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,వనమా వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులతో కలిసి హాజరయ్యారు.అలాగే,ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి,రేగా కాంతారావు,బానోతు మదన్ లాల్,మెచ్చా నాగేశ్వరరావు,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కంచర్ల భూపాల్ రెడ్డి,బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, ఖమ్మం మాజీ జేడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

vaddiraju ravichandra

రేషన్ షాపుల్లో నరేంద్ర మోడీ చిత్రపటాన్ని పెట్టాలి. 

రేషన్ షాపుల్లో నరేంద్ర మోడీ చిత్రపటాన్ని పెట్టాలి. 

మందమర్రి నేటి ధాత్రి

 

బిజెపి నాయకులు దేవరనేని సంజీవరావు
మందమర్రి టౌన్ ఏప్రిల్ 5

మందమర్రి మండలంలోని చిర్రకుంట గ్రామంలో ప్రభుత్వ చౌక ధార దుకాణంలో ఉచిత రేషన్ బియ్యం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యువజన పథకం కింద ఐదు కిలోల బియ్యం ప్రతి పేదవారికి చెందే విధంగా గత కరోనా కాలం నుండి రాబోయే ఐదు సంవత్సరాల వరకు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇవ్వడంలో భాగంగా చిర్రకుంట గ్రామంలో ప్రభుత్వ చౌకదారుల దుకాణంలో ఉచిత రేషన్ నరేంద్ర మోడీ బోర్డుని పెట్టడం జరిగింది ఈ సందర్భంలో లబ్ధిదారులను ఉద్దేశించి సీనియర్ నాయకులు సంజీవరావు దేవర్నేని మాట్లాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మందమర్రి మండల అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్ మరియు చిర్రకుంట మాజీ ఉపసర్పంచ్ కర్రే రాజయ్య మరియు మాజీ వార్డ్ నెంబర్ దుర్గం మల్లేష్ కొమురోజు రాము కడియాల ఉదయ్ సిద్ధం శ్రీను నమసని చంద్రశేఖర్.శ్రీకాంత్ సత్యం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నర్సంపేట విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిఈ తిరుపతి బాబు జగ్జీవన్ రామ్ యొక్క స్ఫూర్తి గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.డి.ఈ బి.లక్ష్మణ్, టౌన్ ఏ.ఈ ఎన్ .విజయభాస్కరరావు టెక్నికల్ ఏ ఈ సంపత్ తో పాటు నర్సంపేట టౌన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించడం గర్వకారణం. 

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించడం గర్వకారణం. 

తొర్రూరు( డివిజన్) నేటి ధాత్రి

 

అద్దంకి దయాకర్ సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం గర్వకారణం అని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టి మల్ల మహేష్ పేర్కొన్నారు.
మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు డివిజన్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ…..
సామాజిక ఉద్యమాల్లో అద్దంకి దయాకర్ చురుగ్గా పాల్గొన్నాడని, దళితుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశాడని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశాడని తెలిపారు.
మాలలు, దళిత వర్గాల అభివృద్ధికి అద్దంకి దయాకర్ పాటుపడ్డాడని తెలిపారు.
అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించే విషయ పరిజ్ఞానం, నిబద్ధత కలిగిన దయాకర్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా యూత్ నాయకులు యనమల రాకేష్, డివిజన్ అధ్యక్షులు గొడిశాల నవీన్, నాయకులు గారలాజర్, నెల్లికుదురు అధ్యక్షులు కారం ప్రశాంత్, నాయకులు చిట్టి మల్ల కిరణ్ ఎనమాల లక్ష్మి, ప్రసన్న కుమార్, చిట్టి మల్ల గోపి, బన్నీ మనో, శివకుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం..

