సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మునిసిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లిని ఒక ఆధునిక మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అని ఈ నిధులతో రోడ్లు, కాలువలు, తాగునీటి సౌకర్యాలు, పట్టణ సౌందర్య వృద్ధికి, జయశంకర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్, హనుమాన్ జంక్షన్ వెడల్పు,పలు అభివృద్ధి పనులు అమృత్సర్ స్కీం కింద 23 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ భవనానికి ఐదు కోట్ల రూపాయలు, గిరిజన భవనానికి కోటి రూపాయలు వెచ్చించామని తెలిపారు.ఈ నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, పి.సి.సి సభ్యులు చల్లూరి మధు పిప్పాల రాజేందర్ ముంజల రవీందర్ అప్పం కిషన్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
