భూపాలపల్లి లో లారీ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన

లారీ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరివి అలైవ్ క్యాంపెనింగ్
2026” కార్యక్రమంలో భాగంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీడియా అవుట్‌రీచ్ డే కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్, భూపాలపల్లి నందు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా, లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, బొగ్గు లారీ డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, అందులో దాదాపు 50 వేల మంది సకాలంలో వైద్య సహాయం అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు జనవరి మాసం మొత్తం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచనలతో “ 2026” పేరిట ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, ఇది 13 జనవరి 2026 నుండి 24 జనవరి 2026 వరకు నిర్వహించబడుతున్నదని తెలిపారు. మీడియా అవుట్‌రీచ్ డే కార్యక్రమంలో ముఖ్యంగా “రహవీర్ – గుడ్ సమరిటన్” పథకం గురించి వివరించారు.
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించకపోవడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాద స్థలంలో ఉన్న పాదచారులు లేదా వాహనదారులు, పోలీసులు ప్రశ్నిస్తారు, కోర్టులకు పిలుస్తారు అనే భయంతో సహాయం చేయడం లేదని పేర్కొన్నారు.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టం – సెక్షన్ 134(A) ద్వారా గుడ్ సమరిటన్‌లకు పూర్తి రక్షణ కల్పించిందని, ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారి వివరాలను పోలీసులు అడగరాదని, కోర్టులకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
గోల్డెన్ అవర్‌లో స్వచ్ఛందంగా రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి “గుడ్ సమరిటన్” బిరుదుతో పాటు రూ.25,000 నగదు బహుమతి అందజేస్తారని తెలిపారు. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో గరిష్టంగా ఐదు సార్లు ఈ బహుమతిని పొందవచ్చని అన్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో ఎంపికైన గుడ్ సమరిటన్‌లలో నుంచి మూడు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా, ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1 లక్ష నగదు బహుమతి మరియు జాతీయ అవార్డు అందజేస్తుందని తెలిపారు.
అదేవిధంగా, జిల్లా ఎస్పీ లారీ, ఆటో, బొగ్గు లారీ డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ,
రోడ్డు ప్రమాదం ఒక్క డ్రైవర్‌కే కాకుండా ఆయనపై ఆధారపడి ఉన్న మొత్తం కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. ప్రమాదాల్లో గాయాలు లేదా మరణాలు సంభవిస్తే, కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి కోల్పోవడం, కుటుంబ పోషణలో సమస్యలు, పిల్లల చదువు దెబ్బతినడం, మానసిక వేదన వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ రోడ్డు రవాణా జిల్లా అధికారి ఎండి సంధాని ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు. సీఐ నరేష్ కుమార్ ఎస్సై సాంబమూర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

రహదారి భద్రత మాసోత్సవం–2026లో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు..

రహదారి భద్రత మాసోత్సవం–2026లో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

వరంగల్, నేటిధాత్రి:

 

రహదారి భద్రత మాసోత్సవం–2026 కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం (04-01-2025) రవాణా శాఖ కార్యాలయంలో హెవీ గూడ్స్ వెహికల్స్, మీడియం గూడ్స్ వెహికల్స్ డ్రైవర్లు మరియు ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO), వారి సిబ్బంది పర్యవేక్షణలో ఈ పరీక్షలు చేపట్టగా, దాదాపు 150 మంది డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు.

వయసు పెరిగేకొద్దీ దూరదృష్టి లోపించడం వల్ల రోడ్డు ప్రమాదాల ప్రమాదం పెరుగుతుందనే అంశంపై డ్రైవర్లకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఎస్. శోభన్ బాబు, ఏఎంవిఐ ఉదయ్ కుమార్, రవాణా శాఖ సిబ్బంది, అలాగే డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రహదారి భద్రతకు డ్రైవర్ల ఆరోగ్యం కీలకమని, ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

– ఆటోడ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్ భరోసా

– ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ఆటోడ్రైవర్ల తో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించామని కార్మికుల పక్షపాతి కేసీఆర్‌ అన్నారు. అధికారంలో లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందని వారి వెన్నంటే ఉండి వారి సమస్యలపై పోరాడుతామన్నారు.
కేసీఆర్‌ను మరోసారి గెలిపిద్దామని ప్రజలు అనుకుంటున్నరని ఆటోడ్రైవర్లను ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను అన్ని విధాలుగా తప్పుడు ప్రచారాలు చేసి మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.

ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, కార్మిక విభాగం అధ్యక్షులు రాంబాబు యాదవ్, వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మాజీ టెక్స్టైల్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,సిరిసిల్ల బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,
ఆటో యూనియన్ అధ్యక్షులు అల్లే శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్, కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ చైర్మన్ చిక్కాల రామారావు మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు

ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో కేటీ రామారావుచిత్రపటానికి పాలాభిషేకం….

ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో కేటీ రామారావుచిత్రపటానికి పాలాభిషేకం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీ రామారావు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ అధ్యక్షులు జిల్లా యూనియన్ గౌరవ అధ్యక్షులు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొ ల్లి రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ. గత ప్రభుత్వం ఆయాంలో .ఆటో డ్రైవర్లుఅందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో జీవనం సాగించారని. ఇప్పుడున్న సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆటో డ్రైవర్ లు జీవనోపాధి మీద చాలా భారం పడిందని. మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న సంవత్సరానికి. మీ మాట ప్రకారం అటు డ్రైవర్లఅకౌంట్లో డబ్బులు వేస్తామని ఆటో డ్రైవర్లకు మాయమాటలు చెప్పి తప్పించుకుని తిరుగుతున్నారని పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తున్నారని. అందుకు అనుగుణంగా వెంటనే ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పై .దయ తలచి మీరు ఇచ్చిన మాట ప్రకారం వారి అకౌంట్లో డబ్బులు వేయాలని. ప్రభుత్వపరంగా జీవిత బీమా 10 లక్షలకు విధంగా వారికి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎందరో నిరుపేద కార్మికులు ఆటో డ్రైవర్ గా జీవిస్తున్నారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారి బాగోబాగులు. చూసుకోవాలని. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పించడం మంచిదే అయిన దానికి వ్యతిరేకం మేము కాదు అని. దీనివలన ఆటో జీవన ఉపాధి పై. భారం పడుతుందని దయచేసి ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేసి వారి జీవితాలలో వెలుగు నింపాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి పాలాభిషేక. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ శాఖ నాయకులు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్. నులిగొండ శ్రీనివాస్. ఆటో యూనియన్ అధ్యక్షులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జహీరాబాద్ ఎమ్మెల్యే…

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు చేసిన మోసాన్ని ఆటోలో ప్రయాణించి తెలుసుకున్న , శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ ఆటో డ్రైవర్లు ఏకమై జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి భాగమవుతామని వెల్లడి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్, కార్మిక నగర్ ఆటో స్టాండ్ నుంచి ఆటోలో ప్రయాణించి ఆటో కార్మికుడు రాజుతో మాట్లాడటం జరిగింది .

ఆలయ నిర్మాణానికి సమ్మి గౌడ్ చిరువేరు విరాళం….

