– సిరిసిల్ల బిజెపి పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలో బిర్సా ముండా జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో గిరిజన హక్కుల కోసం అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండాకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ “బిర్సా ముండా భారత గిరిజన సమాజ చరిత్రలో అజరామర వీరుడు అన్నారు. ఆయన చేసిన పోరాటం న్యాయం, స్వాభిమానం, దేశభక్తికి ప్రతీక అన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ గిరిజన అభ్యున్నతికి కట్టుబడి పనిచేసిందనీ అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సిరిసిల్ల పట్టణంలో గిరిజన సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడమే పార్టీ ధ్యేయం” అని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.
మహాకవి కాళోజీ గారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించిన వరంగల్ బార్ అసోసియేషన్:-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
తెలంగాణ ప్రజాకవి మహాకవి కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్ హాల్ (అంబేద్కర్ హాల్)లో గురువారం స్మారక సభను వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ “తెలంగాణ తొలిపొద్దు కాళోజీయని అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు” అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ గారంటూ, అదేవిధంగా అన్నపు రాశులు ఒకచోట – ఆకలికేకలు ఒకచోట అంటూ సమాజంలోని అసమానతలను అక్షర యోధుడై దునుమాడి సమసమాజం కోసం పోరాడారని,ప్రజల ఆవేదనను బడిపలుకులతో గాక, పలుకుబడుల భాషలో పలికించిన నిజమైన ప్రజా కవి కాళోజీ గారిని స్మరించుకోవడం మనందరికీ స్పూర్తిదాయకం అంటూ వారి ఆశయాల వెలుగులో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో ముందుకు సాగి అసమానతలు లేని సమాజాన్ని సాధించాలని బార్ అసోసియేషన్ తరఫున పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా న్యాయవాదులు కాళోజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి డి. రమాకాంత్, సంయుక్త కార్యదర్శి ముసిపట్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి సిరుమళ్ల అరుణ, సీనియర్ ఈసి సభ్యుడు ఇజ్జేగిరి సురేష్, మహిళా ఈసి సభ్యురాలు తోట అరుణ, బార్ కౌన్సిల్ సభ్యుడు బైరపాక జయాకర్, అలాగే సీనియర్ న్యాయవాదులు తీగల జీవన్ గౌడ్, ఎలుకుర్తి ఆనంద్ మోహన్, రాచకట్ల కృష్ణ, గంధం శివ, ఓరుగంటి కోటేశ్వర్, సిద్దం యుగేందర్,గురుమిళ్ల రాజు మరియు ఇతర పలువురు న్యాయవాదులు పాల్గొని నివాళులర్పించారు.
చిట్యాల మండలం లోని చల్లగరిగ గ్రామ అంబెడ్కర్ చౌరస్తా లో సామాజిక కార్యకర్త, అంబెడ్కర్ ఫేలోషిప్ అవార్డు గ్రహీత నోముల శివశంకర్ గారి ఆధ్వర్యంలో , స్వర్గియ,డాక్టర్ అందెశ్రీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చల్లగరిగ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పిఆర్ టియు చిట్యాల మండలం అధ్యక్షులు శ్రీ బండి శ్రీనివాస్ పాల్గొని అందెశ్రీ గారి చిత్ర పటానికి పూల మాల వేసి రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు…. అనంతరం ప్రసంగిస్తూ అందెశ్రీ గారిని ప్రకృతి కవిగా అభివర్ణించారు,అయన తెలంగాణ మలి దశ ఉద్యమ పాటలు వ్రాసి, పాడి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి, తన పాటల ద్వారా తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించినారు , తను వ్రాసిన జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను ప్రభుత్వం గుర్తించి ప్రార్థన గీతంగా ఆలపిస్తున్నారాని ఆయన గురించి కొనియాడారు… ఈ కార్యక్రమంలో మాజీ జంక్ ఎస్ ఏం సి ఛైర్మన్ మ్యాదరి వీరాస్వామి, యూత్ నాయకులు కొల్లూరి అశోక్, రామస్వామి, సోమిడి రఘుపతి, ఎస్.వెంకటప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రుద్రగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాన బోయిన రాజయ్య అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్టీవ దేహం పై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరామర్శించిన వారిలో మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ చరణ్ సింగ్, నాయకులు బత్తిని మహేష్ యాదవ్, అజ్మీర తిరుపతి, మామిండ్ల రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బై కానీ కోటి, మాసం పెళ్లి అఖిల్, గంధం చోటు తదితరులు ఉన్నారు.
# పులి దేవేందర్ ముదిరాజ్ మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు.
#అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు.
