వ్యవసాయ పరికరాలతో రైతులకు సాగు సులభతరం

వ్యవసాయ పరికరాలతో రైతులకు సాగు సులభతరం

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల,నేటి ధాత్రి:

వ్యవసాయ సాగులో రైతులకు ఉపయోగకరమైన వ్యవసాయ పరికరాలతో సాగు సులభతరం అవుతుందని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జిల్లా వ్యవసాయ అధికారిని సురేఖ, మంచిర్యాల ఏ ఎం సి చైర్మన్ పయ్యావుల పద్మ ముని, ఆత్మ బి ఎఫ్ ఏ సి ఛైర్మన్ సింగటి మురళి,సహాయ వ్యవసాయ సంచాలకులు మంచిర్యాల డివిజన్ ఎం.కృష్ణ లతో కలిసి అర్హులైన రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి గాను సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజెషన్ లో భాగంగా ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని,రైతు రుణమాఫీ, రైతు భరోసా,రైతు బీమా పథకాలను అమలు చేయడంతో పాటు వరి ధాన్యం,పత్తి,మొక్కజొన్న పంటలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.ఈ క్రమంలో 35 లక్షల 31 వేల రూపాయల విలువైన 6 పవర్ టిల్లర్లు, 6 రోటవేటర్లు, 52 పవర్ స్ప్రేయర్లు, 16 బ్రష్ కట్టర్లను జిల్లాలోని దండేపల్లి, హాజీపూర్,లక్షెట్టిపేట మండలాలకు చెందిన 81 మంది అర్హులైన రైతులకు 16లక్షల 24 వేల రూపాయల రాయితీతో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,ప్రజా ప్రతినిధులు,రైతులు పాల్గొన్నారు.

రైతు వేదికలో కపాస్ కిసాన్ యాప్, శనగ విత్తన పంపిణీ ప్రారంభం…

రైతు వేదికలో కపాస్ కిసాన్ యాప్, శనగ విత్తన పంపిణీ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పప్పు దినుసుల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశం పాల్గొన్నారు. ప్రస్తుత యాసంగిలో ఝరాసంగం మండలానికి 10 క్వింటాళ్ల కుసుమలు కేటాయించడమైనది అని తెలిపారు జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ తెలిపారు.విత్తనాలతోపాటు ప్రదర్శనా క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులకిచ్చిన హామీ మేరకు జాతీయ నూనె గింజల మిషన్‌, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను చేపడుతున్నామన్న మంత్రి తుమ్మల.. ఇప్పటికే యాంత్రీకరణ లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు.
ప్రస్తుతం వానాకాలం పంట ఉత్పత్తుల సేకరణకు ప్రాధాన్యం ఇస్తూనే.. యాసంగిలో అమలు చే యాల్సిన పథకాలపై దృష్టి సారించామని చెప్పారు.
సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు క్లస్టర్ల గుర్తింపు, రైతుల శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version