తిరుపతిలో పరిచయ కార్యక్రమంలో నాయకులకు గజమాలతో సన్మానం

పరిచయ కార్యక్రమంలో నాయకులకు గజమాలతో సన్మానం

తిరుపతి(నేటి ధాత్రి:

తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి,, తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి మున్నూరు సుగుణమ్మ , రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ లను ఒకటవ క్లస్టర్ ఇంచార్జి కృష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శిలు, బుద్ధ ఇన్ చార్జీ నాయకులు ప్రధాన కార్యదర్శులు దృశ్యాలువాలు కప్పి పుష్పగుచ్చాను అందించి గజమాలతో ఘనంగా సన్మానించారు, మంగళవారం రామానాయుడు గార్డెన్ నందు జరిగిన తిరుపతి నియోజకవర్గం లోని వార్డు నాయకులు క్లస్టర్లు ఇన్చార్జీలు అధ్యక్షులు పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం , 1వ వార్డు బూత్ ఇన్చార్జి కొండా రామారావు , వార్డులలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

మహబూబాబాద్‌లో పోలీస్ అధికారుల పదవీ విరమణ ఘనంగా

సుదీర్ఘకాలంగా విధులు నిర్వర్తించిన పోలీస్ అధికారుల పదవీ విరమణ

మహబూబాబాద్/ నేటి ధాత్రి

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులు
యాకూబ్ అలీ, ఎస్.ఐ (డీ.సీ.ఆర్.బీ)
1984 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి 43 సంవత్సరాల ఘనమైన పోలీస్ సేవలు అందించారని కొనియాడారు..

బోడ తులసయ్య 1990లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి
2023లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది మొత్తం 36 సంవత్సరాల సేవలు అందించారని.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందుతున్న అధికారులకు తమ తరపున మరియు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
యాకూబ్ అలీ1984 బ్యాచ్‌కు చెందినవారై, సుమారు 43 సంవత్సరాల పాటు శాంతి భద్రతల పరిరక్షణలో, నేర నియంత్రణలో, ప్రజా సేవలో విశేష సేవలు అందించారని ప్రశంసించారు. అదేవిధంగా బోడ తులసయ్య 36 సంవత్సరాల పాటు శాఖకు అంకితభావంతో సేవలందించి విధి నిర్వహణలో ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
పదవీ విరమణ అనేది జీవితంలో కొత్త అధ్యాయమని, మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని సూచించారు. నిత్యం ఏదో ఒక వ్యాపకంతో చురుకుగా ఉండాలని కోరారు.
రిటైర్మెంట్ అనంతరం లభించే బెనిఫిట్స్‌ను ప్రభుత్వ బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో భద్రపరుచుకోవాలని, అధిక లాభాల ఆశ చూపే మోసగాళ్ల పట్ల మరియు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పదవీ విరమణ పొందిన వారిని కుటుంబ సభ్యులు గౌరవప్రదంగా చూసుకోవాలని, వారి మానసిక ప్రశాంతతకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ నాగేశ్వర్ రావు, ఆర్. ఐ సోములు, డీ.సీ.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఉపేంద్ర రావు సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

చిలుకమారి శ్రీనివాస్ కు పద్మశాలి సంఘం ఘన సన్మానం

చిలుకమారి శ్రీనివాస్ కు ఘన సన్మానం. పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ భీమనాదుని సత్యనారాయణ.

మొగుళ్ళపల్లి నేటి దాత్రి

మొగుళ్లపల్లి గ్రామపంచాయతీ ఎనిమిదవ వార్డు నంబర్ గా గెలుపొందిన శ్రీ చిలుకమారి శ్రీనివాస్ గారిని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం నాయకులు చేనేత కార్మికులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ భీమనాధుని సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ శ్రీనివాస్ గారు వార్డ్ నెంబర్ గా గెలుపొందడం ఆనందదాయకమని మొగుళ్ళపల్లి సమగ్ర అభివృద్ధి కోసం పాలకమండలి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు అలాగే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా చేనేత కార్మికులు పొద్దంతా కష్టపడితే 200 రూపాయల కూడా కూలి గిట్టుబాటు కావడం లేదని కావున రాష్ట్ర ప్రభుత్వం నెలకు 20 వేల రూపాయలు కూలిగిట్టుబాటు అయ్యే విధంగా పనికల్పించాలని ప్రతినెల చేనేత బంధు పథకం కింద ₹2,000 నేత కార్మికునికి కండెల చుట్టే వారికి 500 రూపాయలు గత ప్రభుత్వంఅందించిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా అందించి చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని మరియు 50 నిండిన చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛను వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరారు

కొహిర్ మండలానికి కొత్త అసిస్టెంట్ ఇంజినియర్ సంతోష్ కుమార్ కు ఘన సన్మానం

నూతన ఎలక్ట్రికల్ ఏఈ సంతోష్ కుమార్ కు ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్. సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది కోహిర్ మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినియర్ గా సంతోష్ కుమార్ బుధవారం నాడు సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండల పరిధిలోని రాజినెల్లి గ్రామానికి చెందిన మధుకర్ సబ్ కాంట్రాక్టర్ గ్రామస్తులతో కలిసి మర్యాదపూర్వకంగా పులమల శాలువకప్పి ఘనంగా సన్మానించారు. ఇంతకు ముందు సబ్ ఇంజినియర్ విభాగంలో ఉన్న అబ్దుల్ అజీజ్ ఇంచార్జ్ అసిస్టెంట్ ఇంజినియర్ గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్ కుమార్ మునిపల్లి మండల ఏఈ గా బాధ్యతలు స్వీకరిస్తూ కోహిర్ మండల ఏఈ గా బదిలీపై వచ్చారు. మండల రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించి మండల ప్రజల్లో, రైతుల్లో శాశ్వతంగా పేరును సంపాదించుకోవలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో జలీల్ పాష, షేక్ మొయిన్, రాజ్ కుమార్, రాజినెల్లి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు ఘన సన్మానం…

సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు ఘన సన్మానం…

తిరుపతి, నేటిధాత్రి:

చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సిడిసిఏ) కార్యదర్శి సతీష్ యాదవ్ ను తిరుపతి యాదవ నాయకులు ఘనంగా సన్మానించారు. శ్రీమాన్ సన్నిధి శరభయ్య యాదవ్ విగ్రహ స్థాపన సమావేశంకు సతీష్ యాదవ్ ను గౌరవంగా ఆహ్వానించారుఈ సందర్భంగా తిరుపతి యాదవ నాయకులు, బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, పలువురు యాదవ నాయకులతో కలిసి సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు

విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే…

విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

 

 

69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 చెస్ టోర్నమెంట్ గురువారం జగిత్యాల లో జరిగిన ఇట్టి టోర్నమెంట్ లో జగిత్యాల జిల్లా నుండి పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల కు చెందిన పదవ తరగతి విద్యార్థి బబ్బిలి అక్షయ్’గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికయినట్లు ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా గౌరవ కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్ విద్యార్థిని అభినందించి, శాలువతో సన్మానించారు.

సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు…

సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు

జైపూర్,నేటి ధాత్రి:

 

సింగరేణిలో సీఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి కమాండెంట్ సంచల్ సర్కార్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ జరిపించారు.విధి నిర్వహణలో భాగంగా ప్రాణ త్యాగాలు అర్పించిన పోలీస్ వీరులకు కమాండెంట్ చంచల్ సర్కార్ నివాళులు అర్పించారు.సెప్టెంబర్ 1. 2024 నుండి ఆగస్టు 31.2025 మధ్యకాలంలో ఆరుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మొత్తం 191 పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించాలని వారు తెలిపారు. అలాగే అమరవీరులైన పేర్లను చదివి వినిపించి వారి గౌరవం సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీస్ బలగాల ధైర్య సహసాలను అంకిత భావాన్ని గౌరవించడం వారి సంక్షేమం దేశ భద్రత పట్ల మన నిబంధతను తెలియజేయడమే మన లక్ష్యము అని తెలిపారు.

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ సత్కారం

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

చిట్యాల, నేటిదాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది…ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయరాదని ఉన్న జీవోను రద్దు చేయించి ముగ్గురు పిల్లలు ఆ పైన ఉన్న కూడా స్థానిక సంస్థల పోటీ చేయొచ్చు అనే జీవోను ఇప్పించినందుకు గాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో *చిట్యాల మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య,మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండెపరెడ్డి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మట్టికి రవీందర్, *సీనియర్ నాయకులు సిరిపురం కుమారస్వామి ,కొర్రి సాంబశివుడు, తదితరులు పాల్గొన్నారు.

మెట్ పల్లి ప్రెస్ క్లబ్ లో ఐజెయు జిల్లా కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం…

మెట్ పల్లి ప్రెస్ క్లబ్ లో ఐజెయు జిల్లా కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం

