సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ లో సిఐఎస్ఎఫ్ కమాండెంట్ చంచల్ సర్కార్,అసిస్టెంట్ సుధీష్ జాకర్,ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యం,దివార్ ఏ ఎస్ పవర్ ప్లాంట్ అధికారుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని శనివారం నిర్వహించారు.అక్టోబర్ 1వ తేదీన నేషనల్ బ్లడ్ డొనేషన్ డేను పురస్కరించుకొని సిఐఎస్ఎఫ్ అధికారుల సహకారంతో రక్తాన్ని సేకరించారు.సేకరించిన రక్తాన్ని మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ అందించారు.ఈ రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని తల సేమియా పిల్లలకు ఉచితంగా అందజేస్తామని రెడ్ క్రాస్ సొసైటీ నెంబర్ కాసర్ల శ్రీనివాస్ తెలిపారు.
ఈకార్యక్రమంలో ప్రేమ్ సాయి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సురేష్, శిరీష,హరీష్ తదితరులు పాల్గొన్నారు.