ములుగు, నేటిధాత్రి:
మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ తండ్రి అయిన పొన్నం సారయ్య ముదిరాజ్ ఇటీవల గుండెపోటు’తో మృతి చెందిన సందర్బంగా ఈరోజు వారి స్వగ్రామం అయిన రాజపల్లె లోని వారి నివాసానికి వెళ్లి పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, వారి కుమారులు పొన్నం రాజు, కృష్ణ ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంగా మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ…..కష్టం వచ్చిన కుటుంబాలకు మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాజు, కృష్ణ కుటుంబానికి భరోసానిచ్చారు. అలాగే మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూ….. పొన్నం సారయ్య ముదిరాజ్ మృతి చాలా బాధాకరం, సారయ్య ఎక్కడ ఉన్న అతని ఆత్మ శాంతిచాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఆపదలో ఉన్న ముదిరాజ్ కుటుంబాలకు మెపా అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెపా ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, చొప్పరి రాజేందర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
సోమవారం నాడు హైద్రాబాదు లో మాజీ మంత్రి,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు,తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు కాగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరకాల బిఆర్ఎస్ యువనాయకులు వీరేష్ రావు సత్యనారాయణ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు
•భౌతికకాయానికి నివాళిలు అర్పించిన భీంభరత్ * రాములు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు
చేవెళ్ల, నేటిధాత్రి:
షాబాద్ మండలం తిర్మలపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు శనివారం ఉదయం అకాల మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రాములు స్వగ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, తమిల్లి రవీందర్ షాబాద్ సర్పంచ్, షాబాద్ ఎంపీటీసీ అశోక్, తొంట వెంకటయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమలపురం శ్రీరామ్ రెడ్డి, బందయ్య దోస్వాడ సర్పంచ్ రాములు, తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య, మద్దూరు మల్లేష్ సర్పంచ్, తదితరులు రిపోర్టర్ రాములు భౌతికకాయానికి నివాళిలు అర్పించారు.
• ప్రజల ధన, మాన ప్రాణ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తూ.. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..
• పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం లో స్మృతి పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన…జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపియస్.
మహబూబాబాద్/ నేటి ధాత్రి
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… 21 అక్టోబర్ 1959 వ సంవత్సరం లో సి.ఆర్.పి.యఫ్ – ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన ఆర్మీ పై దొంగ దాడి చేసి 10 మందిని జవాన్ లను హతమార్చిందని, ఆ రోజు నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (పోలీస్ ఫ్లాగ్ డే) గా నిర్వహిస్తున్నం అన్నారు.
ఒక్కొక రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉండేవి మన రాష్ట్రంలో గతంలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో ఎంతో మంది జవాన్లను కోల్పోవడం జరిగిందని, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్ మరియు అస్సాం వంటి కొన్ని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలోనూ అనేక మంది జవాన్లను కోల్పోవడం జరిగిందన్నారు. జమ్ముకాశ్మీర్ లాంటి రాష్ట్రాలలో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులతో ఎంతో మంది పోలీసులు, ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉగ్ర మూకలను హతమార్చి, తమ తనువులను చాలించారని, ఆనాటి వారి ప్రాణత్యాగల వలననే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అన్నారు. ఈ సంవత్సరంలో మన దేశంలో విధినిర్వహణలో 191-మంది జవాన్లు వీరమరణం పొందారని, ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 5- మంది ఉన్నారు. వీరమరణం పొందిన వారి ప్రాణత్యాగాలను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు.
పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని, ఆనాటి వారి ప్రాణత్యాగల వలననే నేడు మనందరం సుఖ:సంతోషాలతో ఉండగలుగుతున్నాం అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితిలలోనైనా పోలీసు శాఖ ఎదురు నిలబడి, పోరాడటం జరుగుతుందని, అలాంటి పోలీసుల సేవలు మనందరి మదిలో చిరస్మరణీయం అన్నారు. గత జూన్ నెలలో జరిగిన సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శిధిలాల క్రింద చిక్కుకు పోయిన మృతదేహాలను వెలికి తీసి, తమ ధైర్య సహసాలను చాటుకున్నారు అన్నారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అన్నారు. పోలీస్ అమరుల కుటుంబాలను ఉధ్యేశించి మాట్లాడుతూ.. వారి కుటుంబాల సంక్షేమం, వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను చేకూరేలా, వారి కుటుంబాలలో మనోధైర్యాన్ని అందించటమే పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళి అన్నారు.
ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకై ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తూ.. పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. అమరవీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు తిరుపతి రావు, కృష్ణకిషోర్, గండ్రతి మోహన్, ఏ.ఆర్ డిఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, సీఐలు, ఆర్.ఐలు ఎస్.ఐ అధికారులు సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మున్సిపాలిటీకీ చెందిన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు తల్లి వల్లభు లక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా నేడు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి
వారితోపాటు కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, దన్నసరి మాజీ ఉపసర్పంచ్ వెంకన్న,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ ఆయుబ్ ఖాన్, సబ్ స్టేషన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిలియ, బాలు నాయక్,శ్రీను, ఇగే సత్తి,తదితరులు ఉన్నారు.
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ గారు నిన్న సాయంత్రం మృతిచెందడం జరిగింది.విషయం తెలుసుకున్న పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు రంగమ్మ గారి పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే గారి వెంట పరామర్శించిన వారిలో పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.
రేగూరి గంగమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా
గంగమ్మ ప్రతివాదేహానికి మహిళా కమిటీ నాయకురాళ్ల నివాళులు
పరకాల నేటిధాత్రి
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ నిన్న సాయంత్రం మృతిచెందడం జరిగింది.విషయం తెలుసుకున్న పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రంగమ్మ పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.పరామర్శించిన వారిలో పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.
