కోహీర్ మండల ఫొటో వీడియో గ్రఫీ నూతన కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నిక.

కోహీర్ మండల ఫొటో వీడియో గ్రఫీ నూతన కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నిక…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో ని జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం ఫొటో వీడియో గ్రఫీ నూతన కమిటీ ఏర్పాటు చేసారు.. మండలం లోని ఆయా గ్రామ ల ఫొటో వీడియో గ్రాఫర్లు గురువారం నాడు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్ను కున్న కమిటీ ని అందరు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు కోహీర్ మండల ఫొటో వీడియో సంక్షేమ కార్యవర్గ వ్యవస్థాపకులుగ శ్యామ్ రావు, అధ్యక్షులు రచన్న,ప్రధాన కార్యదర్శి రాజు,కోశాధికారి పరమేష్,సoయక్త సహాయ కార్యదర్శులు సంజువు, ప్రవీణ్ కుమార్, సంయుక్త కోశాధికారి కృష్ణ,ఉపాధ్యక్షలు ప్రకాష్, రాజు జనార్దన్ ఆర్గానేజర్ సెక్రటరీ శేఖర్, నవీన్ కుమార్, లక్ష్మాన్, నాగరాజు, మీడియా ఇంచార్జి కె.అశోక్, కార్యవర్గ సభ్యులు రవి, జకీర్, నందు, కాశినాథ్, వినోద్,ఎన్నుకొన్నారు.

రేషన్ షాప్ ముందు మోడీ ఫోటో.

రేషన్ షాప్ ముందు మోడీ ఫోటో

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

ప్రతి రేషన్ షాపు ముందు నరేంద్రమోడీ ఫోటో పెట్టాలి — బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబీ దేవ్

కల్వకుర్తి మున్సిపాలిటీ సిల్లారుపల్లిలోని 9వ రేషన్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ పథకం బిజెపి నాయకులు ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈఉగాదికి ప్రారంభించిన 6కేజీల సన్నబియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా 5కేజీలు ఉన్నందున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా పెట్టాలని అందుకు అనుగుణంగా కలెక్టర్లు ఆర్డీవోలు ఎమ్మార్వోలు రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని లేని యెడల బిజెపి నాయకులు ఉరువాడ తిరిగే ప్రజల ముందుకు మీ కుట్రలను బయట పెడతామని కల్వకుర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు గన్నోజు బాబీదేవ్ హెచ్చరించారు…
ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వివేకానంద, మాజీ అధ్యక్షులు నరసింహ, గంగాధర చారీ,బీజేవైఎం జిల్లా సెక్రెటరీ నరేష్ చారి, నాయకులు శ్రీకాంత్, పర్వతాలు, శివ, అరవింద్ రెడ్డి, కుమార్, రేషన్ డీలర్ మహమ్మద్ సిరాజుద్దీన్, లబ్ధిదారులు పాల్గొన్నారు

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు.!

ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు ఫోటో కాన్ కరాటే మాస్టర్ సిద్దు స్వామి.

జహీరాబాద్.నేటి ధాత్రి:

ఝరాసంగం,ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు వ్రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫోటో కాం కరాటే మాస్టర్ సిద్దు స్వామి మార్గదర్శనం చేశారు. బుధవారం ఝరాసంఘం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2024 – 25 విద్యా సంవత్సరానికి చెందిన 10 తరగతి విద్యార్థునులకు ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరాటే మాస్టర్ సిద్దు స్వామి10వ తరగతి విద్యార్థునులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ మేరకు పదవ తరగతి విద్యార్థునులకు పరీక్ష ప్యాడులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version