మెట్ పల్లి అక్టోబర్ 4 నేటి ధాత్రి

మెట్ పల్లి ప్రెస్ క్లబ్ కు నూతనంగాఎన్నికైన ఉపాధ్యక్ష కార్యవర్గ సభ్యులకు సన్మానం
మెట్ పల్లి గత రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లకు ఐ జేయు ఎన్నికలు జరుగగా ఆ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డా జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ సాజిద్ పాషా, బాసెట్టి హరీష్ లను శనివారం రోజు మెట్ పల్లి ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేఐజేయు అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మమ్మద్ అజీమ్ ల ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది.
వారితోపాటు మెట్ పల్లి ప్రెస్ క్లబ్ కు నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు , మహమ్మద్ అఫ్రోజ్,కార్యవర్గ సభ్యులు బొల్లం రాజు, ఓంకారీ శ్రీనివాసులను కూడా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జంగం విజయ్, గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్ , గౌరవ సలహాదారులు దాసం కిషన్,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజరి శివ,ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, యస్ పి రమణ కార్యవర్గ సభ్యులు పోనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, ముత్యాల రమేష్ ,విజయసాగర్, సభ్యులు ఆగ సురేష్,ఆదిల్ పాషా, ఏసమేని గణేష్, ఎండి అభిద్, రాజశేఖర్, అమ్ముల ప్రవీణ్, తేలు కంటే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

దండు రమేష్ కు రాష్ట్ర ఈ జీ సి కౌన్సిలర్ గా సన్మానం

దండు రమేష్ కు రాష్ట్ర ఈ
జీ సి కౌన్సిలర్ గా సన్మానం

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ బుధవారం రోజు జయశంకర్ భూపాలపల్లి భారత్ ఫక్షన్ హాల్ లో జరిగే దండు రమేష్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర ఈ. జి.సి. కౌన్సిల్ మెంబర్ గా నియమించిన సంధర్బంగా “సన్మాన మహోత్సవ” కార్యక్రమానికి
ముఖ్య ఆతిథులుగా విచ్చేస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాశనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, నాగరిగారి ప్రీతం తెలంగాణ రాష్ట్ర ఎస్.సి.కార్పొరేషన్ చైర్మన్,గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి శాసనసభ్యులు, అయిత ప్రకాష్ రెడ్డి , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ కావున ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుటుంభ సభ్యులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా మనవి

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఇన్చార్జి ఎపిఎం కు ఘన సన్మానం…

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఇన్చార్జి ఎపిఎం కు ఘన సన్మానం.

చిట్యాల,నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో వెలుగు మహిళా సమైక్య ఏపిఎం ఇన్చార్జి గా గుర్రపు రాజేందర్ బాధ్యతలు చేపట్టినందున అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* అన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… రాజేందర్ వెలుగు మహిళ సమైక్య లో సీసీగా పనిచేస్తూ ఇన్చార్జి ఏపిఎం గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని అంబేద్కర్ యువజన సంఘం తరపున రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సక్రమంగా నిర్వహించాలని అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్ అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు పుల్యాల సురేష్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజు అంబేద్కర్ వాదులు పుల్ల ప్రభాకర్ జీడి సురేష్ భాస్కర్ మైదం మహేష్ గుర్రం తిరుపతి పాముకుంట్ల చందర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి లో అవార్డు స్వీకరించిన భూమేశ్వర్ కు ఘన సన్మానం….

జిల్లాస్థాయి లో అవార్డు స్వీకరించిన భూమేశ్వర్ కు ఘన సన్మానం.
మల్లాపూర్ సెప్టెంబర్ 12 నేటి దాత్రి

 

 

 

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న భూమేశ్వర్ ఉపాధ్యాయుడు ఇటీవలే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఘన సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని విలువలను వినయాన్ని నేర్పుతూ ప్రజల మనసును చూరగొన్న భూమేశ్వర్ నిజంగా అభినందనీయుడని అవార్డుకు తగిన వ్యక్తిగా సరిపోతాడని ఈ అవార్డు మరింత బాధ్యత పెంచుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు కైవసం చేసుకొని మా పాఠశాలకు పేరు తీసుకురావాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయి, విష్ణువర్ధన్ రాజు శ్రీధర్ గౌడ్ కొండ గణేష్ దువ్వ నవీన్ నాగభూషణం మహేష్ రమణ ముజాబీర్ మెలికూర్ రెడ్డి వందన తదితరులు పాల్గొన్నారు.

సతీష్ యాదవ్ కు సిటిజన్ ఫోరం సన్మానం..

డాక్టరేట్ సతీష్ యాదవ్ కు హైదరాబాదులో సిటిజన్ ఫోరం, సన్మానం
వనపర్తి నేటిదాత్రి .