ఆలయ నిర్మాణానికి సమ్మి గౌడ్ చిరువేరు విరాళం

మత సామరస్యానికి ప్రతీకగా పెనుగొండ ఆటో యూనియన్ – సమ్మయ్య గౌడ్

దేవాలయం చుట్టూ స్టీల్ ఫెన్సింగ్ కు 20వేల రూపాయలు అందించిన సమ్మిగౌడ్

మైసమ్మ తల్లి దీవెనలతో ప్రతి ఒక్కరూ క్షేమం: ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం గ్రామం పెనుగొండ ఆటో యూనియన్ మత సామరస్యానికి ప్రతీకగా, ఆటో డ్రైవర్లకు, ప్రయాణీకులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీవిస్తూ మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణం చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ గ్రామంలో ఆటో కేంద్రం వద్ద ఉన్న మైసమ్మ తల్లిని చెట్టు కింద కొలిచేవారమని, అనంతరం ఆటో డ్రైవర్ల సహకారంతో రేకుల షెడ్డుతో నీడను ఏర్పాటు చేసినప్పటికీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ మైసమ్మ తల్లికి శాశ్వత ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించి ఆటో డ్రైవర్లు, గ్రామ పెద్దలు, మండలం లోని ప్రజా ప్రతినిధుల సహకారాన్ని కోరామని తెలిపారు. అడగగానే స్పందించి ఆలయం చుట్టూ ఏర్పాటు చేసే స్టీల్ ఫెన్సింగ్ కు మండల కాంగ్రెస్ నాయకు సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.మామూలుగా ఆలయాలను హిందువులు మాత్రమే నిర్మిస్తారని కానీ అందుకు భిన్నంగా హిందు, ముస్లీం తేడాలు లేవని దేవుడు ఎవరికైనా ఒక్కరేనని విశ్వాసం వ్యక్తం చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు ఆలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందించదగ్గ విషయమని, అలాంటి వారితో నేను సైతం ఉండాలని, మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కల్పించిన పెనుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్, ఇతర సభ్యులకు సమ్మయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు షేక్ ఇమామ్ పాషా, తాటి వీరన్న,నాంచారి శ్రీను,ఈసాల లక్ష్మయ్య, కొండ బత్తుల నరేష్, దేవరపు వెంకన్న,తాటి ఉపేందర్,ముత్యం వెంకన్న బొమ్మర మల్లయ్య,షేక్ మదార్, తాటి కుమారస్వామి, షేక్ ఇమ్రాన్,షేక్ అమీర్, చిన్నబోయిన వీరన్న, పూణెం సంతోష్,కల్తీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..

*పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..

*మార్కెట్ యార్డ్ నుంచి మదర్ థెరిసా కళాశాల వరకు భారీగా జరిగిన ఆటో ర్యాలీ..

*ఆటో డ్రైవర్ల ఆనందం…కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 04:

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ఆర్థిక చేయుతను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం పలమనేరులో దిగ్విజయంగా సాగింది.
ఆ మేరకు కూటమి నాయకులతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారుపట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం చిత్తూరు డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించారుమార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం గంగవరం మండలంలోని మదర్ తెరిసా కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూడ్రైవర్ల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు.ఆటో డ్రైవర్ సేవలో, పథకం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నరలోనే అన్ని కార్యక్రమాలు అమలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.చెప్పినవి. చెప్పనవి.
చేసి చూపే ఏకైక నాయకుడు చంద్రబాబని.. ఆయనకున్న దూర దృష్టి కారణంగా నేడు రాష్ట్రం అన్ని రంగాలలో పరుగులు పెడుతోందని కొనియాడారు. మనందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మునుముందు కూటమి ప్రభుత్వానికి అందరి మద్దతు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, డిఆర్డిఏ పీడీ శ్రీదేవి, ఎం వి ఐ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణ రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాజన్న, నాయకులు ఆర్.వి. బాలాజీ, రంగనాథ్, కిషోర్ గౌడ్, సోమశేఖర్ గౌడ్,ఆనంద, నాగరాజు రెడ్డి,
ఆర్ బి సి, కుట్టి,సుబ్రహ్మణ్యం గౌడ్,
నాగరాజు, రాంబాబు,, మదన్, శ్రీధర్, బిఆర్సీ కుమార్, జనసేన నాయకులు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్, నాగరాజు మరియు సింగిల్ విండో చైర్మన్ లు మరియు డైరెక్టర్లులతో పాటు ఆటో యూనియన్ లీడర్లు మురుగ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం…