నర్సంపేట,నేటిధాత్రి;*

 

అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడిన యోధుడు,భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి కార్యక్రమాన్ని నర్సంపేట టౌన్ దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పాత ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ముందు నిర్వహించారు. దళిత రత్న,దళిత ప్రజా సంఘాల కో కన్వీనర్ కళ్ళేపెళ్లి ప్రణయ్ దీప్ ఆధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా దళిత ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గద్ద వెంకటేశ్వర్లు, ప్రజాసంఘాల నాయకులు జనగాం కుమార్,అందె రవి దళిత ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ దళిత రత్న గుంటి వీర ప్రకాష్ దళిత ప్రజాసంఘాల జేఏసీ కో కన్వీనర్ తడుగుల విజయ్ లు మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత నేత బీహార్ లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జన్మించారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బోయిని నారాయణ, ఉపాధ్యాయ సంఘ నాయకులు సాంబయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయులు గిరిగాని శ్రీనివాస్, కుల పెద్దలు మాదాసి సదానంద,కరుణాకర్, నవీన్, రాజు,మాల మహానాడు నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికుల ఐదవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె.

సిరిసిల్ల చేనేత కార్మికుల ఐదవ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మె

డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టిన కార్మికులు

ఏప్రిల్ – 7 సోమవారం రోజున 24 గంటల నిరాహార దీక్ష చేపడతాం

CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జోళి శాఖ ప్రభుత్వ ఆర్డర్ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ , వైపని కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించి ఇతర సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో చేపట్టిన సమ్మె ఈరోజు 5 వ రోజు కు చేరుకుంది ఈరోజు సమ్మెలో భాగంగా బి.వై నగర్ లోని సమ్మె శిబిరం నుండి కార్మికులు గోపాల్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ గార్లు మాట్లాడుతూ గత ఐదు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న కూడా ప్రభుత్వం , అధికారులు స్పందించకపోవడం అన్యాయమని అన్నారు.

సమ్మె డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 7 సోమవారం రోజున 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్..

Musham Ramesh’s

కూరపాటి రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరుతున్నారని ఇట్టి కార్యక్రమంలో పవర్లూమ్ కార్మికులు , వార్పిన్ , వైపని కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు నక్క దేవదాస్ , వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరి కుంట కిషన్ నాయకులు ఉడుత రవి , ఒగ్గు గణేష్ , ఎలిగేటి శ్రీనివాస్ , సబ్బని చంద్రకాంత్ , భాస శ్రీధర్ , వేణు , తిరుపతి , రాజు , రాము , వెంకటేశ్వర్లు , సదానందం పెద్ద ఎత్తున పవర్లూమ్ , వార్పిన్ , వైపని యూనియన్ల నాయకులు , కార్మికులు పాల్గొన్నారు

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.

గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు ఇంజక్షన్స్.
• అంగన్వాడీ లో పౌష్టిక ఆహారం
• ఏఎన్ఎం రేణుక
నిజాంపేట: నేటి ధాత్రి

 

గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందని ఏఎన్ఎం రేణుక అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు నెలవారి ఇంజక్షన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు, పసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తుందని గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జ్యోతి, సిస్టర్ గౌరీ, గర్భిణీ స్త్రీలు పసుపిల్లలు ఉన్నారు.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు 5 అరెస్ట్.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు ఐదుగురు అరెస్ట్

పరకాల నేటిధాత్రి

 

 

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశానూసారం గుడుంబా నిర్మూలన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ,మనుగొండ,ఎలుకుర్తి ల లో దాడులు నిర్వహించి గీసుకొండ కు చెందిన పోలేపాక సబిత,కోట స్రవంతి,ఎలుకుర్తి కి చెందిన బొడిగే దేవేంద్ర,బొల్లు సాంబ లక్ష్మి,మనుగొండ కు చెందిన ఎంబడి మల్లమ్మ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (25) లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడులలో ఎస్ఐ జ్యోతి,సిబ్బంది లక్ష్మణ చారి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకల్లో.!

బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టి ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్. నేటి ధాత్రి

 

భారత దేశ మాజీ ఉపప్రధాని డా:బాబు జగ్జివన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చెర్మెన్ వై.నరోత్తం పస్తాపూర్ గ్రామంలో గల బాబు జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి,మరియు కోహిర్ మండలం చింతల్ ఘాట్ చౌరస్తా వద్ద గల బాబు జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా జరిగిన పస్తాపూర్ గ్రామంలో ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతూ వారు దేశానికి ఎంతో సేవ చేసారని కుల రహిత సమాజం కొరకు, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కొరకు పోరాడిన మహానేత అని వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కొరకు నిరంతరం కృషి చేస్తూ మనమందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్, మాజీ ఎంపీటీసీ సంపత్ కుమార్,రాజేందర్,రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు సి.బాల్ రాజ్,ధన్ రాజ్,సామెల్,విఠల్,చెంగల్ జైపాల్,రాజ్ కుమార్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

పూజ సందర్భంగా అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న.!

వీరాంజనేయ మండల పూజ సందర్భంగా అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న మాజీ మంత్రి

సతీమణి సింగిరెడ్డి.వాసంతి

వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ సందర్భంగా పాతబజార్ వీరాంజనేయ స్వామి దేవస్థానం పునర్ణిర్మానం లో భాగంగా 45రోజులు మండల పూజ, గణపతి హోమం కార్యక్రమం నిర్వహించారు
వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గుడి పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకవచ్చారు
ఈ సందర్బంగా పూజ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి ని ఆలయ నిర్వాహకులు సన్మానించారు, అన్న ప్రసాద వితరణ చేసి భక్తుల తో పాటు స్వీకరించారు
ఆలయ నిర్వాహకులు నీలస్వామి, ఎర్రశ్రీను గణేష్ వాకింగ్ టీమ్ అధ్యక్షులు. గోనూరు వెంకటయ్య, బాలస్వామి,సూర్యావంశం గిరి, మెహన్, సునీల్ వాల్మీకి, శివ లక్ష్మణ్ గౌడ్, బాలరాజు, రాజు, రవి, జస్వంత్ వాల్మీకి, ఇమ్రాన్, మునికుమార్, అలీం మరియు ముఖ్యులు పాల్గొన్నారు.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

: రాజానెల్లి ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం రాజానెల్లి గ్రామంలో జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.భారతదేశ మాజీ ఉప ప్రధానీ మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ , డీ .ధనరాజ్ మాట్లాడుతూ. బాబు జగ్జీవన్‌ రామ్‌ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ అని, పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేద దళిత కుటుంబంలో పుట్టి దళితుల హక్కుల సాధనకు అవిరామ కృషి చేసిన సంఘ సంస్కర్త, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అణగారిన ప్రజలకు సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు , నేటి యువత ఆయన అడుగుజాడలలో నడవాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలోడి ధనరాజ్ యూత్ ప్రెసిడెంట్ ధనరాజ్ . మధుకర్. బాగప్ప.ఏవన్ గోల నర్సింలు. గోల సురేష్.హబ్రహం. మెషె. పి.లక్మ్యాన్. చింటూ . సంగన.ఈశ్వర్.కజమియా.ఉపరి వినయ్. జ్యోత్ . నాగప్ప పటేల్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

రైతాంగ ఉద్యమాల బలోపేతంకై 7,8తేదీలలో జాతీయ సమావేశాలు

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయల పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.శనివారం స్థానిక నర్సంపేట ఓంకార్ భవన్ లో జరిగిన అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పెద్దారపు రమేష్ మాట్లాడుతూ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే తీరా చేతికి పంటలు వచ్చే దశలో అకాల వర్షాలు రైతన్నలకు తీరని నష్టాన్ని చేకూర్చాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న, వరి, మిర్చి,మామిడి, అరటి తదితర పంటలు నేలమట్టమై 10 లక్షల ఎకరాలలో తీవ్రమైన నష్టం వాటిల్లిందని దాంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో పంట చేనులను పరిశీలించి బాధిత రైతాంగానికి భరోసా కల్పించి ఎకరాకు కనీసం 50వేల రూపాయల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మొక్కజొన్నలను వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి కుంటి సాకులు లేకుండా భేషరత్తుగా కొనుగోలు చేయాలని కోరారు. ఈ క్రమంలో రైతు సంఘం కార్యకర్తలు ఎక్కడికి అక్కడ రైతులకు అండగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈనెల 7 8 తేదీల్లో జలంధర్ లో ఏఐకేఎఫ్ జాతీయ సమావేశాలు

జాతీయస్థాయిలో రైతాంగ ఉద్యమాలను మరింత బలోపేతం చేయడానికి అఖిలభారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జాతీయ సమావేశాలు ఈనెల 7 8 తేదీలలో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో జరగనున్నాయని పేర్కొన్నారు.
ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దారపు రమేష్, రాష్ట్ర గౌరవాధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వరికుప్పల వెంకన్న, గిరిజన రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ వి తుకారాం నాయక్ హాజరవుతారని తెలిపారు.

