ఆలయ నిర్మాణానికి సమ్మి గౌడ్ చిరువేరు విరాళం
మత సామరస్యానికి ప్రతీకగా పెనుగొండ ఆటో యూనియన్ – సమ్మయ్య గౌడ్
దేవాలయం చుట్టూ స్టీల్ ఫెన్సింగ్ కు 20వేల రూపాయలు అందించిన సమ్మిగౌడ్
మైసమ్మ తల్లి దీవెనలతో ప్రతి ఒక్కరూ క్షేమం: ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం గ్రామం పెనుగొండ ఆటో యూనియన్ మత సామరస్యానికి ప్రతీకగా, ఆటో డ్రైవర్లకు, ప్రయాణీకులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీవిస్తూ మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణం చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ గ్రామంలో ఆటో కేంద్రం వద్ద ఉన్న మైసమ్మ తల్లిని చెట్టు కింద కొలిచేవారమని, అనంతరం ఆటో డ్రైవర్ల సహకారంతో రేకుల షెడ్డుతో నీడను ఏర్పాటు చేసినప్పటికీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ మైసమ్మ తల్లికి శాశ్వత ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించి ఆటో డ్రైవర్లు, గ్రామ పెద్దలు, మండలం లోని ప్రజా ప్రతినిధుల సహకారాన్ని కోరామని తెలిపారు. అడగగానే స్పందించి ఆలయం చుట్టూ ఏర్పాటు చేసే స్టీల్ ఫెన్సింగ్ కు మండల కాంగ్రెస్ నాయకు సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.మామూలుగా ఆలయాలను హిందువులు మాత్రమే నిర్మిస్తారని కానీ అందుకు భిన్నంగా హిందు, ముస్లీం తేడాలు లేవని దేవుడు ఎవరికైనా ఒక్కరేనని విశ్వాసం వ్యక్తం చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు ఆలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందించదగ్గ విషయమని, అలాంటి వారితో నేను సైతం ఉండాలని, మైసమ్మ తల్లి దేవాలయ నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కల్పించిన పెనుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఆసిఫ్, ఇతర సభ్యులకు సమ్మయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు షేక్ ఇమామ్ పాషా, తాటి వీరన్న,నాంచారి శ్రీను,ఈసాల లక్ష్మయ్య, కొండ బత్తుల నరేష్, దేవరపు వెంకన్న,తాటి ఉపేందర్,ముత్యం వెంకన్న బొమ్మర మల్లయ్య,షేక్ మదార్, తాటి కుమారస్వామి, షేక్ ఇమ్రాన్,షేక్ అమీర్, చిన్నబోయిన వీరన్న, పూణెం సంతోష్,కల్తీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