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం

మాట నిలబెట్టుకున్న సొంటి రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

క్కొండ మండల కేంద్రంలోని నవత ఆటో యూనియన్ సభ్యులందరికీ తన సొంత ఖర్చులతో ఉచితంగా ప్రమాద బీమా చేపిస్తానన్న మాట ప్రకారం. 160 మంది డ్రైవర్లకు సంవత్సరం పాటు ఉచితంగా ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల బీమా ఇన్సూరెన్స్ చేపించిన టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి. బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ సెంటర్లో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ భీమ పత్రాలను నవత ఆటో యూనియన్ డ్రైవర్లకు అందించిన సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, ఈ సందర్భంగా సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సంవత్సరమే కాకుండా ఐదు సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీ బీమా అందరికీ చెల్లిస్తానని ఇంకా ఎవరైనా డ్రైవర్లు ఉంటే వాళ్ల పేర్లు కూడా పంపించాలని ప్రతి ఒక్క డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమని యూనియన్ బాధ్యులకు తెలిపారు. డ్రైవర్ల అందరూ ప్రభుత్వానికి పరోక్షంగా సేవ చేస్తున్నారని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుటలో డ్రైవర్ల పాత్ర కీలకమని, వీరి కుటుంబాలు వీరిపై ఆధారపడి ఉన్నాయని, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరో ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా చట్టప్రకారం ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఇలాంటి ఇన్సూరెన్స్ లను వినియోగించుకోవాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కి చిరు సన్మానం చేశారు .కార్యక్రమంలో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్, శ్రీరంగం శ్రీనివాస్, ఉల్లేరావు ప్రభాకర్, పెండ్యాల రాజు, బద్రు నాయక్, మోడెం రాజు, మహమ్మద్ అమీర్, నవత ఆటో యూనియన్ డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

నిత్య సేవలందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్..

నిత్య సేవలందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

ఘనంగా ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

సామాన్య ప్రజలకు నిత్య సేవలు అందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్ అని టీపీసీసీ సభ్యులు, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ అన్నారు.ప్రపంచం ఆటో డ్రైవర్స్ దినోత్సవం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ర్యాలీ చేపట్టగా ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ సభ్యులు,గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆటో కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామానంద్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అందించే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పారు.ఆటో డ్రైవర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో కాకతీయ యూనియన్ అధ్యక్షులు ఇస్రం కుమార్,పట్టణ ఇన్చార్జి కొమ్ము వినయ్ కుమార్, ఐఎన్టియుసి నాయకులు ఆకుతోట ఇంద్రసేనారెడ్డి, పాకాల రోడ్ ఆటో యూనియన్ అధ్యక్షులు దేశి విజయ్, ఉపాధ్యక్షులు ఈదుల శ్రీను, కార్యదర్శి మండల రమేష్, కోశాధికారి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు పోగుల రాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఓర్సు తిరుపతి,మాజీ కౌన్సిలర్ యెలకంటి విజయ్,మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, ప్రధాన కార్యదర్శి బైరి మురళి,కార్యదర్శులు మోటం రవి,గిరగాని రమేష్,నాంపెల్లి వెంకటేశ్వర్లు,బూస నర్సింహరాములు,బిట్ల మనోహర్,రామగోని శ్రీనివాస్,మైధం రాకేష్, రామగోని సుధాకర్,గండు గిరివరంగంటి విక్రమ్ సాయి తదితరులు పాల్గోన్నారు.

పుష్కర సమయంలో ఆటో డ్రైవర్ల నిరసన.

పుష్కర సమయంలో ఆటో డ్రైవర్ల నిరసన.

గోదావరి వద్ద ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేసి మా పుట్ట కొడుతున్నారు.

వెంటనే స్కూల్ బస్సులను నిలిపివేయాలి.

పెద్ద మొత్తంలో ఆటో డ్రైవర్ల నిరసన. రోడ్డుపై బైఠాయి.

మహదేవ్పూర్ -నేటి ధాత్రి;

 

కాలేశ్వరం బస్టాండ్ వద్ద స్థానిక ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు బస్టాండ్ నుండి గోదావరి వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉండడంతో స్థానిక ఆటోల్లో భక్తులకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా భక్తులను ఆటోలో తరలించడంతో స్థానిక ఆటో డ్రైవర్లకు ఉపాధి కలుగుతుంది. కానీ పుష్కరాల సందర్భంగా మండలానికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలల వాహనాలను భక్తుల కు గోదావరి వద్ద తరలించుటకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తక్షణమే స్కూల్ బస్సులను తీసివేయాలంటూ ఆటో డ్రైవర్లు సుమారు రెండు గంటల పాటు ధర్నా కొనసాగించడం జరిగింది. పోలీసుల జోక్యంతో ఆటో డ్రైవర్లు ధర్నా ను విరమించినట్లు తెలుస్తుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version