ముగిసిన పాదయాత్ర..

ముగిసిన పాదయాత్ర..

సగర బంధువులకు సన్మానం.

తెలంగాణ రాష్ట్ర సగర యువజన అధ్యక్షులు మర్క సురేష్ సగర..

రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)

 

తొమ్మిదవ రోజు పాదయాత్ర ముగించుకొని రాత్రి భద్రాద్రి జిల్లా పాల్వంచ లో అయ్యప్ప స్వామి టెంపుల్ లో రాత్రి స్టే చేశారు. పాల్వంచ సగర బంధువులు టెంపుల్ దగ్గరికి వొచ్చి పాదయాత్రని ప్రోత్సహిస్తు శాలువాతో సత్కారించి సానుభూతి తెలిపారు. పాల్గొన్నవారు రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యులు ఆవుల నారాయణమ్మ సగర. పాల్వంచ కోశధికారి ఆవుల మహేశ్వరి సగర. ఆవుల పార్వతి సగర, ఆవుల లక్ష్మి దేవమ్మ సగర,ఆవుల సువర్ణ సగర, గుంటి జయలక్ష్మమ్మ సగర,ఆవుల నిరంజన్ సగర, ఆవుల సత్యం సగర, మరికొందరు సగర బంధువులు కలిశారు.

నీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.

నీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.

మిషన్ భగీరథ వాటర్ మెన్ లకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరిక.

జడ్చర్ల / నేటి ధాత్రి

 

 

మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేసే విషయంలో నిర్లక్ష్యం వహించే వాటర్ మెన్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. గతంలో కూడా హెచ్చరికలు చేసినా తమ వైఖరిని మార్చుకోని వాటర్ మెన్ లను విధుల నుండి తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేసవి కాలంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చూసుకోవల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది పైనే ఉందని చెప్పారు. ఈ విషయంగా శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మిషన్ భగీరథ వాటర్ మెన్ ల పనితీరుపై తమకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. కొంతమంది వాటర్ మెన్ లు సకాలంలో నీటిని విడుదల చేయకపోవడం, నిర్ణీత వేళలలో తగినంత సమయం నీటి సరఫరా చేయకపోవడం వల్ల పలు గ్రామాలలో ప్రజలు త్రాగునీటి కి ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతాలలో ప్రజలకు తక్కువ నీటిని సరఫరా చేసి తమకు కావాల్సిన పరిశ్రమలకు ఎక్కువ నీటిని పంపిణీ చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు అందాయన్నారు.ప్రత్యేకించి బాలానగర్, జడ్చర్ల మండలాల్లో వాటర్ మెన్ లపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వాటర్ మెన్ లను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉన్నా మానవతా దృక్పథంతో తాము ఆ పని చేయలేదన్నారు. అయితే ప్రస్తుతం వేసవిలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వాటర్ మెన్ ల కారణంగా ప్రజలు నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తాను సహించేది లేదని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇకనైనా వాటర్ మెన్ లు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ నిర్ణీత వేళలలో నీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కాగా మిషన్ భగీరథ వాటర్ మెన్ ల కారణంగా ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడి నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటే ప్రజలు జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అనిరుధ్ రెడ్డి ప్రజలకు సూచించారు. మిషన్ భగీరథ అధికారులు కూడా నీటి సరఫరాను, వాటర్ మెన్ ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరారు.

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు. 

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు. 

