*పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ*
నడికూడ,నేటిధాత్రి:
కంటి వెలుగు పథకం స్పూర్తితో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన సొంతూరు హన్మకొండ జిల్లా నడికూడ మండలం వరికోలులో ఉచిత కంటి పరీక్ష, ఉచిత కళ్ల జోళ్లు పంపిణీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఇందులో భాగంగా ఉచిత కంటి పరీక్షల అనంతరం వారి కుమార్తె ఆశ్రిత రెడ్డి జన్మదిన సందర్బంగా ఉచిత కళ్ల జోళ్లను పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా పుట్టిన ఊరికి సేవ చేయాలన్న ఆలోచనతో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,ఉప సర్పంచ్ మూర్తాల భుజంగరావు, మాజీ వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి,బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు డేగరాజు,మండలంలోని వివిధ గ్రామాల నూతన సర్పంచులు,గ్రామ ప్రజలు బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
