సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు
జైపూర్,నేటి ధాత్రి:
సింగరేణిలో సీఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి కమాండెంట్ సంచల్ సర్కార్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ జరిపించారు.విధి నిర్వహణలో భాగంగా ప్రాణ త్యాగాలు అర్పించిన పోలీస్ వీరులకు కమాండెంట్ చంచల్ సర్కార్ నివాళులు అర్పించారు.సెప్టెంబర్ 1. 2024 నుండి ఆగస్టు 31.2025 మధ్యకాలంలో ఆరుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మొత్తం 191 పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించాలని వారు తెలిపారు. అలాగే అమరవీరులైన పేర్లను చదివి వినిపించి వారి గౌరవం సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీస్ బలగాల ధైర్య సహసాలను అంకిత భావాన్ని గౌరవించడం వారి సంక్షేమం దేశ భద్రత పట్ల మన నిబంధతను తెలియజేయడమే మన లక్ష్యము అని తెలిపారు.
