గోవింద్ పూర్ లో ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ ముగింపు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జహీరాబాద్ ఆధ్వర్యంలో ఏడు రోజుల ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ యూనిట్ – 3 ముగింపు కార్యక్రమం గోవింద్ పూర్ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరహరి మూర్తి విద్యార్థులకు సమాజంలోని సమస్యలను తెలుసుకోవడానికి క్యాంపు అవసరాన్ని నొక్కి చెప్పారు.ఎంపిడిఓ మహిందర్ రెడ్డి సమాజ సేవలో యువత భాగస్వామ్యం ప్రాముఖ్యతను వివరించారు. ప్రధానోపాధ్యాయుడు దేవి సింగ్, పంచాయతీ కార్యదర్శి శ్రీమతి సరస్వతి, శివశంకర్ సర్ కూడా హాజరై స్వచ్ఛంద సేవకులను ప్రోత్సహించారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మొహమ్మద్ ముజాఫర్ అలీ శిబిరం విజయవంతం కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