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోజున డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 118 వ జయంతి ఉత్సవాలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ 1975 సంవత్సరంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేయడంతో ఇందిరా గాంధీ ఎదురులేని నాయకురాలుగా ఉన్న సమయంలో ఆమెకు ఎదురు తిరిగిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ ఆయన బీహార్ రాష్ట్రంలో చాంద్ గ్రామంలో 19O8 ఏప్రిల్ 5వ తేదీన జన్మించాడు.తల్లి వసంతి దేవి తండ్రి శోభిరామ్ లు ఆయన చిన్నతనంలోనే స్కూల్లో హిందువులకు ఒక కుండ క్రైస్తవులకు ఒక కుండా ముస్లింలకు ఒక కుండా అంటరాని వాళ్లకు ఒక్కకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కుండలను చూసి చలించిపోయి అందరికీ ఒకే కుండా ఉండాలన్న ఆలోచనతో అన్నిటిని మొదలుపెట్టడం జరిగింది. మనుషులంతా ఒక్కటే ఒకే కుండలో అందరం తాగాలి అని ఒక గొప్ప మనసుతో ఆలోచించేవాడు, బాబు జగ్జీర్రావ్ తండ్రి శోభిరామ్ సైన్యంలో పనిచేసేవాడు, అక్కడ అంటరానితనం వివక్ష చూసి అక్కడి నుండి ఇంటికి వచ్చి 20 ఎకరాల భూమి లో వ్యవసాయం చేస్తూ, అంటరానితనం కులవ్యక్ష మీద ప్రజలకు చైతన్యం చేయడంజరిగింది. బాబు జగ్జీవన్ రావు ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుని పేరు సురేషు కూతురు పేరు మీరా కుమారి కలరు.
ఆయన సామాజికంగా ఆర్థికంగా పేదరిక నిర్మూలనకు ఎంతో కృషి చేసిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు 1929లో అంటరాని ప్రజల గురించి ఉత్తర ప్రదేశ్ బెంగాల్ బీహార్ ప్రజలను సమీకరించి 35 వేల మందితో ఊరేగింపు నిర్వహించాడు. ఆయన జీవితంలో అదొక గొప్ప చరిత్ర కలిగిన రోజు అదే ఆయన రాజకీయానికి పునాది 1935లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో బాబు రాజేంద్రప్రసాద్ తో స్నేహం ఏర్పడింది,బాబు జగ్జీరావ్ 1931లో గొప్ప సైంటిస్ట్ కావాలని నిర్ణయంతో సైంటిస్ట్ ను అయితే నేను బాగుపడతా నా కుటుంబాలు బాగుపడతాయి, కానీ పేద బడుగు బలహీనవర్గాల పరిస్థితి ఏంటి అని నిర్ణయించుకొని అంటరాని వాళ్ళు కులవ్యవక్షత దుర్భారం గడుపుతున్న మా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి వారి గురించి, నేనే పోరాడాలి అని గొప్ప సంకల్పంతో ఆలోచన చేస్తాడు అంటరాని వాళ్ళు చదువుకోవాలి అంటరాని వాళ్ళు మద్యపానం నిషేదించాలి పిల్లలను పశువుల కొట్టలాల్లో పనిచేయడం మానేయాలి,
నా జాతి పిల్లలు చదువుకోవాలి అని కొన్ని అభిప్రాయాలతో అట్టడుగు వర్గాలకు ఒక దిక్సూచిగా నిలిచాడు, ఆయన జీవితంలో 50 సంవత్సరాలుగా ఓటమెరుగని పార్లమెంటు సభ్యులుగా గొల్లిపొందిన మహా ఉన్నతమైన వ్యక్తి, ఆయన ఈ భారత దేశ ఉప ప్రధాని పనిచేశారు, ఆయన ఈ దేశ కేంద్రకార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న క్రమంలో ఎయిర్ ఇండియా జాతీయం చేశారు, అందులో 7000 ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అమలు చేశారు, అదే విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు కొమ్మాట సుధాకర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అమర్
మాల మహానాడు కార్యదర్శి టంకరి లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం,ఎరుకల సంఘం మండల అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్, కొతాడి నర్సింలు, ఎండి బిలాల్, కొమ్మాట స్వామి, నందిగామ బాబు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version