రంగమ్మ పార్థివదేహానికి మహిళ నాయకురాళ్ల నివాళులు
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ నిన్న సాయంత్రం మృతిచెందగా బిఆరఎస్ మహిళా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రంగమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.మహిళా పట్టణ అధ్యక్షురాలు గంటా కళావతి,సాంబరాజు జ్యోతి మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
ఈరోజు సిరిసిల్ల కేంద్రంలోని ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని, మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ — ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి, బోయవాణిగా జీవితం గడిపి, సప్తర్షుల బోధనలతో మహర్షిగా మారి ఆదికావ్యం రామాయణం అనే అమరగ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి గారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.
“కృషి, నిబద్ధత ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు — దీనికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనం” అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు రవి, నాగేశ్వరరావు, ఆర్.ఐ రమేష్, ఏ. ఓ పద్మ,జిల్లా పోలీసు అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
స్వరాష్ట్ర సాధనలో కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లా ఎస్పీ .
వనపర్తి నేటిదాత్రి .
జిల్లా పోలీసుకార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్బంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులుర్పించారు ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ డిఎస్పీ, ఉమా మహేశ్వర్ రావు కార్యాలయం ఏఓ, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు శ్రీనివాస్ డిసిఆర్బి ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
కంప్యూటర్ ఆపరేటర్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీడీఓ ఆపీస్ సిబ్బంది
జహీరాబాద్ నేటి ధాత్రి:
కీర్తిశేషులు ఏలేటి సోమిరెడ్డి తుంగతుర్తి మండలం కంప్యూటర్ ఆపరేటర్ మరణించటం తో అయన చిత్రపటానికి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎంపీడీవో మంజుల, కార్యాలయంలో ఎంపీడీవో జూనియర్ అసి స్టెంట్ శాస్త్రము, పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది పూలమాల వేసి నివాళుఅర్పించి మౌనంపాటించి సంతాపం తెలిప్యారు.
మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు
పరకాల నేటిధాత్రి
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించిన పరకాల మాజీ జడ్పిటిసి సిలివేరు మొగిలి పార్థివదేహానికి తన స్వగ్రామం మండలంలోని వెంకటపూర్ గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మునిగాల సురేందర్ రావు నివాళులు అర్పించారు.మొగిలి మరణ వార్త తెలిసి పరకాల ప్రాంత ప్రజలు తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.రాజకీయ నాయకులు,స్థానిక ప్రజలు ఆయన మరణంపై సంతాపం తెలియజేస్తూ,వారి ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.
పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
V6 రిపోర్టర్ అయ్యుబ్ ఖాన్ సోదరుడు అహ్మద్ ఖాన్ అనారోగ్యంతో మంగళవారం మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పట్టణంలోని ఈద్గా వద్దకు వెళ్లి వారి మృతదేహాన్నీ సందరర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు,మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా,ఆతార్ అహ్మద్ ఏఐఎంఐఎం నాయకులు, జర్నలిస్ట్ లు మహబూబ్, కరీం,తదితరులు ఉన్నారు,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల పాపిరెడ్డి తల్లి చల్ల లక్ష్మి గత కొద్ది రోజుల క్రితం మరణించగా గురువారం చల్ల లక్ష్మి దశదినకర్మలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై లక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు తిరుమల్ నాయక్, చల్ల శ్రీపాల్ రెడ్డి, దొడ్డ విజయ్, రావుల తిరుపతిరెడ్డి, మెరుగు విజయ్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామారావు శిరీష, సింగం ప్రశాంత్, పోలిశెట్టి భాను ప్రసాద్, చిన్నూరి కార్తీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ జగద్గురు రేవణసిద్దేశ్వరాయ దేవస్థానాన్ని దర్శించుకున్న కేతకి చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఈదుల్ పల్లి గ్రామంలో శ్రీ జగద్గురు రేవణసిద్దేశ్వరాయ నమః శ్రావణమాసం బుధవారం పురస్కరించుకొని శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకము బిల్వపత్రి పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థాన చైర్మన్ .అప్నగారి చంద్రశేఖర్ పాటిల్ కుటుంబ సభ్యులు వారికి ఆలయ పీఠాధిపతి శివ లీలమ్మ అర్చకులు రేవన సిద్దయ్య స్వామి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
కొడిమ్యాల (నేటి ధాత్రి ):
కొడిమ్యాల మండల కేంద్రంలో అంగడి బజార్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ అద్వ్యర్యం లో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరి నారాయణ గౌడ్,సీనియర్ నాయకులు గుడి మల్లికార్జునరెడ్డి, గోగూరి మహిపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి వినోద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గడ్డం చంద్రమోహన్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ చిలువరి ప్రసాద్, నాయకులు కిషన్ రెడ్డి, గంగయ్య, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు..
కోర్వి కృష్ణ స్వామి జయంతి: ముదిరాజ్ సంఘం ఘన నివాళి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ వ్యవస్థాపకుడు కోర్వి కృష్ణ స్వామి జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.