హైదరాబాద్ లో మహబూబ్నగర్ జిల్లా మాజీ రిజిస్టర్ నర్సిరెడ్డి, బుద్ధారం మారం మహేందర్ ఆధ్వర్యంల డాక్టరేట్ పొందిన అఖిలపక్ష అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ను సన్మానం చేశారు
ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ జిల్లా రిజిస్టర్ నర్సిరెడ్డి విశ్వనాథం, నాగభూషణం, మారం మహేందర్, శ్రీనివాసరావు, మురళి శర్మ, సుధాకర్, పద్మా విశ్వనాథం, విజయ్ దంపతులు, నాగరాజు, లక్ష్మణ్, కమ్యూనిటీ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గౌరవం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T121121.910-1.wav?_=1

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్సి కార్పోరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాహిరాబాద్ పట్టణంలోని ఎన్.కన్వెన్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన వికలాంగుల,వృద్ధుల, వితంతువుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్,మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్,సామెల్, శివప్ప,బి.దిలీప్,తదితరులు ఉన్నారు

వర్ధన్నపేట నూతన ఎస్సై సాయిబాబాకు ఘన స్వాగతం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T114241.463.wav?_=2

వర్ధన్నపేట నూతన ఎస్సై సాయిబాబాకు ఘన స్వాగతం

వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

 

వర్ధన్నపేట నియోజక వర్గం , వర్ధన్నపేట మండల కేంద్రంలో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సై గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సాయిబాబా ని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజీరెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,యూత్ కాంగ్రెస్ మండల నాయకులు ఎలికట్టే చిన్న రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

పోత్కపల్లి ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కార అవార్డు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-7.wav?_=3

పోత్కపల్లి ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కార అవార్డు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్పై
ది కొండా రమేష్ కు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ పురస్కారం అవార్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐకి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును
అందించారు.

కార్మిక సంఘం అధ్యక్షుడికి సన్మానం.

కార్మిక సంఘం అధ్యక్షుడికి సన్మానం.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-25T115303.147.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల అధ్యక్షలుగా సుకుమార్ ఎన్నికయ్యారు. వారిని జహీరాబాద్ బీజేపీ మహిళా నాయకురాలు జ్యోతి పండాల్, తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు రాజేష్ ముదిరాజ్ కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.

డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!

డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-92.wav?_=5

జహీరాబాద్ నేటి ధాత్రి:

డయాలసిస్ సేవల కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్న జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయస్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే “బెస్ట్ సెంటర్ అవార్డ్స్” విభాగంలో ఉత్తమ డయాలసిస్ సెంటర్ అవార్డును ఈ ఆసుపత్రికి వరించింది. ఇందులో రోజుకు సగటున 30 మంది పేషంట్లకు డయాలసిస్ చికిత్సలు అక్కడి వైద్యులు అందజేస్తున్నారు. వీరి ఉత్తమ సేవలకు గాను ఈ అవార్డు దక్కడం పట్ల జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిని డాక్టర్ గాయత్రి, డీ.సీ.హెచ్.ఎస్ డాక్టర్ సంగారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు సేవలు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 2018లో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 600 మంది వరకు ఈ సెంటర్లో చికిత్స పొందారు. ప్రస్తుతం 65 మందికి ఇక్కడ డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రస్తుతం 10 బెడ్స్ ఉండగా రోజుకు 30 మందికి మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు డయాలసిస్ వైద్య సేవలను ఇక్కడి సిబ్బంది కొనసాగిస్తున్నారు.

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని.

మెట్ పల్లి జూలై 1 నేటి ధాత్రి

 

 

 

 

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని మండల్ రూరల్ ఆర్ఎంపి పి.ఎం.పి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖ ఐఎంఏ జాతీయ వైద్య విధాన రాజ్యాంగ సవరణ కమిటీ మెంబర్ ఐఎంఏ మెట్పల్లి అధ్యక్షులు డాక్టర్ గంగసాగర్ ను ఘనంగా సన్మానం చేశారు.
డాక్టర్ రవి, డాక్టర్ నిర్మల్ రెడ్డి తదితర డాక్టర్లను ఆర్ఎంపి పి.ఎం.పి మెట్టుపల్లి రూరల్ సంఘం వారిచే ఘనంగా సన్మానించడం జరిగింది.
ఇ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు గాజంగి రాజ మల్లయ్య,మండల అధ్యక్షుడు బండి శంకర్, ప్రధాన కార్యదర్శి జోగా నరసయ్య, ఇల్లెందుల సత్యనారాయణ,సదానందం,పరశురాం,సామల గంగాధర్, మొగిలయ్య,మహేష్ గంగుల ఉపేంద్ర పాల్గొన్నారు.

పదోన్నతి పై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం.

పదోన్నతి పై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో ఏఎస్ఓగా విధులు నిర్వహించి డివైఎస్ఓ గా పదోన్నతి పొంది భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్తున్న సతీష్ కుమార్ కి శనివారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డి, కార్యాలయ సిబ్బందితో కలిసి పూలమాలతో,శాలువాతో సత్కరించి,వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి సన్మానం చేశారు.తమతో పాటు విధి నిర్వహణలో చురుగ్గా,నైపుణ్యంతో కూడిన సేవలను అందించి పదోన్నతి పై వెళ్తున్న సతీష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరింత శ్రమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తహసిల్దార్ వనజా రెడ్డి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version